సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు రాగానే రాష్ట్రానికి టూరిస్ట్ నాయకులు క్యూ కడుతున్నారంటూ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం గురించి మా ప్రభుత్వం తపిస్తే.. అనారోగ్య రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తపిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు అధమ స్థానంలో ఉన్నాయి. అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకోం’’ అంటూ మండిపడ్డారు.
‘‘అభివృద్ధి, ఆరోగ్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణకు నీతులు చెబుతారు. బాధతో చెబుతున్నా.. ఇన్నేళ్ల స్వతంత్రంలో తల్లిబిడ్డల ఆరోగ్యాలకు కూడా మన దేశంలో భరోసా ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటి అంశాల గురించి దేశ నాయకులు ఆలోచించాల్సింది పోయి రాజకీయాల గురించి ప్రతిసారీ మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్.. ఎంఎంఆర్, ఐఎంఆర్ గణనీయంగా తగ్గించి దేశానికి తెలంగాణను రోల్ మోడల్ చేశారు. మరొకరికి జన్మనిచ్చే అమ్మకు, ఊపిరిపోసుకునే బిడ్డ ఆరోగ్యానికి అనేక పథకాలు, కార్యక్రమాల ద్వారా కేసీఆర్ భరోసా ఇచ్చారు. మానవ సంపదే మహోన్నత సంపద అనే భావనతో సీఎం కేసీఆర్ పని చేస్తే, ఓట్లు, సీట్లే పరమావధిగా కొందరు విమర్శలు చేస్తుంటారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్ సింగ్ సుక్కు సహా, తెలంగాణకు వచ్చి నీతులు చెప్పే బిజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలి. ఇక్కడికి వచ్చి మా నుంచి నేర్చుకొని వెళ్లండి’’ అంటూ మంత్రి హరీష్‌రావు హితవు పలికారు.
చదవండి: ఢిల్లీలో హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్.. హస్తినాలో ఏం జరుగుతోంది?
Comments
Please login to add a commentAdd a comment