సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ఒక ప్రెసిడెంట్‌ను నియమించారు. జోన్–1కి.. విశాఖ జిల్లాకు చెందిన చెన్నా జానకిరామ్ నియమితులయ్యారు. జోన్–2కి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విప్పర్తి వేణుగోపాల్ నియమితులయ్యారు. జోన్ –3కి ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన నట్ట యోనారాజు నియమితులయ్యారు. జోన్ –4కి తిరుపతి జిల్లాకు చెందిన నల్లని బాబు నియమితులయ్యారు.
జోన్ –5కి వైఎస్సార్ జిల్లాకు చెందిన పులి సునీల్‌కుమార్ నియమితులయ్యారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన ఎ.లక్ష్మీశివకుమారిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా(జోన్ –2కు)గా, తిరుపతి జిల్లాకు చెందిన ఎస్.రామచంద్రారెడ్డిని రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా, తిరుపతి జిల్లాకు చెందిన దువ్వూరు మునిశేఖర్‌రెడ్డిని రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–4)గా నియమించారు.
పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా విశాఖ జిల్లాకు చెందిన ద్రోణంరాజు శ్రీవత్సవ(జోన్ –1), కాకినాడ జిల్లాకు చెందిన తోట రాంజీ(జోన్–2), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎ.రవిచంద్ర(జోన్–3), చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి(జోన్–4), అనంతపురం జిల్లాకు చెందిన వై.ప్రణయ్‌రెడ్డి(జోన్–5) నియమితులయ్యారు. ఎనీ్టఆర్ జిల్లాకు చెందిన వి.ఈశ్వర్‌ప్రసాద్‌ను రాష్ట్ర వాణిజ్య విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్(జోన్–3)గా నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


