థాయ్ అందాలు | Thai beauties | Sakshi
Sakshi News home page

థాయ్ అందాలు

Published Thu, May 15 2014 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM

థాయ్ అందాలు

థాయ్ అందాలు

భరత్ భూషణ్, మిలన్, రీతు, చాఛా కటుదీప్ (బ్యాంకాక్) ముఖ్య తారలుగా టి. చలపతి నిర్మిస్తున్న చిత్రం ‘బూమ్ బూమ్’. నగేష్ నారదాశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇది రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ప్రధానంగా యువతను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కథానుసారం 80 శాతం విదేశాల్లో చిత్రీకరిస్తున్నాం. థాయ్‌లాండ్‌లోని అందమైన ప్రాంతాల్లో ఈ షూటింగ్ చేశాం. రెండో షెడ్యూల్‌ని ఈ నెలాఖరుకు పూర్తి చేసి, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement