Vice Admiral
-
నావికా దళాధిపతిగా దినేశ్ త్రిపాఠీ
న్యూఢిల్లీ: భారత నావికా దళం నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ నియమితులయ్యారు. ప్రస్తుతం నేవీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైస్ అడ్మిరల్ త్రిపాఠీ ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. 1964 మే 15వ తేదీన జన్మించిన వైస్ అడ్మిరల్ త్రిపాఠీ 1985 జులై ఒకటో తేదీన భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిపుణుడిగా గత 30 ఏళ్లుగా బాధ్యతల్లో ఉన్నారు. -
గవర్నర్ విశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్‌తో వైస్ అడ్మిరల్ భేటీ
సాక్షి, అమరావతి: తూర్పు నౌకాదళ కమాండ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తా బుధవారం రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలను వేర్వేరుగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. గవర్నర్‌తో రాజభవన్లో, ముఖ్యమంత్రితో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. తూర్పు తీరం వెంబడి దేశ భద్రత కోసం చేపడుతున్న చర్యలను వారికి వివరించారు. చదవండి: వరద సాయం తక్షణమే విడుదల చేయాలి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించనున్న ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, మల్టీనేషనల్ మేరిటైమ్ ఎక్సర్సైజ్ మిలాన్ సన్నాహక కార్యక్రమాల పురోగతిని గవర్నర్, సీఎంలకు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తాను సీఎం జగన్ సత్కరించారు. కార్యక్రమంలో కెపె్టన్ వీఎస్సీ రావు, కెప్టెన్ ప్రదీప్ సింగ్ సేథి, సివిల్ మిలటరీ లైజన్ ఆఫీసర్ కమాండర్ సుజిత్‌రెడ్డి పాల్గొన్నారు. -
నేవీ కొత్త చీఫ్‌గా హరికుమార్
న్యూఢిల్లీ: భారత నావికాదళం కొత్త అధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ మంగళవారం తెలిపింది. హరికుమార్ ప్రస్తుతం వెస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్‌గా ఉన్నారు. ఈనెల 30వ తేదీన రిటైర్ కానున్న నేవీ ప్రస్తుత అధిపతి, అడ్మిరల్ కరంబీర్ సింగ్ నుంచి అదే రోజు మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. కేరళకు చెందిన హరికుమార్కు కమాండ్, స్టాఫ్, ఇన్స్ట్రక్షనల్ సంబంధ విధుల్లో దాదాపు 39 ఏళ్ల అనుభవం ఉంది. -
కాకినాడ బీచ్‌లో యుద్ధ విమాన మ్యూజియం ..
సాక్షి,కాకినాడ రూరల్: యుద్ధ విమాన మ్యూజియం కాకినాడ బీచ్‌లో త్వరలోనే ప్రారంభం కానుంది. సంబంధిత పనులు వేగం అందుకున్నాయి. సూర్యారావుపేట బీచ్‌లో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యాన అభివృద్ధి చేస్తున్న పార్కులో రూ.5.89 కోట్ల కాకినాడ పట్టణాభి వృద్ధి సంస్థ (కుడా) నిధులతో టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నానికి చెందిన తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సంస్థ ఈ పనులు చేపడుతోంది. ఈ పనులను తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ శనివారం స్వయంగా పరిశీలించారు. ఆయనకు కలెక్టర్ సి.హరికిరణ్, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, వైస్ చైర్మన్ కె.సుబ్బారావు, జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఆర్డీఓ చిన్నికృష్ణ తదితరులు స్వాగతం పలికారు. యుద్ధ విమానాన్ని పరిశీలించిన వైస్ అడ్మిరల్ అజేంద్ర ప్రజా సందర్శనకు వీలుగా చేపట్టబోయే పనుల గురించి కలెక్టర్ హరికిరణ్, తనేజా సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నంలో మాదిరిగా సందర్శకులు చూసేందుకు ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయాలని సూచించారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ 4న ప్రారంభోత్సవం జరిగేలా చూడాలన్నారు. మ్యూజియం, పార్కు అభివృద్ధి పురోగతి, పెండింగ్ పనులపై సమీక్షించారు. పనులపై వైస్ అడ్మిరల్ సంతృప్తి మ్యూజియం పనులపై కలెక్టర్ హరికిరణ్, కుడా వీసీ సుబ్బారావులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైస్ అడ్మిరల్‌కు వివరించారు. బహదూర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ త్వరితగతిన మ్యూజియం పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న జిల్లా అధికారులను అభినందించారు. పనులు పూర్తయ్యాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మ్యూజియాన్ని ప్రారంభిస్తారన్నారు. కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ యూటీ–142 యుద్ధ విమాన మ్యూజియం పనులు త్వరిగతిన జరుగుతున్నాయన్నారు. వీటని 60 నుంచి 90 రోజుల్లో పూర్తి చేస్తామని తనేజా సంస్థ ప్రతినిధి తెలిపారన్నారు. కోల్‌కతా, విశాఖపట్నం తర్వాత కాకినాడలో మాత్రమే యుద్ధ విమాన మ్యూజియం ఉందన్నారు. ఏపీ టూరిజం విభాగం స్నాక్స్ బార్, ఇంటర్‌ప్రెటేన్ సెంటర్ ఏర్పాటుతో పాటు రూ.1.50 కోట్లతో పచ్చదనం ఉండేలా పార్కును అభివృద్ధి చేస్తుందన్నారు. కుడా పీఓ సత్యనారాయణమూర్తి, ఏపీలు సూర్యనారాయణ, కృష్ణ, శాంతిలత, తహసీల్దార్ మురళీకృష్ణ, రాగిరెడ్డి బన్నీ, సిద్ధార్ధ తదితరులు పాల్గొన్నారు. సమీపంలోని నేవల్ ఎన్క్లేవ్ వద్దకు వెళ్లిన వైస్ అడ్మిరల్ అక్కడి సిబ్బందితో భేటీ అయ్యారు. -
కెరీర్‌ను గౌరవించండి
ఐఐఎం విద్యార్థులకు వైస్ అడ్మిరల్ సతీశ్ సోనీ సూచన విశాఖపట్నం: వేతన ప్యాకేజీలతో నిమిత్తం లేకుండా ఎంచుకున్న వృత్తిని గౌరవించాలని ఈస్టర్న్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సతీశ్ సోని ఐఐఎం విద్యార్థులకు సూచించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) విశాఖపట్నం ప్రథమ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునేందుకు, సమాజాభివృద్ధికి పాటుపడేందుకు వేతనాలకై చూడకుండా వృత్తిని గౌరవించాలని చెప్పారు. నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు, వ్యక్తిత్వ వికాసానికి హార్డ్‌వర్క్, సిన్సియారిటీ ఎంతో ముఖ్యమని తెలిపారు. తీర ప్రాంత రక్షణ, దేశ ఆర్థికాభివృద్ధిలో నేవీ కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. -
తూర్పు నౌకాదళాదిపతిగా సతీశ్ సోని బాధ్యతలు
విశాఖ : తూర్పు నావికాదళం ప్రధాన అధికారిగా వైస్ అడ్మిరల్ సతీశ్ సోని సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2012 నుంచి దక్షిణ నౌకాదళాధిపతిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన భారత నౌకాదళంలోని పలు కీలక విభాగాల్లో పనిచేశారు. ఇప్పటివరకు విశాఖలో విధులు నిర్వర్తించిన వైస్ అడ్మిరల్ అనిల్ చోప్రా ముంబయి పశ్చిమ తీర నౌకాధిపతిగా బదిలీ అయ్యారు. చోప్రా నుంచి సతీశ్ సోని బాధ్యతలు స్వీకరించారు.