ముంబై: పార్టీ చీఫ్ పదవికి రాజీనామా ప్రకటన చేసి.. ఆపై వెనక్కి తగ్గిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పార్టీ తరపున కీలక నిర్ణయం ప్రకటించారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే(పవార్ తనయ), ప్రపుల్ పటేల్‌లను ప్రకటించారు. ఎన్సీపీ 25వ వార్షికోత్సవం సందర్భంగా శరద్ పవార్ ఈ విషయాన్ని ప్రకటించారు.
ఎన్సీపీలో కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్(శరద్ పవార్ అన్న కొడుకు) సమక్షంలోనే ఈ విషయాన్ని ప్రకటన వెలువడటం గమనార్హం. ఇదిలా ఉండగా, శరద్ పవార్ గతనెలలో అధ్యక్ష పార్టీ పదవికి రాజీనామా చేస్తాని ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ సభ్యుల తోపాటు ఇతర రాజకీయ నాయకులు నుంచి తీవ్ర నిరసనలు వెల్లవెత్తడంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఆ తర్వాత ఆయన నిర్ణయంపై చర్చించేందుకు ఏర్పాటైన ఎన్సీపీ ప్యానెల్ మే 5న ఆయన రాజీనామాను తిరస్కరించి, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరింది. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యాక.. 1999లో సంగ్మాతో కలిసి ఏర్పాటు శరద్ పవార్ ఎన్సీపీని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ ఎప్పటికప్పుడు కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది కూడా.
సూలేనే ఎందుకంటే..
- ఇటీవల ఆమె పార్టీ అధిష్టాన కీలక నిర్ణయాల్లో పాల్గొనడమే గాక ప్రజలకు చేరువయ్యేలా అనేక జిల్లాలోని కార్యక్రమాలకు హాజరయ్యారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని తనదైన శైలిలో విమర్శలు చేశారు.
- ఇటీవల శరద్ పవర్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే ప్రతిపాదన లేవనెత్తినప్పుడూ ఆయన తన నిర్ణయాన్ని పునరాలోచించేలా పార్టీ అధిష్టానాన్ని, నాయకులను చైతన్యవంతం చేసింది.
- ఆమె సెప్టెంబర్2006లో రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కావడం ద్వారా సులే క్రియాశీ రాజకీయాలకు పరిచయమయ్యారు. తర్వాత 2009లో అప్పటి వరకు పవార్ ప్రాతినిధ్యం వహించిన బారామతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. అంతేగాదు యువతతో కనెక్ట్ అయ్యేలా నెట్‌వర్క్‌ని ఏర్పరుచుకోవడమే గాక రాష్ట్రవాది యువతీ కాంగ్రెస్‌ను కూడా ఏర్పాటు చేసింది. అదీగాక శరద్ పవార్ తన ఆధ్వర్యంలో తన కుమార్తెనే గాక అజిత్ పవార్, ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ తోసహా చాలా మంది యువ నేతలను మంచి నాయకులుగా తీర్చిదిద్దారు.
ఇదీ చదవండి: షిండే కుమారుడి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment