admiral
-
విశాఖ వేదికగా మిలన్–2024
సాక్షి, అమరావతి: తూర్పు నావికాదళం విశాఖపట్నం వేదికగా వచ్చే ఫిబ్రవరిలో మిలన్–2024 నిర్వహించనుంది. తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్ మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. మిలన్–2024 నిర్వహణ వివరాలను సీఎంకు తెలియజేశారు. విశాఖపట్నంలో నిర్వహించే మిలన్–2024కు 57 దేశాల ప్రముఖులు, నౌకాదళాలు పాల్గొనే అవకాశముందని చెప్పారు. సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగవిుంచేందుకు తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేశ్ పెందార్కర్‌ను సీఎం జగన్ సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేయగా.. రాజేశ్ ముఖ్యమంత్రికి ఐఎన్ఎస్ విశాఖపట్నం షిప్ మోడల్‌ను బహూకరించారు. సమావేశంలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎస్సీ రావు, కెప్టెన్ రోహిత్ కట్టోజు, కమాండర్ వైకే కిశోర్, లెఫ్టినెంట్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డిని తూర్పు నావికాదళ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. -
అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్
వాషింగ్టన్: అమెరికా నావికా దళానికి నూతన అధిపతిగా అధ్యక్షుడు జో బైడెన్ లీసా ఫ్రాంచెట్టి పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్ సెనేట్ గనుక బైడెన్ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తారు. జో బైడెన్ ప్రతిపాదన అయితే చేశారు కానీ అందుకు యూఎస్ సెనేట్ ఆమోదించాల్సి అవసరముంది. అధికార యంత్రాంగాన్ని నియమించడంలో అమెరికా కాంగ్రెస్ కు భారత పార్లమెంటు కంటే విశేష అధికారాలుంటాయి. కాకపొతే ఈ ప్రతిపాదనకు రిపబ్లికన్లు కూడా మద్దతు తెలపాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. లీసా ఫ్రాంచెట్టి గత 38 సంవత్సరాలుగా ఆమె స్వీకరించిన ప్రతి పదవికి వన్నె తీసుకొస్తూ అమెరికా నావికా దళానికి విశేష సేవలందించారు. ప్రస్తుతం ఆమె అమెరికా నావికా దళానికి వైస్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లీసా అమెరికా నౌకాదళంలో ఫోర్ స్టార్ అడ్మిరల్ గా నియమింపబడిన రెండో అధికారి. ఒకవేళ ఆమె నియామకంపై సెనెట్‌లో గ్రీన్ సిగ్నల్ వస్తే అమెరికా నావీకి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తొట్టతొలి మహిళగా నిలుస్తారన్నారు. రిపబ్లికన్లకు అమెరికా నౌకా దళం పేరు ప్రఖ్యాతలు గురించి, దాని సామర్ధ్యం గురించి పరిజ్ఞానం ఉందనే అనుకుంటున్నాను. దేశఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసే విధంగా తొలి మహిళా అడ్మిరల్ నిర్ణయాన్ని వారు ఆమోదిస్తారని అనుకుంటున్నానని అన్నారు. ఇది కూడా చదవండి: ఎగతాళి చేద్దామనుకున్నాడు.. చివరికి నవ్వులపాలై.. -
ఇండో పసిఫిక్ భద్రతపై ఆస్ట్రేలియాతో కలిసి అడుగులు
సాక్షి, విశాఖపట్నం: ఇండో పసిఫిక్ సముద్ర భద్రత, సవాళ్లపై ఆస్ట్రేలియాతో కలిసి అడుగులు వేస్తున్నామని తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ హరికుమార్ వెల్లడించారు. సీఎన్‌ఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాలో మూడు రోజులు అధికారికంగా పర్యటించారు. రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ మార్క్ హమ్మండ్, ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్సెస్ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ డేవిడ్ జాన్సన్‌తోపాటు రక్షణ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక ఒప్పందాలు, పరస్పర సహకారానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. సాగర జలాల్లో ఉన్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన చర్యలపై ఆస్ట్రేలియా అధికారులతో సమీక్షించారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని గురువారం విశాఖపట్నం చేరుకున్న రియర్ అడ్మిరల్ హరికుమార్ సముద్ర పర్యావరణం, హిందూ మహాసముద్రం, ఇండో పసిఫిక్ తీరంలో ఆధిపత్యం, ఇతర అంశాలపై కేంద్రీకృత ప్రయత్నాలను పెంచాల్సిన అవసరాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని తూర్పు నౌకాదళ వర్గాలు పేర్కొన్నాయి. -
నేవీ ఛీఫ్‌గా అడ్మిరల్ కరంబీర్ సింగ్
న్యూ ఢిల్లీ : భారత నేవీ ఛీఫ్ అడ్మిరల్‌గా కరంబీర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. అడ్మిరల్ సునీల్ లాంబా నుంచి 24వ నేవీ ఛీఫ్‌గా కరంబీర్ బాధ్యతలు స్వీకరించారు. నేవీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తానని కరంబీర్ తెలిపారు. చేతక్, కమోవ్-25, కమోవ్-28 హెలీకాఫ్టర్లను నడిపిన అనుభవం ఉంది. ఇండియన్ నేవీలో హెలీకాఫ్టర్ పైలెట్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఇండియన్ నేవీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి కరంబీర్ సింగ్ కావడం విశేషం. భారత నౌకాదళాన్ని అడ్మిరల్ సునిల్ లాంబా ఎంతో పటిష్టం చేశారని నేవీకి ఆయన చేసిన సేవలను కరంబీర్ సింగ్ కొనియాడారు. -
బ్రిటీష్ వార్‌షిప్‌ల గురించి సంచలన నిజాలు
లండన్: బ్రిటన్ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే వార్‌షిప్‌ల గురించి ఇటీవల వెల్లడైన విషయాలు ఆ దేశ పౌరులను విస్తుపోయేలా చేశాయి. స్వయంగా ఆదేశ నావీ అధికారి క్రిస్ పారీ.. తమ వార్‌షిప్‌ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా టైప్ 45 డిస్ట్రాయర్ వార్‌షిప్‌లు విడుదల చేసే సౌండ్ మరీ ఎక్కువగా ఉందని క్రిస్ పారీ తెలిపారు. వీటి సౌండ్‌ను 100 మైళ్ల దూరంలో ఉన్న రష్యా సబ్మెరైన్లు గుర్తించగలవని ఆయన వెల్లడించారు. ఇలాంటి లోపాలను చాలా ఏళ్లుగా పట్టించుకోకుండా వదిలేసినట్లు ఆయన తెలిపారు. 1.2 బిలియన్ పౌండ్లు వెచ్చించిన వాచ్కీపర్ డ్రోన్లు సైతం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఆ దేశ రక్షణ అధికారుల్లోఅసంతృప్తిని మిగిల్చింది. క్రిస్ పారీ గతంలో బ్రిటన్ డిఫెన్స్ మినిస్ట్రీకి ఆపరేషనల్ కేపబిలిటీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.