సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి దంపతులు రాజ్‌భవన్‌లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం దంపతులకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా స్వాగతం పలికారు. దాదాపు అరగంట పాటు సమకాలీన రాజకీయ అంశాలపై గవర్నర్, సీఎం చర్చించారు.
చదవండి: చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యం: సీఎం జగన్
అతి త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయాన్ని ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకువచ్చి అనుమతి తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. మరో వైపు ప్రభుత్వం జిల్లాల పునర్ విభజన చేపట్టనుండగా ఆవిషయాన్ని కూడా సీఎం.. బిశ్వ భూషణ్‌కు వివరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల పునర్ విభజన జరుగుతుందని, ప్రజల నుండి వినతులను స్వీకరించి ఆమోద యోగ్యమైన రీతిలో నూతన జిల్లాలను ఆవిష్కరించనున్నామని సీఎం వివరించారు.
మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. 8న గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. మార్చి 11న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment