joint director
-
యూపీలో మహిళా చోరులు!
లక్నో: ముసుగులు ధరించిన మహిళలు ఆయుధాలు చేతబూని భారీ దొంగతనానికి పూనుకున్నారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దర్జాగా ప్రవేశించి కేవలం 50 నిమిషాల్లో ఉన్నదంతా ఊడ్చేసి గోతాముల్లో నింపుకుని వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ నెల ఏడో తేదీన తెల్లవారుజామున 3 గంటలకు ఆషియానా పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ సందీప్ గులాటి ఇంట్లో ఈ మహిళా దొంగలు చొరబడ్డారు. ఒకరిద్దరు ఆయుధాలతో బయట కాపలాగా ఉండిపోగా మిగతా వారు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు సహా ప్రతి వస్తువు తీసుకుని ఐదు బస్తాల నిండా దర్జాగా నింపుకుని నెమ్మదిగా వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
ఘనంగా బతుకమ్మ వేడుకలు!
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ రోజున 'గౌరమ్మను' పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పండుగను అంగరంగా వైభవంగా జరుపుతారు. ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. పార్వతి గురించి పాటలాగా పాడుతూ.. ఆనందంతో బతుకమ్మను జరుపుకుంటారు. ఆడపడచులు, యువకులు, పిల్లలు, పెద్దలు తమ ఆనందాన్ని చూపే కన్నుల పండుగగా.. తెలంగాణ ప్రజలకు ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ ఈ బతుకమ్మ. ఈ సందర్భంగా పల్లెలు, పట్టణాల్లో ఆలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు తీరొక్క పూల శోభ సంతరించుకోనుంది. ఈ క్రమంలో చెరువుల వద్ద నిమజ్జన ప్రదేశాల్లో రంగుల ఆహ్లాదం ఎంతో చూడముచ్చట. పౌష్టికాహారం, చిరుధాన్యాలు, కూరగాయలు, గాజులు, చేతివృత్తులతో తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణీయం. బతుకమ్మ పండుగ కేవలం కటుంబాలకు, ఇంటికే పరిమితం కాదు, తెలంగాణలోని అన్నీ రంగాలవారిగా.. విద్యా, వైద్యా, సాంకేతిక, వివిధ పరిశ్రమల్లో బతుకమ్మ వేడుకల నిర్వహణ ఎంతో కన్నుల పండుగగా చెప్పవచ్చు అనడానికి నిదర్శనంగా.. 'డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంలో' శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 'డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగం' డైరెక్టర్ వి ఫణిభూషణ్‌శర్మ ఈ వేడుకలకు హాజరయ్యారు. 'జాయింట్ డైరెక్టర్లు' హెచ్ శైలజారాణి, పి రజిని, తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. రంగారెడ్డి హైదరాబాద్ 'పే అండ్ అకౌంట్ ఆఫిసర్స్' మహ్మద్ ఆరిఫ్, ఆర్ వి రామగోపాల్ అండ్ స్టాఫ్, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ సిబ్బంది, తదితరులు బతుకమ్మ వేడుకల సందర్భంగా హాజరయ్యారు. బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళల్ని మరింత ప్రోత్సహించే దిశలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇలాంటి మరెన్నో పండుగలు జరుపుకోవాలని డైరెక్టర్ కోరుతూ.. అందుకు అందరి ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు. -
విజయవాడలో ఏసీబీ సోదాలు
సాక్షి, విజయవాడ: నగరంంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. బృందావన కాలనీలో సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ ఇంటితో పాటు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారం మేరకు ప్రసాద్ ఇంట్లో సోదాలు చేపట్టారు. సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. 1991లో హైదరాబాద్‌లో ఐటీబీపీ కానిస్టేబుల్‌గా.. ఎస్పీఎఫ్లో హెడ్ కానిస్టేబుల్‌గా ఎస్ఐ, సీఐగా పదోన్నతి పొందారు. 2007లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్-I అధికారిగా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఏటీవోగా చేరారు. గతంలో భువనగిరి జిల్లా ఏటీవోగా ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ (DRDA) కృష్ణా, డివిజనల్ ట్రెజరీ అధికారి విజయవాడ, అనంతరం డిప్యూటేషన్‌పై కృష్ణా, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. ఈడీ జేడీగా రోహిత్ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: ఈడీ జాయింట్ డైరెక్టర్‌గా రోహిత్ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. దినేష్ పరుచూరి స్థానంలో నూతన జేడీగా రోహిత్ ఆనంద్ నియమితులయ్యారు. దినేష్ కొచ్చికి బదిలీ అయ్యారు. సంచలనాత్మక ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి హైదరాబాద్ ఈడీ విచారణ జరుపుతున్న క్రమంలో కొత్త అధికారి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: సిట్‌ను కాదని సీబీఐకి ఎందుకు? -
ఖాకీదుస్తులు త్యాగానికి ప్రతీక
‘ప్రియమైన పోలీసు ధీశాలులారా... మహమ్మారైనా, ఆపత్కాలమైనా, శాంతి సమయమైనా మీరే మా ధైర్యం’ అని పేర్కొంటూ తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో కట్టిన బ్యానర్... సాధారణ ప్రజలకు పోలీ సుల మీద కలిగిన నమ్మకానికి నిదర్శనం అనవచ్చు. తెలంగాణ రాష్ట్రా విర్భావ అనంతరం పీపుల్స్ ఫ్రెండ్లీగా, పోలీసులు అంటే ప్రజల సేవ కులు, ప్రజలే బాసులు అనే విశ్వాసం కలిగే విధంగా తెలంగాణా పోలీస్ శాఖ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే, ఒక కెమెరా వంద మంది పోలీసులతో సమానం అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీటీవీల ఏర్పాటు లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 8.25 లక్షల ఏర్పాటు పూర్తయింది. డయల్ 100, ప్రత్యేకంగా మహిళా భద్రతా విభాగం ఏర్పాటు, స్వతంత్ర భారత చరిత్రలో మరెక్కడా లేని విధంగా దాదాపు 80 వేల మందికి పైగా పోలీసు అధికారుల నియామకం, కొత్త పోలీసు కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్లు, చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే కమాండ్ కంట్రోల్ నిర్మాణం... ఇలా తెలంగాణ పోలీస్ శాఖ తన విధుల్లో ఎంతో ముందుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో 377 మంది పోలీసులు అమరులయ్యారు. తెలంగాణలో ఒక్క ప్రాణాపాయం జరగకపోవడం గమనార్హం. అయితే ఇప్పటివరకూ 326 మంది తెలంగాణ పోలీసులు మావోయిస్టు, ఎంఎల్ గ్రూపు నక్సలైట్ల చేతుల్లో అమరులయ్యారు. వీరిలో కానిస్టేబుళ్ల నుంచి ఐపీఎస్ అధికారుల వరకు ఉన్నారు. ఖాకీ దుస్తులు అంటేనే త్యాగాలకు ప్రతీక అనే విష యాన్ని పోలీసులు తమ విధుల ద్వారా చాటుతున్నారు. ప్రజల భద్రత, శాంతి పరిరక్షణ కోసం నిస్వార్థ సేవలందించిన ఈ అమర పోలీసులకు దేశ ప్రజలు అక్టోబర్ 21న నివాళులు అర్పిస్తున్నారు. – కన్నెగంటి వెంకటరమణ, జాయింట్ డైరెక్టర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ -
నిర్లక్ష్యంగా ఉంటే కరోనా కాటు తప్పదు
-
పల్లె నుంచి పరీక్షల అధికారి వరకూ..
సాక్షి, కడప ఎడ్యుకేషన్: మనసుండాలే గాని మార్గముంటుందంటారు. చదువుకోవాలనే ధ్యాస ఆ వ్యక్తిని ఉన్నతాధికారి స్థాయికి తీసుకెళ్లంది. మన జిల్లాలోని వల్లూరు మండలం గంగాయపల్లెలో ఓ రైతు ఇంట జన్మించి బడి ముఖమే చూడకుండా 1 నుంచి 5 వరకు ఓ ప్రైవేటు వ్యక్తి వద్ద చదివారు. తరువాత 6 నుంచి ప్రభుత్వ స్కూలులో చదివారు. ఆయనెవరో కాదు. మన రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారెడ్డి. టెట్, సర్వశిక్ష అభియాన్ బోర్డులకు కూడా సేవలందిస్తున్నారు. సుబ్బారెడ్డి గంగాయపల్లె గ్రామంలోని ఓ ప్రైవేటు వ్యక్తి వద్ద ప్రాథమిక విద్య నేర్చుకున్నారు. చదువుపై ఆది నుంచి ఆసక్తి చూపేవరు.6 నుంచి 10వ తరగతి వరకు గంగాయపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివారు. కడపలోని రామక్రిష్ణా జూనియర్ కళాశాలో, డిగ్రీని కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో పీజీని శ్రీక్రిష్ణదేవరాయ యూనివర్సీటీ పూర్తి చేశారు. ఈయన 2000లో విద్యను పూర్తి చేసి మొట్టమొదటి సారిగా సెకండ్‌గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తరువాత డీఎస్సీ రాసి 2001లో స్కూల్ అసిస్టెంట్ ఎంపికైయ్యారు. 2007లో జేఎల్ పరీక్షను రాసి జూనియర్ లెక్చరర్‌గా ఎంపికయ్యారు. 2008లో ఏపీపీఎస్సీ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును సాధించారు. డిప్యూటీ డీఈఓగా ఎంపికయ్యారు. సొంత జల్లా అయిన కడపకు వచ్చారు. అనంతరం 2012లో డీఈఓగా పదోన్నతిపై హైదరాబాదకు వెళ్లారు. తరువాత రాçష్ట్రం విడిపోవడంతో కృష్ణా జిల్లా డీఈఓగా బదిలీపై వచ్చారు. తరువాత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొంది విద్యాశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. దీంతోపాటు 2018 నుంచి ప్రభుత్వ పరీక్షల జాయింట్ డైరెక్టర్‌గా, సర్వశిక్ష అభియాన్ బోర్డు డైరెక్టర్‌గా కూడా సేవలందిస్తున్నారు. సుబ్బారెడ్డి తల్లితండ్రులు బాలిరెడ్డి, సుబ్బమ్మలది వ్యవసాయ కుటుంబం. విద్యాశాఖలో మార్పులు సుబ్బారెడ్డి ప్రభుత్వ పరీక్షల రాష్ట్ర ఇన్చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విద్యాశాఖలో పలు సమూల మార్పులు తెచ్చారు. పదవ తరగతి విద్యార్థులకు మార్కుల జాబితాను ఫలితాలు వెలువడిన వెంటనే ఆన్లైన్ పెట్టించేలా చర్యలు తీసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులను ఎత్తివేయించడంలో కీలక భూమిక పోషించారు. గతంలో విద్యార్థి హాల్‌టికెట్ నెంబరు కొడితే కేవలం వ్యక్తిగత మార్చులు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు స్కూల్ కోడ్ కొట్టగానే విద్యార్థులకు సంబంధించిన అందరి ఫలితాలు ఒకేసారి వస్తాయి. ఇదీ ఆయన కృషేనని చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా 12 రకాల స్కూల్ మేనేజ్మెంట్కు సంబంధించిన 11,890 స్కూల్స్ గుర్తింపుతోపాటు అడిషి నల్ తరగతుల వివరాలను అన్లైన్లో నమోదు చేయించారు. ప్రైవేటు పాఠశాలల గుర్తిం పు వివరాలను కూడా ఆన్లైన్లో పెట్టించారు. పదవ తరగతి విద్యార్థులకు సం బంధించిన నామినల్ రోల్స్‌ను కూడా జూన్‌లోనే ఆన్లైన్ చేస్తున్నారు. గతంలో నవంబర్ నెలలో నామినల్ రోల్స్‌ను అన్లైన్ చేసేవారు. ఆలాంటిది ఇప్పడు జూన్‌లోనే చేయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మహిళలు ఆర్థిక స్వావలంబనకు కుట్లు, అల్లికలు, మ్యూజిక్ వంటి వృత్తి విద్యా కోర్సలను సంబంధించిన శిక్షణా కేంద్రాన్ని కడపలో ఏర్పాటు చేయించారు. -
అధియాపై ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆగ్రహం
న్యూఢిల్లీ: కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియాపై ఈడీ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్ మండిపడ్డారు. కుంభకోణాలు చేసిన వారు, వారి సంబంధీకుల విషయంలో రాజేశ్వర్ అనుకూలంగా వ్యవహరించారంటూ ఇటీవల అధియా వ్యాఖ్యానించారు. దీనిపై జూన్ 11న అధియాకు పంపిన లేఖలో రాజేశ్వర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘20 ఏళ్లుగా ఎందరో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారుల నుంచి ‘అద్భుతంగా పనిచేశావంటూ’ ప్రశంసలందుకున్నాను. నేను ఎప్పుడూ తప్పచేయలేదు. మీరు వివిధ సందర్భాల్లో నేను సుప్రీంకోర్టుసహా న్యాయవ్యవస్థనూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించానని తోటి అధికారుల ముందు అవమానకరంగా మాట్లాడారు. అది నన్ను చాలా బాధించింది’ అని లేఖలో పేర్కొన్నారు. అయితే, రాజేశ్వర్ సింగ్‌పై గతంలో ఇచ్చిన అధికారిక ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ బుధవారం సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ లేఖ విషయం బయటకొచ్చింది. -
సీబీఐకు కొత్త జేడీల నియామకం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కొత్త జాయింట్ డైరెక్టర్లను నియమించింది. ఆరుగురి పేర్లతో కూడిన ఓ ప్రకటనను కేంద్రం గురువారం ఉదయం విడుదల చేసింది. ఐపీఎస్ అధికారులు శరద్ అగర్వాల్, గజేంద్ర కుమార్ గోస్వామి, వీ మురుగేశన్, ప్రవీణ్ సిన్హా, అజయ్ భట్నాగర్, శ్రీ పంకజ్ కుమార్ శ్రీవాస్తవలను నూతన జాయింట్ డైరెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 1998 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శరద్ అగర్వాల్ ప్రస్తుతం విజిలెన్స్ కమిషన్‌కు అదనపు కార్యదర్శిగా ఉన్నారు. అజయ్ భట్నాగర్ సీఆర్పీఎఫ్ ఐజీగా విధులు నిర్వహించారు. కొత్త జేడీల పేర్ల జాబితాతోపాటు వారి వారి పదవీకాలం పూర్తయ్యే వివరాలను కూడా కేంద్రం ప్రకటనలో స్పష్టం చేసింది. -
పల్స్ పోలియో విజయవంతం
అనంతపురం మెడికల్ : జిల్లా వ్యాప్తంగా రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతమైనట్లు జాయింట్ డైరెక్టర్ వీణాకుమారి అన్నారు. మంగళవారం డీఎంహెచ్ఓ చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మూడ్రోజల పాటు వంద శాతం చిన్నారులకు పోలియో చుక్కలు వేశామన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు, సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేశారని కితాబిచ్చారు. అనంతరం ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక జబ్బుల నివారణపై రూపొందించిన ‘మానసిక కుంగుబాటు గురించి మాట్లాడుకుందాం’ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, ప్రోగ్రాం ఆఫీసర్లు అనిల్‌కుమార్, సుధీర్‌బాబు, సుజాత, పురుషోత్తం, దోసారెడ్డి, డెమో హరిలీలాకుమారి, ఎస్ఓ మారుతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ జేడీ లక్ష్మా నాయక్‌కు మహోన్నత సేవా పథకం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏసీబీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మానాయక్‌కు రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత సేవా పథకాన్ని ప్రకటించింది. బుధవారం గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ఆయన పథకాన్ని అందుకోనున్నారు. ఓర్వకల్ మండలం గుమితంతండా గ్రామంలోని సామాన్య రైతు కుటుంబం నుంచి 1995లో ఎస్ఐగా పోలీసు శాఖలో చేరిన లక్ష్మా నాయక్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఏసీబీ జేడీగా పనిచేస్తున్నారు. -
జిల్లాలో 100 పశువైద్య శిబిరాలు
పశుసంవర్ధక శాఖ జెడీ వెంకట్రావు అచ్చంపేట (సామర్లకోట) : జిల్లావ్యాప్తంగా మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 100పశువైద్య క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వి.వెంకట్రావు తెలిపారు. సామర్లకోట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 మార్కెట్ కమిటీలు ఉండగా ప్రతి కమిటీ ఏడాదికి ఐదు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. ప్రతి శిబిరంలోను రూ.20వేలు ఖర్చు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. పశువులకు ఉచితంగా మందులు, దాణా అందజేస్తారని తెలిపారు. రూ.5 లక్షలతో నిర్మించే అచ్చంపేట పశువైద్య కేంద్రం ప్రహరీకి శంకుస్థాపన చేశారు. ఆవరణలో మొక్కలు నాటారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు అధ్యక్షత వహించగా గ్రామ సర్పంచ్ పోతల నాగమõß శ్వరీ, ఉపసర్పంచ్ పబ్బినీడీ ఈశ్వరరావు, మండల పరిషత్తు వైస్ ఎంపీపీ ఆకునూరి సత్తిబాబు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ అడబాల చిట్టిబాబు, పశుసంవర్ధక శాఖ ఏడీ ఎన్టీ శ్రీనివాసరావు, డాక్టర్లు యోగేశ్వర్, రాకేష్, శ్రీధర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రసన్నబాబు పాల్గొన్నారు. -
విత్తనాల కొరత లేదు
ఎరువులు అందుబాటులో ఉన్నాయి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఖరీఫ్ రైతులు ఆందోళన చెందవద్దు శాస్త్రీయంగా భూసార పరీక్ష పత్రాలు సేంద్రియ ఎరువుల వాడకంపై అన్నదాతలకు అవగాహన ఈ నెలాఖరులోగా రెండో విడత రుణమాఫీ అందుతుంది 'సాక్షి'తో వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ డి. నర్సింహా సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మృగశిర, ఆరుద్ర కార్తెల ప్రభావం మొదలైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి వానల జోరు పెరిగింది. ఈ నేపథ్యంలో రైతులు సాగుకు సన్నద్ధమయ్యూరు. ఖరీఫ్ పనులు వేగం పుంజుకున్నాయి. ఎరువులు, విత్తనాల సరఫరాపైనే అనుమానాలు. వ్యవసాయ పనిముట్లు, రుణమాఫీ, యంత్రలక్ష్మి పథకాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. భూసార పరీక్ష లు మొదలు పంటల సాగు వరకు అనేక అంశాలు ప్రాధాన్యంగా మారాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎం.నర్సిం హాసింహా 'సాక్షి'ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. అనుమానాలను నివృత్తి చేయడంతోపాటు, రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వివరాలు ఆ యన మాటలలోనే... విత్తనాలు, ఎరువుల కొరత లేదు... ఈ విషయంలో అపోహలు వద్దు ఖరీఫ్‌కు రైతులు విత్తనాలు, ఎరువుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీజన్‌కు సరి పడే విధంగా ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేం దుకు వీలుగా అన్ని చర్యలు తీసుకున్నాం. 1,04,550 క్వింటాళ్ల జీలుగ, సోయాచిక్కుడు, మొక్కజొన్న తది తర విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నా ము. 75,000 పత్తి ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఈ సీజన్ కోసం 234303 మెట్రిక్ టన్నుల యూ రియా, డీఏపీ, కాంప్లెక్స్ తదితర రకాల ఎరువులను సరఫరా చేయనున్నాం. 1,02, 809 మె.టన్నుల ఎరువులు మార్క్‌ఫెడ్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(ప్యాక్స్)లకు సరఫరా చేశాం. విత్తనాలు, ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించే వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. ఖరీఫ్ సాగు అంచనా 4.18 లక్షల హెక్టార్లు 2013, 2014 ఖరీఫ్ సీజన్ల సాగును దృష్టిలో పెట్టుకుని ఈసారి ఖరీఫ్ సాగును అంచనా వేశాము. 4,18,100 హెక్టార్లలో వివిధ పంటలు వేస్తారనుకున్నాం. అత్యధికంగా సోయా, వరి పంటలు మూడు లక్షల హెక్టార్ల వరకు ఉండవచ్చు. ఈసారి అటవీశాఖ ఆక్రమిత భూముల విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తున్నందున సుమారు 20 వేల హెక్టార్లలో సాగు తగ్గే అవకాశం ఉంది. 