జిల్లాలో 100 పశువైద్య శిబిరాలు
-
పశుసంవర్ధక శాఖ జెడీ వెంకట్రావు
అచ్చంపేట (సామర్లకోట) :
జిల్లావ్యాప్తంగా మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 100పశువైద్య క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వి.వెంకట్రావు తెలిపారు. సామర్లకోట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 మార్కెట్ కమిటీలు ఉండగా ప్రతి కమిటీ ఏడాదికి ఐదు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. ప్రతి శిబిరంలోను రూ.20వేలు ఖర్చు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. పశువులకు ఉచితంగా మందులు, దాణా అందజేస్తారని తెలిపారు. రూ.5 లక్షలతో నిర్మించే అచ్చంపేట పశువైద్య కేంద్రం ప్రహరీకి శంకుస్థాపన చేశారు. ఆవరణలో మొక్కలు నాటారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు అధ్యక్షత వహించగా గ్రామ సర్పంచ్ పోతల నాగమõß శ్వరీ, ఉపసర్పంచ్ పబ్బినీడీ ఈశ్వరరావు, మండల పరిషత్తు వైస్ ఎంపీపీ ఆకునూరి సత్తిబాబు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ అడబాల చిట్టిబాబు, పశుసంవర్ధక శాఖ ఏడీ ఎన్టీ శ్రీనివాసరావు, డాక్టర్లు యోగేశ్వర్, రాకేష్, శ్రీధర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రసన్నబాబు పాల్గొన్నారు.