new appointments
-
ఫిక్కీకు కొత్త డైరెక్టర్ జనరల్ నియామకం
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) డైరెక్టర్ జనరల్‌గా జ్యోతి విజ్ నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం ఫిక్కీలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.1988లో శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990లో దిల్లీ యూనివర్సిటీ నుంచి బిజినెస్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. 1993లో ఫిక్కీలో చేరిన ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. జ్యోతి నియామకం సందర్భంగా ఫిక్కీ ప్రెసిడెంట్ అనీష్ షా మాట్లాడుతూ..‘జ్యోతి విజ్‌ను డైరెక్టర్ జనరల్‌గా నియమించడం సంతోషంగా ఉంది. ఆమె సమర్థంగా విధానాలను రూపొందిస్తారు. ఫిక్కీలో సుధీర్ఘకాలంపాటు సేవలందిస్తున్న జ్యోతి అనుభవం సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఉపయోగపడుతుంది. అది ఫిక్కీకు అదనపు విలువను జోడిస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?ఇదిలాఉండగా, వ్యక్తిగత కారణాలతో ఫిక్కీ సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆయన సర్వీసులో సంస్థకు సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఫిక్కీ ప్రకటన విడుదల చేసింది. -
నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటర్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స నియమితులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాకేశ్ శ్రీవాస్తవ మార్చి 31తో రిటైరవుతున్నారు. ఇటీవల జనవరి 15నే కంపెనీలో ఆయన డిప్యుటీ ఎండీగా నియమితులయ్యారు. అనుభవజు్ఞడైన వత్స సారథ్యం .. కంపెనీ తదుపరి వృద్ధికి దోహదపడగలదని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. -
నేవీ షిప్‌పై మొదటిసారిగా మహిళా అధికారికి బాధ్యతలు
న్యూఢిల్లీ: నావికా దళం యుద్ధ నౌకపై మొదటిసారిగా మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. మహిళా అధికారులకు ‘అన్ని ర్యాంకులు– అన్ని బాధ్యతలు’ అనే సిద్ధాంతానికి నేవీ కట్టుబడి ఉంటుందన్నారు. హిందూ మహా సముద్రంలో చైనా ఉనికి పెరిగిన నేపథ్యంలో భారత నావికా దళం యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు గత ఏడాదిగా వ్యూహాత్మకంగా చురుగ్గా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. -
మైక్రోసాఫ్ట్ జీడీసీ లీడర్‌గా అపర్ణ గుప్తా
Microsoft GDC Leader: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా తన కొత్త గ్లోబల్ డెలివరీ సెంటర్ (జీడీసీ) లీడర్ని అధికారికంగా ప్రకటించింది. ఈమె ఎవరు? ప్రస్తుతం ఆమె చేపట్టే బాధ్యతలు ఏవి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ కొత్త గ్లోబల్ డెలివరీ సెంటర్ (జిడిసి) లీడర్‌గా 'అపర్ణ గుప్తా' (Aparna Gupta) బాధ్యతలు స్వీకరించింది. ఈమె కస్టమర్ ఇన్నోవేషన్, డెలివరీ సామర్ధ్యాలను పర్యవేక్షిస్తుంది. 2005లో మైక్రోసాఫ్ట్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ డెలివరీ విభాగంగా జీడీసీని హైదరాబాద్‌లో నెలకొల్పారు. ఆ తరువాత ఇది బెంగళూరు, నోయిడా వంటి ప్రాంతాలకు విస్తరించింది. అపర్ణ గుప్తా లీడర్షిప్ లక్షణాలు మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ మీద కూడా మంచి పట్టుని కలిగి ఉంది, ఆమె సారథ్యంలో కంపెనీ పురోగతి చెందుతుందన్న విశ్వాసం తమకుందని మైక్రోసాఫ్ట్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ డెలివరీ కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ మౌరీన్ కాస్టెల్లో అన్నారు. ఆరు సంవత్సరాల క్రితం, అపర్ణ కమర్షియల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ (CSE)గా చేరి.. ఇప్పుడు గ్లోబల్ డెలివరీ సెంటర్ (జిడిసి) లీడర్‌గా ఎంపికైంది. ప్రారంభం నుంచి మంచి ప్రతిభను కనపరిచిన అపర్ణ ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరింది, రానున్న రోజుల్లో మరింత గొప్ప స్థాయికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
బీహెచ్ఈఎల్ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి
న్యూఢిల్లీ: బీహెచ్ఈఎల్ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీహెచ్ఈఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. మూర్తిని సీఎండీగా నియమించే ప్రతిపాదనకు అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఏసీసీ) ఆమోదం తెలిపిన విషయమై భారీ పరిశ్రమల శాఖ నుంచి బీహెచ్ఈఎల్కు సమాచారం అందింది. దీంతో సోమవారం సమావేశమైన బీహెచ్ఈఎల్ బోర్డు ఇందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సదాశివ మూర్తి కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ‘‘సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి నియామకం నవంబర్ 1 తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు అమల్లోకి వస్తుంది. పదవీ విమరణ తేదీ 2027 ఫిబ్రవరి 28 వరకు లేదంటే, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు (ఏది ముందు అయితే అది) ఈ నియామకం అమల్లో ఉంటుంది’’అని బీహెచ్ఈఎల్ తెలిపింది. -
ఉపాధిలో ఎయిరిండియా జోరు..
న్యూఢిల్లీ: వృద్ధి అవకాశాలపై అత్యంత ఆశావహంగా ఉన్న విమానయాన సంస్థ ఎయిరిండియా అయిదేళ్ల వ్యాపార పరివర్తన ప్రణాళిక అమలుపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతోంది. ప్రతి నెలా 550 మంది క్యాబిన్ సిబ్బంది, 50 పైలట్లను నియమించుకుంటోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఆరు ఏ350 పెద్ద విమానాలను అందుకోనుంది. ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ ఈ వివరాలను వెల్లడించారు. ఎయిర్‌లైన్ హైరింగ్ ప్రణాళికలను ప్రస్తావిస్తూ నిర్దిష్ట టార్గెట్ అంటూ ఏదీ లేదన్న విల్సన్ .. ‘ప్రతి నెలా కొత్తగా సుమారు 550 మంది క్యాబిన్ సిబ్బంది, 50 మంది పైలట్లను తీసుకుంటున్నాం, శిక్షణనిస్తున్నాం. ఎయిర్‌లైన్ ప్రైవేటీకరణ ముందు నాటి పరిస్థితితో పోలిస్తే వార్షికంగా క్యాబిన్ సిబ్బంది నియామకాల రేటు పది రెట్లు, పైలట్లది అయిదు రెట్లు పెరిగింది‘ అని వివరించారు. ఈ ఏడాదంతా కూడా ఇదే తీరులో హైరింగ్ కొనసాగుతుందని, ఏడాది ఆఖరులో నెమ్మదించి, 2024 ఆఖర్లో మళ్లీ పెరగవచ్చని ఆయన పేర్కొన్నారు. కొత్త విమానాలు వచ్చే కొద్దీ రిక్రూట్మెంట్ పెరుగుతుందన్నారు. నాలుగు సంస్థల్లో 20 వేల సిబ్బంది.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిరేషియా ఇండియా (ప్రస్తుతం ఏఐఎక్స్ కనెక్ట్), విస్తారాలను ఎయిరిండియాలో విలీనం చేసే విషయంపై స్పందిస్తూ నియంత్రణ సంస్థల అనుమతుల మేరకు ఎయిర్‌లైన్స్ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించుకోనున్నట్లు విల్సన్ చెప్పారు. వృద్ధి వ్యూహంలో భాగంగా కొత్తగా తీసుకుంటున్న వారు కాకుండా నాలుగు ఎయిర్‌లైన్స్‌లో కలిపి సుమారు 20,000 సిబ్బంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 3,900 మంది పైచిలుకు సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నట్లు గత నెలలో ఉద్యోగులకు విల్సన్ తెలిపారు. వీరిలో 500 మంది పైలట్లు, 2,400 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారని వివరించారు. 122 విమానాలు .. ప్రస్తుతం ఎయిరిండియాకు 122 విమానాలు ఉన్నాయి. వీటి సంఖ్యను మరింతగా పెంచుకుంటోంది. ఇందులో భాగంగా 470 విమానాల కోసం ఆర్డరు ఇచ్చింది. వీటిలో 250 విమానాలను యూరప్ దిగ్గజం ఎయిర్‌బస్ నుంచి, 220 ఎయిర్‌క్రాఫ్ట్‌లను అమెరికన్ దిగ్గజం బోయింగ్ దగ్గర్నుంచి కొనుగోలు చేస్తోంది. వీటిలో 40 ఎయిర్‌బస్ ఏ350లు, 20 బోయింగ్ 787లు, 10 బోయింగ్ 777–9 రకం పెద్ద విమానాలు, 210 ఎయిర్‌బస్ ఏ320/321 నియో ఎయిర్‌క్రాఫ్ట్, 190 బోయింగ్ 737 మ్యాక్స్ చిన్న విమానాలు ఉన్నాయి. వీటికి సంబంధించి తొలి చిన్న విమానం (నారో–బాడీ) జూలై లేదా ఆగస్టు నాటికి అందుకోవచ్చని విల్సన్ చెప్పా రు. అలాగే ఈ ఏడాది ఆఖరు నాటికి ఆరు ఏ350, ఎనిమిది బీ777 ఎయిర్‌క్రాఫ్ట్‌లు రాగలవని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా తొమ్మిది బీ777 విమానాలను లీజుకు తీసుకుని నడుపుతోంది. సవాళ్లు.. కొన్నాళ్లుగా పెట్టుబడులు లేక సతమతమవుతున్న ఎయిరిండియా వంటి పెద్ద సంస్థను వేగంగా గాడిన పెట్టాల్సి రావడమనేది సవాలు వంటిదని విల్సన్ తెలిపారు. ఎయిర్‌లైన్‌ను గణనీయంగా మార్చాల్సిన పరిస్థితి ఉందన్నారు. మిగతా ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేయడం, శిక్షణా సామరŠాధ్యలను పెంపొందించుకోవడం, ప్రారంభం నుంచి గతంలో ఎన్నడూ లేనంత వృద్ధి సాధించేలా మద్దతు కల్పించడం వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు, ఎకానమీ, ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్, సిబ్బందిలాంటి భాగస్వాములందరికీ మేలు చేసేలా దేశీ విమానయాన వ్యవస్థ ఆరోగ్యకరంగా, స్థిరంగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని విల్సన్ చెప్పారు. -
‘జెయింట్స్’ హెడ్ కోచ్‌గా రేచల్ హేన్స్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో అత్యధిక మొత్తంతో టీమ్‌ను సొంతం చేసుకున్న అహ్మదాబాద్ యాజమాన్యం అందరికంటే వేగంగా, చురుగ్గా టీమ్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈ టీమ్ ‘గుజరాత్ జెయింట్స్’కు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను ఇటీవలే మెంటార్‌గా ఎంపిక చేయగా, ఇప్పుడు టీమ్ హెడ్ కోచ్‌ను ప్రకటించింది. ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ రేచల్ హేన్స్ ‘జెయింట్స్’కు హెడ్ కోచ్‌గా వ్యవహరించనుంది. గత ఏడాదే ఆటకు గుడ్‌బై చెప్పిన హేన్స్ ఆసీస్ తరఫున ఆరు ప్రపంచకప్ విజయాల్లో భాగంగా ఉండటం విశేషం.ఆస్ట్రేలియా తరఫున ఆమె 6 టెస్టులు, 77 వన్డేలు, 84 టి20ల్లో ప్రాతినిధ్యం వహించింది. దీంతో పాటు మరో రెండు నియామకాలను కూడా అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఇటీవలే వరల్డ్‌కప్ నెగ్గిన భారత మహిళల అండర్–19 టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించిన నూషీన్ అల్ ఖదీర్‌ను బౌలింగ్ కోచ్‌గా... తుషార్ అరోథేను బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. గత ఏడాది మహిళల టి20 చాలెంజ్ టోర్నీ నెగ్గిన ‘సూపర్ నోవాస్’కు కోచ్‌గా పని చేసిన అనుభవం నూషీన్కు ఉండగా, బరోడా మాజీ క్రికెటర్ తుషార్ భారత సీనియర్ మహిళల టీమ్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. -
రోజ్‌గార్ మేళాల ద్వారా 1.47 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: రోజ్‌గార్ మేళాల కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వతంత్య్ర సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో కొత్తగా 1.47 లక్షల మందిని నియమిస్తూ నియామకపత్రాలు అందజేశామని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. ఇంకా భర్తీకాని పోస్టులకుగాను నియామక ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేశారు. 2020–21 కాలానికిగాను దేశంలో నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అదే కాలానికి దేశంలోని మొత్తం జనాభాలో ఏదైనా ఒక వృత్తిలో నిమగ్నమైన జనాభా(వర్కర్ పాపులేషన్ రేషన్–డబ్లూపీఆర్) 52.6 శాతంగా నమోదైందని తెలిపారు. కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు, కోవిడ్ సంక్షోభం నుంచి దేశార్థికాన్ని ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ.27 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అమలుచేసిందన్నారు. ఈ పథకం కింద లబ్దిపొందాలనుకునే సంస్థల రిజిస్ట్రేషన్ గడువు ఈ ఏడాది మార్చి 31నాడే ముగిసిందన్నారు. 60 లక్షల ఉద్యోగాల సృష్టి కోసం రూ.1.97 లక్షల కోట్లతో ఉత్పత్తి ప్రోత్సాహక రాయితీ పథకం తెచ్చామని మంత్రి చెప్పారు. -
Russia-Ukraine: రష్యా సైన్యం మరింత బలోపేతం!
కీవ్/మాస్కో/దావోస్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. సుదీర్ఘ పోరాటానికి పుతిన్ సైన్యం సన్నద్ధమవుతున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. సైన్యంలో నూతన నియామకాలకు సంబంధించిన బిల్లుకు రష్యా పార్లమెంట్ దిగువ సభ ఆమోదం తెలిపింది. సైన్యంలో చేరడానికి ప్రస్తుతమున్న 40 ఏళ్ల వయోపరిమితిని తొలగించారు. వయసు మళ్లిన వారినీ చేర్చుకుంటారని సమాచారం. మోటార్ సిచ్ ప్లాంట్ ధ్వంసం జపొరిజాజియాలోని ఉక్రెయిన్‌కు చెందిన కీలక హెలికాప్టర్ట ఇంజన్ల తయారీ కర్మాగారాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌లో అత్యంత కీలకమైన మారియుపోల్ ఓడరేవులో కార్యకలాపాలు మూడు నెలల తర్వాత ప్రారంభమయ్యాయి. అక్కడ మందుపాతరలను రష్యా సైన్యం తొలగించిందని సమాచారం. తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్క్లో రష్యా దాడుల్లో చాలామంది గాయపడ్డారు. రష్యాకు తలొంచం: జెలెన్స్కీ ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోందో పుతిన్‌కు తెలియదని జెలెన్స్కీ చెప్పారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమ భూభాగాన్ని రష్యాకు అప్పగించే ప్రసక్తే లేదన్నారు. ‘‘చర్చలకు రష్యా ముందుకు రావాలి. ముందు తన సేనలు, ఆయుధాలను ఉపసంహరించాలి’’ అన్నారు. మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభం: సోరోస్ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభం కావొచ్చని ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ జార్జి సోరోస్ హెచ్చరించారు. అదే జరిగితే భూగోళంపై నాగరికతే మిగలదన్నారు. దీన్ని నివారించేందుకు పుతిన్‌ను ఓడించడమే మార్గమన్నారు. యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ‘‘చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పుతిన్‌ది అవధుల్లేని అనుబంధం. యుద్ధంపై పింగ్‌కు ముందే సమాచారమిచ్చాడు. వారిద్దరి మధ్యా ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరూ ప్రజలను భయపెట్టి పరిపాలిస్తున్నారు’’ అని దుయ్యబట్టారు. -
భర్తీ చేయకుండా నిర్వీర్యం చేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అహనం వ్యక్తం చేసింది. వారంలోగా తీరు మార్చుకోవాలని పేర్కొంది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, ఢిల్లీ బార్ అసోసియేషన్, స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ మధ్యప్రదేశ్, అమర్జీత్ సింగ్ బేడిలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వరరావులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వాఖ్యలు చేసింది. మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి: కోర్టు తీర్పుల్ని కేంద్రం గౌరవించడంలేదని స్పష్టంగా అర్థమవుతోందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. ట్రైబ్యునళ్లలో ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలో చెప్పండి, ఆయా అంశాలపై ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏడాదిన్నరగా ఖాళీలు భర్తీ కాక మూసివేత దశలోకి వచ్చేలా ఉన్నా... ట్రైబ్యునళ్లలో ఎందుకు నియామకాలు చేపట్టడం లేదని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తమకు మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. 1. కొత్త చట్టం అమలుపై స్టే ఇచ్చి ట్రైబ్యునళ్లను మూసివేయడం. 2. సుప్రీంకోర్టే ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయడం. 3. కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడం. కేంద్రంతో ఘర్షణ పడాలని తాము భావించడం లేదని, ఇటీవల సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల నియామకం విషయంలో కొలీజియం సిఫారసులను ఆమోదించినందుకు సంతోషంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయితే, ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఖాళీలతో చైర్పర్సన్లు, సభ్యులు లేక ట్రైబ్యునళ్లు కూలిపోయేలా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఖాళీలు భర్తీ చేయకుండా వాటి నిర్వీర్యానికి కారణం అవుతున్నారని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ట్రైబ్యునళ్లను మూసివేసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ‘ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం నోటిఫై అయినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కొత్త చట్టం ఖాళీల భర్తీకి మార్గం సుగమం చేస్తుంది. సెర్చ్, సెలక్షన్ కమిటీ సిఫారసులను కేంద్రం తీసుకుంటుంది’ అని తుషార్ మెహతా తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ), నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)వంటి వాటిల్లో అనేక ఖాళీలున్నాయని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ట్రిబ్యునళ్లలో ఖాళీల వల్ల అనేక కేసులు పరిష్కారం కావడం లేదన్నారు. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా బ్యూరోక్రాట్లతో సమావేశమై పలు పేర్లు సిఫారసు చేశామని, అయినా నియామకాలు చేపట్టలేదని... ఇదంతా వృథా ప్రయాస అయిందని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఖాళీల భర్తీకి సంబంధించి వివరాలను తదుపరి విచారణకు అందజేస్తామని మెహతా చెప్పడంతో ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని ధర్మాసనం పేర్కొంది. ‘‘మీపై మాకు విశ్వాసం ఉంది. ఇలాంటి చట్టాలు చేయమని ప్రభుత్వానికి ఎప్పుడూ సూచించరు . ప్రభుత్వం దగ్గర ఉండే కొందరు బ్యూరోక్రాట్లు సలహాలు ఇస్తారు. ఒకవేళ ఏదైనా తీర్పు వస్తే కొత్త చట్టం రూపొందించమని చెబుతారు. ప్రస్తుతం బ్యూరోక్రసీ పనితీరు ఇలా ఉంది. అది మాకు తెలుసు. కానీ సీరియస్ అంశం కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఏదిఏమైనప్పటికీ మేమెంతో నిరుత్సాహం చెందాం. మేం చెప్పదలచుకున్నది ఇదే’’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్యానించారు. మూడు నాలుగు రోజులపాటు సమయం ఇస్తే... ఈలోగా భర్తీ చేస్తామని తుషార్ మెహతా చెప్పడంతో సోమవారానికి విచారణ వాయిదా వేస్తున్నామని కోర్టు పేర్కొంది. సోమవారానికి ఖాళీల భర్తీ కాకుంటే ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీకి పది రోజులు సమయం ఇస్తూ ధర్మాసనం ఆగస్టు 16న ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ట్రైబ్యునల్ సభ్యుల పదవీకాలం తగ్గించడం, ఇతర సేవలను తగ్గిస్తూ కేంద్రం తీసుకొచి్చన ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం, 2021ను ఇటీవల పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ట్రిబ్యునల్ సభ్యుడు లేదా చైర్పర్సన్ నియామకానికి కనీస వయసు 50 ఏళ్లు ఉండాలన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, ట్రైబ్యునళ్ల చైర్పర్సన్ల పదవీకాలం ఐదేళ్లు ఉండాలని ఆ మేరకు చట్టంలో పొందుపరచాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇవే అంశాలు మళ్లీ కొత్త చట్టంలో రావడంతో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా అంశాలు కేంద్రం విస్మరించడంతో తమ తీర్పులు పాటించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. గతంలో కొట్టివేసిన చట్టానికి కొత్త చట్టం అచ్చు నకలులా ఉందని పేర్కొంది. -
కోవిడ్ స్పెషల్ నియామకాలు
సాక్షి, అమరావతి: కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రెగ్యులర్ పోస్టులకు అదనంగా 20,792 మంది సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 17,901 మంది నియామకాలు పూర్తి కాగా మిగతా సిబ్బంది నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. వాక్ఇన్ ఇంటర్వూలతో ప్రత్యేకంగా సిబ్బంది నియామకాలు చేపడుతున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున స్పెషలిస్ట్ డాక్టర్లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, స్టాప్ నర్సులు, టెక్నీషియన్లు, పారిశుద్ధ్య సిబ్బంది, పురుష, మహిళా నర్సుల ఆర్డర్లీ నియామకాలు చేపడుతున్నారు. ఒకవైపు ఆసుపత్రుల్లో అవసరమైన మేరకు బెడ్లను ఏర్పాటు చేస్తూనే మరోపక్క వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెగ్యులర్ నియామకాలకు అదనంగా ప్రత్యేకంగా కోవిడ్–19 కింద వీటిని ప్రభుత్వం చేపడుతోంది. -
మహిళలు ఎక్కువే మాట్లాడాలి
టోక్యో ఒలింపిక్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో నిన్న ఒక్కరోజే 12 మంది మహిళలు కొత్తగా అపాయింట్ అయ్యారు. ఇప్పటికే ఉన్న ఏడుగురు మహిళలతో కలిపి 19 మంది! దీంతో బోర్డులో మహిళల శాతం 42 అయింది. (మొత్తం సభ్యులు 45 మంది). ఈ మెరుపు నియామకాలు చేపట్టింది ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీకి కొత్తగా వచ్చిన మహిళా ప్రెసిడెంట్ సీకో హషిమొటొ. ‘బోర్డు మీటింగులలో ఆడవాళ్లు ఎక్కువ మాట్లాడతారు‘ అని కామెంట్ చేసి, ప్రెసిడెంట్ పదవి పోగొట్టుకున్న 83 ఏళ్ల యషిరొ మొరి స్థానంలోకి వచ్చిన మహిళే హషిమొటొ. ‘ఎక్కువ మాట్లాడతారు‘ అనే కామెంట్ కు తగిన సమాధానంగా ఎక్కువ మంది మహిళలను బోర్డు రూమ్ లోకి తీసుకున్న హషిమొటొ.. జెండర్ ఈక్వాలిటీ కోసం మరికొన్ని చేర్పులు కూడా ఉంటాయంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ దగ్గర పడ్డాయి. జూలై 23 నుంచి ఒలింపిక్స్, తర్వాతి నెలకే ఆగస్టు 24 నుంచి పారా ఒలింపిక్స్. ఈ రెండు అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ‘ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ’ పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ కమిటీ ప్రెసిడెంట్ ఒక మహిళ. సీకో హషిమొటొ. ఆమె కూడా ఒకప్పుడు క్రీడాకారిణే. ఒలింపిక్స్ స్పీడ్ స్కేటింగ్‌లో కాంస్య పతకం సాధించారు. ఇప్పుడిక ఒలింపిక్స్ నిర్వహణ అధికారాలలో స్త్రీ సాధికారతను సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కమిటీ ప్రెసిడెంట్ పదవి అకస్మాత్తుగా ఖాళీ అవడంతో గత వారమే హషిమొటొ ఆ స్థానంలోకి వచ్చారు. ప్రెసిడెంటుగా తన తొలి ప్రసంగంలో ఆమె చెప్పిన మాట.. ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులలో మహిళల సంఖ్యను పెంచబోతున్నానని. చెప్పినట్లే మొన్న బుధవారం ఒకేసారి పన్నెండు మంది మహిళలను బోర్డు సభ్యులుగా నియమించారు హషిమొటో! బోర్డులో మొదట ఉన్న ఏడుగురు మహిళలతో కలిపి మొత్తం ఇప్పుడు పందొమ్మిది మంది అయ్యారు. ఈ పన్నెండు మందిని చేర్చుకోవడం కోసమే బోర్డులోని మొత్తం సభ్యుల సంఖ్యను 35 నుంచి 45కు పెంచారు హషిమొటో. స్త్రీ సాధికారత, స్త్రీ పురుష సమానత్వం కోసం ఆమె తీసుకున్న ఈ నిర్ణయం.. స్త్రీలపై పాత ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలకు తగిన సమాధానం కూడా అయింది! ∙∙ సీకో హషిమొటోకు ముందరి ప్రెసిడెంట్ యషిరో మొరి. నిజానికి ఆయన నేతృత్వంలోనే ‘ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ’ టోక్యో ఒలింపిక్స్‌ని నిర్వహించవలసి ఉంది. మీటింగుల మీద మీటింగులు జరుగుతున్నాయి. మీడియాకు ఎప్పటికప్పుడు మీటింగులలో మాట్లాడుకున్న నిర్వహణ వివరాలు ఆయనే అందించాలి. అలా అందిస్తున్న క్రమంలోనే యషిరో మాట జారారు. ‘‘మీటింగులలో ఈ ఆడవాళ్లు ఎందుకంత ఎక్కువగా మాట్లాడతారో!’’ అని అన్నారు. అలా అనడం వివాదం అయింది. జపాన్‌లోని మహిళా కమిషన్లు, సంఘాలు ఆయన అలా అనడాన్ని ఖండించాయి. యూనివర్సిటీ విద్యార్థినులు యషీరో రాజీనామాను కోరుతూ ప్రదర్శనలు జరిపారు. ‘‘క్షమాపణలు చెబితే సరిపోదు, రాజీనామా చేయాల్సిందే’’ అని పట్టుపట్టారు. ప్రభుత్వానికి తలవొగ్గక తప్పలేదు. ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలోకి హషిమొటొ వచ్చారు. ఈ అధికార మార్పిడంతా వారం పది రోజుల్లోనే జరిగిపోయింది. ఆడవాళ్లు మీటింగులలో ఎక్కువ మాట్లాడతారని అన్నందుకు జవాబుగా అన్నట్లు ఎక్కువమంది ఆడవాళ్లను బోర్డులోకి తీసుకున్నారు హషిమొటో. ‘‘వేగంగా పని చేసి, గట్టి ఫలితాలను సాధిస్తే మనం ఏమిటో రుజువు అవుతుంది’’ అని తన తొలి బోర్డు మీటింగులోనే మహిళల్ని ఉత్సాహపరిచారు హషిమొటొ. ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ ర్యాంకుల ప్రకారం స్త్రీ పురుష సమానత్వంలో జపాన్ 135 దేశాలలో 121వ స్థానంలో ఉంది. ఆ అంతరాన్ని తగ్గించడం కోసం అన్ని రంగాల బోర్డు రూమ్‌లలో మహిళల సంఖ్యను పెంచడం ఒక మార్గం అని కూడా ఫోరమ్ అభిప్రాయపడింది. ఆ విషయాన్నే చెబుతూ.. ఈ నెల 25న ఒలింపిక్ జ్యోతి తన ప్రయాణాన్ని ప్రారంభించేనాటికి బోర్డులో మరికొన్ని మార్పులు తేబోతున్నట్లు హషిమొటొ తెలిపారు. బోర్డులో ప్రస్తుతం ఏడుగురు వైస్–ప్రెసిడెంట్లు ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే మహిళ. బహుశా మహిళా వైస్–ప్రెసిడెంట్ల సంఖ్యను కూడా హషిమొటొ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఆ సంగతిని శుక్రవారం వెల్లడించబోతున్నట్లు ఆమె తెలిపారు. -
సినాడ్ అండర్ సెక్రటరీగా మహిళ
వాటికన్ సిటీ: రోమన్ క్యాథలిక్కుల గురువు పోప్ ఫ్రాన్సిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంప్రదాయాన్ని పక్కనబెట్టి కీలకమైన సినాడ్ (బిషప్పుల మహాసభ) అండర్ సెక్రటరీ పదవికి మొట్టమొదటిసారిగా మహిళను ఎంపిక చేశారు. ఆమెకు ఓటింగ్ హక్కులను కూడా కల్పించారు. కొత్తగా నియమితులైన ఇద్దరు అండర్ సెక్రటరీల్లో ఒకరు స్పెయిన్‌కు చెందిన లూయిస్ మారిన్ డీ సాన్ మార్టిన్ కాగా, మరొకరు ఫ్రాన్సుకు చెందిన సిస్టర్ నథాలీ బెకార్ట్(51) కావడం గమనార్హం. క్రైస్తవ మతంలో సిద్ధాంతపరంగా తలెత్తే ప్రధాన ప్రశ్నలపై సినాడ్ అధ్యయనం చేస్తుంది. సినాడ్‌లో బిషప్పులు, కార్డినల్స్ తోపాటు నిపుణులు కూడా ఉంటారు. వీరిలో బిషప్పులు, కార్డినల్స్కు మాత్రమే ఓటింగ్ హక్కులుంటాయి. అండర్ సెక్రటరీగా నియమితురాలైన బెకార్ట్‌కు కూడా ఓటింగ్ హక్కు కల్పించారు. చర్చికి సంబంధించిన విషయాల్లో సూక్ష్మపరిశీలన, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు కీలకంగా మారాలన్న పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్ష మేరకు ఈ నియామకం జరిగిందని సినాడ్ సెక్రటరీ జనరల్ కార్డినల్ మరియో గ్రెక్ తెలిపారు. ‘గతంలో నిపుణులుగా, పరిశీల కులుగా మాత్రమే మహిళలు సినాడ్‌లో ఉండే వారు. సిస్టర్ బెకార్ట్ ఎంపికతో మహిళలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు కూడా అవకాశం కలిగింది’అని ఆయన పేర్కొన్నారు. ఫ్రాన్సు లోని జేవియర్ సిస్టర్స్ సంస్థ సభ్యురాలైన బెకార్ట్, ప్యారిస్‌లోని ప్రఖ్యాత హెచ్ఈసీ బిజినెస్ స్కూల్ నుంచి మేనేజ్మెంట్లో డిగ్రీ పొందారు. బోస్టన్ యూనివర్సిటీలో కూడా ఆమె అధ్యయనం చేశారు. 2019 నుంచి సినాడ్‌కు కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నారు. కాగా, సినాడ్ తరువాతి సమావేశం 2022లో జరగనుంది. 2019లో అమెజాన్‌పై ఏర్పడిన ప్రత్యేక సినాడ్ సమావేశానికి 35 మంది మహిళా ఆడిటర్లను ఆహ్వానించినప్పటికీ వారెవరికీ ఓటింగ్ హక్కులు ఇవ్వలేదు. -
సీబీఐకు కొత్త జేడీల నియామకం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కొత్త జాయింట్ డైరెక్టర్లను నియమించింది. ఆరుగురి పేర్లతో కూడిన ఓ ప్రకటనను కేంద్రం గురువారం ఉదయం విడుదల చేసింది. ఐపీఎస్ అధికారులు శరద్ అగర్వాల్, గజేంద్ర కుమార్ గోస్వామి, వీ మురుగేశన్, ప్రవీణ్ సిన్హా, అజయ్ భట్నాగర్, శ్రీ పంకజ్ కుమార్ శ్రీవాస్తవలను నూతన జాయింట్ డైరెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 1998 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శరద్ అగర్వాల్ ప్రస్తుతం విజిలెన్స్ కమిషన్‌కు అదనపు కార్యదర్శిగా ఉన్నారు. అజయ్ భట్నాగర్ సీఆర్పీఎఫ్ ఐజీగా విధులు నిర్వహించారు. కొత్త జేడీల పేర్ల జాబితాతోపాటు వారి వారి పదవీకాలం పూర్తయ్యే వివరాలను కూడా కేంద్రం ప్రకటనలో స్పష్టం చేసింది. -