3.98 లక్షల హెక్టార్లు అనుకు న్నా ఇప్పటి వరకు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 1,14, 860 హెక్టార్లలో వివిధ పంటలు వేశారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైనా, మిగతా జిల్లాలతో పోలిస్తే తక్కువే. ఆన్లైన్ ద్వారానే ఇక ‘యంత్రలక్ష్మి’ దరఖాస్తులు యంత్రలక్ష్మి పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఆన్లైన్ ద్వారా అర్హులైన రైతుల దరఖాస్తులు స్వీకరించనుంది. మ ండల వ్యవసాయాధికారి కార్యాలయంలో పూర్తి వివరాలు పొందవచ్చు. ఈ ఏడాది జిల్లాకు యంత్రలక్ష్మి కింద రూ.18.74 కోట్లు కేటాయించారు. 25 హెచ్‌పీ ట్రాక్టర్లు,రొ టవేటర్లు, మినీ ట్రాక్టర్లు, ట్రాలీలు, టార్పాలిన్లు, వ్యవసాయ సస్యరక్షణ పరికరాలు తదితర యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకనుంచి వీటిని దరఖాస్తు చేసు కున్న వారం రోజులలోనే అందిస్తాం. మూడేళ్లలో భూములకు భూసార పరీక్ష పత్రాలు శాస్త్రీయ పద్ధతిలో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు పత్రాలు అందజేసే ప్రక్రియను ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది.మోతాదును మించి రసాయన ఎరువులు వాడటంతో చాలా చోట్ల భూసారం దెబ్బతిన్నది. ఇందుకోసం జిల్లాలోని భూములన్నింటినీ మూడు విడతలుగా మూడేళ్లలో పరీక్షలు నిర్వహించి శాస్త్రీయంగా వ్యవహరించే వీలు కల్పించనున్నాం. వర్షాధార పంటలు వేసే భూములైతే 10 హెక్టార్లు ఒక గ్రిడ్‌గా, బాబులు, ప్రాజెక్టుల కింద సాగయ్యే భూములైతే రెండున్నర హెక్టార్లు ఒక గ్రిడ్ పరిగణించి భూమి ఆరోగ్య పథకం కింద పరీక్షలు నిర్వహించి కార్డులు అందజేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'పరం పరాగత్' స్కీం ద్వారా గతంలో రసాయన ఎరువులు వాడిన భూములను 25 ఎకరాలను ఒక క్లస్టర్‌గా తీసుకొని సేంద్రియ ఎరువులపై రైతులందరికీ అవగాహన కల్పించనున్నాం. పకడ్బందీగా విత్తన గ్రామ పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విత్తన గ్రామ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం. బోధన్, భిక్కనూర్, బిచ్కుంద మండలాలో మినుముల విత్తనాల కోసం ఆరు క్వింటాళ్లు సరఫరా చేశాము. 12 మండలాలలో 900 క్వింటాళ్ల వరి విత్తనాలు రైతులకు సరఫరా చేయగా, నారుమళ్లు కూడ సిద్ధం చేశారు. సోయా సీడ్ కోసం 3000 క్వింటాళ్లు లక్ష్యం కాగా, 2600 క్వింటాళ్లు సరఫరా చేశాము. వచ్చే ఏడాదిలో రైతులు ప్రరుువేటు కంపెనీలపై ఆధారపడే పరిస్థితి ఉండదు.రెండో విడత రుణమాఫీకి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ నెలాఖ రులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీంతో మరో రూ.393.40 కోట్ల రుణా లు రైతులకు మాఫీ కానున్నాయి. -
నేను మంత్రినన్న సంగతి తెలుసా?
చీపురుపల్లి : పశు సంవర్థక శాఖాధికారులుపై రాష్ట్ర గ్రా మీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవా రం చీపురుపల్లి వచ్చిన ఆమెను మండల పరిషత్ కార్యాలయంలో పశు సంవర్థక శాఖ జాయింట్ డెరైక్టర్ వై. సింహాచలం, ఏడీ శ్రీనివాసరావు కలిసారు. ఈ సందర్భంగా ఆమె వారిపై అసహ నం వ్యక్తం చేశారు. జిల్లాలో మంత్రిగా ఉన్నానని తెలు సా..? లేదా? అని ప్రశ్నించారు. అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. స్వయాన మంత్రి సొంత నియోజకవర్గంలో సమస్యలపై కూడా తన దృష్టి కి ఇంతవరకు తీసుకురాకపోవడం ఏమిటి, అసలు మీ ఇబ్బందులు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. శాఖలో ఉన్న సమస్యలను తానే గుర్తించి, ఫోన్లు చేసిన ంత వరకు కలవకపోతే ఎలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఇంతలో పశు సంవర్థకశాఖ ఏడీ శ్రీనివాసరావు కలుగజేసుకుని చాలాసార్లు జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు దృష్టికి చీపురుపల్లి పశువైద్యశాల సమస్య తీసుకొచ్చానని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి ఆయనతో ఎందుకు చెప్పడం నేరుగా తన వద్దకే వచ్చి చెప్పాలి కదా...ఏం చదువుకున్న వారే కదా.. మీ ఆస్పత్రిలో సమస్యలు మీరు వచ్చి చెప్ప లేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనుకోవడం మా నేసి, ఉద్యోగులు తమ కార్యాలయాల్లో ఏం సమస్యలు ఉన్నాయో గుర్తించాలన్నారు. ఆ సమస్యలను ఎలా పరి ష్కరించుకోవాలో మార్గం తెలుసుకుని తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. చీపురుపల్లి పశువైద్యశాల సొంత భవనం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పది సెం ట్లు స్థలం ఉంటే సొంత భవనానికి నిధులు మంజూరవు తాయని జేడీ సింహాచలం చెప్పారు. స్థలం ఎక్కడైనా ఉంటే చూడాలని తహశీల్దార్ డి. పెంటయ్యను మంత్రి ఆదేశించారు. ఇంతలో జెడ్పీటీసీ మీసాల కలుగజేసుకుని మార్కెట్ యార్డు స్థలంలో చాలా ఖాళీ స్థలం ఉంద ని,అక్కడ నిర్మించుకుంటే బాగుంటందని సూచించా రు. దీనికి మంత్రి సుముఖత వ్యక్తం చేస్తూ, సర్వే నంబర్లతో లేఖను తయారు చేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. -
యంత్ర సాయం...సాగు లాభం
ఆరుగాలం కష్టించి సాగుచేసిన రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు. గత కొన్నేళ్లుగా పంటలు కలిసిరాకపోవడంతో అన్నదాతలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటనష్టపోతున్నారు. పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. రైతన్నల సమస్యలు తెలుసుకునేందుకు వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ (జేడీ) దమ్ము ప్రమీల సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారారు. కొండ కరకాం గ్రామంలో పొలాల్లోకి వెళ్లి రైతులు పండిస్తున్న వరి, టమాటా, మిరప, వంగ వంటి పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని, తగిన సూచనలు చేశారు. ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే అధికలాభాలు పొందవచ్చని చెప్పారు. కొండకరకాం గ్రామాంలో పలు పంటలను పరిశీలించి రైతులను సమస్యలను తెలుసుకున్నాను. వరి ఒక్కటే అయితే గిట్టుబాటు కాదని, ఇక్కడ రైతులు వరితోపాటు టమాటా, మిరప, వంగవంటి పంటలు కూడా సాగు చేస్తున్నారు. ఈ విధానాన్ని మిగతా రైతులు కూడా పాటించాలి. కూరగాయలను విజయనగరం రైతు బజార్లో విక్రయిస్తే మంచిధర వస్తుంది. రైతులకు యంత్ర పరికరాలను 50 శాతం రాయితీపై అందిస్తున్నాం. యంత్ర పరికరాలు కావాల్సిన వారు మీసేవద్వారా దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకుని వెళ్లడంలో ఇబ్బందుల పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళతాను. నష్టపోయిన రైతులందరికీ పరి హారం అందేలా కృషి చేస్తాను. రైతులతో జాయింట్ డెరైక్టర్ ప్రమీల సంభాషణ ఇలా సాగింది. వ్యవసాయశాఖ జేడీ: నాపేరు ప్రమీల, నేను వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్‌ను. మీ సమస్యలు తెలుసుకోడానికి వచ్చాను. మీ పేరేంటి, ఏపంట వేశారు? రైతు సత్యం: అమ్మా నాపేరు సత్యం. వరి వేశాను జేడీ: ఎన్ని ఎకరాల్లో వేశారు? సత్యం: ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్నానమ్మ. జేడీ: ఏరకం విత్తనాలు వేశారు ? సత్యం: హెబ్రీడ్ రకం రకాన్ని వేశాను జేడీ: ఎన్ని రోజుల్లో పండుతుంది. పంట వేసిఎన్ని రోజులయింది? సత్యం: 120 రోజుల్లో పండుతుంది. పంట వేసి 25 రోజులయింది. జేడీ: కలుపు మందు ఏమైనా వేశారా? సత్యం: స్వాతి అనే కలుపు మందు వేశాను జేడీ: హైబ్రీడ్ రకాన్నే ఎందుకు వేశారు? సత్యం: మా గ్రామంలో ఓ రైతు ఖరీఫ్‌లో వేశారు. పంట బాగుంది. అందుకే నేనూ వేశాను . జేడీ: హైబ్రీడ్ రకాలను ఏకాలంలోనైనా వేసుకోవచ్చు. అయితే రబీలో వేసుకోవడం మంచిది. ఎందుకంటే తక్కువ రోజుల్లో పంట పండుతుంది. రబీలో నీటి వసతి అన్ని వేళలా అందుబాటులో ఉండదు కాబట్టి ఇటువంటి సల్వకాలిక రకాలను వేసుకోవడం మంచిది. అంతేకాకుండా దిగుబడి కూడా పెరుగుతుంది. పంటకు అవసరమైన ఎరువులను అందిస్తాం. జేడీ: మీ పేరేంటి? రైతు రాములప్పడు : నాపేరు రాములప్పుడమ్మ జేడీ:మీరేపంట వేశారు ? రాములప్పడు : వరి వేశానమ్మ. జేడీ: ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏ రకం సాగు చేస్తున్నారు? రాములప్పడు : ఖరీఫ్‌లో ఏడు ఎకరాల్లో హైబ్రీడ్ రకాన్ని వేశాను జేడీ: ఎంతదిగుబడి వస్తుందనుకుంటున్నారు? రాములప్పడు: ఎకరాకు 40 బస్తాలు వరకు వస్తాదని అనుకున్నాను. అయితే హుద్‌హుద్ తుపాను వల్ల పంట దెబ్బతింది. 25 నుంచి 30 బస్తాలు మాత్రమే దిగుబడి రావచ్చు జేడీ: పరిహారం వచ్చిందా? రాములప్పడు : రాలేదమ్మా జేడీ: పంటకు ఇన్సూరెన్స్ కట్టారా? రైతు: ఇన్సూరెన్స్ గురించి తెలియదమ్మా జేడీ: పంటలు బీమా ఇన్సూరెన్స్ ప్రతీ రైతు కట్టుకోవాలి. ఇన్సూరెన్స్ కడితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటలకు బీమా వర్తిస్తుంది. పరిహారం ఎందుకు రాలేదో విచారణ జరిపి, చర్యలు తీసుకుంటాను. జేడీ: మీ పేరేంటి రైతు సూర్యనారాయణ : నాపేరు సూర్యనారాయణమ్మ. జేడీ: ఏ పంట వేశారు? సూర్యనారాయణ : టమాటా వేశాను జేడీ: టమాటా ఎందుకు వేశారు ? సూర్యనారాయణ : వరి పంట కొంత వేశాను, అదనపు