navy chief
-
ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది
న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్లతో సరిహద్దుల్లో సుదీర్ఘ కార్యాచరణ అనుభవమున్న లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది 30వ ఆర్మీ చీఫ్‌గా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రిటైరయ్యారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022–2024 సంవత్సరాల మధ్య ఆయన జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్ ఆఫ్ నార్తర్న్ కమాండ్‌గా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక స్కూల్ విద్యార్థి అయిన జనరల్ ద్వివేది 1984లో జమ్మూకశీ్మర్ రైఫిల్స్ రెజిమెంట్‌లో చేరారు. పరమ విశిష్ట సేవ, అతి విశిష్ట సేవ పతకాలు పొందారు.ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ క్లాస్మేట్స్ దేశ సైనిక చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆర్మీకి, నేవీకి సారథ్యం వహిస్తున్న ఇద్దరూ క్లాస్మేట్స్ కావడం విశేషం. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్ స్కూల్లో సహాధ్యాయులు. 1970లలో వీరిద్దరూ అక్కడ ఐదో తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. వీరిద్దరి రోల్ నంబర్లు కూడా దగ్గరదగ్గరగా ఉన్నాయి. జనరల్ ద్వివేది రోల్ నంబర్ 931 కాగా, అడ్మిరల్ త్రిపాఠీ నంబర్ 938. పాఠశాల దశలో మొదలైన వీరి స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. వేర్వేరు బాధ్యతల్లో ఉన్నప్పటికీ వీరి మైత్రి చెక్కుచెదరలేదు. రెండు నెలల వ్యవధిలోనే ఈ ఏడాది మేలో అడ్మిరల్ త్రిపాఠీ నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా, తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ అయ్యారు. -
నావికా దళాధిపతిగా దినేశ్ త్రిపాఠీ
న్యూఢిల్లీ: భారత నావికా దళం నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ నియమితులయ్యారు. ప్రస్తుతం నేవీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైస్ అడ్మిరల్ త్రిపాఠీ ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. 1964 మే 15వ తేదీన జన్మించిన వైస్ అడ్మిరల్ త్రిపాఠీ 1985 జులై ఒకటో తేదీన భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిపుణుడిగా గత 30 ఏళ్లుగా బాధ్యతల్లో ఉన్నారు. -
నేవీ షిప్‌పై మొదటిసారిగా మహిళా అధికారికి బాధ్యతలు
న్యూఢిల్లీ: నావికా దళం యుద్ధ నౌకపై మొదటిసారిగా మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. మహిళా అధికారులకు ‘అన్ని ర్యాంకులు– అన్ని బాధ్యతలు’ అనే సిద్ధాంతానికి నేవీ కట్టుబడి ఉంటుందన్నారు. హిందూ మహా సముద్రంలో చైనా ఉనికి పెరిగిన నేపథ్యంలో భారత నావికా దళం యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు గత ఏడాదిగా వ్యూహాత్మకంగా చురుగ్గా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. -
అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్
వాషింగ్టన్: అమెరికా నావికా దళానికి నూతన అధిపతిగా అధ్యక్షుడు జో బైడెన్ లీసా ఫ్రాంచెట్టి పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్ సెనేట్ గనుక బైడెన్ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తారు. జో బైడెన్ ప్రతిపాదన అయితే చేశారు కానీ అందుకు యూఎస్ సెనేట్ ఆమోదించాల్సి అవసరముంది. అధికార యంత్రాంగాన్ని నియమించడంలో అమెరికా కాంగ్రెస్ కు భారత పార్లమెంటు కంటే విశేష అధికారాలుంటాయి. కాకపొతే ఈ ప్రతిపాదనకు రిపబ్లికన్లు కూడా మద్దతు తెలపాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. లీసా ఫ్రాంచెట్టి గత 38 సంవత్సరాలుగా ఆమె స్వీకరించిన ప్రతి పదవికి వన్నె తీసుకొస్తూ అమెరికా నావికా దళానికి విశేష సేవలందించారు. ప్రస్తుతం ఆమె అమెరికా నావికా దళానికి వైస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లీసా అమెరికా నౌకాదళంలో ఫోర్ స్టార్ అడ్మిరల్ గా నియమింపబడిన రెండో అధికారి. ఒకవేళ ఆమె నియామకంపై సెనెట్‌లో గ్రీన్ సిగ్నల్ వస్తే అమెరికా నావీకి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తొట్టతొలి మహిళగా నిలుస్తారన్నారు. రిపబ్లికన్లకు అమెరికా నౌకా దళం పేరు ప్రఖ్యాతలు గురించి, దాని సామర్ధ్యం గురించి పరిజ్ఞానం ఉందనే అనుకుంటున్నాను. దేశఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసే విధంగా తొలి మహిళా అడ్మిరల్ నిర్ణయాన్ని వారు ఆమోదిస్తారని అనుకుంటున్నానని అన్నారు. ఇది కూడా చదవండి: ఎగతాళి చేద్దామనుకున్నాడు.. చివరికి నవ్వులపాలై.. -
వియత్నాంకు కానుకగా మన యుద్ధనౌక
న్యూఢిల్లీ: వియత్నాంకు భారత్ అరుదైన కానుక అందించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిదర్శనంగా ఐఎన్ఎస్ కృపాణ్ యుద్ధనౌకను బహుమతిగా ఇచి్చంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఇరు దేశాల్లో నెలకొన్న ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతంలో గస్తీని బలోపేతం చేయడం దీని ఉద్దేశమంటున్నారు. పూర్తి సామర్థ్యంతో పని చేసే యుద్ధ నౌకను ఒక మిత్రదేశానికి భారత్ కానుకగా ఇవ్వడం ఇదే తొలిసారని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన శనివారం బే ఆఫ్ కామ్ రన్హ్ జలాల్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ కృపాణ్‌ను ఆ దేశానికి అందజేశారు. పూర్తిస్థాయి ఆయుధాలతో కూడిన నౌకను ఆ దేశ నేవీకి అప్పగించినట్టు వివరించారు. భారత్ జీ20 సదస్సు ప్రధాన థీమ్ అయిన వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్)లో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు తెలిపారు. ఐఎన్ఎస్ కృపాణ్ గస్తీతో దక్షిణ చైనా జలాల్లో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ కృపాణ్ జూన్ 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి జూలై 8 నాటికి వియత్నాం చేరింది. -
నేవీ చీఫ్‌గా హరికుమార్ బాధ్యతల స్వీకారం
న్యూఢిల్లీ: దేశ నావికాదళం 25వ చీఫ్‌గా అడ్మిరల్ రాధాకృష్ణన్ హరికుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సర్వీస్ నుంచి రిటైరవుతున్న అడ్మిరల్ కరంబీర్‌సింగ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తన తల్లి విజయలక్ష్మికి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. అడ్మిరల్ కుమార్ ఇప్పటి వరకు వెస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్‌ఛీఫ్‌గా వ్యవహరించారు. 1962 ఏప్రిల్ 12వ తేదీన కేరళలో జన్మించిన అడ్మిరల్ కుమార్ భారత నావికాదళంలో 1983 జనవరి ఒకటో తేదీన జాయినయ్యారు. దాదాపు 39 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో కమాండ్, స్టాఫ్, ఇన్స్ట్రక్షనల్ విభాగాల్లో పలు బాధ్యతలు చేపట్టారు. ఐఎన్ఎస్ నిషాంక్, ఐఎన్ఎస్ కోరా, ఐఎన్ఎస్ రణ్వీర్, ఐఎన్ఎస్ విరాట్‌లపై కమాండింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. వెస్టర్న్ ఫ్లీట్‌కు ఆపరేషన్స్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. పరమ విశిష్ట, అతి విశిష్ట, విశిష్ట సేవా పతకాలను ఆయన అందుకున్నారు. -
నావికాదళంలోకి ఐఎన్ఎస్ వేలా
ముంబై: భారతా నావికాదళం మరింత శక్తిమంతమయ్యేలా మరో అస్త్రం వచ్చి చేరింది. ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి గురువారం నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ చేతుల మీదుగా ముంబై తీరంలో జలప్రవేశం చేసింది. ప్రాజెక్టు 75లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ జలాంతర్గామిని తయారు చేశారు. 2005లో భారత్, ఫ్రాన్స్ 375 కోట్ల డాలర్లతో ఆరు స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాముల్ని తయారు చేయాలని ఒప్పందం కుదిరింది. అందులో ఇది నాలుగవది. ఈ సందర్భంగా కరమ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ ఐఎన్ఎస్ వేలా అత్యంత సమర్థవంతమైనదని, జలంతార్గాముల ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రతాపరమైన సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో ఐఎన్ఎస్ వేలాకి భారత నావికాదళ ప్రయోజనాలను పరిరక్షించే సత్తా ఉందని అన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్ఎస్, భారత్‌కు చెందిన మాజ్‌గావ్ డాక్స్ లిమిటెడ్ కంపెనీలు ఈ జలాంతర్గామి తయారీలో భాగస్వామ్యులుగా ఉన్నాయి. అయితే ఫ్రాన్స్ సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో జాప్యం చేయడంతో ఈ ప్రాజెక్టులు ఆలస్యమవుతూ వచ్చాయి. 2017లో ఐఎన్ఎస్ కల్వారి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ కరాంజ్‌లు కూడా విధుల్లో చేరాయి. అయితే కరోనా కారణంగా ఐఎన్ఎస్ వేలా మరింత ఆలస్యమైంది. 1973 నుంచి 2010 వరకు నావికాదళంలో సేవలు అందించిన ఒకప్పటి జలాంతర్గామి వేలా పేరునే దీనికీ పెట్టారు. సోవియెట్ రష్యా తయారు చేసిన ఆ సబ్‌మెరైన్ మన దేశం నిర్వహించిన ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొంది. నేవీలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన వేలాని 2010లో నావికాదళం నుంచి విరమించారు. పాక్‌కు చైనా ఎగుమతులు చైనా నుంచి పాకిస్తాన్‌కు మిలటరీ హార్డ్‌వేర్ ఎగుమతులు అధికమయ్యాయని, ఇది అంతిమంగా భారత్ భద్రతకు ముప్పు కలిగిస్తుందని నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నౌకలు, జలాంతర్గాముల ఎగుమతులు పెరిగాయని, అన్నింటికి భారత్ సిద్ధంగా ఉండాలన్నారు. ప్రత్యేకతలు.. ► వేలా సబ్‌మెరైన్ 67.5 మీటర్లు పొడవు, 12.3 మీటర్ల ఎత్తు, 6.2 మీటర్ల వెడల్పు ఉంటుంది. ► ఈ జలాంతర్గామి నీట మునిగినప్పుడు 20 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. ► ఐఎన్ఎస్ వేలా సీ303 యాంటీ టార్పెడో కౌంటర్మెజర్ వ్యవస్థ కలిగి ఉంది. ఈ సబ్‌మెరైన్‌లో 18 టార్పెడోలను, లేదంటే యాంటీ షిప్ క్షిపణుల్ని అత్యంత సమర్థవంతంగా ప్రయోగించగలదు. ► ఎనిమిది మంది అధికారులు, 35 మంది సిబ్బందిని మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగి ఉంది. ► స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన వేలాలో తొలిసారిగా బ్యాటరీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. డీజిల్, ఎలక్ట్రిక్ శక్తితో ఇంజిన్లు పని చేస్తాయి. -
నేవీ సమీక్షకు నవ్యాంధ్ర సీఎం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విశాఖ రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన నగరానికి రావడం ఇది రెండోసారి. ఇటీవల జరిగిన తొలి పర్యటనలో శారదా పీఠాన్ని సందర్శించి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మలి పర్యటనను దేశ రక్షణ శాఖ కార్యక్రమాలకు కేటాయించారు. ఈ పర్యటనలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంలో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే జరిగే విందులో పాల్గొని.. అదే రోజు రాత్రి విజయవాడకు తిరిగి వెళ్తారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం ఆదివారం మధ్యాహ్నం వరకు విశాఖలోనే ఉంటారు. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శనివారం విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఇద్దరూ కలిసి తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ రెండోసారి నగరానికి వస్తుండగా, రక్షణ మంత్రి హోదాలో రాజ్‌నాధ్ విశాఖ రావడం ఇదే తొలిసారి. రక్షణ మంత్రి శనివారం మధ్యాహ్నమే నగరానికి రానుండగా.. సీఎం వైఎస్జగన్ రాత్రి 7 గంటలకు విశాఖ చేరుకుంటారు. విమానాశ్రయంలోనే పార్టీ నాయకులు, అధికారులు ఇతర ముఖ్యులతో మాట్లాడతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని కల్వరి సమావేశ మందిరానికి 7.30కు చేరుకుంటారు. అక్కడ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను మర్యాద పూర్వకంగా కలుస్తారు. అనంతరం రాత్రి 8.15 వరకు నౌకాదళ సమీక్షలో వారిద్దరూ కలిసి పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ జరిగే విందులో సీఎం జగన్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటారు. రాత్రి 8.40 గంటలకు సీఎం బయలుదేరి 9 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని విజయవాడకు తిరిగి వెళ్తారు. రెండు రోజులు రక్షణ మంత్రి ఇక్కడే.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉదయం 11.45 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 నుంచి 3.55 వరకు హెలికాప్టర్లో తూర్పు నౌకాదళంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. రాత్రి 7.30కు ఈస్ట్రన్ నేవీ హెడ్ క్వార్టర్స్‌లో జరిగే సమీక్ష సమావేశం, విందు కార్యక్రమాల్లో ఏపీ సీఎం వైఎస్‌జగన్‌తో కలిసి పాల్గొంటారు. రెండో రోజు ఆదివారం ఉదయం ఐఎన్ఎస్ డేగా నుంచి బయలుదేరి ఈఎన్సీ ప్రధాన కేంద్రానికి చేరుకొని నౌకలను సందర్శిస్తారు. నావికులు, నేవీ అధికారులు, నేవీ సివీలియన్ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలోఢిల్లీ బయలుదేరి వెళ్తారు. విశాఖ చేరుకున్న నౌకాదళాధిపతి కేంద్ర రక్షణ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్ శుక్రవారం సాయంత్రం విశాఖ నగరానికి చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న కరమ్బీర్సింగ్ను తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ స్వాగతం పలికారు. భారత నౌకాదళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వచ్చిన కరమ్‌బీర్ సింగ్‌కు గార్డాఫ్ హానర్ నిర్వహించి స్వాగతం పలికారు. అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్ 3 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజున ఈఎన్సీ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. -
నేవీ ఛీఫ్‌గా అడ్మిరల్ కరంబీర్ సింగ్
న్యూ ఢిల్లీ : భారత నేవీ ఛీఫ్ అడ్మిరల్‌గా కరంబీర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. అడ్మిరల్ సునీల్ లాంబా నుంచి 24వ నేవీ ఛీఫ్‌గా కరంబీర్ బాధ్యతలు స్వీకరించారు. నేవీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తానని కరంబీర్ తెలిపారు. చేతక్, కమోవ్-25, కమోవ్-28 హెలీకాఫ్టర్లను నడిపిన అనుభవం ఉంది. ఇండియన్ నేవీలో హెలీకాఫ్టర్ పైలెట్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఇండియన్ నేవీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి కరంబీర్ సింగ్ కావడం విశేషం. భారత నౌకాదళాన్ని అడ్మిరల్ సునిల్ లాంబా ఎంతో పటిష్టం చేశారని నేవీకి ఆయన చేసిన సేవలను కరంబీర్ సింగ్ కొనియాడారు. -
తదుపరి నేవీ చీఫ్‌గా కరమ్‌బీర్
న్యూఢిల్లీ: నావికాదళం తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్‌ను కేంద్రం నియమించింది. మే 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. విశాఖలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్(ఎఫ్‌వోసీ–ఇన్– సీ)గా ఉన్న కరమ్‌బీర్ మే 31వ తేదీన విధుల్లో చేరుతారని పేర్కొంది. హెలికాప్టర్ పైలెట్ ఒకరు నేవీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టనుండటం ఇదే ప్రథమం. అత్యంత సీనియర్ అధికారిని ఈ పదవికి నియమించాలన్న సంప్రదాయ విధానాన్ని పక్కనబెట్టి ప్రతిభే గీటురాయిగా కరమ్‌బీర్‌ను ఎంపిక చేసినట్లు రక్షణ శాఖ స్పష్టం చేసింది. కరమ్‌బీర్ గురించి ఇంకొంత స్వస్థలం: పంజాబ్‌లోని జలంధర్ ∙పుట్టిన తేదీ: నవంబర్ 3, 1959 నేవీలో చేరింది: జూలై 1, 1980 హెలికాప్టర్ పైలెట్‌గా ఎంపిక: 1982 శిక్షణ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (పూణె), డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్(వెల్లింగ్టన్), చేతక్, కమోవ్ హెలీకాప్టర్ల పైలెట్‌గా విశేష అనుభవం. అనుభవం: 37 ఏళ్ల సర్వీసులో కరమ్‌బీర్ సింగ్ ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్ చాంద్బీబీ, మిసైల్ కార్వెట్ ఐఎన్ఎస్ విజయ్‌దుర్గ్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ ఐఎన్ఎస్ రాణా నౌకలకు కమాండర్‌గా పనిచేశారు. -
‘ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం’
పుణే: భారత నావికా దళం ప్రాబల్యం సముద్ర జలాల్లో విస్తరిస్తోందని, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా అన్నారు. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో ఓ నౌకను శాశ్వతంగా మోహరించామని, పశ్చిమ నేవీ కమాండ్‌కు చెందిన నౌక ఒకటి మధ్యదరా సముద్రం గుండా అంట్లాటిక్ చేరిందని తెలిపారు. పుణేలోని జాతీయ రక్షణ అకాడమీ(ఎన్డీఏ) గ్రాడ్యుయేట్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి లాంబా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తూర్పు కమాండ్‌కు చెందిన నౌకలు సింగపూర్‌తో కలిసి దక్షిణ చైనా సముద్రంలో సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించాయని ఆయన వెల్లడించారు. ఆస్ట్రేలియాతో కూడా విన్యాసాలు చేపట్టేందుకు అవి బయల్దేరాయని తెలిపారు. ముంబైలో జరిగిన 26–11 లాంటి మరో దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్ని అయినా అమలు చేస్తామని పేర్కొన్నారు. నావికా దళం ఆధునీకరణ గురించి మాట్లాడుతూ... నేవీ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటోందని అన్నారు. 1960 నుంచి 200కు పైగా నౌకలను దేశీయంగా తయారుచేశామని తెలిపారు. ప్రస్తుతం 41 నౌకలు, జలాంతర్గాములు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. విధుల నుంచి తప్పించిన ఐఎన్ఎస్ విరాట్‌ను మ్యూజియంగా మార్చడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్డీఏ నుంచి 312 మంది శిక్షణను పూర్తిచేసుకున్నారు. వీరిలో 211 మంది ఆర్మీ నుంచి, 34 మంది నేవీ నుంచి, 67 మంది వాయుసేన నుంచి ఉన్నారు. -
నావీ చీఫ్‌గా సునీల్ లంబా బాధ్యతలు
న్యూఢిల్లీ: భారత నావికాదళ నూతన ప్రధానాధికారిగా అడ్మిరల్ సునీల్ లంబా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నౌకాదళ అధిపతిగా ఉన్న ఆర్కే ధోవన్ ఇవాళ పదవీ విరమణ చేశారు. దీంతో ధోవన్ నుంచి సునీల్ లంబా బాధ్యతలు స్వీకరించారు. 58 ఏళ్ల లంబా ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ఇప్పటివరకూ సునీల్ లంబా పశ్చిమ నావికాదళ కమాండర్‌గా విధులు నిర్వహించారు. భారత నావికాదళానికి ఆయన 23వ అధిపతి. 30 ఏళ్ల పాటు నావికదళానికి సేవలందించినందుకుగానూ ఆయన ఇటీవలే పరమ విశిష్ట సేవా పతకంతో కేంద్ర ప్రభుత్వం నుంచి సత్కారం అందుకున్నారు. -
నౌకలను ప్రారంభించిన నేవీ చీఫ్
-
ఉక్రెయిన్ నేవీ చీఫ్ అరెస్ట్
సెవాస్టొపోల్: క్రిమియాను రష్యాలో కలుపుకోవడంపై పశ్చిమ దేశాలు వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని ఏమాత్రమూ లక్ష్య పెట్టని రష్యా తనదైన శైలిలో మరో అడుగు ముందుకు వేసింది. ఈ క్రమంలో రష్యా అనుకూల దళాలు.. ఉక్రెయిన్ నేవీ చీఫ్ ను బుధవారం అదుపులోకి తీసుకున్నాయి. అదేవిధంగా క్రిమియాకు చెందిన రెండు ప్రధాన నౌకా స్థావరాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. దీంతో క్రిమియాపై రష్యా మరింత పట్టుసాధించినట్లయింది. ఈ నేపథ్యంలో డజన్ల మంది ఉక్రెయిన్ సైనికులను రష్యా బలగాలు క్రిమియా నుంచి పంపించాయి. కాగా, కొందరు సైనికులు మాత్రం వెళ్లేందుకు తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. తాము 20 ఏళ్లుగా క్రిమియాలో ఉంటున్నామని, ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. మరోపక్క, మాస్కో బలగాలు ఉక్రెయిన్ జెండాను తొలగించాయి. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: అమెరికా అంతర్జాతీయంగా వస్తున్న వ్యతిరేకతను రష్యా ఏమాత్రమూ లక్ష్య పెట్టకుండా క్రిమియాను కలుపుకోవడంపై అమెరికా తీవ్రస్థాయిలో మండిపడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చారిత్రక తప్పిదం చేశారని ధ్వజ మెత్తింది. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈమేరకు క్రిమియాను రష్యా సమాఖ్యలో చేర్చుకుంటూ అధ్యక్షుడు పుతిన్ ఒప్పంద పత్రంపై సంతకం చేసిన కొద్ది సేపటికే అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ మంగళవారం ధ్వజమెత్తారు. ‘చరిత్ర పట్ల అధ్యక్షుడు పుతిన్ ఎలాంటి వివరణనైనా ఇవ్వొచ్చు. కానీ నా ఉద్దేశంలో మాత్రం రష్యా, పుతిన్‌లు క్రిమియా విషయంలో చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు’ అని అన్నారు. -
నేవీ చీఫ్ D.K.జోష్ రాజీనామా