ఎమ్మెల్యే కారుమూరి సోదరుడు మృతి  | Thanuku MLA Karumuri Brother Died In West Godavari | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కారుమూరి సోదరుడు మృతి 

Published Fri, Aug 16 2019 10:47 AM | Last Updated on Fri, Aug 16 2019 10:47 AM

Thanuku MLA Karumuri Brother Died In West Godavari - Sakshi

విషణ్నవదనంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు

సాక్షి, పశ్చిమగోదావరి: తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు అన్నయ్య కారుమూరి వెంకట ప్రసాద్‌(59)  అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం మరణించారు. ఎమ్మెల్యే కారుమూరి అమెరికా పర్యటనకు బయల్దేరుతుండగా.. సోదరుడి మరణవార్తతో ప్రయాణం రద్దుచేసుకుని అత్తిలి చేరుకున్నారు. వెంకట ప్రసాద్‌కు భార్య సుభద్రాదేవి, కుమారుడు రామసాయిచరణ్, కుమార్తె లహరి ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వెం కట ప్రసాద్‌ తణుకు ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. స్వగ్రామం అత్తిలిలో గురువారం అంత్యక్రియలు నిర్వహించా రు. నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీనాయకులు, అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావును పరామర్శించి సంతాపం తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement