బ్రిటీష్‌ వార్‌షిప్‌ల గురించి సంచలన నిజాలు | British Warships So Loud Russians Hear Them 100 Miles Away says British Admiral | Sakshi
Sakshi News home page

బ్రిటీష్‌ వార్‌షిప్‌ల గురించి సంచలన నిజాలు

Published Mon, Feb 6 2017 12:05 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

బ్రిటీష్‌ వార్‌షిప్‌ల గురించి సంచలన నిజాలు

బ్రిటీష్‌ వార్‌షిప్‌ల గురించి సంచలన నిజాలు

లండన్‌: బ్రిటన్‌ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే వార్‌షిప్‌ల గురించి ఇటీవల వెల్లడైన విషయాలు ఆ దేశ పౌరులను విస్తుపోయేలా చేశాయి. స్వయంగా ఆదేశ నావీ అధికారి క్రిస్‌ పారీ.. తమ వార్‌షిప్‌ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిపారు.

ముఖ్యంగా టైప్‌ 45 డిస్ట్రాయర్‌ వార్‌షిప్‌లు విడుదల చేసే సౌండ్‌ మరీ ఎక్కువగా ఉందని క్రిస్‌ పారీ తెలిపారు. వీటి సౌండ్‌ను 100 మైళ్ల దూరంలో ఉన్న రష్యా సబ్‌మెరైన్లు గుర్తించగలవని ఆయన వెల్లడించారు. ఇలాంటి లోపాలను చాలా ఏళ్లుగా పట్టించుకోకుండా వదిలేసినట్లు ఆయన తెలిపారు. 1.2 బిలియన్‌ పౌండ్‌లు వెచ్చించిన వాచ్‌కీపర్‌ డ్రోన్‌లు సైతం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఆ దేశ రక్షణ అధికారుల్లోఅసంతృప్తిని మిగిల్చింది. క్రిస్‌ పారీ గతంలో బ్రిటన్‌ డిఫెన్స్‌ మినిస్ట్రీకి ఆపరేషనల్‌ కేపబిలిటీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement