తణుకు పట్టణంలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఆరేళ్ల బాలుడ్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్లు తల్లిదండ్రులు తణుకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యం రద్దీగా ఉండే తణుకు పట్టణంలోని సోమవారం ఉదయం 11.40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. అయితే కిడ్నాప్ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తణుకు పట్టణ పోలీసులు కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఛేదించారు. తాడేపల్లిగూడెం మండలం ముక్కిరాలపాడు గ్రామంలోని ఒక ఇంట్లో నిందితులు బాలుడ్ని వదిలి వెళ్లినట్లు సమాచారం అందుకున్న పోలీసులు బాలుణ్ని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.