
ఫైల్ ఫోటో
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చరవాణి ద్వారా గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళ జీవితం గడపాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం జగన్ ట్వీట్ కూడా చేశారు.
చదవండి: మహిళ అభ్యర్థన.. చలించిపోయిన సీఎం జగన్.. 4 రోజులు తిరక్కముందే
గవర్నర్ @governorap శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు జీవితం గడపాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 3, 2022