games complete
-
టేబుల్ టెన్నిస్ పోటీల విజేతలు వీరే..!
తణుకు టౌన్ : ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అంతర కళాశాలల టేబుల్ టెన్నిస్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో అనపర్తికి చెందిన జీబీఆర్ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలవగా. గొల్లల మామిడాడకు చెందిన డీఎల్ఆర్ కళాశాల విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. రాజమండ్రి ఎస్‌కేవీటీ కళాశాల విద్యార్థులు తృతీయస్థానం, రామచంద్రాపురం వీఎస్ఎం కళాశాల విద్యార్థులు నాలుగోస్థానం పొందారు. బాలికల విభాగంలో రామచంద్రాపురం వీఎస్ఎం కళాశాల విద్యార్థినులు విన్నర్స్‌గా, తణుకు ఎస్‌కేఎస్‌డీ విద్యార్థినులు రన్నర్స్‌గా, రాజమండ్రి ఎస్‌కేవీటీ విద్యార్థినులు తృతీయస్థానం స్థానం పొందినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సుబ్బారావు, ఏఎంసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ జె.చంద్రప్రసాద్, ఆదికవి నన్నయ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఎ.సత్యనారాయణ, పీడీలు పాల్గొన్నారు. -
ఉత్కంఠభరితంగా ఫుట్‌బాల్ పోటీలు
తాడేపల్లిగూడెం : జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్, కోటగిరి విద్యాధరరావు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫా డిస్ట్రిక్ట్ కప్ –2016 పోటీలు రెండోరోజు శుక్రవారం స్థానిక డాక్టర్ తేతలి సత్యనారాయణమూర్తి జెడ్పీ హైస్కూల్లో ఉత్కంఠభరితంగా సాగాయి. అండర్ –16 బాలికల విభాగంలో పల్లంట్ల జట్టు విజేతగా నిలిచింది. బెస్టు ఉమెన్ ఆఫ్ ది టోర్నమెంటుగా మేడపూడి పూజిత(జంగారెడ్డిగూడెం), బెస్టు గోల్ కీపర్‌గా పి.పద్మజ(పల్లంట్ల), ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటుగా జె.భూమిక (పల్లంట్ల) అవార్డులను, నగదును అందుకున్నారు. విజేతలకు టోర్నీ నిర్వాహకులు దాసరి భాస్కరరావు, ఉడిపి హోటల్ అధినేత అచ్చన్న బాబు బహుమతులు అందించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన టేబుల్ టెన్నిస్ పోటీలు
తణుకు అర్బన్ : స్థానిక జెడ్పీ హైస్కూల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 62వ అంతర జిల్లాల అండర్–17 టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. బాలుర వ్యక్తిగత విభాగంలో సి. కుశాల్‌కుమార్ (అనంతపురం) ద్వితీయ స్థానం నిలిచి ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ పీఎస్ సుధాకర్ తెలిపారు. బాలికల వ్యక్తిగత విభాగంలో కేజే అమూల్య (అనంతపురం) ద్వితీయ స్థానం సాధించి జాతీయస్థాయికి ఎంపికైందన్నారు. బాస్కెట్ బాల్ అండర్ 14 విభాగంలో.. బాస్కెట్ బాల్ అండర్ 14 బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు, అనంతపూర్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నట్టు సుధాకర్ తెలిపారు. అనంతరపురం జట్టు 18–2 తేడాతో విజయనగరంపైనా గెలిచి సెమీస్‌కు చేరినట్టు తెలిపారు. బాలుర విభాగంలో అనంతరపురం జట్టు 16–11 తేడాతో చిత్తూరుపైనా గెలుపొందిందన్నారు. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ జట్టుకు ఎంపికైన బాలురు, బాలికల జట్టలోని క్రీడాకారులకు ఆదివారం సాయంత్రం మెమొంటోలు, ధ్రువపత్రాలు అందజేశారు.