న్యూఢిల్లీ: నావికా దళం యుద్ధ నౌకపై మొదటిసారిగా మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. మహిళా అధికారులకు ‘అన్ని ర్యాంకులు– అన్ని బాధ్యతలు’ అనే సిద్ధాంతానికి నేవీ కట్టుబడి ఉంటుందన్నారు.
హిందూ మహా సముద్రంలో చైనా ఉనికి పెరిగిన నేపథ్యంలో భారత నావికా దళం యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు గత ఏడాదిగా వ్యూహాత్మకంగా చురుగ్గా వ్యవహరిస్తున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment