![Anant Ambani Radhika Cruise Party Shakira Perform with Whopping Fee](/styles/webp/s3/article_images/2024/05/28/AnantandRadhikaprewedding_Shakira.jpg.webp?itok=XEQ0pz6G)
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్‌ను జూలై 12, 2024న వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో స్టార్-స్టడెడ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు. ఇపుడిక రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం. బిలియనీర్ స్టేటస్‌కి తగ్గట్టుగా ఈసారి ఇటలీలో క్రూయిజ్ షిప్‌లో నిర్వహిస్తుండటం విశేషం.
నాలుగు రోజుల ఈవెంట్‌ల గురించిన వివరాలతో నిండిన రెండవ ప్రీ-వెడ్డింగ్ ఇన్విటేషన్, ప్లాన్, ఫోటోలు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. తాజాగా మరో వార్త హల్‌చల్ చేస్తోంది.
పాపులర్ పాప్ సింగర్, పాటల రచయిత షకీరా అనంత్ రాధిక క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఈవెంట్ కోసం రూ.10-15 కోట్లు చార్జ్ చేయనుందని తెలుస్తోంది.
కాగా ఇటలీలో మే 29 నుండి జూన్ 1, 2024 వరకు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. వెల్కం డిన్నర్, మే 30, 2024న 'రోమన్ హాలిడే' , 'లా డోల్స్ ఫార్ నియెంటె', 'టోగా పార్టీ'. ఆ తర్వాత, మే 31, 2024న ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా కుమార్తె, వేద తొలి ఏడాది పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. కొన్నిఇప్పటికే సల్మాన్‌ఖాన్, అలియా, రణబీర్‌దంపతులు, రణ్‌వీర్ సింగ్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యామిలీ ఇటలీకి పయనమైన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలతోపాటు, పలువురు ప్రముఖులు దాదాపు 800మంది పాల్గొనే అవకాశం ఉంది. అయితే జామ్‌నగర్ ఈవెంట్ కోసం రూ.1259 కోట్లు, కేవలం కేటరింగ్‌కే ఏకంగా రూ. 210 కోట్లు ఖర్చు చేసిన అంబానీ కుటుంబం ఈ సారి ఎంత వెచ్చిస్తోంది అనే చర్చ జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment