రిజిస్ట్రేషన్లకు బ్రేక్
రిజిస్ట్రేషన్లకు బ్రేక్
Published Thu, Jun 15 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM
కొవ్వూరు: జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల నుంచి రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. సర్వర్‌లో సాంకేతిక లోపం కారణంగా వెబ్ ల్యాండ్‌లో భూముల వివరాలు ఓపెన్‌కావడం లేదు.దీంతో ఈ నెల 8న సాంకేతిక సమస్య తలెత్తింది. 8, 9 తేదీల్లో సర్వర్ పూర్తిస్థాయిలో పని చేయలేదు. భూములు, స్థలాలు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లతో ఈసీలు, నకళ్లు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. భూముల మార్కెట్ విలువ తెలుసుకోవడం వంటి వాటికి ఇబ్బందులు తలెత్తాయి.10వ తేదీ రెండో శని, 11వ తేదీ ఆదివారం సెలవుల వలన కార్యాలయాలు తెరవలేదు. సోమవారం యథావిధిగా పని చేశాయి. సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్లు పూర్తయినప్పటికీ దస్తావేజుల స్కానింగ్ ప్రక్రియ పూర్తి కావడం లేదు. దీంతో రిజిస్టర్ చేయించుకున్న వారు దస్తావేజుల కోసం మరో రోజు రావా
లి్సన పరిస్థితి ఉంది. మళ్లీ రెండు రోజుల నుంచి సాంకేతిక సమస్య వలన సర్వర్ పని చేయడం లేదు. గడిచిన వారం రోజుల నుంచి సుమారు ఐదు వందల వరకు రిజిస్ట్రేషన్లు వాయిదా పడినట్లు అంచనా. జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రారర్ కార్యాలయాల ద్వారా రోజుకు రిజిస్ట్రేషన్ల ఫీజుల రూపంలో సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మేరకు ఆదాయం లభిస్తుంది. ఈ ఆదాయానికి వారం నుంచి గండి పడింది. సుమారు రూ.యాభై లక్షల మేరకు ఆదాయం కోల్పోయింది. పైగా రోజు వారీగా రిజిస్ట్రేషన్లు, ఈసీ, నకళ్లు కోసం వచ్చే జనం కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. చివరకు సర్వర్ సమస్య అని చెప్పడంతో నిరాశగా వెను తిరిగి వెళుతున్నారు. గడిచిన వారం రోజుల నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈ వారం సుమారు యాభై వరకు రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో పడ్డాయి. వేగేశ్వరపురంలోనూ సుమారు 20 రిజిస్ట్రేషన్లు వాయిదా పడ్డాయి.
వెబ్‌ల్యాండ్ ఓపెన్ కాక సమస్య
వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు ఓపెన్‌కావడం లేదు. దీంతో రిజిస్ట్రేషన్
ప్రక్రియకు ఇబ్బంది ఏర్పడింది. ఒకటి, రెండు రోజుల్లో సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈనెల 8 నుంచి సమస్య నెలకొంది. సెంట్రల్ సర్వర్ సమస్య వేధిస్తోంది.–పి.విజయలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్, ఏలూరు
వారం నుంచి ఇబ్బందులు
వారం రోజుల కిత్రం నుంచి సాంకేతిక సమస్య వలన రిజిస్ట్రేషన్లు కావడం లేదు. మధ్యలో ఒక రోజు మాత్రమే పని చేసింది. మళ్లీ రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. కనీసం ఈసీ తీసుకోవడానికి వస్తే సర్వర్లు పని చేయడం లేదని చెబుతున్నారు. దీంతో చాలా ఇబ్బందిగా ఉంది.–ముదునూరి నాగరాజు, దొమ్మేరు
Advertisement
Advertisement