కీలక నియామకాలు చేపట్టిన వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పదవులకు కీలక నియామకాలు చేపట్టింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర ప్రధాన కార్యాలయం శనివారం ప్రకటనలు విడుదల చేసింది. రాష్ట్ర కార్యదర్శిగా చెల్లెం ఆనంద్ ప్రకాశ్(పాలకొల్లు నియోజక వర్గం ) నియమించినట్లు తెలిపింది. వీటితోపాటు ఎన్నారై విభాగం కేంద్ర కార్యాలయ సమన్వయకర్తగా గుంటూరుకు చెందిన అన్నపురెడ్డి హర్షవర్థన్ రెడ్డిని నియమించినట్లు తెలిపింది. అనంతపురం, కృష్ణా జిల్లాలకు చెందిన వారికి కీలక బాధ్యతలను అప్పజెప్పింది. మడకశిర నియోజకవర్గానికి గానూ రూరల్ మండల్ ప్రెసిడెంట్‌గా ఎస్ రామిరెడ్డిని నియమించినట్లు పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రకటనలో స్పష్టం చేసింది. (కృష్ణా జిల్లా జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (అనంతపురం జిల్లా జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్సీపీకి కొత్త నియామకాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ఇద్దరిని పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించారు. కృష్ణా జిల్లాకు చెందిన పైలా సోమినాయుడు, ప్రకాశం జిల్లాకు చెందిన కాకుమాను రాజశేఖర్‌లను అధికార ప్రతినిధులుగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదలైంది. పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఖాదర్ బాషా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వి.ఖాదర్ బాషా వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం అధ్యక్షునిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగానికి పది జిల్లాల్లో అధ్యక్షులను నియమించారు. వీరు కాక ఆయా జిల్లాల్లో ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను కూడా నియమించారు. -
కాంగ్రెస్‌లో భారీ నియామకాలు
జాబితాను విడుదల చేసిన ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సాక్షి, హైదరాబాద్: ఏపీ కాంగ్రెస్‌కు ఆ పార్టీ అధిష్టానం కొత్త నియామకాలు చేపట్టింది. ప్రధాన కార్యదర్శులుగా 26 మందికి, 12 జిల్లాలకు అధ్యక్షులనూ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా మరో 12 మంది నియమితులయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదించిన జాబితాను ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శనివారం విడుదల చేశారు. ప్రధాన కార్యదర్శులు వీరే.. కిల్లి రామ్మోహన్ రావు, యడ్ల రమణ మూర్తి, ద్రోణంరాజు శ్రీనివాసరావు, గిడుగు రుద్రరాజు, జంగా గౌతం, పంతం నానాజి(వేంకటేశ్వరరావు), ఎస్.ఎన్.రాజ, మార్టిన్ లూథర్, ఎన్.రాజీవ్ రతన్, ఎన్.నరసింహారావు, ఆకుల శ్రీనివాసకుమార్, లింగంశెట్టి ఈశ్వరరావు, టి.జె.ఆర్.సుధాకర్‌బాబు, కె.రమాదేవి, వై.వేంకటేశ్వరరెడ్డి, షేక్ అబ్దుల్ వహీద్, సూరిబాబు, కాసు మహేశ్వరరెడ్డి, మోపిదేవి శ్రీనివాసరావు, నేదురమల్లి రామ్ కుమార్‌రెడ్డి, పనబాక క్రిష్ణయ్య, నందిమండలం భాను శ్రీ, ఎ.సుజాతమ్మ, షహజాన్ బాష, వి.ఎస్.ఎస్.ఇందిర, ప్రభాకర్‌లను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.టి.సుబ్బిరామిరెడ్డిని కోశాధికారిగా నియమించారు. 12 జిల్లాలకు కొత్త డీసీసీలు కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులుగా డి.జగన్మోహన్రావు(శ్రీకాకుళం), పి.విజయకుమార్(విజయనగరం), పసుపులేటి బాలరాజు(విశాఖపట్నం), కందుల దుర్గేష్(తూర్పు గోదావరి), రఫీహుల్లా బేగ్(పశ్చిమ గోదావరి), కడియాల బుచ్చిబాబు(కృష్ణా), ఎం.మల్లికార్జునరావు(గుంటూరు), ఎం.ఉగ్రనరసింహారెడ్డి(ప్రకాశం), బి.వై.రామయ్య(కర్నూలు), నజీర్ అహ్మద్(కడప), కోటా సత్యనారాయణ(అనంతపురం), కె.వేణుగోపాల్‌రెడ్డి(చిత్తూరు)లను నియమించారు.నెల్లూరుకు ప్రస్తుత ఇన్చార్జి ధనుంజయరెడ్డిని కొనసాగించనున్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు.: సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా బెహరా భాస్కరరావు(విశాఖపట్నం), కంపర రమేష్(కాకినాడ), ఎన్.వి.శ్రీనివాస్(రాజమండ్రి), రాజనాల రామ్మోహనరావు(ఏలూరు), మల్లాది విష్ణువర్ధన్(విజయవాడ), ఎస్.కె.మస్తాన్ వలి(గుంటూరు), టి.శ్రీపతిప్రకాశ్(ఒంగోలు), ఎ.సి.సుబ్బారెడ్డి (నెల్లూరు), బండి జక్రయ్య(కడప), ఎం.సుధాకర బాబు(కర్నూలు), షాలి దాదా గాంధీ(అనంతపురం), ఎం.నరసింహులునాయుడు (చిత్తూరు)ను నియమించారు.