
న్యూఢిల్లీ: భారత నావికా దళం నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ నియమితులయ్యారు. ప్రస్తుతం నేవీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైస్ అడ్మిరల్ త్రిపాఠీ ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది.
1964 మే 15వ తేదీన జన్మించిన వైస్ అడ్మిరల్ త్రిపాఠీ 1985 జులై ఒకటో తేదీన భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ నిపుణుడిగా గత 30 ఏళ్లుగా బాధ్యతల్లో ఉన్నారు.