
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు గురువారం.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ 1న జరిగే వైఎస్‌ఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా గవర్నర్‌ను సీఎం వైఎస్ జగన్ ఆహ్వానించారు.
వివిధ రంగాలలో విశేష సేవలు చేసిన వారికి ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. ఈ కార్యక్రమం విజయవాడలో జరగనుంది. 50 మందికి పైగా ప్రముఖులకు వైఎస్‌ఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment