సీఎం వైఎస్ జగన్‌కు ఐఎన్‌ఎస్ షిప్ మోడల్‌ను బహూకరిస్తున్న రాజేశ్ పెందార్కర్
సాక్షి, అమరావతి: తూర్పు నావికాదళం విశాఖపట్నం వేదికగా వచ్చే ఫిబ్రవరిలో మిలన్–2024 నిర్వహించనుంది. తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్ మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. మిలన్–2024 నిర్వహణ వివరాలను సీఎంకు తెలియజేశారు. విశాఖపట్నంలో నిర్వహించే మిలన్–2024కు 57 దేశాల ప్రముఖులు, నౌకాదళాలు పాల్గొనే అవకాశముందని చెప్పారు.
సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగవిుంచేందుకు తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేశ్ పెందార్కర్‌ను సీఎం జగన్ సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేయగా.. రాజేశ్ ముఖ్యమంత్రికి ఐఎన్‌ఎస్ విశాఖపట్నం షిప్ మోడల్‌ను బహూకరించారు. సమావేశంలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎస్‌సీ రావు, కెప్టెన్ రోహిత్ కట్టోజు, కమాండర్ వైకే కిశోర్, లెఫ్టినెంట్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డిని తూర్పు నావికాదళ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment