Working President
-
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్, ప్రచార కమిటీ సభ్యులు వీరే
కాంగ్రెస్ హైకమాండ్ శనివారం 'కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ' (KPCC)కి ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ముగ్గురు సభ్యులతో ప్రచార కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తన్వీర్ సైత్ (మైసూరు ఎమ్మెల్యే), జీసీ చంద్రశేఖర్ (ఎంపీ), వినయ్ కులకర్ణి (ధార్వాడ్ ఎమ్మెల్యే), మంజునాథ్ భండారి (ఎమ్మెల్సీ), వసంత్ కుమార్ నియమితులయ్యారు. ప్రచార కమిటీలో చైర్మన్ వినయ్ కుమార్ సొరకే (మాజీ మంత్రి), కో చైర్మన్ డాక్టర్ ఎల్ హనుమంతయ్య (ఎంపీ), వైస్ చైర్మన్ రిజ్వాన్ అర్షద్ (శివాజీనగర్ ఎమ్మెల్యే) ఉన్నారు. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2024 ఏప్రిల్ 26, మే 7న రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. -
పనులు.. నిధులు.. పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ పదో తేదీలోపు వెలువడుతుందనే సంకేతాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్, సచివాలయానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడంతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలుస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు. తమ నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని, వివిధ పనులకు సంబంధించిన పెండింగు బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు. నిధుల అడ్డంకి ఉంటే తాము ప్రతిపాదించిన పనులకు కనీసం పాలనా పరమైన అనుమతులు అయినా ఇప్పించాలని విన్నవిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సుమారు పక్షం రోజుల సమయం మాత్రమే ఉన్నందున తమ వినతులను సత్వరం పరిష్కరించాలంటూ లేఖలు సమర్పిస్తున్నారు. కేటీఆర్ సంతకాలతో కూడిన సిఫారసు లేఖలను తీసుకుని సచివాలయంలోని సంబంధిత శాఖల ఉన్నతాధి కారులు, జిల్లా అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. పనులు.. పోస్టింగులు ఎమ్మెల్యేల వినతుల్లో పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలు తమ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వాటికి పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారు లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే వీరిలో తమకు అనుకూలురైన పోలీసు, రెవెన్యూ అధికారుల పోస్టింగుల కోసం కొందరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే పోస్టింగులు పూర్తయిన కొన్నిచోట్ల మార్పులకు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే తక్షణం నిధుల విడుదలకు సంబంధం లేని పనులకు ఓకే చెప్తూ, ఇతర అంశాలను పరిశీలిస్తామని మాత్రమే కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ఎన్నికలు సమీపిస్తుండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. వీటితో పాటు తుది దశలో ఉన్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా సంబంధిత శాఖల మంత్రులను ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తు న్నారు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ నెల రోజుల క్రితం ఆగస్టు 21న సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది రెండేసి పర్యాయాలకు పైగా వరుస విజయాలు సాధించిన వారే ఉండటంతో వివిధ పథకాల ద్వారా లబ్ధి ఆశిస్తున్న వారి నుంచి వీరు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తమపై ఉన్న ప్రతికూలతను తొలగించుకునేందుకు, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే పనులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీసీబంధు, గృహలక్ష్మి ఒత్తిడి.. ఎన్నికల నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. తమకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఎదురవు తున్నట్లు సమాచారం. బీసీబంధు పథకం కింద రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు చెక్కుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించగా, ప్రస్తుతం లబ్ధిదారులకు తొలి విడత చెక్కుల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మిగతా రెండు విడ తలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరో వైపు గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల వడపోత కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపు లబ్ధిదారుల జాబితా పై స్పష్టత వచ్చేలా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తు న్నారు. మరోవైపు సామాజిక పింఛన్ల కోసం కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ సంఖ్యలో దరఖా స్తులు అందుతున్నాయి. -
శరద్ పవార్ నిర్ణయంపై అజిత్ అసంతృప్తి.. స్పందించిన సుప్రియా సూలే
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తాజా నిర్ణయంపై అజిత్ పవార్ అసంతృప్తి ఉన్నారంటూ వస్తున్న వార్తలపై పార్టీకి కొత్తగా నియమితులైన వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సులే స్పందించారు. తన పదవి పట్ల అజిత్ పవార్ సంతోషంగా లేరన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. అవన్నీ పుకార్లేనని బారామతి ఎంపీ కొట్టిపారేశారు. కాగా జూన్ 10న ఎన్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పార్టీ చీఫ్ శరద్ పవార్ తన అన్న కొడుకు అజిత్ పవార్‌కు షాక్ ఇస్తూ కూతురు సుప్రియా సూలేకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ ప్రకటన వెలువడింది. ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు సూప్రియా సూలేతోపాటు సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పటేళ్లను ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఝార్ఖండ్, గోవాతోపాటు పార్టీ రాజ్యసభ వ్యవహారాలను ప్రఫుల్ పటేల్ చూస్తారు. కూతురికి లోక్‌సభ, పార్టీ వ్యవహారాలతోపాటు మహిళలు, యువత, విద్యార్థి విభాగాలు, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. అయితే మహారాష్ట్ర వ్యవహరాలను ఇప్పటికీ వరకు అజిత్ పవార్ చూసుకుంటున్నారు. తాజాగా సుప్రియా సూలేకు అ భాద్యతలు ఇవ్వడంతో అజిత్‌ను పక్కకు పెట్టినట్లు అయ్యింది. బంధుప్రీతితోనే బాధ్యతలు! ఇక పార్టీ వ్యవహారాల విషయంలో అన్న కొడుకు, ముఖ్యనేత అజిత్ పవార్‌ను పక్కన పెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పవార్ నిర్ణయం అజిత్‌ను పక్కకు పెట్టిన్నట్లు కనిపిస్తుందని, ఎన్సీపీలో విభేదాలు బయపడ్డాయని మండిపడుతున్నాయి. కేవలం బంధుప్రీతితోనే సుప్రియా సూలేకు కీలక బాధ్యతలు అప్పగించారని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలపై సుప్రియా సులే స్పందించారు. అవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. आपल्या बारामती लोकसभा मतदारसंघातील न्हावी ता. इंदापूर येथे गावभेट उपक्रमाअंतर्गत भेट देऊन ग्रामस्थांशी संवाद साधला. याप्रसंगी राष्ट्रवादी काँग्रेसचे इंदापूर तालुकाध्यक्ष हनुमंत कोकाटे, सचिन सपकाळ, अतुल झगडे, प्रताप पाटील, प्रवीण माने, विजय शिंदे, रेहना मुलाणी यांच्यासह… pic.twitter.com/3TvsguW44H— Supriya Sule (@supriya_sule) June 12, 2023 అజిత్‌ను బీజేపీ టార్గెట్ చేసింది అజిత్ పవార్ సంతోషంగా లేరని ఎవరూ చెప్పారు? ఎవరైనా అతన్ని అడిగారా? ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ గాసిప్స్ మాత్రమే. దాదా అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఆయన స్థానం ముఖ్యమంత్రితో సమానం. అజిత్ పవార్‌ను టార్గెట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. కొన్నిసార్లు నన్ను టార్గెట్ చేస్తోంది’ మండిపడ్డారు. బంధుప్రీతి’ లేని పార్టీ ఏదీ? అదే విధంగా వారసత్వ రాజకీయాలపై ఆమె ఘాటుగా స్పందించారు.‘ అవును బంధుప్రీతి రాజకీయాలు ఉన్నాయి. ‘బంధుప్రీతి’ లేని పార్టీ ఏదైనా ఉందా? శరద్ పవార్ కూతురిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. బంధు ప్రీతి గురించి మాట్లాడినప్పుడు పని తీరు గురించి, ప్రతిభ గురించి ఎందుకు మాట్లాడరు. నేను సంసద్ రత్న అవార్డు కూడా అందుకున్నాను. అయితే నాకు ఆ అవార్డు పార్లమెంట్లో చేసిన కృషికి దక్కింది. శరద్ పవార్ కూతుర్ని కావడం వల్ల కాదు’ అని పేర్కొన్నారు. అజిత్ పవార్ ఏమన్నారంటే.. అంతకుముందు ఆదివారం ఆమె పుణెలో పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెండ్‌గా ఎన్నికైనందుకు ఎన్సీపీ శ్రేణులు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా సుప్రియా సూలే పుణెలోని గాంధీ భవన్లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఇక శరద్ పవార్ నిర్ణయంపై తాను సంతోషంగా ఉన్నట్లు అజిత్ పవార్ సైతం వెల్లడించారు. దీనిపై తాను అసంతృప్తితో ఉన్నట్లు వస్తున్న ప్రచారాలన్నీ పుకార్లేనని తెలిపారు. అప్పుడే నిర్ణయం తీసుకున్నాం.. ‘పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పజెప్పకపోవడంతో నేను సంతోషంగా లేనంటూ కొన్ని వార్త కథనాలు వెలువడుతున్నాయి. అవన్నీ అబద్ధాలే. శరద్ పవార్ రాజీనామా చేసిన సమయంలో కమిటీ ఏర్పడింది. అరోజే రెండు నిర్ణయాలు తీసుకున్నాం. శరద్ పవార్ తన రాజీనామాను వెనక్కి తీసుకోవడం ఒకటి.. సుప్రియా సూలేను వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించాలని కమిటీ ఏర్పడినప్పుడే సూచించాం. అయితే మిగిలిన కమిటీ సభ్యులు శరద్ పవార్‌ను ఒప్పించి రాజీనామా ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించాలని చెప్పారు’ అని అజిత్ పవార్ విలేకరులతో అన్నారు. శరద్ పవార్ గత నెలలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే మే 5న ఎన్సీపీ కమిటీ శరద్రా జీనామాను తిరస్కరిస్తూ తీర్మానం చేయసింది.అలాగే తను స్థాపించిన పార్టీకి నాయకత్వం వహించాల్సిందిగా అభ్యర్థించడంతో ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. -
ఎన్సీపీ కీలక నిర్ణయం.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆ ఇద్దరూ
ముంబై: పార్టీ చీఫ్ పదవికి రాజీనామా ప్రకటన చేసి.. ఆపై వెనక్కి తగ్గిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పార్టీ తరపున కీలక నిర్ణయం ప్రకటించారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే(పవార్ తనయ), ప్రపుల్ పటేల్‌లను ప్రకటించారు. ఎన్సీపీ 25వ వార్షికోత్సవం సందర్భంగా శరద్ పవార్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్సీపీలో కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్(శరద్ పవార్ అన్న కొడుకు) సమక్షంలోనే ఈ విషయాన్ని ప్రకటన వెలువడటం గమనార్హం. ఇదిలా ఉండగా, శరద్ పవార్ గతనెలలో అధ్యక్ష పార్టీ పదవికి రాజీనామా చేస్తాని ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ సభ్యుల తోపాటు ఇతర రాజకీయ నాయకులు నుంచి తీవ్ర నిరసనలు వెల్లవెత్తడంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన నిర్ణయంపై చర్చించేందుకు ఏర్పాటైన ఎన్సీపీ ప్యానెల్ మే 5న ఆయన రాజీనామాను తిరస్కరించి, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరింది. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యాక.. 1999లో సంగ్మాతో కలిసి ఏర్పాటు శరద్ పవార్ ఎన్సీపీని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ ఎప్పటికప్పుడు కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది కూడా. సూలేనే ఎందుకంటే.. ఇటీవల ఆమె పార్టీ అధిష్టాన కీలక నిర్ణయాల్లో పాల్గొనడమే గాక ప్రజలకు చేరువయ్యేలా అనేక జిల్లాలోని కార్యక్రమాలకు హాజరయ్యారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఇటీవల శరద్ పవర్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే ప్రతిపాదన లేవనెత్తినప్పుడూ ఆయన తన నిర్ణయాన్ని పునరాలోచించేలా పార్టీ అధిష్టానాన్ని, నాయకులను చైతన్యవంతం చేసింది. ఆమె సెప్టెంబర్2006లో రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కావడం ద్వారా సులే క్రియాశీ రాజకీయాలకు పరిచయమయ్యారు. తర్వాత 2009లో అప్పటి వరకు పవార్ ప్రాతినిధ్యం వహించిన బారామతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. అంతేగాదు యువతతో కనెక్ట్ అయ్యేలా నెట్వర్క్ని ఏర్పరుచుకోవడమే గాక రాష్ట్రవాది యువతీ కాంగ్రెస్‌ను కూడా ఏర్పాటు చేసింది. అదీగాక శరద్ పవార్ తన ఆధ్వర్యంలో తన కుమార్తెనే గాక అజిత్ పవార్, ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ తోసహా చాలా మంది యువ నేతలను మంచి నాయకులుగా తీర్చిదిద్దారు. ఇదీ చదవండి: షిండే కుమారుడి కీలక వ్యాఖ్యలు -
వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వరుదు కల్యాణి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వరుదు కల్యాణి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, వైఎస్సార్సీపీకి చెందిన 22 అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిపినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
అధ్యక్ష పోటీకి గెహ్లాట్ విముఖత?
జైపూర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఒకవైపు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (71) బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఆయనకు పోటీగా తాజాగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా తెరపైకి వచ్చారు. తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ ఆశీస్సులతో గెహ్లాట్ సోమవారం నామినేషన్ వేయాలన్న నిర్ణయం కూడా అంతర్గతంగా జరిగిపోయింది. అయితే పోటీకి గెహ్లాట్ విముఖంగా ఉన్నారని హస్తిన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ అధ్యక్షునిగా ఎన్నికై ఢిల్లీ వెళ్తే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు చిరకాల ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను అధిష్టానం ముఖ్యమంత్రిని చేసే అవకాశముంది. ఇది గెహ్లాట్‌కు సుతరామూ ఇష్టం లేదు. రాష్ట్రంపై పట్టు వదులుకోవడానికి ఆయన అస్సలు సుముఖంగా లేరట. రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సచిన్ పైలట్ కేరళలో ఉన్నారు. ఈ సమయంలో గెహ్లాట్ ఉన్నట్టుండి మంగళవారం రాత్రి పదింటికి కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని సమావేశపరిచారు. పైలట్ గైర్హాజరీలో ఎమ్మెల్యేలపై తన పట్టును ప్రదర్శించుకోవడమే ఈ భేటీ లక్ష్యమని భావిస్తున్నారు. మధ్యేమార్గంగా సీఎంగా కొనసాగుతూనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పని చేస్తానంటూ అధిష్టానానికి ఆయన ప్రతిపాదించారట. కుదరని పక్షంలో కనీసం పైలట్‌కు బదులు తన విశ్వాసపాత్రున్ని సీఎం చేయాలని కోరుతున్నారట. ఇది అధిష్టానానికి కొత్త తలనొప్పిగా పరిణమించిందని సమాచారం. గట్టి నాయకుడైన పైలట్ సీఎంగా చాన్స్ దక్కనందుకు రెండేళ్ల క్రితమే పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. దాంతో సోనియా, రాహుల్ రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. ఈసారి కూడా ఆయనకు అవకాశం ఇవ్వకపోతే అది రాష్ట్ర పార్టీలో సంక్షోభానికి దారి తీయవచ్చన్నది కాంగ్రెస్ పెద్దల ఆందోళన. రాహులే అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని గెహ్లాట్ ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాజస్తాన్ పీసీసీతో తీర్మానం కూడా చేయించారు. దాంతో రాజస్తాన్ బాటలోనే పలు రాష్ట్రాల పీసీసీలు రాహుల్ సారథ్యాన్ని కోరుతూ తీర్మానాల బాట పట్టాయి. బుధవారం గెహ్లాట్ ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడి నుంచి కేరళ వెళ్లి రాహుల్ యాత్రలో పాల్గొనే అవకాశముంది. ఈ సందర్భంగా కూడా పోటీకి రాహుల్‌ను ఒప్పించేందుకు మరోసారి ప్రయతి్నస్తారని చెబుతున్నారు. 22 ఏళ్ల తర్వాత పోటీ! గెహ్లాట్‌తో పాటు థరూర్ కూడా బరిలో దిగితే పోటీ అనివార్యమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరిసారిగా 22 ఏళ్ల క్రితం ఎన్నిక జరిగింది. 2000 నవంబర్‌లో జరిగిన ఆ ఎన్నికలో జితేంద్ర ప్రసాదపై సోనియా నెగ్గారు. 1997లో శరద్ పవార్‌ను సీతారాం కేసరి ఓడించారు. కాంగ్రెస్‌కు సుదీర్ఘ కాలం సారథ్యం వహించిన రికార్డు సోనియాదే. 1998 నుంచి మధ్యలో రెండేళ్లు మినహా ఇప్పటిదాకా పార్టీ పగ్గాలు ఆమె చేతిలోనే ఉన్నాయి. 2017 నుంచి 2019 దాకా రాహుల్ గాంధీ అధ్యక్షునిగా కొనసాగారు. ఈసారి ఎన్నికకు సోనియా దూరంగా ఉండటం తెలిసిందే. సారథ్యానికి విముఖంగా ఉన్న రాహుల్ చివరి క్షణాల్లో మనసు మార్చుకుంటే తప్ప ఈసారి గాందీయేతర నేతే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ షాకింగ్ నిర్ణయం.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరం! -
సీఎంగానా? వర్కింగ్ ప్రెసిడెంట్‌గానా!... టెన్షన్లో రాజస్తాన్ సీఎం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్న సంగతి తెలిసింది. కాంగ్రెస్ 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పదేపదే కోరారు. ఐతే అందుకు ఆశోక్ గెహ్లాట్ సిద్దంగా లేరని సమాచారం. పైగా పార్టీ అధ్యక్ష అత్యున్నత పదవిని రాహుల్ గాంధీనే చేపట్టాలని గెహ్లాట్ ఒప్పించే ప్రయత్నం చేయునున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా...రాజస్తాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కూడా ఢిల్లీకి రావడంతో ఆయనలో మరింత టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఈసారి రాజస్తాన్ ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్‌కి చాన్స్ ఇవ్వాలని పార్టీ సన్నాహాలు చేయడం ఆశోక్‌ని కాస్త ఆందోళనకు గురి చేస్తున్న అంశం. వాస్తవానికి బీజేపీ ఆపరేషన్ కమలం తిరుగుబాటు సమర్థవంతంగా ఎదుర్కొన్న గొప్ప కాంగ్రెస్ అనుభవజ్ఞుడు ఆశోక్ గెహ్లాట్. అందుకే పార్టీ ఆయన్ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాలని ఆశిస్తుంది. ఐతే ఆయన అందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. ఆయన అటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానూ, రాజస్తాన్ ముఖ్యమంత్రిగానూ రెండు పదవులలోనూ కొనసాగాలన్నదే ఆయన ఆలోచన అని పార్టీ సభ్యుల చెబుతున్నారు. తొలుత ఆశోక్ రాహుల్‌ని వర్కింగ్ ఛీప్‌గా ఉండేలా ఒప్పించేందుకు యత్నం చేసిన తదనంతరమే వచ్చే సోమవారం ఈ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్ల సమాచారం. ఆయనకు ప్రత్యర్థిగా శశి థరూర్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఈ నామినేషన్లను ఈ నెల సెప్టెంబర్ 30 వరకు స్వీకరిస్తుంది. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తే అక్టోబర్ 17 ఎన్నికలు నిర్వహిస్తుంది లేదంటే ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది. (చదవండి: పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానాయన శాఖ దర్యాప్తు) -
మేమింతే.. మా స్టయిల్ ఇంతే!
