సాక్షి, పశ్చిమగోదావరి : భీమడోలు మండలం అంబరుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. భూవివాదం నేపథ్యంలో పసుపర్తి కిశోర్‌పై దుండగులు రాడ్లతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన కిశోర్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సోదరుడు గోపాలం ప్రోద్బలంతో టీడీపీ నాయకులు దాడిచేసి చంపారని కిశోర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు చేరుకున్నారు.