milan
-
విశాఖ సముద్ర జలాల్లో ఒళ్లు గగుర్పొడిచేలా యుద్ధ విన్యాసాలు (ఫొటోలు)
-
వినువీధిలో మిలాన్ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్–2024 విన్యాసాల్లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను గురువారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ఆర్కే బీచ్‌లో ప్రారంభించారు. యుద్ధ నౌకల ప్రదర్శనలు, మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌ల గగుర్పొడిచే విన్యాసాలు, సీహాక్స్, చేతక్, ఏఎల్‌హెచ్ హెలికాఫ్టర్ల సమర ప్రదర్శనలకు విశాఖ ఆర్కే బీచ్ వేదికైంది. లక్షలాది మంది వీక్షకుల నడుమ మార్కోస్.. శత్రుమూకలతో చేసిన పోరాటాలు సాగర తీరాన్ని రణరంగంగా మార్చాయి. యుద్ధ విన్యాసాల అనంతరం.. మిలాన్‌లో పాల్గొన్న 51 దేశాల జాతీయ జెండాల ప్రదర్శన, నౌకాదళ సిబ్బంది పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన నేవీ బ్యాండ్ ఉర్రూతలూగించగా.. కూచిపూడి, థింసా, గరగ, తప్పెటగుళ్లు, కొమ్ము నృత్యం, కోలాటం, గార్భా, దాండియా.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు విదేశీయుల్ని సైతం మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ఏర్పాటు చేసిన శకట ప్రదర్శనకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. నేవీ బ్యాండ్‌తో ముగింపు పలకగా.. చివర్లో దేశ పరాక్రమాన్ని, ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని ప్రస్ఫుటించేలా నిర్వహించిన లేజర్ షో అద్భుతంగా సాగింది. బాణసంచా పేలుళ్లతో కార్యక్రమాన్ని ముగించారు. సాగర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు వార్‌షిప్స్ జలాశ్వ, ముంబై, చెన్నై యుద్ధ నౌకలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి అజయ్‌భట్ స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు విశాఖలో నిర్వహించిన రెండు మిలాన్‌లు అతిపెద్ద విన్యాసాలుగా చరిత్రకెక్కాయి. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ నగరం మేరీటైమ్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్‌లో నౌకాదళానికి విశాఖ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన సిటీ పరేడ్ ద్వారా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించాలన్నదే లక్ష్యం. 51 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. – అజయ్‌భట్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి విశాఖ నగరం అద్భుత ఆతిథ్యమిచ్చింది మిలాన్–2024 విన్యాసాలకు విశాఖ నగరం అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించినందుకు కృతజ్ఞతలు. విశాఖకు, నౌకాదళానికి అవినాభావ సంబంధం ఉంది. ఈస్ట్రన్ సీ బోర్డ్‌లో విశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్‌నకు.. ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి నగరానికి అంకితం చేశాం. ఇక్కడ నిర్వహించే ప్రతి నౌకాదళ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి, విశాఖ ప్రజలకు కృతజ్ఞతలు. – అడ్మిరల్ ఆర్ హరికుమార్, భారత నౌకాదళాధిపతి -
మిలాన్ మెరుపులు
-
నేడు మిలాన్‌లో మెరుపులు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా గురువారం సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. ఆర్కే బీచ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళం తయారు చేసిన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ తొలిసారిగా విశాఖ చేరుకుంది. ఏడాది క్రితం ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచి్చన తర్వాత తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్ విధులు నిర్వర్తిస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత వివిధ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న విక్రాంత్ ప్రస్తుతం తొలిసారిగా విశాఖకు చేరుకుంది. వాస్తవానికి విక్రాంత్‌ని బెర్తింగ్ చేసేందుకు అవసరమైన బెర్త్ ఇక్కడ లేదు. విక్రాంత్‌కు అనుగుణమైన భారీ బెర్త్ నిర్మించేందుకు విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)తో నౌకాదళం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాఖ వేదికగా మిలాన్–2024 విన్యాసాలు జరుగుతున్న నేపథ్యంలో విశాఖకు వచ్చిన విక్రాంత్‌ను విశాఖ కంటైనర్ టెర్మినల్‌లో బెర్తింగ్ చేశారు. మరోవైపు.. పశ్చిమ నౌకాదళంలో విధులు నిర్వర్తిస్తున్న మరో విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య రెండు రోజుల క్రితం విశాఖ చేరుకుంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ని గంగవరం అదానీ పోర్టులో లంగరు వేశారు. 22న జరిగే సిటీ పరేడ్, 23 నుంచి 27వ తేదీ వరకూ జరిగే మిలాన్ సీ ఫేజ్ విన్యాసాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మిలాన్‌లో పాల్గొన్న దేశాల జాతీయ జెండాలతో ఆ దేశ సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పరేడ్ సాగనుంది. యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాఫ్టర్ల విన్యాసాలతో ఆర్కే బీచ్‌లో యుద్ధ వాతావరణాన్ని నౌకాదళ సిబ్బంది ప్రజలకు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించనున్నారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నౌకాదళ అధికారులు పాల్గొననున్నారు. -
మిలాన్ విన్యాసాలు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: యుద్ధ నౌకల సమాహారం.. ప్రపంచ నౌకాదళాల సమన్వయం ‘మిలాన్–2024’ విశాఖ వేదికగా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక నౌకాదళ యుద్ధ విన్యాసాల ప్రదర్శన ‘మిలాన్–2024’లో 58 దేశాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే చాలా దేశాలకు చెందిన నౌకాదళాలు, కోస్ట్‌గార్డ్ బృందాలు, యుద్ధనౌకలు, విమానాలు, హెలికాఫ్టర్లు, సబ్మెరైన్లు విశాఖకు చేరుకున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే మిలాన్–2024లో భాగంగా తొలి రోజు మధ్యాహ్నం మారీటైమ్ వార్ఫేర్ సెంటర్లో వివిధ దేశాల మధ్య ప్రీ సెయిల్ డిస్కషన్స్ జరిగాయి. హార్బర్ ఫేజ్ విన్యాసాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అదేరోజు రాత్రికి ఐస్ బ్రేకర్ డిన్నర్ ఏర్పాటు చేసి అన్ని దేశాల అధికారులు, సిబ్బందికి భారత నౌకాదళం ఆతిథ్య విందు ఇవ్వనుంది. కాగా, 22వ తేదీన జరిగే ప్రతిష్టాత్మక సిటీ పరేడ్‌కు సంబంధించిన రిహార్సల్స్ సోమవారం సాయంత్రం ఆర్కే బీచ్‌లో అద్భుతంగా జరిగాయి. మంగళవారం సాయంత్రం జరిగే తుది రిహార్సల్స్‌కు నౌకాదళ అధికారులు, జిల్లా అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటి వరకూ విశాఖ చేరుకున్న యుద్ధ నౌకల వివరాలు సీ షెల్ నుంచి కోస్ట్‌గార్డ్‌కు చెందిన పీఎస్ జొరాస్టర్ డిస్ట్రాయర్, శ్రీలంక నుంచి ఎస్ఎల్ఎన్ఎస్ సయురాలా యుద్ధనౌక, మయన్మార్ నుంచి యూఎంఎస్ కింగ్సిన్పీసిన్ యుద్ధ నౌక, ఇండొనేషియా నుంచి కేఆర్ఐ సుల్తాన్ ఇస్కందర్ ముదా యుద్ధ నౌక, రాయల్ ఆస్ట్రేలియా నేవీ నుంచి హెచ్ఎంఏఎస్ వార్మూంగా వెసల్, జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి జేఎస్ సజనామీ యుద్ధ నౌక వచ్చాయి. వీటితోపాటు రాయల్ థాయ్ నేవీ నుంచి హెచ్‌టీఎంఎస్ ప్రచువాప్ ఖిర్కీఖాన్ వార్ఫేర్, వియత్నాం పీపుల్స్ నేవీ నుంచి కార్వెట్టీ 20 డిస్ట్రాయర్, యూఎస్ నేవీ నుంచి యూఎస్ఎస్ హాల్సే యుద్ధ నౌక, బంగ్లాదేశ్‌కు చెందిన బీఎన్ఎస్ ధలేశ్వరి యుద్ధ నౌక, రాయల్ మలేషియా నుంచి కేడీ లేకిర్ యుద్ధ నౌక, రష్యన్ నేవీ నుంచి మార్షల్ షాపోష్నికోవ్ వార్ షిప్, వర్యాగ్ గైడెడ్ మిసైల్ షిప్ కూడా విశాఖ చేరుకున్నాయి. -
Visakha: నేటి నుంచి ‘మిలాన్’ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలిచేందుకు విశాఖ మహానగరం సిద్ధమైంది. 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2022ని వరుసగా నిర్వహించి ప్రపంచ దేశాలకు సత్తాచాటిన విశాఖ మహా నగరం... తాజాగా ప్రతిష్టాత్మక మిలాన్–2024 విన్యాసాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు జరిగే మిలాన్ విన్యాసాల్లో 50కి పైగా దేశాలు పాల్గొననున్నాయి. మిలాన్ విన్యాసాల్లో కీలకమైన సిటీ పరేడ్‌ను ఈ నెల 22వ తేదీన ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్నారు. ఈ పరేడ్‌కు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. మిలాన్–2024 విన్యాసాలను ‘కమరడెరీ(స్నేహం)–కొహెషన్ (ఐక్యత)–కొలాబరేషన్(సహకారం)’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 11 ‘మిలాన్’లు.. వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణం, స్నేహ పూర్వక సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడంతోపాటు శత్రు సైన్యాలకు తమ బలం, బలగం గురించి తెలియజేసేందుకు ‘మిలాన్’ పేరుతో 1955 నుంచి విన్యాసాలు నిర్వహిస్తున్నారు. తొలిసారి జరిగిన విన్యాసాల్లో భారత్, ఇండొనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ‘మిలాన్’లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2005లో సునామీ రావడం వల్ల మిలాన్ విన్యాసాలు రద్దు చేయగా.. 2001, 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు నిర్వహించడం వల్ల ఈ విన్యాసాలు జరగలేదు. ఈ విన్యాసాల్లో 2010 వరకు 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో అనూహ్యంగా 16 దేశాలు పాల్గొన్నాయి. 2022లో విశాఖలో నిర్వహించిన విన్యాసాల్లో 35 దేశాలు పాల్గొనగా, 2023లో అండమాన్‌లో జరిగిన విన్యాసాల్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి ఏకంగా 50కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. సాగర తీరంలో వివిధ దేశాల నౌకాదళాల సందడి భారత నౌకాదళ ఆహ్వానం మేరకు మిలాన్–2024లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల నౌకాదళాలతో విశాఖ సాగర జలాలు కిటకిటలాడుతున్నాయి. భారత్‌తోపాటు యూఎస్ఏ, రష్యా, జపాన్, యూకే, ఆ్రస్టేలియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఇండొనేషియా, ఫ్రాన్స్, ఈజిప్‌్ట, శ్రీలంక, వియత్నాం, మొజాంబిక్, సూడాన్, ఇజ్రాయిల్, ఖతర్, థాయ్‌లాండ్, మలేషియా, సోమాలియా, కెన్యా, మయన్మార్, న్యూజిలాండ్, టాంజానియా, కొమరోస్, మాల్దీవులు, బ్రూనే, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, ఒమన్, కాంబోడియా, దక్షిణ కొరియా, కువైట్, ఇరాన్, మడగాస్కర్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, యూఏఈ, జిబౌటీ, ఎరిత్రియా, మారిషస్, సీషెల్స్, ఫిజీ, టోంగా, టోగో, పెరూ తదితర 50దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలు విశాఖ చేరుకుంటున్నాయి. ఈ చరిత్రాత్మకమైన ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ నగర ప్రజలకు తూర్పు నౌకాదళాధికారులు విజ్ఞప్తి చేశారు. మిలాన్–2024 కార్యక్రమాలు ఇలా... ♦ మొదటగా ఈ నెల 19 నుంచి 23 వరకు హార్బర్ ఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. ♦ 19న తొలి రోజు ప్రీ సెయిల్ డిస్కషన్స్, టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ బ్రీఫింగ్స్, అతిథులకు ఐస్ బ్రేకర్ డిన్నర్ ఉంటాయి. ♦ 20న హెల్త్ ట్రెక్, ఆగ్రా, తాజ్‌మహాల్ సందర్శన, యంగ్ ఆఫీసర్ల ఆత్మీయ కలయిక ఉంటాయి. ఆర్కే బీచ్‌లో సిటీ పరేడ్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. ♦ 21న క్రీడాపోటీలు, మేరీటైమ్ టెక్నికల్ ఎక్స్పో–2024 ప్రారం¿ోత్సవం, భారత యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ విజిట్, ద్వైపాక్షిక విన్యాసాలు, వివిధ దేశాల ప్రతినిధుల సిటీ టూర్, మిలాన్ విన్యాసాలు ప్రారం¿ోత్సవం, మిలాన్ విలేజ్ ప్రారంభ కార్యక్రమాలు ఉంటాయి. ♦ 22న అంతర్జాతీయ మేరీటైమ్ సెమినార్ ప్రారంభం, ప్రీసెయిల్ డిస్కషన్స్, సిటీ టూర్, ఆర్కే బీచ్‌లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. ♦ 23న బుద్ధగయ పర్యటన, సిటీ టూర్‌తో హార్బర్ ఫేజ్ విన్యాసాలు ముగుస్తాయి. ♦ 24 నుంచి 27 వరకు వివిధ దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సబ్‌మెరైన్స్‌తో సీఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. ♦ 28న వివిధ దేశాల యుద్ధ నౌకల నిష్క్రమణ ♦ ఈసారి విన్యాసాల్లో భారత నౌకాదళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. -
50 దేశాలతో మిలాన్–2024
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా మిలాన్–2024 నిర్వహించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించినట్టు తూర్పు నావికా దళాధిపతి, వైస్ అడ్మిరల్ పెంథార్కర్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 27 వరకూ మిలాన్ విన్యాసాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఏ సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారన్నారు. ఈ భరోసాతో 50 దేశాలతో రికార్డు స్థాయిలో మిలాన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అన్ని దేశాలకు ఆహ్వానాలు పంపించామని.. ఇప్పటివరకూ 27 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్స్, ఎయిర్క్రాఫ్టŠస్ విన్యాసాల్లో పాల్గొననున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని వివరించారు. నేవీ డే సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. తుపాను కారణంగా నేవీ డేను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశామన్నారు. ఆ రోజున ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారని, ఈ విన్యాసాల్లో తొలిసారిగా స్వావలంబన్ పేరుతో టెక్నికల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖ కేంద్రంగా నావికాదళం బలోపేతం విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న తూర్పు నౌకాదళం మరింత బలోపేతం కానుందని వైస్ అడ్మిరల్ పెంథార్కర్ పేర్కొన్నారు. ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ మైసూర్ యుద్ధ నౌకలు త్వరలోనే విశాఖ నుంచే కార్యకలాపాలు ప్రారంభించనున్నాయన్నారు. తూర్పు నౌకాదళం ప్రపంచ రక్షణ దళాల్లో కీలకంగా వ్యవహరించనుందని చెప్పారు. భవిష్యత్‌లో భారత నౌకాదళంలో కీలక ప్రాంతంగా విశాఖపట్నం అభివృద్ధి చెందనుందని తెలిపారు. సముద్ర జలాల పరిరక్షణ, ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలు సాగించే కీలకమైన భద్రతకు అవసరమైన షిప్‌లు, జలాంతర్గాములు, సర్వే వెస్సల్స్ వంటివి తూర్పు నౌకాదళంలో కేంద్రీకృతం కానున్నాయని వివరించారు. 20కి పైగా స్వదేశీ యుద్ధ నౌకలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న 20 నుంచి 25 యుద్ధ నౌకలు 2037 నాటికి తూర్పు నౌకాదళ అమ్ముల పొదిలో చేరనున్నాయని వైస్ అడ్మిరల్ చెప్పారు. ఇందులో నీలగిరి క్లాస్ ఫ్రిగేట్, నెక్స్ట్ జనరేషన్ కార్వెట్ క్లాస్ షిప్, డైవింగ్ సపోర్ట్ వెస్సల్స్, సర్వే వెస్సల్స్, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్, వాటర్ క్రాఫ్ట్, న్యూక్లియర్ సబ్‌మెరైన్ వంటివి రాబోతున్నాయని వివరించారు. మల్టీ రోల్ 60ఆర్ 60ఆర్, అప్‌గ్రేడ్ చేసిన యాంటీ సబ్‌మెరైన్ కమోవ్ 28 హెలికాప్టర్లు, మీడియం లిఫ్ట్ ఇ–295 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా విశాఖలో కేంద్రీకృతం కానున్నాయన్నారు. సర్వే వెసెల్స్‌లో మొదటిది సంధాయక్ వచ్చే ఏడాది ప్రారంభంలో తూర్పు నౌకాదళ అమ్ముల పొదిలో చేరనుందన్నారు. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దృష్ట్యా ఆ దేశ యుద్ధ నౌకలు, పరిశోధన నౌకలు, శాటిలైట్స్, ఇంటెలిజెన్స్ సమాచార షిప్స్, సబ్మెరైన్లను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. చైనా నుంచి ప్రతి కదలికనూ పసిగడుతున్నామన్నారు. డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు వివరించారు. -
మెగా మిలిటరీ విన్యాసాలకు సిద్ధమవుతున్న ఇండియన్ నేవీ
ప్రపంచ భౌగోళిక రాజకీయ వాతావరణం, గ్లోబల్‌గా జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో భారతనౌకాదళం తొమ్మిది రోజులపాటు నావికా విన్యాసాలు చేపట్టనుంది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అరేబియా మహాసముద్రంలో జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం 50కి పైగా దేశాల భాగస్వామ్యం కానున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా మిలిటరీ విన్యాసాలు పెంచడం కూడా ఇందుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న 'మిలన్' విన్యాసాల్లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొంటాయని అధికారులు తెలిపారు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ విన్యాసాల్లో భాగంగా అధునాతన వైమానిక రక్షణ కార్యకలాపాలు, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్, యాంటీ-సర్ఫేస్ డ్రిల్లు ఉంటాయని సమాచారం. మిలన్‌ను 1995లో భారత నావికాదళం ప్రారంభించింది. 2022లో 39 దేశాలు ఈ మిలన్లో పాల్గొన్నాయి. -
విశాఖ వేదికగా మిలన్–2024
సాక్షి, అమరావతి: తూర్పు నావికాదళం విశాఖపట్నం వేదికగా వచ్చే ఫిబ్రవరిలో మిలన్–2024 నిర్వహించనుంది. తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్కర్ మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. మిలన్–2024 నిర్వహణ వివరాలను సీఎంకు తెలియజేశారు. విశాఖపట్నంలో నిర్వహించే మిలన్–2024కు 57 దేశాల ప్రముఖులు, నౌకాదళాలు పాల్గొనే అవకాశముందని చెప్పారు. సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగవిుంచేందుకు తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేశ్ పెందార్కర్‌ను సీఎం జగన్ సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేయగా.. రాజేశ్ ముఖ్యమంత్రికి ఐఎన్ఎస్ విశాఖపట్నం షిప్ మోడల్‌ను బహూకరించారు. సమావేశంలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎస్సీ రావు, కెప్టెన్ రోహిత్ కట్టోజు, కమాండర్ వైకే కిశోర్, లెఫ్టినెంట్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డిని తూర్పు నావికాదళ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. -
ఇటలీ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి
మిలాన్: ఇటలీ సముద్ర తీరానికి సమీపంలో రెండు పడవలు నీటమునిగాయి. రెండు పడవల్లో ఒకదాంట్లో 48 మంది మరో దాంట్లో 42 మంది వలసదారులు ప్రయాణిస్తున్నారని వారిలో 57 మందిని కాపాడిన ఇటలీ తీరప్రాంత రక్షణ దళాలు ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని గల్లంతైన మరో 30 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఇటలీ కోస్ట్ గార్డులు తెలిపారు. వయా ట్యునీషియా.. స్ఫాక్స్ బీచ్ తీరంలో గత వారం 10 మృతదేహాలను కనుగొన్నామని ట్యునీషియా పోర్టు గుండా ఇటలీకి చేరుకోవడం సులభం కాబట్టి అక్రమ వలసదారులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు స్ఫాక్స్ అధికారులు. తాజాగా ఈ రెండు పడవలు కూడా ట్యునీషియా పోర్టు నుండే ఇటలీ వైపుగా వచ్చాయని అవి లంపెడుసా ద్వీపం దాటగానే ఉరుములు మెరుపులతో సముద్రంలో అలజడి రేగడంతో అలల తాకిడికి అందులో ప్రయాణిస్తున్న 90 మంది వలసదారులతో సహా పడవలు బోల్తా పడ్డాయన్నారు. కోస్ట్ గార్డుల సాహసం.. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఇటలీ తీర రక్షణ దళాలు హుటాహుటిన స్పందించి 57 మందిని రక్షించగలిగామని తెలిపారు స్ఫాక్స్ అధికారులు. కానీ ప్రమాదంలో ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని. వారి మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయని తెలిపారు. పడవలోని మిగిలిన 30 మంది గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇలా అయితే ఎలా? ఈ రెండు పడవల్లోని వలసదారులు సహారా-ఆఫ్రికా దేశాలకు చెందిన వారే అయి ఉంటారని, ఎంతగా ప్రయత్నించినా ఆఫ్రికా దేశాల నుండి ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయలేకున్నామని తెలిపారు ఇటలీ వలసల విచారణాధికారి ఇమ్మానుయేల్ రిసిఫారీ. వారాంతా మెరుగైన జీవితం కోసమే ఇటు వస్తున్నారు. అదేదో చట్టబద్దంగా వస్తే బాగుంటుంది కానీ దొడ్డిదారిన రావడం వల్లనే ఇలా ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. డిమాండ్ ఎక్కువ.. ఎందరో వలసదారులు చనిపోతున్నారని సముద్రంలో ప్రమాదాలను నివారించడానికి నౌకలను ఏర్పాటు చేయడం కూడా అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నట్లే ఉంది. పొరుగు దేశానికి వలసలంటే భయపడేవారు కూడా ధైర్యంగా అడుగేసి ఇటు వైపుగా కదులుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ అక్రమ వలసలు రెట్టింపయ్యాయి. 2022లో 42,600 మంది వలస వచ్చినట్లు రికార్డుల్లో నమోదు కాగా ఈ ఏడాది మాత్రం 92,000 మందికిపైగా వలస వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. Migrants rescued from rough seas off Italy. Reports say dozens could still be missing at sea, while more stranded migrants were airlifted from rocks on the island of Lampedusa. Read more: https://t.co/cJMUPoyyWL pic.twitter.com/lbXo28Rbrd — Sky News (@SkyNews) August 7, 2023 ఇది కూడా చదవండి: మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి.. -
భారత సైనికులకు ఇటలీ ఘన నివాళి
మిలన్: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలీకి విశేష సేవలందించి ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికులకు ఆ దేశసైన్యం ఘన నివాళులర్పించింది. ఇందులో భాగంగా ఆనాటి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు స్మారక స్థూపాలను నిర్మించి ఆవిష్కరించింది ఇటలీ మాంటోన్. ఈ కార్యక్రమానికి ఇటలీ భారత అంబాసిడర్ డా. నీనా మల్హోత్రా తోపాటు రక్షణశాఖ ప్రతినిధులు, ఇటలీ దళాల ప్రతినిధులు అక్కడి ప్రజలు పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఇటలీకి వెన్నుదన్నుగా నిలిచిన భారత సైనికులు ఆనాడు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా తమ విధులను నిర్వర్తించారు. సుమారు 50 వేల మంది ప్రాతినిధ్యం వహించిన 4,8,10వ డివిజన్ బెటాలియన్లతో కలిసి వీరంతా వీరోచితంగా పోరాడారు. ఆనాటి యుద్ధకాండలో 23,722 మంది భారత సైనికులు అసువులుబాశారు. వీరందరినీ ఇటలీ వ్యాప్తంగా కామన్ వెల్త్ యుద్ధ స్మశానవాటికల్లో సమాధి చేశారు. ఈ సందర్బంగా భారత సైన్యానికి చెందిన వి.సి. నాయక్ యశ్వంత్ గాడ్గేకు సన్ డయల్ స్మారక స్థూపాన్ని నిర్మించి ఇటలీ అత్యున్నత సైనిక పురస్కారం విక్టోరియా క్రాస్ బహూకరించారు. యశ్వంత్ గాడ్గే యుద్ధంలో ఎగువ టైబర్ లోయలో పోరాటం చేస్తూ వీరమరణం చెందారు. కార్యక్రమంలో మొత్తం 20 మందికి విక్టోరియా క్రాస్ పురస్కారాన్ని బహుకరించగా అందులో ఆరుగురు భారతీయ సైనికులే కావడం విశేషం. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి.. -
పట్టనట్టుండే రచయిత
ఆధునిక కాలంలో దాదాపు ఒక సన్యాసిగా బతికిన సుప్రసిద్ధ ‘ఫ్రెంచ్’ రచయిత మిలన్ కుందేరా జూలై 11న తన 94వ ఏట కన్నుమూశారు. ఒక దశ తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వడానికి నిరాకరించి, అధికారిక జీవిత చరిత్రలు రాయడానికి ఒప్పుకోక, జనానికి దూరంగా, తన గురించి వీలైనంత తక్కువ తెలిసేలా మసలుకున్నారు. రాతలోకి వచ్చినది మాత్రమే జీవితం; రచయిత వ్యక్తిగత జీవితం గురించిన కుతూహలం రచనల సమగ్రతను దెబ్బకొడుతుందనేది ఆయన భావన. కమ్యూనిస్టు రచయితగా మొదలైన కుందేరా, అనంతర కాలంలో ఆ భావజాలంతో పాటు తన మాతృదేశం చెకొస్లొవేకియాకూ, దాని పౌరసత్వానికీ, చివరకు తన మాతృభాష ‘చెక్’కూ దూరం కావాల్సి వచ్చింది. మొదట్లో చెక్ భాషలోనే రాసినప్పటికీ, మలి దశలో ఫ్రెంచ్‌లోనే రాయడానికి నిర్ణయించుకున్నారు. తనను ఫ్రెంచ్ రచయితగానే చూడాలనీ, తన రచనలను ఫ్రెంచ్ భాషవిగానే పరిగణించాలనీ కోరారు. 1929 ఏప్రిల్ 1న జన్మించిన మిలన్ కుందేరా యవ్వనోత్సాహంలో కమ్యూనిస్టు విప్లవాన్ని సమర్థించినవాడే. సోషలిస్టు రష్యాకు జైకొట్టినవాడే. 24వ యేట మొదటి సంపుటి సహా, విప్లవ సమర్థనగా మూడు కవితా సంపుటాలను వెలువరించినవాడే. విమర్శక గొంతులను నిరసిస్తూ, ఇంకా ఎవరినీ లోపలేసి తాళాలు వేయడం లేదు కదా అని వాదించినవాడే. కానీ పై అధికారిని విమర్శించినందుకు ఒకసారీ, పార్టీలో సంస్కరణలు జరగాలని కోరినందుకు మరోసారీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీనివల్ల తనకు విముక్తి లభించిన భావన కలిగిందని తర్వాత చెప్పారాయన. రాయాలనుకుంటున్న థీమ్స్ మీద పెట్టుకున్న మానసిక నిరోధం తొలగినట్టయి రచయితగా మరింత స్వేచ్ఛను పొందారు. ఆయన తొలి నవల ‘ద జోక్’(1967)లో వినోదానికి అనుమతి లేని సంతోషంలో ఉంటారు మనుషులు. ప్రేయసికి రాసిన లేఖలోని ఒక సరదా వాక్యాన్ని (ఆశావాదం అనేది మానవాళి నల్లమందు) కూడా ఓ త్రిసభ్య కమిటీ విచారిస్తుంది. ఈ కారణంగా కథానాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించే ఓటింగుకు ఆఖరికి కర్తవ్యోన్ముఖురాలైన అతడి ప్రేయసీ చెయ్యెత్తి సమ్మతిస్తుంది. పార్టీ నుంచి బహిష్కరణ వల్ల కుందేరా తన ప్రొఫెసర్ ఉద్యోగం పోగొట్టుకుని, పియానో వాయించే తండ్రి వారసత్వంగా వచ్చిన సంగీతాన్ని పాఠాలుగా చెబుతూ, దినసరి కూలీగా పనిచేస్తూ, మారుపేరుతో పత్రికలకు జాతక ఫలాలు రాస్తూ బతకాల్సి వచ్చింది. ఆయన ఫోన్ ను ట్యాప్ చేశారు. రచనలను నిషేధించారు. ఒక దశలో సీక్రెట్ పోలీసులు రాతప్రతుల కోసం ఆయన గదిని గాలించారు. అప్పుడే పూర్తయివున్న ‘లైఫ్ ఈజ్ ఎల్స్వేర్’(1973) నవల రాతప్రతిని దాని పేరుకు తగినట్టుగానే స్నేహితుల సాయంతో అప్పటికే ఫ్రాన్స్‌కు తరలించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన ఫ్రాన్స్‌కు వెళ్లిపోయారు. 1979లో చెక్ పౌరసత్వం రద్దయింది. 1981లో ఫ్రాన్స్ పౌరసత్వం పొందారు. (నలభై ఏళ్ల తర్వాత, 2019లో మాత్రమే చెక్ పౌరసత్వాన్ని పునరుద్ధరించారు. గొప్ప చెక్ రచయిత పునరాగమనానికి ప్రతీకగా చూస్తున్నామని చెబుతూ, ఆ చర్యను గొప్ప గౌరవంగా అభివర్ణించింది ప్రభుత్వం.) స్టాలినిస్టు కాని మనిషిని నేను సులభంగా గుర్తించగలిగేవాడిని; ఆయన నవ్వే విధానం నేను భయపడాల్సిన మనిషి కాదని చెప్పేది, అన్నారు కుందేరా. ఆయనకు అత్యంత ప్రసిద్ధి తెచ్చిపెట్టిన నవల ‘ది అన్ బేరబుల్ లైట్నెస్ ఆఫ్ బీయింగ్’ (1984)లో కథానాయిక తమ కుక్కపిల్లను ఒడిలోకి తీసుకుని జోకొడుతూ, ‘భయపడకు, భయపడకు, భయపడకు’ అని దాన్ని ఊరడిస్తుంది. ‘ద బుక్ ఆఫ్ లాఫ్టర్ అండ్ ఫర్గెటింగ్’(1979)లోని ‘అధికారానికి వ్యతిరేకంగా మనిషి చేసే పోరాటం, మరపునకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసే పోరాటం’ అనే వాక్యం చదివినప్పటినుంచీ తనతో ఉండిపోయిందనీ, ప్రపంచంలోని ఘటనల పట్ల తన అవగాహనను ప్రజ్జ్వరిల్లజేసిందనీ చెబుతారు సల్మాన్ రష్దీ. తన రచనా గదిలోని ఒక గోడకు తండ్రి ఫొటోనూ, తన అభిమాన సంగీత కారుడు లియోస్ యానాచెక్ ఫొటోనూ పక్కపక్కనే పెట్టుకున్న కుందేరా, నవల మాత్రమే సాధించేది సాధిస్తూనే అది ఒక మ్యూజికల్ నోట్లా ఉండాలనీ, నవలలోని అందరి కథనాలూ ఏకసూత్రతతో లయబద్ధంగా అమరాలనీ అంటారు. ఒక కామా కూడా ఉండాల్సిన చోట లేకపోతే నచ్చని పర్ఫెక్షనిస్టు ఆయన. చిత్రంగా ఆయన మొదటి నవల జోక్ ఆంగ్లంలో వచ్చినప్పుడు, తన నియంత్రణలో లేని అనువాదం కారణంగా అధ్యాయాలు తారుమారయ్యాయి. దీనివల్ల ‘ఐరనీ’ కాస్తా ‘సెటైర్’ అయ్యింది. 1992లో మాత్రమే ఆయనకు సంతృప్తి కలిగించే అనువాదం వచ్చింది. ఆంగ్లభాషలో ఇది ఐదో వెర్షన్ అని ఆయనే ముందుమాట రాస్తూ నవ్వుకున్నారు. అయితే నవలల పేర్ల విషయంలో మాత్రం ఆయనకు పట్టింపు లేదు. ఒక నవల పేరును ఇంకో నవలకు పెట్టినా సరిగ్గా సరిపోతుందంటారు. తనను పీడించే అంశాలు పరిమితమైనవనేది ఆయన ఉద్దేశం. 2015లో వచ్చిన ‘ద ఫెస్టివల్ ఆఫ్ ఇన్ సిగ్నిఫికెన్స్’ ఆయన చివరి నవల. మలి దశ రచనల్లో రాజకీయాల కంటే తత్వానికి ప్రాధాన్యం ఇచ్చిన కుందేరా, జీవితానికి రెండో అవకాశం లేకపోవడం కూడా ఒక విముక్తి లాంటిదేనంటారు. ప్రపంచ వ్యాప్తంగా జనాలు అర్థం చేసుకోవడం కంటే తీర్పులు ఇవ్వడానికే ఇష్టపడుతున్నారంటూ, ప్రపంచంలోని ఘటనలను మరీ అంత సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా ఒక ప్రతిఘటనే అని చెబుతారు. అన్నీ పట్టించుకుంటూనే ఏమీ పట్టనట్టుగా ఉండాలంటే చాలా సంయమనం కావాలి. -
మిలాన్ - 2022 : దూసుకొచ్చిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు.. నీటిలో పేలిన బాంబులు (ఫోటోలు)
-
మిలాన్.. విశాఖ చరిత్రలో మైలు రాయి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మొట్టమొదటి సారిగా విశాఖ సాగర తీరంలో మిలాన్–2022 నిర్వహణ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. తూర్పు నావికాదళంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖ చేరడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. విశాఖ సాగర తీరంలో 39 దేశాలతో కలసి భారత నావికాదళం, తూర్పు నావికాదళం నిర్వహించిన విన్యాసాలు.. దేశ సైన్యం పట్ల మరింత నమ్మకాన్ని, అభిమానాన్ని పెంచుతాయని చెప్పారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో మిలాన్–2022 వేడుకలను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. అంతకుముందు సీఎం దంపతులు డాక్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ విశాఖను జాతికి అంకితం చేశారు. కొత్తగా నావికాదళంలో చేరిన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని సందర్శించారు. అక్కడి నుంచి ఆర్కే బీచ్‌కు చేరుకుని.. మిలాన్ వేడుకల్లో భాగంగా సిటీ పరేడ్‌ను ప్రారంభించారు. దాదాపు గంటకుపైగా సాగిన సైనిక విన్యాసాలు, సిటీ పరేడ్‌ను సీఎం దంపతలు ఆసాంతం ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. సముద్రంలో కళ్లు మిరుమిట్లు గొలుపుతున్న లేజర్ షో విశాఖ ప్రజలకు గర్వకారణం ► వైజాగ్.. సిటీ ఆఫ్ డెస్టినీ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతం సంప్రదాయానికి ప్రతీక. విశాఖ చరిత్రలో ఇది మైలురాయి. ఇది అరుదైన యుద్ధ నౌకల విన్యాసాల పండగ. ఈ మిలాన్‌లో 39 దేశాలు పాల్గొనడం గర్వకారణం. ► పూర్తి స్వదేశీయంగా యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ విశాఖ’ను రూపొందించడం ఎంతో సంతోషం. ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక కొద్ది నెలల క్రితం నావికాదళంలో చేరింది. ఇది విశాఖ ప్రజలకు గర్వకారణం. పీ 15 బీ క్లాసెస్ గైడెడ్ మిసైల్ స్టెల్త్ డిస్ట్రాయర్ సాంకేతికతో పనిచేసే ఈ యుద్ధ నౌక తూర్పు నావికాదళంలోకి చేరడం ఎంతో గర్వకారణం. ► నౌక పై భాగంలో మన విశాఖపట్నంలో ప్రకృతి ప్రసాదంగా ఏర్పడిన డాల్ఫిన్ నోస్‌ని.. రాష్ట్ర మృగం కృష్ణ జింకని ప్రత్యేకంగా ముద్రించారు. ధన్యవాదాలు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి కూడా తూర్పు నావికాదళంలో చేరడంతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం ప్రారంభమైంది. యుద్ధ నౌకలు, నేవీ హెలికాప్టర్ల విన్యాసాలు ఈ స్నేహ బంధం కొనసాగాలి ► మిలాన్–2022 విన్యాసాలతో విశాఖ ప్రజలకు ఉత్సాహంతో పాటు.. దేశ రక్షణకు నిరంతరం పాటు పడుతున్న సైన్యం మీద గౌరవం, అభిమానం, నమ్మకం మరింత పెరుగుతుంది. ► మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ నేవీ సంయుక్త నిర్వహణలో మిలాన్ వేడుకలకు విశాఖ కేంద్రం కావడం ఆనందంగా ఉంది. ఇక్కడి ఆతిథ్యం మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ సంప్రదాయాన్ని కొనసాగిద్దాం. ► సిటీ పరేడ్‌లో పాల్గొన్న ఇండియన్ కోస్ట్‌గార్డ్, ఏపీ పోలీస్, ఫైర్ సర్వీస్ సీకేడెట్, ఎన్సీసీ, బ్యాండ్ ట్రూప్, కల్చరల్ ట్రూప్స్, స్నేహ పూర్వక దేశాల ప్రతినిధులకు ధన్యవాదాలు. ఇదే స్నేహ బంధం కొనసాగాలని కోరుకుంటున్నాను. ► భారత నౌకాదళానికి ప్రత్యేకంగా తూర్పు నావికాదళంతో పాటు అనేక దేశాల నుంచి వచ్చి ఈ విన్యాసాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా, ఈ వేడుకల్లో పాల్గొన్న అంబాసిడర్లు, అధికారులు, ఇతర దేశాల ప్రతినిధులకు ధన్యవాదాలు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) యుద్ధ నౌకలు, నేవీ హెలికాప్టర్ల విన్యాసాలు -
Milan 2022: శభాష్.. నావికా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆదివారం సాయంత్రం 5.30 గంటలు.. సుందర సంద్రం ఎదురుగా జనసంద్రం.. సాగరంలో అలల సవ్వడి సందడి చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా వేదికపైకి చేరుకున్నారు.. జనసంద్రంలో కేరింతలు.. అందరికీ సీఎం అభివాదం చేసి ఆశీనులయ్యారు.. ఆహ్లాదకర వాతావరణం మధ్య వీనుల విందుగా సంగీతం వినిపించింది.. కొద్ది నిమిషాల వ్యవధిలో పెద్ద పేలుడు.. సందర్శకులతో పాటు సాగరతీరం ఉలిక్కిపడింది.. ఒక్కసారిగా అలజడి రేగింది.. ఏం జరిగిందో అర్థం కాకముందే.. రయ్‌మంటూ డోర్నియర్ విమానాలు జనం పై నుంచి.. బంగాళాఖాతం వైపు దూసుకెళ్లి మాయమైపోయాయి.. ఎక్కడికి వెళ్లాయోనని ఆదుర్దాగా ఎదురు చూస్తుండగా.. మబ్బుల్ని చీల్చుకుంటూ వివిధ విన్యాసాలతో తిరిగి దూసుకొచ్చాయి.. ఈ షాక్ నుంచి సందర్శకులు తేరుకోకముందే ఆకాశంలో రంగు రంగుల పక్షుల్లా మెరైన్ కమాండోలు ప్యారాచూట్ల సాయంతో స్కై డైవింగ్ చేస్తూ జాతీయ పతాకాన్ని, భారత నావికాదళం జెండాను చేతబట్టుకుని నేలకు దిగారు.. వారికి సీఎం వైఎస్ జగన్ మెమోంటో అందజేశారు.. ఇంతలో.. మిగ్ 29 యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.. సాగరాన్ని చీల్చుకుంటూ యుద్ధ నౌకల విన్యాసాలు, నింగీ, నేల, నీరు ఏకం చేసేలా సాగిన హెలికాఫ్టర్లు, చేతక్‌ల కదన కవాతు ఒళ్లు గగుర్పొరిచేలా సాగింది.. దివిపై.. భువిపై నౌకాదళ సిబ్బంది.. శత్రు సైన్యంపై పోరుని తలపించేలా 25 నిమిషాల పాటు సాగిన ఎన్నో అద్భుత విన్యాసాలకు విశాఖ తీరం వేదికైంది.. విశాఖ వాసులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశాక నేవీ అధికారులతో సీఎం జగన్ విన్యాసాలు అద్భుతం గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి సీఎం జగన్ దంపతులకు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సతీసమేతంగా స్వాగతం పలికారు. ఆర్కే బీచ్ వద్ద మెరైన్ కమెండోలు 84 ఎంఎం రాకెట్ వాటర్ బాంబు పేల్చి సీఎంను స్వాగతించారు. 25 నిమిషాల పాటు వివిధ రకాల విన్యాసాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరు వేల అడుగుల ఎత్తులో పయనిస్తున్న డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్‌ల నుంచి పారాజంపింగ్ చేసిన స్కైడైవర్లు గాల్లో ప్యారాచూట్ల సహాయంతో విన్యాసాలు చేస్తూ వేదిక ప్రాంగణంలో చాకచక్యంగా దిగారు. అనంతరం వారు వేదికపైకి వచ్చి ముఖ్య అతిథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్మృతి చిహ్నాన్ని అందించారు. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించడం, గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో పయనించగల మిగ్ 29 విమానాలు పల్టీలు కొడుతూ బాంబుల వర్షం కురిపిస్తూ దూసుకుపోవడం, మార్కోస్‌ను సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా మరో చోటుకు తరలించడం వంటి సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఒడ్డున ఉన్న శత్రువులపై మోటారు బోట్లపై దూకుడుగా వచ్చి తుపాకులతో కాల్పు?లు జరపడం వంటివి ప్రత్యక్షంగా యుద్ధాన్ని చూసిన అనుభూతిని కలిగించాయి. నేవీ విజిటర్స్ బుక్‌లో సంతకం చేస్తున్న సీఎం ఈ విన్యాసాల్ని చూసేందుకు నౌకాదళాధికారులు, ప్రజా ప్రతినిధులు, సెయిలర్స్, నేవీ కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. అద్భుతమైన రీతిలో విన్యాసాలు చేశారని నౌకాదళ బృందాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. విన్యాసాలు చేస్తున్న వివిధ విభాగాల పనితీరు, సామర్థ్యం గురించి ముఖ్యమంత్రికి నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ వివరించారు. విన్యాసాలు ముగిసిన తర్వాత బంగాళాఖాతంలో లంగరు వేసిన యుద్ధ నౌకలు విద్యుత్ దీపాలంకరణలో ధగధగ మెరిసిపోతుండగా.. సాగిన లేజర్ షో చూపరులకు కనువిందు చేసింది. సిటీ పరేడ్ ముగింపు సందర్భంగా మిరుమిట్లు గొలిపేలా నౌకాదళం బాణసంచా కాల్చింది. వేలా జలాంతర్గామి నమూనాను పరిశీలిస్తున్న సీఎం దంపతులు హైలైట్‌గా నిలిచిన నవరత్నాల శకటం యుద్ధ విన్యాసాల అనంతరం ఆస్ట్రేలియా, అమెరికా, శ్రీలంక, వియత్నాం, బంగ్లాదేశ్, సీషెల్స్, మలేషియా, మయన్మార్ దేశాలకు చెందిన నౌకాదళం, రక్షణ శాఖ బృందాలు మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్నాయి. వీటికి తోడుగా.. రాష్ట్రానికి చెందిన బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు, నౌకాదళ బ్యాండ్ ప్రదర్శన, శకటాల ప్రదర్శన.. ఎన్సీసీ, సీ కేడెట్ కారŠప్స్ కవాతులు ఆద్యంతం అలరించాయి. గరగలు డ్యాన్స్, కూచిపూడి నృత్యం, థింసా నృత్యం, కొమ్ముకోయ, డప్పు నృత్యం, పులివేషం ప్రదర్శనలు, చెక్క భజన, అమ్మవారి వేషాలు, కోలాటం, తప్పెట గుళ్లు, బుట్టబొమ్మల జానపద నృత్య ప్రదర్శనలు అలరించాయి. ‘మిలాన్’లో భాగంగా విశాఖ తీరంలో బాంబుల వర్షం కురిపిస్తున్న యుద్ధ విమానాలు.. శకటాల ప్రదర్శనలో జాతీయ పక్షి నెమలి శకటం, విశాఖపట్నం స్మార్ట్ సిటీ శకటం ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలని ప్రతిబింబించేలా ప్రదర్శించిన శకటం సిటీ పరేడ్‌కు హైలైట్‌గా నిలిచింది. పరేడ్ ముగిసిన అనంతరం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు అందరికీ అభివాదం చేస్తూ.. బీచ్ రోడ్డు నుంచి రాత్రి 7.25 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి 8 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బీవీ సత్యవతి, జి.మాధవి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, పెట్ల ఉమాశంకర్ గణేష్, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి, చెట్టిఫాల్గుణ, వాసుపల్లి గణేష్, కలెక్టర్ మల్లికార్జున, సీపీ మనీశ్ కుమార్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. నౌకాదళ అధికారులు, సిబ్బందితో సీఎం జగన్ దంపతులు నౌకాదళ అధికారులు, సిబ్బందితో సీఎం మాటామంతి ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేసిన అనంతరం.. సతీమణి వైఎస్ భారతితో కలసి ఆద్యంతం పరిశీలించారు. భారత నౌకాదళ సంపత్తిని చూసి గర్వంగా ఫీలయ్యారు. యుద్ధ నౌకలో ఏ ఏ భాగాలు ఏ విధంగా ఉపయోగపడతాయన్న వివరాల్ని నౌకాదళాధికారులు సీఎం దంపతులకు వివరించారు. ఈ యుద్ధ నౌక పై నుంచే ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. విశాఖ యుద్ధ నౌక కెప్టెన్‌తో పాటు సెయిలర్స్‌తో సీఎం దంపతులు కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత అత్యాధునిక ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్ (జలాంతర్గామి)ను సందర్శించారు. దాని పనితీరును అధికారులు వారికి వివరించారు. సాహసోపేతంగా సముద్ర అంతర్భాగంలో ప్రయాణిస్తూ.. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సబ్‌మెరైన్ క్రూ కు వైఎస్ భారతి హ్యాట్సాఫ్ చెప్పారు. భారత నౌకాదళం హ్యాట్ ధరించిన వైఎస్ జగన్‌ను చూసి.. సతీమణి భారతి మురిసిపోయారు. ఆ తర్వాత ఐఎన్ఎస్ విశాఖపట్నం వార్ షిప్, ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్ సిబ్బంది, నౌకాదళ ప్రధానాధికారులతో షిప్ డెక్‌పై ముఖ్యమంత్రి దంపతులు గ్రూప్ ఫొటో దిగారు. సంప్రదాయం ప్రకారం.. నేవల్ విజిటర్స్ బుక్‌లో సీఎం వైఎస్ జగన్ దంపతులు సంతకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ జ్ఞాపిక అందించారు. నేవీ అధికారులు, సిబ్బందితో సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి యుద్ధ నౌకలు, నేవీ హెలికాప్టర్ల విన్యాసాలు -
ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్
-
వైజాగ్‌లోని మిలాన్ 2022 కవాతుకు హాజరైన సీఎం వైఎస్ జగన్ మరియు వైఎస్ భారతి
-
ఆర్కే బీచ్ లో మిలాన్ విన్యాసాలు తిలకించనున్న సీఎం వైఎస్ జగన్
-
విశాఖలో మిలాన్-2022 నిర్వహించడం గర్వకారణం: సీఎం జగన్
అప్డేట్స్: ► సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన ముగించుకుని సాయంత్రం 8 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరారు. ► ఐఎన్ఎస్ విశాఖపట్నం మీద డాల్ఫిన్ లైట్‌హౌస్, డాల్ఫిన్ నోస్, కృష్ణజింకను ముద్రించినందుకు సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ది సిటీ ఆఫ్ డెస్టినీ అని అన్నారు. ► సిటీ పరేడ్‌లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని సీఎం జగన్ తెలిపారు. ఇది అరుదైన వేడుక, విన్యాసాల పండగ అని అన్నారు. ఇటీవల తూర్పు నౌకాదళ స్థావరంలో ఐఎన్ఎస్ విశాఖ చేరిందని తెలిపారు. ఈ విన్యాసాల్లో పాల్గొన్న అందరికీ సీఎం జగన్ అభినందనలు తెలియజేశారు. ► మిలాన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. విశాఖపట్నంలో మిలాన్-2022 నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించదగ్గ రోజు అని అన్నారు. ► మిలాన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్‌లో నేవీ ఆధ్వర్యంలో పరేడ్ ప్రారంభమైంది. సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను ప్రదర్శించారు. సముద్రతీరంలో నావికా దళం అబ్బురపరిచే విన్యాసాలు: 6000 అడుగుల ఎత్తులో 6 మంది ఆకాశంలో త్రివర్ణ పతకంతో విన్యాసాలు చేశారు. యుద్ధ విమానాలు గర్జనల, నావికా సిబ్బంది యుద్ధ విన్యాసాలు, నావికదళ సిబ్బంది రీస్క్యు ఆపరేషన్, ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే సాహసాలు, యుద్ద విమానాలు చక్కర్లు, సముద్రంలో బాంబుల మోతా, ఆపదలో ఉన్నవారిని కాపాడే సాహసం, సముద్రం తీరంలో వాహనాలతో శత్రువులపై ఛేజింగ్, మిషన్ గన్స్‌తో శత్రువులను వెంటాడే విధానం, శత్రువులు వెన్నులో వణుకు పుట్టించె విధంగా ధైర్యసాహసాల ప్రదర్శన, మిత్ర దేశాలతో పరస్పరం సహకరించుకొనే విధంగా విన్యాసాలు, యుద్ద నౌకల నుంచి గురి తప్పని టార్గెట్, సముద్ర తీరంలో హెలికాప్టర్ల గస్తీ విన్యాసాలును ప్రదర్శించారు. ► ఆర్కే బీచ్‌లో నేవీ ఆధ్వర్యంలో సాయంత్రం పరేడ్ జరగనుంది. మిలాన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. గంటన్నరపాటు జరిగే సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్ వీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో 39 దేశాల ప్రతినిధులు, 13 దేశాల యుద్ధనౌకల సిబ్బంది పాల్గొంటారు. ► ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ► నేవల్ డాక్‌యార్డ్‌లో ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని సీఎం వైఎస్ జగన్ సందర్శించారు. ► విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ దంపతులు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు తూర్పు నావికా దళం గౌరవ వందనం చేసింది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సాక్షి, విశాఖపట్నం: అలలతో పోటీపడుతూ భారత నావికా దళ సామర్థ్యాల్ని ప్రదర్శించే వేడుకకు విశాఖ నగరం సిద్ధమైంది. అంతర్జాతీయ విన్యాసాల వేదిక మిలాన్–2022లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను బీచ్ రోడ్డులో ఘనంగా నిర్వహించేందుకు నౌకాదళం, జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లుచేశాయి. కార్యనిర్వాహక రాజధాని నగరం పేరుతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సిటీ పరేడ్‌ను ప్రారంభించనున్నారు. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్‌లో ఇండియన్ నేవీ సహా 39 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో ముఖ్యఘట్టమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరగనుంది. వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించనున్నాయి. ఈ యుద్ధవిన్యాసాల సంరంభాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విశాఖలో నౌకల పండుగ.. ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): అలలతో పోటీపడుతూ భారత నావికా దళ సామర్థ్యాల్ని ప్రదర్శించే వేడుకకు విశాఖ నగరం సిద్ధమైంది. అంతర్జాతీయ విన్యాసాల వేదిక మిలాన్–2022లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను బీచ్ రోడ్డులో ఘనంగా నిర్వహించేందుకు నౌకాదళం, జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లుచేశాయి. కార్యనిర్వాహక రాజధాని నగరం పేరుతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సిటీ పరేడ్‌ను ప్రారంభించనున్నారు. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్‌లో ఇండియన్ నేవీ సహా 39 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో ముఖ్యఘట్టమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఆదివారం జరగనుంది. వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తాయి. ఈ యుద్ధవిన్యాసాల సంరంభాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఇలా.. బీచ్ రోడ్డులో కోలాహలంగా జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ని ప్రారంభించేందుకు సీఎం వైఎస్ జగన్ విశాఖ నగరానికి ఆదివారం రానున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మ. 2.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేవల్ డాక్ యార్డ్‌కి చేరుకుంటారు. 3.10 గంటలకు ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేస్తారు. అనంతరం నౌకాదళ సిబ్బందితో కలిసి దానిని పరిశీలిస్తారు. సా.4.10 గంటలకు నేవీ అధికారులతో గ్రూపు ఫొటో దిగుతారు. 4.20 నుంచి 4.40 వరకు ఇటీవలే నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని సందర్శిస్తారు. అనంతరం ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో బస చేస్తారు. సా.5.30 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకుని మిలాన్ విన్యాసాలను తిలకిస్తారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. 6.04 గంటలకు సిటీపరేడ్‌ను ప్రారంభించి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ దేశాల నౌకాదళ రక్షణ సిబ్బంది నిర్వహించే మార్చ్ పరేడ్‌ను తిలకిస్తారు. సా.6.50కు విమానాశ్రయానికి చేరుకుంటారు. 7.15 గంటలకు ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి గన్నవరం బయలుదేరుతారు. సాగర తీరంలో విద్యుత్ కాంతులతో నౌకలు ప్రత్యేక ఆకర్షణగా యుద్ధ విన్యాసాలు ఇక భారతీయ నావికాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన్షనల్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యుద్ధనౌకల అత్యంత వేగవంతమైన విన్యాసాలు, మెరైన్ కమాండోల బహుముఖ కార్యకలాపాలు, యుద్ధ విమానాల ఫ్లైపాస్ట్ విన్యాసాలు వీక్షకుల్ని ఆకట్టుకోనున్నాయి. ఇలా వివిధ రకాల విమానాలు, వైమానిక శక్తి ప్రదర్శనలు ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబించనున్నాయి. ఘనంగా మిలాన్–2022 ప్రారంభం నౌకా యానంలో భారత్‌కు ఐదువేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, పశ్చిమ తీరం ద్వారా 80 దేశాలతో వర్తకం సాగిస్తున్నామని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్ అన్నారు. ఆయన శనివారం విశాఖలో మిలాన్–2022ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1995లో భారత్‌తో పాటు నాలుగు దేశాలతో మొదలైన మిలాన్ ఇప్పుడు 39 దేశాలకు విస్తరించటం అభినందనీయమన్నారు. మిలాన్ ద్వారా మారిటైం రంగంలో అక్రమ ఆయుధ రవాణా, టెర్రరిజం, సముద్ర దొంగలు, స్మగర్లకు అడ్డుకట్ట వేయటంపై చర్చించుకునేందుకు వేదిక కానుందన్నారు. ప్రపంచ అంతా ఒక కుటుంబం అనే నినాదంతో ఒకరికొకరం సహాయం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మిలాన్ లోగో, స్పెషల్ కవర్‌ను అజయ్‌భట్ ఆవిష్కరించారు. ఇక్కడ మిలాన్–22 నిర్వహించటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత భారీ ఎత్తులో కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో అంధ్రప్రదేశ్ రాష్ట్రం సహకారం ఆమోఘమని ఆయన కొనియాడారు. అనంతరం వివిధ రకాల స్టాల్స్‌తో కూడిన మిలాన్ విలేజ్‌ను ఆయన ప్రారంభించారు. -
మిలన్... యుద్ధ నౌకల సమాహారం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మహానగరం మరో అంతర్జాతీయ విన్యాసాలకు సిద్ధమైంది. 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించి సత్తా చాటిన మహా నగరం.. ఈ నెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూని ఘనంగా నిర్వహించింది. నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రతిష్టాత్మకమైన మిలన్–2022 అంతర్జాతీయ విన్యాసాలకు ముస్తాబైంది. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలన్ కోసం ఇండియన్ నేవీ 46 దేశాలను ఆహ్వానించగా, 39 దేశాలు పాల్గొంటున్నాయి. శుక్రవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 27న బీచ్‌రోడ్డులో నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 11వ మిలన్కు విశాఖ ఆతిథ్యం రెండేళ్లకోసారి నిర్వహించే మిలన్ విన్యాసాలు 1995లో ప్రారంభమయ్యాయి. తొలిసారి విన్యాసాల్లో భారత్‌తో పాటు ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ మాత్రమే పాల్గొన్నాయి. 2005లో సునామీ కారణంగా మిలన్‌ను రద్దు చేశారు. 2001, 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కారణంగా మిలన్ విన్యాసాలు జరగలేదు. 2010 వరకు 8 దేశాలు పాల్గొన్నాయి. 2012లో ఏకంగా 16 దేశాలు పాల్గొన్నాయి. 2014, 2018లో జరిగిన విన్యాసాల్లో 17 దేశాలు పాల్గొన్నాయి. ఇప్పటి వరకూ 10 సార్లు మిలన్ విన్యాసాలు జరిగాయి. 11వ మిలన్కు విశాఖ ఆతిథ్యమిస్తోంది. మిలన్‌ను మినీ ఐఎఫ్ఆర్గా పిలుస్తారు. కానీ.. ఈసారి జరిగే మిలన్ – 2022లో ఐఎఫ్ఆర్కు దీటుగా 39 దేశాలు పాల్గొనడం విశేషం. రెండు దశల్లో విన్యాసాలు మిలన్లో పాల్గొనేందుకు ఇప్పటికే 10 దేశాలకు చెందిన అధికారులు, యుద్ధ నౌకలు విశాఖ చేరుకున్నాయి. శుక్రవారం మిగిలిన దేశాల ప్రతినిధులు హాజరవుతారని నౌకా దళాధికారులు వెల్లడించారు. ఈ విన్యాసాలు రెండు దశల్లో జరుగుతాయి. 25 నుంచి 28 వరకు హార్బర్ ఫేజ్‌లో, మార్చి 1 నుంచి 4 వ తేదీ వరకూ సీఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. 26వ తేదీన మిలన్ విలేజ్ ప్రారంభిస్తారు. 27న బీచ్ రోడ్డులో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా క్రీడా పోటీలు, విదేశీ సందర్శకుల కోసం ఆగ్రా, బోధ్గయకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. 28న సముద్ర జలాల వినియోగం, భద్రతలో సామూహిక సహకారం అనే అంశంపై వివిధ దేశాల ప్రతినిధులతో సదస్సు నిర్వహిస్తారు. మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు సముద్ర జలాల్లో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతో విన్యాసాలు జరుగుతాయి. సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా.. మిలన్లో కీలకమైనది 27న జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ దేశాల నౌకాదళ అధికారులు సహా మొత్తం 5 వేల మంది అతిథులు హాజరవుతారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర జరిగే పరేడ్‌ని తిలకించేందుకు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మిలన్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, సీనియర్ బ్యూరోక్రాట్లు, వివిధ దేశాలకు చెందిన 150 మంది ఉన్నతాధికారులు హాజరవుతారని భావిస్తున్నారు. ఇందు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 5 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. ఇతర జిల్లాల నుంచి సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పోలీస్‌ను రప్పిస్తున్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ వంటి తీవ్రవాద నిరోధక దళాలతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, మార్కోస్ వంటి కేంద్ర భద్రతా దళాలతో కూడిన సుమారు 3,500 మందిని నగరంలో మోహరించనున్నారు. అణువణువూ అండర్ కంట్రోల్! సిటీ పరేడ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అణువణువూ పోలీసుల పర్యవేక్షణలో ఉండనుంది. విన్యాసాలు తిలకించేందుకు అతిథుల కోసం 10 ఎన్క్లోజర్లు, సాధారణ ప్రజలు వీక్షించేందుకు 32 ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్డులోని ఈవెంట్ ప్రాంతంలోకి ప్రజలను అనుమతించడానికి దాదాపు 16 మార్గాలు ఖరారు చేశారు. ప్రజలు విన్యాసాల్ని స్పష్టంగా తిలకించేందుకు బీచ్ రోడ్లో, ఎన్క్లోజర్ల వద్ద భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీ మార్గంలో, బీచ్ రోడ్లో 400 సీసీ కెమెరాలు అమర్చనున్నారు. 18 క్విక్ రియాక్షన్ టీమ్‌లు శాంతి భద్రతల్ని పర్యవేక్షించనున్నాయి. వీరితో పాటు 400కి పైగా అత్యంత శక్తివంతమైన బాంబు నిర్వీర్య బృందాలు, 25 స్నిఫర్ డాగ్‌లతో 450 మంది సాయుధ పోలీసులను ఆ ప్రాంతంలో మోహరించనున్నారు. మిలన్ అంటే.. హిందీలో సమావేశం అని అర్థం. వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరచుకోవడంతో పాటు శత్రు సైన్యానికి బలం, బలగం గురించి నిత్యం తెలియజేసేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. మిలన్ బహుపాక్షిక విన్యాసాలకు భారత నౌకాదళం సారధ్యం వహించనుంది. ఈ ఏడాది ‘స్నేహం–సమన్వయం–సహకారం’ థీమ్‌తో ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నౌకాదళం ప్రకటించింది. -
కడలిలో కదన రంగం
సాక్షి, విశాఖపట్నం: నీలి కెరటాలలో నౌకా దళ యుద్ధ విన్యాసాలకు విశాఖ తీరం సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే ప్రధాన ఘట్టాలకు విశాఖలోని తూర్పు నౌకాదళం ఆతిథ్యమిస్తోంది. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్), వివిధ దేశాల నౌకా దళాల యుద్ధ విన్యాసాలతో మిలాన్ – 2022కి ఏర్పాట్లు చేసింది. ఈ రెండు ప్రతిష్టాత్మక విన్యాసాల కోసం నౌకాదళం చేస్తున్న రిహార్సల్స్‌తో విశాఖ సాగర తీరం సందడిగా కనిపిస్తోంది. మిలాన్–2022, ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూల వివరాల్ని నౌకాదళం గురువారం విడుదల చేసింది. ఈ నెల 21న పీఎఫ్ఆర్ జరగనుంది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి, త్రివిధ దళాధిపతికి వందనం సమర్పించడంతో పాటు భారత నౌకాదళ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పనుంది. అనంతరం.. 25 నుంచి మార్చి 4 వ తేదీ వరకు మిలాన్–2022 పేరుతో అంతర్జాతీయ విన్యాసాలు నిర్వహిస్తోంది. 60 యుద్ధ నౌకలు.. 55 యుద్ధ విమానాలు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్‌కి చెందిన 60 యుద్ధ నౌకల్లో 10 వేల మంది సిబ్బందిని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమీక్షిస్తారు. రాష్ట్రపతి కోసం ఐఎన్ఎస్ సుమిత్ర ప్రెసిడెంట్ యాచ్‌గా రూపుదిద్దుకుంది. ఆ నౌక నుంచి రాష్ట్రపతి విశాఖ తీరంలో లంగరు వేసిన 44 యుద్ధ నౌకల్ని పరిశీలిస్తారు. అనంతరం నౌకాదళానికి చెందిన 55 యుద్ధ విమానాలు గగనతల విన్యాసాలు చేస్తాయి. సబ్‌మెరైన్ – షిప్ ఫార్మేషన్ స్టీమ్ పాస్ట్, ఎలైట్ మెరైన్ కమాండోస్ ద్వారా వాటర్ పారా జంప్‌లు, సముద్రంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రదర్శన, హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఏరోబాటిక్స్తో పాటు ప్రఖ్యాత ఐఎన్ఎస్వీ మహాదేయ్ సహా బోట్ల కవాతు అలరించనున్నాయి. సమీక్ష అనంతరం ఫ్లీట్ రివ్యూకి సంబంధించిన పోస్టల్ కవర్, స్మారక తపాలా బిళ్లని రాష్ట్రపతి విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దేవుసింహ్ జె చౌహాన్ కూడా పాల్గొంటారు. 45 దేశాలతో మిలాన్–2022 రికార్డు ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న మిలాన్–2022లో 45కి పైగా దేశాలు పాల్గొంటాయని నౌకాదళం వెల్లడించింది. ఇప్పటివరకూ 17 దేశాలు పాల్గొన్న అతి పెద్ద మిలాన్ రికార్డుని తిరగ రాస్తున్నట్లు తెలిపింది. మిలాన్–22లో 15 కంటే ఎక్కువ విదేశీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి. 11 మంది విదేశీ నౌకాదళాలు, కోస్ట్ గార్డ్ల చీఫ్‌లు, 120 కంటే ఎక్కువ మంది విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – హిందూ ఓషన్ రీజియన్ (ఐఎఫ్సీఐఓఆర్) నివేదిక ప్రకారం వివిధ దేశాల నుంచి 30 కంటే ఎక్కువ మంది డిఫెన్స్, నేవల్ అధికారులు, 2000కు పైగా విదేశీ నౌకాదళ సిబ్బంది విదేశీ యుద్ధ నౌకలు, విమానాలలో బయలుదేరినట్లు సమాచారం. 27న జరిగే ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లో 35 బృందాలతో విన్యాసాలు, అంతర్జాతీయ సిబ్బంది ఫ్లైపాస్ట్ జరుగుతాయి. సిటీ పరేడ్‌ను నాలుగు లక్షలకు పైగా ప్రజలు తిలకిస్తారని అంచనా వేస్తున్నట్లు నౌకాదళం వెల్లడించింది. -
మిలాన్ మెరుపులు..46 దేశాలకు ఆహ్వానం!
సాక్షి, విశాఖపట్నం:మరోసారి అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలిచేందుకు విశాఖ మహానగరం సన్నద్ధమవుతోంది. 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించి.. సత్తా చాటిన మహా నగరం.. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ప్రతిష్టాత్మకమైన మిలాన్ విన్యాసాలకు ఆహ్వానం పలుకుతోంది. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్ కోసం భారీ ఏర్పాట్లు చేసేందుకు ఇండియన్ నేవీ ఏడాది కాలంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే భారత నౌకాదళం 46 దేశాలకు ఆహ్వానం పంపగా.. 30 దేశాలు పాల్గొంటున్నట్లు ఇప్పటికే అంగీకారం తెలిపాయి. మిలాన్ అంటే.. హిందీలో సమావేశం అని అర్థం. 2018 అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన ఈ విన్యాసాల్లో 17 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి అంతకు మించి భారీ ఏర్పాట్లకు ఈఎన్సీ సమాయత్తమవుతోంది. వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరుచుకోవడంతో పాటు శత్రుసైన్యానికి బలం, బలగం గురించి నిత్యం తెలియజేసేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. మార్చిలో జరగనున్న మిలాన్ బహుపాక్షిక విన్యాసాలకు భారత నౌకాదళం సారధ్యం వహించనుంది. వాస్తవానికి 2020 మార్చి 19 నుంచి 27 వరకూ మిలాన్ విన్యాసాలు జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. 2021 మార్చిలో నిర్వహించాలని భావించినా కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో మరోమారు వాయిదా వేశారు. ఇప్పటివరకు 11 మిలాన్‌లు 1995లో మిలాన్ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. తొలిసారి జరిగిన విన్యాసాల్లో భారత్‌తో పాటు ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2005లో సునామీ రావడం వల్ల మిలాన్ విన్యాసాలు రద్దు కాగా, 2001, 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు నిర్వహించడం వల్ల జరగలేదు. 2010 వరకూ 8 దేశాలు మాత్రమే పాల్గొనగా.. 2012లో జరిగిన విన్యాసాల్లో దేశాల సంఖ్య రెట్టింపై ఏకంగా 16 దేశాలు పాల్గొన్నాయి. 2014లో 17 దేశాలు పాల్గొని అతి పెద్ద ఫ్లీట్ రివ్యూగా చరితకెక్కింది. 2018లో అండమాన్ నికోబార్ కమాండ్‌లో జరిగిన విన్యాసాల్లో ఏకంగా 17 దేశాలు పాల్గొన్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ 10 సార్లు మిలాన్ విన్యాసాలు జరిగాయి. అతి పెద్ద మిలాన్‌గా రికార్డుకు అవకాశం మిలాన్–2022 విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత నౌకాదళం దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు ఆహ్వానాలు అందించింది. భారత్‌తో పాటు యూఎస్ఏ, రష్యా, జపాన్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఫ్రాన్స్, ఈజిప్ట్, శ్రీలంక, వియత్నాం, మోజాంబిక్, సూడాన్, ఇజ్రాయిల్, ఖతర్, థాయ్‌లాండ్, మలేషియా, సోమాలియా, కెన్యా, మయన్మార్, న్యూజిలాండ్, టాంజానియా, కొమరోస్, మాల్దీవులు, బ్రూనే, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, ఒమన్, కాంబోడియా, దక్షిణ కొరియా, కువైట్, ఇరాన్, మడగాస్కర్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, యూఏఈ, జిబౌటీ, ఎరిత్రియా, మారిషస్, సీషెల్స్ మొదలైన దేశాలకు భారత నౌకాదళానికి చెందిన ప్రతినిధులు ఆహ్వానాలు అందించారు. ఇందులో ఇప్పటికే 30 దేశాలు తాము పాల్గొంటున్నట్లు అంగీకారం తెలిపాయి. మిగిలిన దేశాలూ వచ్చే అవకాశాలున్నాయి. 30 దేశాలు రానున్న నేపథ్యంలో అతి పెద్ద మిలాన్‌కు వేదికగా విశాఖ రికార్డు సృష్టించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పలుమార్లు ప్రణాళిక సమావేశాల్ని నిర్వహించారు. తొలి సమావేశంలో 17 దేశాలకు చెందిన 29 మంది నౌకాదళ కీలకాధికారులు పాల్గొనగా.. తాజాగా విశాఖలోని వివిధ ప్రభుత్వ అధికారులతో తూర్పునౌకాదళం సమీక్ష నిర్వహించింది. ఏర్పాట్లు విషయంపై సుదీర్ఘంగా చర్చించింది. రెండు ఫేజ్‌లలో.. మిలాన్–2022 విన్యాసాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. సీ ఫేజ్, హార్బర్ ఫేజ్‌లలో రెండు ఫేజ్‌లలో విన్యాసాలు నిర్వహించనున్నారు. చరిత్రాత్మకమైన ఈవెంట్ విజయవంతం చేసేందుకు విశాఖ ప్రజలంతా కృషి చెయ్యాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలోనే తేదీలు ఖరారు చేయనున్నట్లు నౌకాదళాధికారులు చెబుతున్నారు. -
సరికొత్త లుక్‌తో యమహా ఎమ్టీ 10, ఎమ్టీ 10 ఎస్పీ బైక్స్..!
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం యమహా మోటార్స్ మిలాన్‌లో జరుగుతున్న ఇక్మాషో (EICMA)లో యమహా ఎమ్టీ 10, ఎమ్టీ 10 ఎస్పీ బైక్‌లను ఆవిష్కరించింది. రివైజ్డ్ స్టైలింగ్‌తో ఈ బైక్స్ రానున్నాయి. ఈ బైక్ యూరో 5 స్పెసిఫికేషన్ మోటార్‌తో అధిక పవర్‌ను కలిగి ఉంటుంది. మెరుగైన ఎలక్ట్రానిక్స్ ప్యాకేజ్‌తో సిక్స్-యాక్సిస్ ఐఎంయూను కలిగి ఉంది. చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ 650 లిమిటెడ్ ఎడిషన్ ..! ఈ బుల్లెట్ బండ్లను చూస్తే ఫిదా అవాల్సిందే..! ఎంటీ 10 ఎస్పీ కూడా లేటెస్ట్ ఫీచర్లతో రానుంది.మునుపటి మోడల్ కంటే అధికంగా 5బీహెచ్పీ శక్తిని అందించనుంది. ఈ బైక్‌ల పీక్ పవర్ 162బీహెచ్పీకు చేరనుంది. వీటిలో అదనంగా సిక్స్-యాక్సిస్ ఐఎమ్‌యూ పొందుతుంది. బ్రేకింగ్ వ్యవస్థలో సరికొత్త రేడియల్ బ్రెంబో మాస్టర్ సిలిండర్‌ను అమర్చారు. డ్యూయల్ 320ఎమ్ఎమ్ డిస్క్‌లతో జత చేయబడింది. ఎమ్టీ 10లో అప్‌గ్రేడ్‌గా యమహా ఎమ్టీ 10 ఎస్పీ రానుంది. దీనిలో సెమీ-యాక్టివ్ సస్పెన్షన్, త్రీ-పీస్ బెల్లీ పాన్ , స్టీల్డ్ బ్రేక్ లైన్లను అమర్చారు. యమహా ఎంటీ 10 బైక్ ధర సుమారు రూ. 14 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి: మార్కెట్లోకి షియోమీ ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేది అప్పుడే..? -
ఎత్తైన బిల్డింగ్.. ఎగిసిపడుతున్న జ్వాలలు
భారీ అగ్నిప్రమాదంతో సుందర నగరం ఉలిక్కిపడింది. నగరంలోని ఎత్తైన భవంతిలో.. ఒక్కసారిగా మంటలు రాజుకోవడంతో దట్టమైన పొగలు కమ్ముకుని భీతావహ వాతావరణం నెలకొంది. ఇటలీ మిలన్లో ఇరవై అంతస్థుల భవంతిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు అరవై మీటర్ల ఎత్తైన ఈ భవనంలో మంటలను ఆర్పేందుకు సిబ్బంది శాయశక్తుల కృషి చేస్తున్నారు. మిలన్లో సుందరమైన భవనంగా పేరున్న ఈ బిల్డింగ్.. ప్రమాదం ప్రభావంతో మసిబట్టి పోయింది.