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తీసుకుని రావడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని, కలిసికట్టుగా పనిచేస్తామని నేతలు తరచూ చెబుతున్నా ఆచరణ అందుకు విరుద్ధంగా ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. సొంత నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలపైనే సీనియర్ నేతలు దృష్టి పెడుతూ, ఇతర నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు దాదాపు శూన్యమని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలు క్షేత్రస్థాయిలో విరివిగా పర్యటిస్తేనే కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నెలకొంటుందని పేర్కొంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, సీనియర్ వైస్–ప్రెసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శులు కూడా ప్రజల్లో ఎక్కు వగా కనిపించడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కొద్దిరోజులుగా పార్టీ సంస్థాగత పనితీరుపై తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌లోనూ సీనియర్ నేతలపై అదే అభిప్రాయం వ్యక్తమైనట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. నియోజకవర్గాలకే పరిమితం.. సీనియర్ నేతలు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, చిన్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, కొండా సురేఖ, మహేశ్వర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్, నాగం జనార్దన్‌రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మధుయాష్కీ, గీతా రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రేమ్‌సాగర్‌రావు, జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నేతలు తమ తమ అసెంబ్లీ నియోజకవర్గంలో తప్ప పెద్దగా ఎక్కడా పర్యటించడం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎంపీలుగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్‌లోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప పెద్దగా జిల్లాల్లో పర్యటించడంలేదని ఫీడ్ బ్యాక్ వచ్చినట్టు తెలిసింది. పార్టీ కార్యక్రమాల కారణంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి కొడంగల్‌పై ఫోకస్ చేయలేదని, ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్‌లోనూ నేతలకు పెద్దగా సమయం ఇవ్వడంలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. వర్క్ అవుట్ చేయని వర్కింగ్ ప్రెసిడెంట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఉన్న ఐదుగురిలో ఆర్గనైజేషన్ వ్యవహారాలు చూస్తున్న మహేశ్ కుమార్ గౌడ్ ఓ మోస్తరు పర్వాలేదని, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న అంజన్‌కుమార్ యాదవ్ ఇంకా గ్రేటర్ అధ్యక్షుడిలాగే పనిచేస్తున్నారని, అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడంలేదన్న వాదన వినిపిస్తోంది. గీతారెడ్డి పెద్దగా ఫోకస్ చేసినట్టు కనిపించడం లేదని నేతలు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరుకు వర్కింగ్ ప్రెసిడెంట్ తప్ప ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో ఆయన సంగారెడ్డికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెండోసారి అవకాశం లభించిన అజహరుద్దీన్ అసలు ఎక్కడ పర్యటిస్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా కామారెడ్డిపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది. అటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లలోనూ ఒకరిద్దరు మినహా మిగిలినవారి పనితీరు సంతృప్తిగా లేదని అధిష్టానానికి నివేదిక సైతం పంపించినట్టు తెలుస్తోంది. -
కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు
-
రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆదివారం రోజు మధ్యాహ్నం 11 గంటల 55 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి 1.30 కి చేరుకోనున్నారు. ముందుగా అక్కడ లంచ్ చేసి 2 గంటలకు మున్సిపల్ ఎన్నికల క్లస్టర్ ఇంచార్జ్‌ల రాష్ట్ర అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం 4 గంటల 10 నిమిషాలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు హరిత ప్లాజాలో కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని రాత్రి అక్కడే బసచేయనున్నారు. 19వ తేది సోమవారం ఉదయం ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని అనంతరం అంబేద్కర్ కాలేజీలో మొక్కలు నాటనున్నారు. -
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా
-
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నడ్డా
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జేపీ నడ్డా(58) బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. సోమవారం ఇక్కడ జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ వెల్లడించారు. సమావేశంలో ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సెక్రటరీగా ఉన్న నడ్డా పార్టీ సంస్థాగత ఎన్నికల తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. కాగా, బీజేపీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించడం ఇదే ప్రథమం.. నడ్డాకు ప్రధాని అభినందనలు.. 1960లో బిహార్ రాజధాని పట్నాలో జన్మించిన జగత్ ప్రకాశ్ నడ్డా విద్యాభ్యాసం అంతా పట్నా, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సాగింది. నడ్డా బీఏ ఎల్ఎల్బీ చదివారు. ఆయనకు భార్య డాక్టర్ మల్లిక, ఇద్దరు పిల్లలున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోదీ గత మంత్రివర్గంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. హిమాచల్‌లో 2007–12 కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నడ్డాను ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులు అభినందించారు. నడ్డా నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జేపీ నడ్డా ఎన్నికయ్యారు. సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం జేపీ నడ్డాకున్న నేపథ్యంలో ఆయనకు ఈ పదవిని అప్పగించారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న జేపీ.. మోదీ గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తర ప్రదేశ్ ఇన్ఛార్జ్గాబాధ్యతలు చేపట్టిన నడ్డా.. 62 ఎంపీ స్థానాల్లో గెలుపుకు కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ జాతీయ నాయకత్వం కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో నియమించింది. జాతీయ అధ్యక్షుడిగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షానే కొనసాగనున్నారు. ఏడాది చివరలో పలు రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో షానే సారథిగా కొనసాగించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా 2014, 19 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కృషి చేసిన అమిత్ షా.. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. దీంతో మోదీ ప్రభుత్వంలో హోంశాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడిగా నూతన వ్యక్తిని నియమిస్తారనే ప్రచారం జరిగింది. రానున్న ఏడాది కాలంలో కీలకమైన రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, బెంగాల్లో పార్టీ విస్తరణ బాధ్యతలు ఉండడంతో షానే ఆ పదవిలో కొనసాగనున్నారు. -
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్)ను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ప్రభుత్వపరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను తుచ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా అత్యంత నమ్మకస్తుడు, సమర్ధుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడైంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండటంతో కేసీఆర్‌పై పనిభారం పెరుగుతోందని భావించి టీఆర్ఎస్ కీలక బాధ్యతలు అప్పగించినట్లుగా స్పష్టమవుతోంది. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంతో ఆయనకు టీఆర్ఎస్ నాయకులు అభినందనలు తెలిపారు. -
వైఎస్సార్సీపీలో మరో నియామకం
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిండెంట్‌గా నాన్యంపల్లె హరీష్ కుమార్ యాదవ్‌ను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్రకార్యాలయ వర్గాలు తెలిపాయి. పార్టీ స్థాపించినప్పటి నుంచి రాష్ట్ర యువజన విభాగంలో హరిష్ కుమార్ చురుగ్గా పనిచేశారు. ఇప్పటి వరకూ ఆయన యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హరీష్ కుమార్‌ను యవజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
ప్రియాంకకు పార్టీ పగ్గాలు.. ఉత్తదే!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రియాంక గాంధీని నియమించబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె కార్యాలయం స్పందించింది. ఆ ప్రచారంలో వాస్తవం లేదని ఓ ప్రకటనలో తెలియజేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అలాంటి చర్చేం ప్రస్తావనకు రాలేదు. అదంతా ఉత్త ప్రచారమే అని ఆమె వ్యక్తిగత సిబ్బంది పి సహాయ్ వెల్లడించారు. ఈ ఉదయం నుంచి కాబోయే కాంగ్రెస్ చీఫ్ ప్రియాంక అంటూ కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే పార్టీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఆగష్టు 8న జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఈ మేరకు ఓ ప్రతిపాదన మాత్రం వచ్చినట్లు తెలుస్తోంది. నాయకత్వం మార్పు అంశాన్ని అధ్యక్షురాలు సోనియా లెవనెత్తగా, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రియాంక గాంధీ పేరును సూచించినట్లు భోగట్టా. పడిపోతున్న పార్టీని తిరిగి నిలబెట్టాలంటే యువ రక్తం రావాల్సిన అవసరం ఉందంటూ పలువురు సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
టీఆర్ఎస్లో మళ్లీ తెరపైకి వర్కింగ్ ప్రెసిడెంట్
-
కళాకారులకు గుర్తింపు కార్డులివ్వాలి
జానపద కళాకారుల సంక్షేమ సంఘం అనంతపురం కల్చరల్ : మన సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని కృష్ణదేవరాయల జానపద కళాకారుల సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘం కార్యాలయంలో నూతన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నరసింహులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జానపద కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఏపీ వెంకటరాముడు మాట్లాడుతూ కళాకారులను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆరోపించారు. 2013 తర్వాత ఇప్పటి వరకు గుర్తిపు కార్డులు ఇవ్వలేదన్నారు. వృద్ధ కళాకారులకు పింఛన్లనివ్వాలని, ప్రభుత్వ బంజరు భూముల్లో వ్యవసాయం చేసుకునే వీలు కల్పించాలన్నారు. సంక్రాంతి లక్ష్మి పథకం కింద పాడి ఆవులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కృష్ణవేణి, మీనాక్షి, ప్రమీâýæమ్మ, వెంకటలక్ష్మి, గోపాల్ , సుబ్బారాయుడు, ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపీ కవిత?
-
వర్కింగ్ ప్రెసిడెంట్ పరిణామాలేమి?
-
టీఆర్ఎస్కు వర్కింగ్ ప్రెసిడెంట్?
-
ఏపీ పీసీసీకీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఏపీ పీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంటును నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు సాగిస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి చెందిన ఎన్.రఘువీరారెడ్డి (యాదవ్)కి అప్పగించినందున దళితవర్గానికి చెందిన నేతల పేర్లపై పరిశీలన సాగిస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు (సీమాంధ్ర) ఇటీవలే వేర్వేరు పీసీసీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. తెలంగాణ పీసీసీకి అధ్యక్షునిగా వెనుకబడినవర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను నియమించడంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంటుగా మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. అదే సమయంలో సీమాంధ్రలో కేవలం అధ్యక్షుడిని మాత్రమే నియమించి వర్కింగ్ ప్రెసిడెంటు పదవిని ఏర్పాటుచేయలేదు. కొత్త కమిటీల ప్రమాణం, బాధ్యతలు స్వీకార కార్యక్రమాలకు హాజరైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ను పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. సీమాంధ్రలోనూ వర్కింగ్ ప్రెసిడెంటును ఏర్పాటు చేయాలని, తద్వారా ఇతర వర్గాల నేతల్లో పార్టీపట్ల నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడితో చర్చించి వర్కింగ్ ప్రెసిడెంటు పదవిపై నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ వారికి తెలిపారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి ఇవ్వగా ప్రచార, మేనిఫెస్టో కమిటీలను అగ్రవర్ణాలకు చెందిన చిరంజీవి, ఆనం రామనారాయణరెడ్డిలకు కట్టబెట్టారు. దీంతో దళితవర్గాలను నిర్లక్ష్యం చేశారన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ తరుణంలో ఆ వర్గాలకు చెందినవారికి వర్కింగ్ ప్రెసిడెంటును అప్పగిస్తే మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్‌ను నియమించవచ్చన్న ప్రచారం పార్టీవర్గాల్లో వినిపిస్తోంది.