సీబీఐకు కొత్త జేడీల నియామకం | Six New joint directors for CBI | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 25 2018 1:46 PM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

Six New joint directors for CBI  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం..  కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కొత్త జాయింట్‌ డైరెక్టర్‌లను నియమించింది. ఆరుగురి పేర్లతో కూడిన ఓ ప్రకటనను కేంద్రం గురువారం ఉదయం విడుదల చేసింది.

ఐపీఎస్‌ అధికారులు శరద్ అగర్వాల్‌, గజేంద్ర కుమార్‌ గోస్వామి, వీ మురుగేశన్‌, ప్రవీణ్‌ సిన్హా, అజయ్‌ భట్నాగర్‌, శ్రీ పంకజ్‌ కుమార్‌ శ్రీవాస్తవలను నూతన జాయింట్‌ డైరెక్టర్‌లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 1998 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన శరద్‌ అగర్వాల్‌ ప్రస్తుతం విజిలెన్స్‌ కమిషన్‌కు అదనపు కార్యదర్శిగా ఉన్నారు. అజయ్‌ భట్నాగర్‌ సీఆర్‌పీఎఫ్‌ ఐజీగా విధులు నిర్వహించారు.

కొత్త జేడీల పేర్ల జాబితాతోపాటు వారి వారి పదవీకాలం పూర్తయ్యే వివరాలను కూడా కేంద్రం ప్రకటనలో స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement