Shakira show
-
Anant - Radhika Cruise Party : షకీరా ఆట పాట, ఫీజు తెలిస్తే ఫ్యూజులెగిరిపోతాయ్!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్‌ను జూలై 12, 2024న వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో స్టార్-స్టడెడ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు. ఇపుడిక రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం. బిలియనీర్ స్టేటస్‌కి తగ్గట్టుగా ఈసారి ఇటలీలో క్రూయిజ్ షిప్లో నిర్వహిస్తుండటం విశేషం.నాలుగు రోజుల ఈవెంట్ల గురించిన వివరాలతో నిండిన రెండవ ప్రీ-వెడ్డింగ్ ఇన్విటేషన్, ప్లాన్, ఫోటోలు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. పాపులర్ పాప్ సింగర్, పాటల రచయిత షకీరా అనంత్ రాధిక క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఈవెంట్ కోసం రూ.10-15 కోట్లు చార్జ్ చేయనుందని తెలుస్తోంది.కాగా ఇటలీలో మే 29 నుండి జూన్ 1, 2024 వరకు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ల రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. వెల్కం డిన్నర్, మే 30, 2024న 'రోమన్ హాలిడే' , 'లా డోల్స్ ఫార్ నియెంటె', 'టోగా పార్టీ'. ఆ తర్వాత, మే 31, 2024న ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా కుమార్తె, వేద తొలి ఏడాది పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. కొన్నిఇప్పటికే సల్మాన్‌ఖాన్, అలియా, రణబీర్‌దంపతులు, రణ్వీర్ సింగ్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యామిలీ ఇటలీకి పయనమైన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలతోపాటు, పలువురు ప్రముఖులు దాదాపు 800మంది పాల్గొనే అవకాశం ఉంది. అయితే జామ్‌నగర్ ఈవెంట్ కోసం రూ.1259 కోట్లు, కేవలం కేటరింగ్‌కే ఏకంగా రూ. 210 కోట్లు ఖర్చు చేసిన అంబానీ కుటుంబం ఈ సారి ఎంత వెచ్చిస్తోంది అనే చర్చ జోరుగా సాగుతోంది. -
జైలుశిక్ష తగ్గించేందుకు రూ.6 కోట్ల ఒప్పందం చేసుకున్న పాప్‌సింగర్
పాప్ స్టార్ షకీరా పన్ను ఎగవేతపై నమోదైన కేసు విచారణలో భాగంగా స్పెయిన్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దానివల్ల తన జైలు శిక్ష తగ్గించుకున్నట్లు తెలిసింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. 2012-2014 మధ్య కాలంలో స్పెయిన్ ప్రభుత్వానికి రూ.131 కోట్లు పన్ను చెల్లించలేదని షకీరాపై ఆరోపణలు వచ్చాయి. దాంతో ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన తర్వాత షకీరాకు 8 ఏళ్ల 2 నెలలు జైలు శిక్షతోపాటు రూ.216 కోట్లు జరిమానా విధించారు. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. సోమవారం జరిగిన కోర్టు విచారణలో భాగంగా అధికారులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. స్పానిష్ ప్రభుత్వానికి పన్ను చెల్లించడంలో విఫలం అయినట్లు ఆమె ఒప్పుకున్నారు. మూడేళ్లు జైలు శిక్ష, రూ.6.3 కోట్లు జరిమానా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. షకీరా కఠిన నిర్ణయం తీసుకున్నారని, తన కెరియర్, పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఈ ఒప్పందం చేసుకున్నారని ఆమె తరఫు వాదించిన న్యాయవాద సంస్థ మిరియం కంపెనీ తెలిపింది. ఆమె తరఫు వాదించేలా అన్ని అంశాలను సిద్ధం చేశామని, కానీ తను అమాయకత్వం వల్ల అధికారులతో ఈ ఒప్పందం చేసుకున్నారని తెలిపింది. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ 2012-2014 వరకు తను బహమాస్‌లో నివాసం ఉన్నట్లు, పన్ను ప్రయోజనాల కోసం తనను స్పానిష్ నివాసిగా పరిగణించకూడదని షకీరా అభ్యర్థించినట్లు తెలిసింది. కానీ స్పానిష్ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. షకీరా 2012లో 242 రోజులు, 2013లో 212 రోజులు, 2014లో 243 రోజులు స్పెయిన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్పెయిన్ చట్టంలోని నియమాల ప్రకారం 183 రోజుల కంటే ఎక్కువ కాలం దేశంలో గడిపిన వ్యక్తులు తమ ఆదాయాలను ప్రకటించి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. షకీరా చాలాకాలం స్పెయిన్‌లో నివసించిందని, తన ఆదాయాలను దాచిపెట్టడానికి ప్రయత్నించినట్లు అధికారులు చెప్పారు.