ఆదాయం వస్తుందని మరికొంత మేర టమాటా వేశాను. జేడీ: ఎక్కడ అమ్ముతారు? సూర్యనారాయణ : విజయనగరం మార్కెట్లో అమ్ముతాను జేడీ: కూరగాయాలను మార్కెట్లో కంటే రైతుబజార్లలో నేరుగా అమ్ముకుంటే మంచి ధర వస్తుంది. రైతు బజార్లో కూరగాయాలు అమ్ముకుంటానంటే ఏడీతో మాట్లాడి కార్డులు ఇప్పిస్తాను. టమాటా సాగులో కలుపు లేకుండా చూసుకోవాలి. ఏదైనా తెగులు సోకితే తక్షణమే ఉద్యానశాఖ అధికారినిగాని, శాస్త్రవేత్తను గాని అడిగి నివారణ చర్యలు చేపట్టాలి. జేడీ : బాబూ నీపేరేంటి? మరో రైతు : నా పేరు సూర్యనారాయణ జేడీ: రుణమాఫీ ఏమైనా అయిందా? సూర్యనారాయణ: తొలివిడతలో అవలేదు. రెండో విడతలో అవుతుందన్నారు. జేడీ: పాసుపుస్తకాలు, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలు వివరాలను జన్మభూమి కమిటీకి అందిస్తే సమస్య పరిష్కారమవుతుంది . రైతు: నా పేరు బాబారావు మేడమ్. జేడీ: ఏ పంట వేశారు, పంటనూర్పును సాధారణ పద్ధతిలో చేపడుతున్నారా, లేక యంత్రంతో చేస్తున్నారా? బాబారావు: వరి వేశానమ్మ, సాధారణ పద్ధతిలోనే నూర్పు చేస్తున్నాం. జేడీ: 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలను అం దిస్తున్నాం. మీసేవ ద్వారా దరఖాస్తు చేస్తే పరికరాలను అందజేస్తాం. యంత్ర పరికరాలతో పనులు చేయడం వల్ల కూలీల ఖర్చు, సమయం ఆదా అవుతుంది. జేడీ: బాబు నీ పేరేంటి ? రైతు గోపాల్‌రావు: మేడమ్ నాపేరు పడాల గోపాల్‌రావు. జేడీ: మీరే పంట పండిస్తున్నారు , మీసమస్య ఏంటి? గోపాల్‌రావు: నేను కూరగాయలు పండిస్తున్నాను. నాకు కూరగాయల సాగులో కలుపుతీసే పరికరం కావాలి జేడీ: కూరగాయల సాగును కూడా కొన్ని పరికరాలతో చేపట్టవచ్చు. వాటిని రాయితీపై అందిస్తాం. జేడీ? ఏమండీ మీ పేరేంటి, మీసమస్య ఏంటి? రైతు కోటేశ్వరరావు: అమ్మా... నాపేరు కోటేశ్వరావు. నేను రబీలో మూడు ఎకరాల్లో చోడి పంట వేశాను. యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నాను జేడీ: ప్రస్తుతం యూరియా కొరత ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు జిల్లాకు 600 టన్నుల యూరియా వచ్చింది. అన్ని సొసైటీలకు అందిస్తాం. ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం. జేడీ ధాన్యం: కొనుగోలు కేంద్రాల వల్ల ఉపయోగం ఉందా? కోటేశ్వరరావు: ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల ప్రయోజనం కంటే, ఖర్చు అదనంగా అవుతోంది జేడీ: ఎందుకు అదనంగా ఖర్చువుతోంది? కోటేశ్వరరావు: ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రానికితీసుకుని వెళ్లడానికిట్రాక్టర్కు అద్దె ఇవ్వాలి. అదే విధంగా ధాన్యం బస్తాల ఆన్లోడింగ్, లోడింగ్‌కు రూ.1000 వరకు ఖర్చువుతోంది జేడీ: మీకు కావాల్సిందేంటి? కోటేశ్వరరావు : మా కళ్లాల దగ్గరకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తే బాగుంటింది. దీని వల్ల రైతులకు చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా తూనిక యంత్రాలు ఇవ్వాలి. జేడీ: దరఖాస్తు చేసుకుంటే తూనిక యంత్రాలను రాయితీపై అందిస్తాం. ధాన్యం తరలించడానికి అవుతున్న అదనపు ఖర్చు గురించి ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరానికి కృషి చేస్తాను. జేడీ : మీ పేరేంటమ్మా ? మహిళారైతు రాజమ్మ: అమ్మా నా పేరు రాజమ్మ. జేడీ: నీకు పొలం ఉందా, ఉంటే ఏపంట వేశావు? రాజమ్మ: నాకు ఎకరం పొలం ఉంది. వరి వేశాను జేడీ : హుద్‌హుద్ తుపానుకు పంట దెబ్బతిందా?, పరిహారం వచ్చిందా ? రాజమ్మ : పంటంతా పోయిందమ్మ. పరిహారం రాలేదు జేడీ: పరిహారం ఎందుకు రాలేదో విచారణ చేసి చర్యలు తీసుకుంటాను జేడీ :బాబూ నీ పేరేంటి ? రైతు రమణ: నా పేరు రమణ మేడమ్. నేను కూరగాయలు సాగు చేస్తున్నాను జేడీ: ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏఏ పంటలవేశారు? రమణ: ఒక ఎకరంలో ముల్లంగి, గోంగూర, మొక్కజొన్న, టమాటా వేశాను మేడమ్ జేడీ: ఎక్కడ విక్రయిస్తారు ? రమణ: విజయనగరం మార్కెట్లో విక్రయిస్తాను జేడీ: ఎవరుతీసుకు వెళాతారు? రమణ : నేనే తీసుకుని వెళాతాను. జేడీ: ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది? రమణ: ఎకరానికి 20 వేలు వరకూ వస్తుంది మేడమ్. జేడీ : కూరగాయాలను రైతు బజారులో విక్రయిస్తే మంచి గిట్టుబాటు అవుతుంది. మార్కెట్లో అయితే దళారులు బెడద వల్ల నష్ట పోవలసి వస్తుంది. -
ఏసీబీకి చిక్కిన అవినీతి ఉద్యోగి
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప ప్రగతి భవన్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆరం రెడ్డి రూ.2 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి అడ్డంగా దొరికిపోయాడు. బ్రహ్మంగారిమఠం సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహంలో వార్డెన్‌గా పని చేస్తున్న నాగశంకర్‌కు ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ నిధుల మంజూరుకు సంబంధించిన ఫైలును జేడీకి పంపేందుకు గాను రూ.2 వేలు లంచంగా అడిగాడు. గత ఏడాది జనవరి నుంచి నిధులు విడుదల కాకపోవడంతో నాగశంకర్ పలుమార్లు ఆరం రెడ్డిని అడిగారు. అందుకు ప్రతిఫలంగా డబ్బుతో పాటు మద్యం బాటిల్ ఇవ్వాలని ఆరంరెడ్డి డిమాండ్ చేశారు. దీంతో బాధతుడు ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఆరంరెడ్డి తన చాంబర్లో ఉండగా నాగశంకర్‌తో రూ.2 వేలు నగదును ఏసీబీ అధికారులు పంపించారు. ఆ నగదును ఆరంరెడ్డికి అందజేయగా ఆయన తీసుకున్నారు. దీంతో తాము రెడ్‌హ్యాండెడ్‌గా ఆయన్ని పట్టుకున్నామని తిరుపతి రేంజ్ డీఎస్పీ రాజారావు విలేకరులకు తెలిపారు. ఏసీబీ సీఐలు పార్థసారథిరెడ్డి, చంద్రశేఖర్, రామ్‌కిశోర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
మైండ్ సెట్ మార్చుకోండి...
ఇందూరు, న్యూస్‌లైన్ : విద్యార్థులకు అనుగుణంగా వార్డెన్లు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ అలోక్ కూమార్ సూచించారు. బయటి పనుల్లో నిమగ్నమై వసతి గృహానికి వచ్చా మా... పోయామా అన్నట్లుగా ఉండొద్దన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నగరంలోని అంబేద్కర్ భవన్లో జిల్లా సంక్షేమాధికారులతో, వార్డెన్లతో సమావేశం నిర్వహించారు. బీసీ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు, సౌకర్యాలను వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను వారికి అందజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో వార్డెన్లపై ఉందన్నారు. కొత్తగా అమలు చేస్తున్న మెనూను పక్కాగా అమలు చేయాలని సూచించారు. జిల్లాలో కొన్ని వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, అక్కడి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారం రోజుల్లో పూర్తి సౌకర్యాలు ఉన్న భవనాల్లోకి మార్చాలని సూచించారు. అవసరమైతే గ్రామ సర్పంచ్, గ్రామ కమిటీ మెంబర్లతో మాట్లాడి భవనాలను వెతుక్కోవాలన్నారు. ప్రభుత్వ భవనంలో కొనసాగుతున్న వసతి గృహాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజురు చేయిస్తానని అన్నారు. ప్రతి వసతి గృహాంలో అవసరం ఉన్నచోట ఫ్యాన్,బల్బు కచ్చితంగా ఉండాలన్నారు. కొందరు విద్యార్థులు సగం పగిలిన అద్దాల్లో చూసుకుంటున్నారని, వార్డెన్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే కొత్తవి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లు, యూనిఫాంలు లేని విద్యార్థులకు వెంటనే అవి అందేలా సహాయ సంక్షేమాధికారులు, వార్డెన్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాస్మోటిక్ చార్జీలు వెంటనే చెల్లించాలని పెండింగ్‌లో ఉంచవద్దన్నారు. విద్యార్థులకు వార్డెన్లు స్టడీ అవర్స్ నిర్వహించడం లేదని కారణం ఏంటనీ ప్రశ్నించగా, ఎవరూ సమాధానం చెప్పకపోడంతో అసహనం వ్యక్తం చేశారు. నేటి నుంచి అన్ని స్టడీ అవర్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారిణి విమలను అదేశించారు. ప్రతి వార్డెన్‌కు ఒక సబ్జెక్టు వచ్చి ఉండాలని, పిల్లలకు రోజు ఒక గంట బోధించడం లేదా, సందేహాలను నివృతి చేయాలన్నారు. వారికి అన్ని మీరే అన్నట్టుగా ఉండాలన్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహించాలి చదువులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందించాలని తద్వారా వారిలో పోటీ తత్వం పెరుగుతుందన్నారు. విద్యార్థులకు సౌకర్యాలు,మెనూ ప్రకారం భోజనం,స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ప్రతి వసతి గృహంలో ల్యాండ్ ఫోన్ ఉండాలని అప్పుడప్పుడు ఫోన్ చేసి విద్యార్థులను అడిగి తెలుసుకుంటామని, దీంతో మీ పనితనం తెలిసిపోతుందన్నారు. మెస్,విద్యా,తదితర కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని,నెలకు రెండు సార్లు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి తనకు నివేదించాలని సూచించారు. వసతి గృహాలకు సరఫరా అవుతున్న రేషన్ బియ్యం సంచుల్లో తక్కువగా వస్తున్నాయని వార్డెన్లు జేడీకి ఫిర్యాదు చేయగా, అలాంటి బ్యాగులను వెంటనే సివిల్ సప్లయ్అధికారులకు అప్పగించి వేరే బ్యాగులను తీసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.