షకీరాకు పాఠాలు నేర్పుతున్న పుత్రరత్నం | Shakira learns to 'simplify' | Sakshi
Sakshi News home page

షకీరాకు పాఠాలు నేర్పుతున్న పుత్రరత్నం

Published Thu, Mar 6 2014 10:39 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

పాప్ స్టార్ షకీరా

పాప్ స్టార్ షకీరా

పాప్ స్టార్ షకీరా తన తళుకుబెళుకులతో ఊగిపోతూ కుర్రకారుల నుంచి వృద్ధుల వరకు తన పాటలతో ఊరుతలూగిస్తుంది. ఆ 37 ఏళ్ల అమ్మడు తన పుత్ర రత్నం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్లు తెలిపింది. తన 15 నెలల కుమారుడు మిలన్ పిక్ మెబారక్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు వెల్లడించింది. మిలాన్ను చూసి తనతో పాటు తన భర్త గ్రిరార్డ్ పిక్ తమ పనులు తామే చేసుకుంటున్నట్లు చెప్పింది. ఖాళీ సమయంలో అధిక భాగం తన కుమారుడితో కలసి ఉండేందుకు తాము ఇష్టపడుతున్నట్లు షకీరా ఆమె భర్త ఈ మేరకు వెల్లడించారని గురువారం కాంటాక్ట్మ్యూజిక్ తెలిపింది.


పాప్ స్టార్ షకీరా తన ప్రియుడు గెరార్డ్ పిక్‍‌‌తో జత కట్టి జనవరి 22, 2013న మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన ఈ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు కలిసి వచ్చేలా ‘మిలన్ పిక్ మెబారక్' అని నామకరణం చేసారు. షకీరాకు 60 మిలియన్ల మంది  ఫేస్ బుక్ అభిమానులు ఉన్నారు. ఆ పాప్ స్టార్ స్పానిష్ దేశపు ఫుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement