United States to Have an Its First Woman Admiral Chief - Sakshi
Sakshi News home page

Lisa Franchetti: అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్  

Published Mon, Jul 24 2023 2:10 PM | Last Updated on Mon, Jul 24 2023 3:09 PM

United States to have a its first woman admiral Chief - Sakshi

వాషింగ్టన్: అమెరికా నావికా దళానికి నూతన అధిపతిగా అధ్యక్షుడు జో బైడెన్ లీసా ఫ్రాంచెట్టి పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్ సెనేట్ గనుక బైడెన్ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తారు. 

జో బైడెన్ ప్రతిపాదన అయితే చేశారు కానీ అందుకు యూఎస్ సెనేట్ ఆమోదించాల్సి అవసరముంది. అధికార యంత్రాంగాన్ని నియమించడంలో అమెరికా కాంగ్రెస్ కు భారత పార్లమెంటు కంటే విశేష అధికారాలుంటాయి. కాకపొతే ఈ ప్రతిపాదనకు రిపబ్లికన్లు కూడా మద్దతు తెలపాల్సి ఉంటుంది. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. లీసా ఫ్రాంచెట్టి గత 38 సంవత్సరాలుగా ఆమె స్వీకరించిన ప్రతి పదవికి వన్నె తీసుకొస్తూ అమెరికా నావికా దళానికి విశేష సేవలందించారు. ప్రస్తుతం ఆమె అమెరికా నావికా దళానికి వైస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లీసా అమెరికా నౌకాదళంలో ఫోర్ స్టార్ అడ్మిరల్ గా నియమింపబడిన రెండో అధికారి. 

ఒకవేళ ఆమె నియామకంపై సెనెట్లో గ్రీన్ సిగ్నల్ వస్తే అమెరికా నావీకి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తొట్టతొలి మహిళగా నిలుస్తారన్నారు. రిపబ్లికన్లకు అమెరికా నౌకా దళం పేరు ప్రఖ్యాతలు గురించి, దాని సామర్ధ్యం గురించి పరిజ్ఞానం ఉందనే అనుకుంటున్నాను. దేశఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసే విధంగా తొలి మహిళా అడ్మిరల్ నిర్ణయాన్ని వారు ఆమోదిస్తారని అనుకుంటున్నానని అన్నారు.     

ఇది కూడా చదవండి: ఎగతాళి చేద్దామనుకున్నాడు.. చివరికి నవ్వులపాలై..     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement