
కోవిడ్–19 నుంచి ఇప్పుడిప్పుడే గుండె చిక్కబట్టుకుంటున్న ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొన్ని వెలుగులు, మెరుపులు మొదలయ్యాయి. వాటిలో భాగంగా ఇటలీలో ఈ బుధవారం జరిగిన మిలన్ ఫ్యాషన్ వీక్ 2021లో డేనియల్ డెల్ కోర్ మెన్– ఉమన్ కోసం తీసిన న్యూ బ్రాండ్ కలెక్షన్‌ను ప్రదర్శించారు. సామాజిక దూరం పాటిస్తూ కేవలం 40 మంది ఆహుతులతో నేలమాలిగలో మొదలైన ఈ రన్ వే కొత్తదనాన్ని కొత్తగా కళ్లకు కట్టింది.
లగ్జరీయస్ బ్రాండ్‌కు పెట్టింది పేరుగా నిలిచిన గూచీ మాజీ విఐపీ డిజైనర్ డేనియల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘0 నుంచి మొదలుపెట్టిన నా డిజైన్స్ పూర్తిగా ప్రకృతిపై ప్రేమతో నిండి ఉన్నవే’ అంటాడు. స్ట్రాపీ టాప్స్, మినీ స్కర్ట్స్, సూట్ జాకెట్, రెడీ టు వేర్‌కి పెట్టింది పేరుగా రన్‌వే లో నిలిచాయి డెల్‌కోర్ డిజైన్స్. ఉన్ని, బ్రొకేడ్, ఆర్గంజా మేటీరియల్‌తో డిజైన్ చేసినవిగా ఈ సందర్భంగా తెలిపాడు 32 ఏళ్ల ఈ డిజైనర్.
Comments
Please login to add a commentAdd a comment