
సాక్షి, అమరావతి: తూర్పు నౌకాదళ కమాండ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తా బుధవారం రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలను వేర్వేరుగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. గవర్నర్‌తో రాజభవన్‌లో, ముఖ్యమంత్రితో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. తూర్పు తీరం వెంబడి దేశ భద్రత కోసం చేపడుతున్న చర్యలను వారికి వివరించారు.
చదవండి: వరద సాయం తక్షణమే విడుదల చేయాలి
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించనున్న ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, మల్టీనేషనల్ మేరిటైమ్ ఎక్సర్‌సైజ్ మిలాన్ సన్నాహక కార్యక్రమాల పురోగతిని గవర్నర్, సీఎంలకు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తాను సీఎం జగన్ సత్కరించారు. కార్యక్రమంలో కెపె్టన్ వీఎస్‌సీ రావు, కెప్టెన్ ప్రదీప్ సింగ్ సేథి, సివిల్ మిలటరీ లైజన్ ఆఫీసర్ కమాండర్ సుజిత్‌రెడ్డి పాల్గొన్నారు.