సాక్షి, హైదరాబాద్: నగరంలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు ఆరు గంటల పాటు కొనసాగింది. ఇక, ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు జేపీ నడ్డా క్లాస్ ఇచ్చారు.
వివరాల ప్రకారం.. ఈ సమావేశంలో దక్షిణాది ఎజెండాను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. జాతీయ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉత్తరాదిన బలంగా ఉన్న పార్టీ దక్షిణాదిన బలోపేతం కాకపోవడానికి కారణాలపై ముఖ్యంగా చర్చించారు.
ఈ సందర్భంగానే పలు రాష్ట్రాల అధ్యక్షుల పనితీరుపై నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పని తీరు అద్భుతం ఉందని ప్రశంసించారు. పార్టీని పటిష్ట పరిచి బూత్ కమిటీలు పూర్తి చేయాలని నేతలకు నడ్డా ఆదేశించారు. దక్షిణ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుపై కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఇక, ఈ సమావేశంలో బీజేపీ 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ గెలవాలని లేదా?.. హైకమాండ్‌ను ప్రశ్నించిన మాజీ ఎంపీ..
Comments
Please login to add a commentAdd a comment