
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆదివారం రోజు మధ్యాహ్నం 11 గంటల 55 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి 1.30 కి చేరుకోనున్నారు. ముందుగా అక్కడ లంచ్ చేసి 2 గంటలకు మున్సిపల్ ఎన్నికల క్లస్టర్ ఇంచార్జ్‌ల రాష్ట్ర అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం 4 గంటల 10 నిమిషాలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు హరిత ప్లాజాలో కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని రాత్రి అక్కడే బసచేయనున్నారు. 19వ తేది సోమవారం ఉదయం ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని అనంతరం అంబేద్కర్ కాలేజీలో మొక్కలు నాటనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment