సాక్షి, హైదరాబాద్: మరికాసేపట్లో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షు లు, సంస్థాగత ప్రధానకార్యదర్శుల సమావేశం జరగనుంది. ఈ బేటీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ సంస్థాగత ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరు కానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, గోవా, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టితో పాటు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల నుంచి గతంలో కంటే అధికంగా లోక్‌సభ సీట్లను గెలుచుకోవడంపై అనుసరించాల్సిన వ్యూహాలపైనా ప్రణాళికలు రచించనున్నారు. ఈ భేటీకి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శులు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, సంస్థాగత సహ ప్రధానకార్యదర్శి శివప్రకాశ్, తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాశ్ జవదేకర్, రాష్ట్రపార్టీ సంస్థాగత సహ ఇన్‌చార్జ్ అర్వింద్ మీనన్ హాజరవుతారు.
జాతీయ కార్యవర్గసభ్యులతో జేపీ నడ్డా భేటీ!
ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం నోవాటెల్ హోటల్‌లో తెలంగాణకు చెందిన జాతీయ కార్యవర్గ సభ్యులతో జేపీనడ్డా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీలో ముఖ్యనేత లు నిర్వహించాల్సిన పాత్ర, ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తారని సమా చారం. సోమవారంపార్టీ పదాధికారులు, ముఖ్య నేతలతో ప్రకాశ్ జవడేకర్, సంస్థాగత ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ సమావేశం కానున్నట్లు తెలిసింది.
మీటింగ్ లో పాల్గొనబోయే రాష్ట్రాలివే..
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కర్ణాటక
4. అండమాన్
5. లక్ష్యద్వీప్
6. పాండిచ్చేరి
7. మహారాష్ట్ర
8. ముంబై
9. గోవా
10. తమిళనాడు
11. కేరళ
చదవండి: స్వాగతానికి అధికారులు మాత్రమే.. ప్రధాని సభకు దూరంగా వివేక్ వెంకటస్వామి!
Comments
Please login to add a commentAdd a comment