సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి దంపతులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులతో భేటీ అయ్యారు. విజయవాడ రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు రాజ్భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ స్వాగతం పలికారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి.
సీఎం జగన్ సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై పురోగతిని గవర్నర్ హరిచందన్‌కు వివరించారు. దాదాపు అరగంటకు పైగా వీరిరువురు సమావేశం అయ్యారు. రాజ్ భవన్‌లో ముఖ్యమంత్రిని స్వాగతించిన వారిలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త, శాసన పరిషత్తు సభ్యుడు తలశిల రఘురామ్, సాధారణ పరిపాలనా శాఖ రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, జిల్లా కలెక్టర్ డిల్లీ రావు, నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఉప కమీషనర్ విశాల్ గున్ని, విజయవాడ నగర పాలక సంస్ధ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్య రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment