in district
-
రిజిస్ట్రేషన్లకు బ్రేక్
కొవ్వూరు: జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల నుంచి రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. సర్వర్‌లో సాంకేతిక లోపం కారణంగా వెబ్ ల్యాండ్‌లో భూముల వివరాలు ఓపెన్‌కావడం లేదు.దీంతో ఈ నెల 8న సాంకేతిక సమస్య తలెత్తింది. 8, 9 తేదీల్లో సర్వర్ పూర్తిస్థాయిలో పని చేయలేదు. భూములు, స్థలాలు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లతో ఈసీలు, నకళ్లు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. భూముల మార్కెట్ విలువ తెలుసుకోవడం వంటి వాటికి ఇబ్బందులు తలెత్తాయి.10వ తేదీ రెండో శని, 11వ తేదీ ఆదివారం సెలవుల వలన కార్యాలయాలు తెరవలేదు. సోమవారం యథావిధిగా పని చేశాయి. సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్లు పూర్తయినప్పటికీ దస్తావేజుల స్కానింగ్ ప్రక్రియ పూర్తి కావడం లేదు. దీంతో రిజిస్టర్ చేయించుకున్న వారు దస్తావేజుల కోసం మరో రోజు రావా లి్సన పరిస్థితి ఉంది. మళ్లీ రెండు రోజుల నుంచి సాంకేతిక సమస్య వలన సర్వర్ పని చేయడం లేదు. గడిచిన వారం రోజుల నుంచి సుమారు ఐదు వందల వరకు రిజిస్ట్రేషన్లు వాయిదా పడినట్లు అంచనా. జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రారర్ కార్యాలయాల ద్వారా రోజుకు రిజిస్ట్రేషన్ల ఫీజుల రూపంలో సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మేరకు ఆదాయం లభిస్తుంది. ఈ ఆదాయానికి వారం నుంచి గండి పడింది. సుమారు రూ.యాభై లక్షల మేరకు ఆదాయం కోల్పోయింది. పైగా రోజు వారీగా రిజిస్ట్రేషన్లు, ఈసీ, నకళ్లు కోసం వచ్చే జనం కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. చివరకు సర్వర్ సమస్య అని చెప్పడంతో నిరాశగా వెను తిరిగి వెళుతున్నారు. గడిచిన వారం రోజుల నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈ వారం సుమారు యాభై వరకు రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో పడ్డాయి. వేగేశ్వరపురంలోనూ సుమారు 20 రిజిస్ట్రేషన్లు వాయిదా పడ్డాయి. వెబ్‌ల్యాండ్ ఓపెన్ కాక సమస్య వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు ఓపెన్‌కావడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఇబ్బంది ఏర్పడింది. ఒకటి, రెండు రోజుల్లో సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈనెల 8 నుంచి సమస్య నెలకొంది. సెంట్రల్ సర్వర్ సమస్య వేధిస్తోంది.–పి.విజయలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్, ఏలూరు వారం నుంచి ఇబ్బందులు వారం రోజుల కిత్రం నుంచి సాంకేతిక సమస్య వలన రిజిస్ట్రేషన్లు కావడం లేదు. మధ్యలో ఒక రోజు మాత్రమే పని చేసింది. మళ్లీ రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. కనీసం ఈసీ తీసుకోవడానికి వస్తే సర్వర్లు పని చేయడం లేదని చెబుతున్నారు. దీంతో చాలా ఇబ్బందిగా ఉంది.–ముదునూరి నాగరాజు, దొమ్మేరు -
బరితెగించిన మృగాళ్లు
ఆకివీడు : మృగాళ్లు బరితెగిస్తున్నారు. అభం శుభం తెలియని బాలికలపై అకృత్యాలకు తెగబడుతూనే ఉన్నారు. గతనెల 29న నిడదవోలు ప్రాంతంలో పెళ్లి కుమార్తెపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. తెల్లారితే వివాహం జరగాల్సిన యువతిని చెరకు తోటలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. 14 గంటలపాటు అపస్మారక స్థితిలోనే ఉండిపోయిన ఆ యువతి.. రైతులు గుర్తించడంతో ప్రాణాలతో బయటపడింది. ఆమె వివాహం నిలిచిపోగా.. పెళ్లింట తీరని విషాదం నెలకొంది. ఇదిలావుంటే.. ఈనెల 3న గణపవరంలో 16 ఏళ్ల బాలికపై తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్ల గ్రామానికి చెందిన మల్లాడి మణికంఠ అనే యువకుడు అత్యాచా రం చేశాడు. ఈ ఘటనల్ని మరువక ముందే సోమవారం ఆకివీడుకు చెందిన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బహిర్భూమికి వెళ్తుండగా.. ఆకివీడు ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక సోమవారం వేకువజామున బహిర్భూమికి వెళ్తుండగా.. ముగ్గురు యువకులు అటకాయించారు. ఆమె నోరు నొక్కి మోటార్ సైకిల్‌పై బైపాస్ రోడ్డులోని పొలాల మధ్య గల పశువుల పాకలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ మృగాళ్లు ముగ్గురూ ఆకివీడు పెదపేటకు చెందిన బొండాడ కిరణ్, సోమల సునిల్, చీకటపల్లి కిరణ్‌గా పోలీసులు గుర్తించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం భీమవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ దుర్మార్గంతో ఓ నిరుపేద కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ దారుణానికి బలైన బాలిక అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ చదువుకుంటోంది. తమ బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లి అరబ్ దేశాలకు వెళ్లి పని చేస్తుండగా.. తండ్రి వేరు గ్రామంలో కూలి పనులు చేస్తున్నాడు. ఆ బాలిక, ఆమె సోదరి అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నారు. ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు అదును కోసం ఎదురు చూశారు. బాలిక తమ ఇంటికి సమీపంలో బహిర్భూమికి వెళ్తుండగా ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. అదో మద్యం అడ్డా బాలిక అత్యాచారానికి గురైన పశువుల పాక ప్రాంతం మందుబాబులకు అడ్డాగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ పాకకు పక్కనే పదుల సంఖ్యలో ఖాళీ బీరు సీసాలు, మద్యం సీసాలు దర్శనమివ్వడం ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఘటనా స్థలాన్ని డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, భీమవరం రూరల్ సీఐ ఎస్ఎస్వీ నాగరాజు, ఇన్చార్జి ఎస్సై ఎం.రవివర్మ పరిశీలించారు. నిందితులు ముగ్గురుపై కిడ్నాప్, అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు. -
నిజంగా.. వానేనా
తాడేపల్లిగూడెం రూరల్ : మండే ఎండలు, ఊపిరిసల్పని ఉక్కపోతలు. ఇలాంటి సమయంలో చల్లని గాలి.. హాయిగొలిపే చినుకు.. ఇంతకన్నా ఏముంది ఓదార్పు. గురువారం రాత్రి ఒక్కసారిగా వర్షం పడి ప్రజలను సేదతీర్చింది. జిల్లాలోని తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పలకరించింది. రాత్రి 7.15 గంటలకు ప్రారంభమైన వర్షం 8 గంటల వరకు పడింది. ఆకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. -
డిజిటల్ డాబు.. ఏదీ జవాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నగదు రహిత లావాదేవీల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతామని జిల్లా అధికారులు, ప్రజాప్రతి నిధులు హోరెత్తిస్తున్నారు. జిల్లాను డిజిటల్ ఎకానమీ హబ్‌గా మార్చాలనుకుంటున్న ప్రజాప్రతినిధులు తమ స్వగ్రామాల్ని మాత్రం గాలికొదిలేశారు. ఆ గ్రామాల్లో బ్యాంకు శాఖల మాట దేవుడెరుగు.. కనీసం ఒక్క ఏటీఎం సెంటర్ కూడా లేదు. స్వైపింగ్ మెషిన్లు సైతం ఎక్కడా కానరావడం లేదు. ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనే నగదు తీసుకునేందుకు కనీస ఏర్పాట్లు లేవంటే.. మిగిలిన గ్రామాల్లో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వగ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరపగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్వగ్రామమైన పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో బ్యాంకుగాని, ఏటీఎం గాని లేవు. ఈ గ్రామ జనాభా దాదాపు 6 వేలు. ఇక్కడి వారంతా దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోగల కవిటంలోని ఇండియ¯ŒS బ్యాంక్, ఎస్బీఐ శాఖలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం పెదవేగి మండలంలోని దుగ్గిరాల. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కావాలంటే ప్రజలు ఏలూరు నగరానికి వెళ్లక తప్పని పరిస్థితి. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు స్వగ్రామం బుట్టాయగూడెం మండలం రాజానగరం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కోసం కొయ్యలగూడెంలో ఏటీఎంలకు వెళ్లాలంటే 13 కిలోమీటర్లు.. బుట్టాయగూడెం వెళ్లాలంటే 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత ఊరు ఆగర్తిపాలెం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. ఆగర్తిపాలెంతో పాటు ఆగర్రు గ్రామం కూడా దాదాపు కలిసే ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లో సుమారు 10 వేలకు పైగా జనాభాతో పాటు 5వేల ఓటర్లు ఉన్నారు. వరి, ఆక్వా సాగు చేసుకుని రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. కొంతమంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇక్కడి వారంతా నగదు కోసం 5కిలోమీటర్లు దూరంలో ఉన్న పూలపల్లి లేదా 7కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లుపై ఆధారపడతారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్వగ్రామం సరిపల్లి. ఆయన చాలా కాలం క్రితమే నరసాపురం పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన స్వగ్రామంలో కనీసం ఒక్క ఏటీఎం కూడా లేకపోవడంతో.. ప్రజలు నగదు కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని నరసాపురం రావాల్సిన పరిస్థితి. జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) నివాస గ్రామమైన కుప్పనపూడిలో ఏటీఎం లేదు. ప్రజల నగదు కోసం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. రైతులకు అందుబాటులో సొసైటీలను, వాటి బ్రాంచిలను ఏర్పాటు చేసినప్పటికీ ఏటీఎంలు లేకపోవడంతో రైతులు, ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
డిజిటల్ డాబు.. ఏదీ జవాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నగదు రహిత లావాదేవీల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతామని జిల్లా అధికారులు, ప్రజాప్రతి నిధులు హోరెత్తిస్తున్నారు. జిల్లాను డిజిటల్ ఎకానమీ హబ్‌గా మార్చాలనుకుంటున్న ప్రజాప్రతినిధులు తమ స్వగ్రామాల్ని మాత్రం గాలికొదిలేశారు. ఆ గ్రామాల్లో బ్యాంకు శాఖల మాట దేవుడెరుగు.. కనీసం ఒక్క ఏటీఎం సెంటర్ కూడా లేదు. స్వైపింగ్ మెషిన్లు సైతం ఎక్కడా కానరావడం లేదు. ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనే నగదు తీసుకునేందుకు కనీస ఏర్పాట్లు లేవంటే.. మిగిలిన గ్రామాల్లో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వగ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరపగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్వగ్రామమైన పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో బ్యాంకుగాని, ఏటీఎం గాని లేవు. ఈ గ్రామ జనాభా దాదాపు 6 వేలు. ఇక్కడి వారంతా దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోగల కవిటంలోని ఇండియ¯ŒS బ్యాంక్, ఎస్బీఐ శాఖలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం పెదవేగి మండలంలోని దుగ్గిరాల. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కావాలంటే ప్రజలు ఏలూరు నగరానికి వెళ్లక తప్పని పరిస్థితి. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు స్వగ్రామం బుట్టాయగూడెం మండలం రాజానగరం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కోసం కొయ్యలగూడెంలో ఏటీఎంలకు వెళ్లాలంటే 13 కిలోమీటర్లు.. బుట్టాయగూడెం వెళ్లాలంటే 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత ఊరు ఆగర్తిపాలెం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. ఆగర్తిపాలెంతో పాటు ఆగర్రు గ్రామం కూడా దాదాపు కలిసే ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లో సుమారు 10 వేలకు పైగా జనాభాతో పాటు 5వేల ఓటర్లు ఉన్నారు. వరి, ఆక్వా సాగు చేసుకుని రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. కొంతమంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇక్కడి వారంతా నగదు కోసం 5కిలోమీటర్లు దూరంలో ఉన్న పూలపల్లి లేదా 7కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లుపై ఆధారపడతారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్వగ్రామం సరిపల్లి. ఆయన చాలా కాలం క్రితమే నరసాపురం పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన స్వగ్రామంలో కనీసం ఒక్క ఏటీఎం కూడా లేకపోవడంతో.. ప్రజలు నగదు కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని నరసాపురం రావాల్సిన పరిస్థితి. జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) నివాస గ్రామమైన కుప్పనపూడిలో ఏటీఎం లేదు. ప్రజల నగదు కోసం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. రైతులకు అందుబాటులో సొసైటీలను, వాటి బ్రాంచిలను ఏర్పాటు చేసినప్పటికీ ఏటీఎంలు లేకపోవడంతో రైతులు, ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
నేటి నుంచి డీఎడ్ పరీక్షలు
ఏలూరు (ఆర్ఆర్ పేట): డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) 2014–16 బ్యాచ్‌కు సంబంధించి విద్యార్థులు, అంతకుముందు పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు జిల్లావ్యాప్తంగా పది కేంద్రాల్లో గురువారం నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు 1,906 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. హాల్‌టికెట్లు అందని విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్సీ.ఏపీ.ఓఆర్జీ వెబ్సైట్ నుంచి డౌ న్లోడ్ చేసుకుని సంబంధిత ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకోవాలని సూచించారు. -
బ్యారన్ రిజిస్ట్రేషన్లకు రైతుల నిరాకరణ
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం 1వ వేలం కేంద్రం పరిధిలోని పలు గ్రామాల రైతులు తమ బ్యారన్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రకటిం చారు. పొగాకు బోర్డు అధికారులు జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లోని బ్యారన్లను రీ ఆర్గనైజేషన్ చేశా రు. దీంతో జంగారెడ్డిగూడెం 1వ వేలం కేంద్రం పరిధిలో ఉన్న సీతంపేట, తిరుమలాపురం, నరసన్నపాలెం గ్రామాల రైతులకు చెందిన బ్యారన్లను కొయ్యలగూడెం వేలం కేంద్రంలో కలపడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 50 మంది రైతులు పొగాకు బోర్డు చైర్మన్‌కు, రీజనల్ అధికారికి, వేలం కేంద్రం అధికారికి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లోని బ్యారన్లను రీ ఆర్గనైజేషన్ చేసే సమయంలో తమతో చర్చింలేదని రైతులు అంటున్నారు. తమ అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. తమను జంగారెడ్డిగూడెం 1వ వేలం కేంద్రం పరిధిలోనే ఉంచాలని లేనిపక్షంలో తమ బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేయించబోమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దేవరపల్లి వేలం కేంద్రంలో బ్యారన్లు విభజించాక 2,564 ఉండగా, విభజనకు ముందు 2,276, జంగారెడ్డిగూడెం 1వ కేంద్రంలో విభజనకు తర్వాత 2,969, ముందు 3,154, 2వ కేంద్రంలో విభజన తర్వాత 2,954, ముందు 3,174, కొయ్యలగూడెం కేంద్రంలో విభజన తర్వాత 2,807, ముందు 2,941, గోపాలపురం కేంద్రంలో విభజన తర్వాత 2,630, విభజనకు ముందు 2,380 బ్యారన్లు వచ్చాయి. దేవరపల్లి కేంద్రంలో 288, గోపాలపురం కేంద్రంలో 250 బ్యారన్లు పెరగ్గా, జంగారెడ్డిగూడెం 1వ కేంద్రంలో 185, 2వ కేంద్రంలో 220, కొయ్యలగూడెం కేంద్రంలో 134 తగ్గాయి. -
జిల్లాలో 100 పశువైద్య శిబిరాలు
పశుసంవర్ధక శాఖ జెడీ వెంకట్రావు అచ్చంపేట (సామర్లకోట) : జిల్లావ్యాప్తంగా మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 100పశువైద్య క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వి.వెంకట్రావు తెలిపారు. సామర్లకోట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 మార్కెట్ కమిటీలు ఉండగా ప్రతి కమిటీ ఏడాదికి ఐదు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. ప్రతి శిబిరంలోను రూ.20వేలు ఖర్చు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. పశువులకు ఉచితంగా మందులు, దాణా అందజేస్తారని తెలిపారు. రూ.5 లక్షలతో నిర్మించే అచ్చంపేట పశువైద్య కేంద్రం ప్రహరీకి శంకుస్థాపన చేశారు. ఆవరణలో మొక్కలు నాటారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు అధ్యక్షత వహించగా గ్రామ సర్పంచ్ పోతల నాగమõß శ్వరీ, ఉపసర్పంచ్ పబ్బినీడీ ఈశ్వరరావు, మండల పరిషత్తు వైస్ ఎంపీపీ ఆకునూరి సత్తిబాబు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ అడబాల చిట్టిబాబు, పశుసంవర్ధక శాఖ ఏడీ ఎన్టీ శ్రీనివాసరావు, డాక్టర్లు యోగేశ్వర్, రాకేష్, శ్రీధర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రసన్నబాబు పాల్గొన్నారు. -
పై వంతెనలకు పచ్చజెండా
భీమవరం టౌన్: అంతర్జాతీయ ప్రమాణాలతో 165 జాతీయ రహదారి (పామర్రు–దిగమర్రు రోడ్డు)లో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల నిర్మాణ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. రైల్వే లెవిల్ క్రాసింగ్‌లు ఉన్నచోట్ల ఆర్వోబీల నిర్మాణానికి కేంద్ర రైల్వే, ఉపరితల రవాణా శాఖలు నిర్ణయం తీసుకున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 35 చోట్ల ఆర్వోబీలు నిర్మించనున్నారు. జిల్లాలో మూడు చోట్ల ఆర్వోబీల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఉండి–పెదపుల్లేరు రైల్వేగేటు, భీమవరం పట్టణంలో ఉండి గేటు, శృంగవృక్షం రైల్వేగేటు వద్ద ఆర్వోబీలకు డిజైన్లు కూడా సిద్ధమయ్యాయి. ఇందుకు పెద్ద ఎత్తున భూసేకరణ కూడా చేయనున్నారు. 20 రోజుల్లో టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారి (ఎన్‌హెచ్) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే భీమవరంలో ఉండి గేటు వద్ద ఆర్వోబీల నిర్మాణంౖపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర ్ణయమని, తమకు కూడా కొద్దిరోజుల క్రితమే తెలిసిందని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చెబుతున్నారు. రూ.125 కోట్లతో భీమవరంలో.. భీమవరం పట్టణంలోని ఉండి రైల్వేగేటు వద్ద రూ.125 కోట్ల వ్యయంతో ఆర్వోబీ నిర్మించనున్నారు. ఆర్వోబీల ప్రతిపాదిత ప్రాంతాల్లో 45 మీటర్లు (150 అడుగులు) రోడ్ల విస్తరణ చేపడతారు. భీమవరంలోని ఉండి రోడ్డు ప్రస్తుతం 50 అడుగులు ఉంది. దీనిని 150 అడుగులకు విస్తరించేందుకు అవసరమైన భూసేకరణ కు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆర్వోబీకు ఇరువైపులా రోడ్డును ఏడు మీటర్లు వెడల్పు చేస్తారు. ఉండి రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి బొంబే స్వీట్ సెంటర్ వరకూ ఆర్వోబీ నిర్మించనున్నారు. ఆర్వోబీపై ఒకేసారి నాలుగు కార్లు ప్రయాణించేలా డిజైన్ చేశారు. వ్యాపారుల ఆందోళన భీమవరంలో ప్రధాన వ్యాపార కేంద్రాలు ఉండి రోడ్డు, జేపీ రోడ్డు, పీపీ రోడ్డులో ఉన్నాయి. ఉండి రోడ్డు 150 అడుగులు విస్తరించి ఆర్వోబీ నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతుండటంతో వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ఆస్పత్రుల భవనాలు, ఖాళీ స్థలాల యజమానుల్లో ఆందోళన మొదలైంది. ఆర్వోబీ నిర్మిస్తే ఆయా రోడ్ల పక్కన ఒక్క భవనం కూడా మిగలదని వీరంతా అంటున్నారు. దీంతో వీరంతా ఎంపీ, ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హడావుడిగా సమావేశం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణగుప్త ఆధ్వర్యంలో ఉండి రోడ్డులో ఆస్తులు ఉన్న 200 మంది ప్రముఖులు మంగళవారం సాయంత్రం భీమవరంలో చాంబర్లో సమావేశమయ్యారు. ఎంపీ గంగరాజు, ఎమ్మెల్యే రామాంజనేయులు, మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, కౌన్సిల్ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేత గాదిరాజు తాతరాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా వెంకటసత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఎక్కడికి పొమ్మంటారు.. ఉండి రోడ్డులో ఆస్తులు పోగొట్టుకుని వ్యాపారాలు లేకుండా ఎక్కడికి పొమ్మంటారని వ్యాపార ప్రముఖులు వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, కాగిత వెంకటరమణ, బొండా శ్రీరామ్ తదితరులు ప్రజాప్రతినిధులను నిలదీశారు. పట్టణంలోని బైపాస్ రోడ్డులో రైల్వేగేటు పెట్టిస్తే ట్రాఫిక్ సమస్య ఉండేది కాదన్నారు. ఉండి రైల్వేగేటు వద్ద ఆర్వోబీ నిర్మాణంపై ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కౌన్సిల్ తీర్మానం చేయనుందని మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు అన్నారు. ఉండి రైల్వేగేటు వద్ద ఆర్వోబీ డిజైన్ చూశాక మైండ్ బ్లాక్ అయ్యిందని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. ఇక్కడ ఆర్వోబీ ప్రతిపాదన రద్దు చేసి బైపాస్ రోడ్డులో ఆర్వోబీ నిర్మించేలా కషిచేయాలని ఎంపీ గంగరాజును కోరారు. పార్లమెంట్లో ప్రస్తావిస్తా.. ఉండి రోడ్డు ఆర్వోబీ నిర్మాణ ప్రతిపాదన ఆపి బైపాస్ రోడ్డులో ఆర్వోబీ నిర్మాణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని ఎంపీ గోకరాజు గంగరాజు హామీ ఇచ్చారు. ప్రజలు కూడా ఉండి రోడ్డు ఆర్వోబీ నిర్మాణాన్ని ఆపేందుకు ఉద్యమ కార్యచరణ సిద్ధం చేయాలని సూచించారు. -
జిల్లాలో 3.78 కోట్ల మొక్కలు నాటాం
వీసీలో కలెక్టర్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహారంలో భాగంగా జిల్లాలో 3.78 కోట్ల మొక్కలు నాటినట్లు కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ సాధారణ పరిపాలన కార్యాలయం నుంచి అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా హరితహారంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 3.50 కోట్ల మొక్కలు హరితహారంలో నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని, లక్ష్యాన్ని మించి అదనంగా 28 లక్షల మొక్కలను నాటినట్లు చెప్పారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించినట్లు చెప్పారు. వారం రోజుల్లో జియోరిఫరెన్స్ పూర్తవుతుందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ మీనా కలెక్టర్‌ను అభినందించారు. నిర్ధేశించిన లక్ష్యాన్ని మించి జిల్లాను ఆదర్శంగా నిలిపారన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో హరితహారం ప్రత్యేకాధికారి రఘవీర్, అటవీశాఖ అధికారి నర్సయ్య, ఎస్పీ సాయికృష్ణ, సామాజిక అటవీశాఖ అధికారి సతీష్, డీఎఫ్ఓ సునీల్ హెరాత్ తదితరులు పాల్గొన్నారు.