nagesh naradasi
-
హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్న అప్సర రాణి
నగేష్ నారదాసి దర్శకత్వంలో అప్సర రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న తలకోన సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి గుర్తుందా శీతాకాలం నిర్మాత రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 'తలకోన' చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ... 'చాలా సినిమాలతో నేను మీకు సుపరిచితమే.. ఇప్పుడు ఈ 'తలకోన' చిత్రంతో మరోసారి మీ ముందుకు వస్తున్నా. క్రైమ్ థ్రిల్లర్‌తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉండబోతోంది. ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు మరో కోణం కూడా ఉంటుందని ఈ సినిమాలో తెలియజేస్తాం. అలాగే పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపిస్తాం. అంతే కాకుండా ప్రకృతిలో ఏమేం జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేశాం. మెయిన్ కథాంశం అయితే తలకోన ఫారెస్ట్‌లోకి కొంతమంది స్నేహితులు వెళ్తారు. ఎంత మంది వెళ్లారు? ఎంతమంది తిరిగొచ్చారు? అనేదే ప్రధానాంశంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిస్తున్నాము. తలకోన చిత్రాన్ని 20రోజులు హైదరాబాద్‌లో, మరో 20 రోజులు తలకోనలో రెగ్యులర్ షూట్ చేయనున్నాము' అని తెలిపారు. హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ... 'మంచి స్క్రిప్ట్స్‌కు నేను ఫ్యాన్‌ను. తలకోన చిత్రం చేయడానికి అదే కారణం అయ్యింది. మొదటి నుంచి కూడా మంచి స్క్రిప్ట్ ఉన్న కథలనే ఎంచుకుంటున్నాను. అవి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే ఈ చిత్రం కూడా విజయంతో పాటు మంచి పేరు ఇస్తుందని ఆశిస్తున్నా' అన్నారు. చదవండి: ఇప్పుడసలైన మజా, ఆదిరెడ్డి వర్సెస్ గీతూ గేమ్ స్టార్ట్ -
డబ్బే జీవితం కాదు
‘‘కథకి నగేష్ ఇచ్చే ప్రాధాన్యం గురించి అందరూ చెప్పారు. ‘దేశ దిమ్మరి’ సినిమా తీసేందుకు ముందుకు వచ్చిన నిర్మాతకు అభినందనలు. ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. ఈ సినిమా హిట్ అయి, విజయ పరంపర కొనసాగాలి’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. తనీష్, షరీన్ జంటగా నగేష్ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేశ దిమ్మరి’. స్వతంత్ర గోయల్ (శావి యుఎస్ఎ) నిర్మించారు. ఈ చిత్రంలో తనీష్ పాడిన ‘హే పైసా..’ సాంగ్‌ని విడుదల చేశారు. డైరెక్టర్ నగేష్ మాట్లాడుతూ– ‘‘పంజాబ్, హర్యానాలో ఈ చిత్రం షూటింగ్ చేశాం. కొండలు ఎక్కడం, దిగడం చాలా కష్టం. నేను ఈ సినిమా కోసం అందర్నీ చాలా ఇబ్బంది పెట్టాను. ముఖ్యంగా తనీష్‌ని, కెమెరామెన్స్‌ని’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నేను చాలెంజింగ్ రోల్ చేశా’’ అన్నారు సుమన్. ‘‘ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి’’ అని గోయల్ అన్నారు . ‘‘పనీపాటా లేకుండా దేశం మొత్తం తిరుగుతుండే ఓ కుర్రాడి చుట్టూ తిరిగే సినిమా ఇది. డబ్బు అనేది కేవలం అవసరం.. అదే జీవితం కాదనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు తనీష్. సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, పాటల రచయిత పార్వతి చంద్, ఫైట్‌మాస్టర్ అంజి, కెమెరామెన్ మల్లికార్జున నారగాని తదితరులు పాల్గొన్నారు. -
‘కాలా’ కెమెరాతో...
తనీష్, షిరీన్ జంటగా నగేష్ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేశ దిమ్మరి’. సవీణ క్రియేషన్స్ బ్యానర్‌పై స్వతంత్ర గోయల్ (శావి యుఎస్ఎ) నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. నాగేష్ నారదాసి మాట్లాడుతూ– ‘‘సరికొత్త కథాంశంతో రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, సిమ్లా వంటి అందమైన ప్రదేశాల్లో షూటింగ్ చేశాం. సుభాష్ ఆనంద్ సంగీతం, ప్రదీష్ ఆంటోని కొరియోగ్రఫీ హైలైట్‌గా ఉంటాయి. రజనీకాంత్ ‘కాలా’ సినిమాని చిత్రీకరించిన హిలీనీయం 8ఆర్ లేటెస్ట్ వెర్షన్ కెమెరాతో మా చిత్రాన్ని తెరకెక్కించాం. ‘హే పైసా...’ అంటూ డబ్బుపై వచ్చే ఓ సెటైరికల్ సాంగ్‌ని తనీష్ పాడారు’’ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు స్వతంత్ర గోయల్. -
సింగర్‌గా మారిన మరో యంగ్ హీరో
బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన తనీష్ తరువాత హీరోగానూ కొన్ని సినిమాల్లో కనిపించాడు. అయితే కథానాయకుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు రాకపోవటంతో ఇటీవల నక్షత్రం సినిమాతో విలన్‌గా మారాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా తనీష్‌కు సక్సెస్ ఇవ్వలేదు. ప్రస్తుతం దేశ దిమ్మరి అనే సినిమాలో నటిస్తున్నాడు తనీష్. ఇప్పటికే హీరో నుంచి విలన్ గా మారిన తనీష్ ఈ సినిమాతో సింగర్ గా మారుతున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నగేష్ నారదాసి దర్శకుడు. నవీన క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
మరో విదేశీ తార...
తెలుగు తెరపై అడపా దడపా విదేశీ తారలు కనిపిస్తుంటారు. తాజాగా థాయ్ చిత్రం ‘ఇన్ ది వన్’, రష్యన్ చిత్రాలు ‘ఐస్‌ల్యాండ్ ఆఫ్ ది లక్’, ‘అల్ట్రా’ తదితర చిత్రాల్లో నటించిన హాలీవుడ్ నటి చాచా పతుమ్తిప్ ‘బూమ్ బూమ్’ ద్వారా కథానాయికగా పరిచయం అవుతున్నారు. భరత్ భూషణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో రీతూ మరో నాయిక. నగేష్ నారదాశి దర్శకత్వంలో టి. చలపతి నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ త్వరలో జరగనుంది. ‘‘స్వార్థప్రయోజనాల కోసం మనుషులు ఎలా మారిపోతున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందించాం’’ అని నిర్మాత చెప్పారు. -
బూమ్ బూమ్ మూవీ స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్
-
నగేష్ నారదాసి 'బూమ్ బూమ్' స్టిల్స్
-
థాయ్ అందాలు
భరత్ భూషణ్, మిలన్, రీతు, చాఛా కటుదీప్ (బ్యాంకాక్) ముఖ్య తారలుగా టి. చలపతి నిర్మిస్తున్న చిత్రం ‘బూమ్ బూమ్’. నగేష్ నారదాశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్. ప్రధానంగా యువతను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కథానుసారం 80 శాతం విదేశాల్లో చిత్రీకరిస్తున్నాం. థాయ్‌లాండ్‌లోని అందమైన ప్రాంతాల్లో ఈ షూటింగ్ చేశాం. రెండో షెడ్యూల్‌ని ఈ నెలాఖరుకు పూర్తి చేసి, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.