నిజంగా.. వానేనా
తాడేపల్లిగూడెం రూరల్ : మండే ఎండలు, ఊపిరిసల్పని ఉక్కపోతలు. ఇలాంటి సమయంలో చల్లని గాలి.. హాయిగొలిపే చినుకు.. ఇంతకన్నా ఏముంది ఓదార్పు. గురువారం రాత్రి ఒక్కసారిగా వర్షం పడి ప్రజలను సేదతీర్చింది. జిల్లాలోని తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పలకరించింది. రాత్రి 7.15 గంటలకు ప్రారంభమైన వర్షం 8 గంటల వరకు పడింది. ఆకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు.