pop star
-
లైపోసక్షన్ వికటించి స్టార్ సింగర్ కన్నుమూత, విషాదంలో ఫ్యాన్స్
బ్రెజిలియన్ పాప్ స్టార్ డానీ లీ (42) మరణించిన ఘటన విషాదాన్ని నింపింది. లైపోసక్షన్ మెట్రో కథనం రిపోర్ట్ ప్రకారం బ్రెజిల్లో గాయనిగా పాపులర్ అయిన లీ బాడీలోని కొన్ని భాగాల్లో కొవ్వును తొలగించుకునేందకు ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆపరేషన్ తరువాత సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రలో కన్నుమూసింది. ఇది ఊహించని పరిణామమంటూ ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అటు తమ అభిమాన స్టార్ సింగర్ ఆకస్మిక మరణంపై ఫ్యాన్స్ కూడా దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. బ్రెజిల్‌లోని పిన్హైస్లో నిర్వహించిన బొడ్డు, వీపుపై లైపోసక్షన్‌తో పాటు రొమ్ములను తగ్గించుకునేందు కూడా ఆపరేషన్ చేయించుకుంది. అయితే పరిస్థితి విషమించడంతో సమీపంలోని మీపంలోని కురిటిబాలోని ఒక ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది. లీకి భర్త, ఏడేళ్ల కుమార్తె ఉంది. గాయని మృతిపై విచారణ జరుగుతోందని మెట్రో నివేదించింది. అమెజాన్‌లోని అఫువా అనే ద్వీపంలో పుట్టిన లీ సింగర్అయ్యేందుకు చిన్నతనం నుంచీ కృషి చేసింది. 2014లో విడుదలైన ఆమె 'యూ సౌ డా అమెజోనియా' (ఐ యామ్ ఫ్రమ్ ది అమెజాన్) అనే పాటతో గాయనిగా ఆమె ప్రసిద్ధి చెందింది. అయిదేళ్ల వయసునుంచే పాడటం ప్రారంభించిన ఆమె టాలెంట్ షోలతో పేరు తెచ్చుకుంది. ఆ తరువాత సింగింగ్ కరియర్ కోసం 17 సంవత్సరాల వయస్సులో మకాపాకు వెళ్లింది. 'వెమ్ మీ డైజర్', 'ప్రా వోస్ ఫికార్ కోమిగో' 'కైక్' తదితర పాటలో స్టార్ సింగర్‌గా ఎదిగింది. ఆమె చివరి పాట ‘గుయెర్రా డి అమోర్' జనవరి 14న విడుదలైంది.డాని లి, అసలు పేరు, డానియెల్ ఫోన్సెకా మచాడో. View this post on Instagram A post shared by Dani Li (@danili.dl) -
పాప్ స్టార్ బీబర్ స్పెషల్ స్కూటర్.. ధర రూ. 6.45 లక్షలు!
ముంబై: వెస్పా స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ తాజాగా జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్ ధర రూ. 6.45 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్). కెనడాకు చెందిన పాప్ స్టార్ జస్టిన్ బీబర్ పేరిట ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్‌ను (పది లోపే) ప్రీ–ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇవి పూర్తిగా అసెంబుల్ చేసిన యూనిట్‌గా దిగుమతి అవుతాయి. 150 సీసీ ఇంజిన్‌తో ఈ లిమిటెడ్ ఎడిషన్ ఉంటుందని పియాజియో వెహికల్స్ సీఎండీ డీగో గ్రాఫీ తెలిపారు. జస్టిన్ బీబర్ రూపొందించిన కొత్త వెస్పా వైట్ కలర్ ఆప్షన్లో మోనోక్రోమ్ స్టైల్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులోని శాడిల్, గ్రిప్స్, రిమ్స్ స్పోక్స్ వంటి ఎలిమెంట్స్ అన్నీ వైట్‌లోనే ఉన్నాయి. బ్రాండ్ లోగో, వెహికల్ బాడీపై ఫ్లేమ్స్ కూడా టోన్-ఆన్-టోన్ తెలుపు రంగులో ఉంటాయి. -
శ్రేయరాగ రాక్‌స్టార్
ఎక్కడి ఒడిశా? ఎక్కడి కొరియా? అయితే కలలు కనేవారికి దూరభారాలు ఉండవు. పట్టుదలతో దూరాలను కరిగించేస్తారు. కలలను నిజం చేసుకుంటారు. ఒడిశాలోని రూర్కెలాకు చెందిన శ్రేయా లెంక ఈ కోవకు చెందిన ప్రతిభాశాలి.... ఇండియా ఫస్ట్ కె–పాప్ ఐడల్‌గా శ్రేయా లెంక చరిత్ర సృష్టించింది. పన్నెండు సంవత్సరాల వయసులో డ్యాన్సర్‌గా శ్రేయ కళాప్రస్థానం మొదలైంది. ఎప్పుడూ పెద్ద కలలే కనేది. ఒక ఫ్రెండ్ ద్వారా శ్రేయకు ‘కె–పాప్’ పరిచయం అయింది. వారి మ్యూజిక్ వీడియోలు తనను బాగా ఆకట్టుకున్నాయి. ‘వీళ్లు ఆర్టిస్టులా? మెరుపు తీగలా?’ అనిపించింది. వారి యూనిక్ స్టైల్, సింగింగ్, డ్యాన్సింగ్ తనకు తెగ నచ్చేశాయి. ఏదో ఒకరోజు వారిలో కలిసి, వారిలో ఒకరిగా కలిసి పనిచేయాలనుకుంది. ‘అది అసాధ్యం’ అని ఎవరు అన్నా సరే శ్రేయ వెనక్కి తగ్గలేదు. ఆమె కల నెరవేరడానికి ఎంతో కాలం పట్టలేదు. ప్రపంచంలోని వందలాది మందితో పోటీ పడి గెలిచింది. ‘కె–పాప్’ మెంబర్‌గా తన కలను నెరవేర్చుకుంది. దేశం కాని దేశం... సౌత్ కొరియాలోకి అడుగు పెట్టినప్పుడు శ్రేయా లెంకాకు అక్కడి ఆహారం, జీవనవిధానం, భాష...అన్నీ కొత్తగా అనిపించాయి. తాను ఇల్లు విడిచి అంత దూరం వెళ్లడం అదే తొలిసారి. కొత్త విషయాలను ఉత్సాహంగా నేర్చుకుంది. కొత్త జీవనవిధానానికి ఆనందంగా అలవాటు పడింది. చుట్టు పక్కల వాళ్లు కూడా ఎంతో ప్రోత్సాహకంగా ఉండేవాళ్లు. ఇండియాలో అయితే రాత్రి పదిలోపు భోజనం చేసేది. కొరియాలో మాత్రం సాయంత్రం 6–7 మధ్య భోజనం చేస్తారు. మొదట్లో కష్టం అనిపించినా ఆ పద్ధతికి మెల్లగా అలవాటు పడింది. తనలాగే ‘కె–పాప్ ఐడల్’ కావాలనుకునే ఔత్సాహికులకు శ్రేయా లెంకా ఇచ్చే సలహా... ‘మీ కలలను నెరవేర్చుకోవడం విషయంలో రాజీ పడవద్దు. వందసార్లు అపజయం పాలైనా సరే, ఆవగింజంత ఆత్మవిశ్వాసం కూడా కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్లు తప్పకుండా ఒకరోజు గెలుస్తారు’ -
ప్రతిభ ఉంటే ప్రపంచంలో ఏ మూలన ఉన్నా పాపులర్ కావొచ్చని నిరూపిస్తోంది శిర్లే సెటియా
-
Social Star: పైజమా పాప్‌స్టార్ శిర్లే సెటియా.. ఆర్జే నుంచి సింగర్‌గా..
ప్రతిభ ఉంటే ప్రపంచంలో ఏ మూలన ఉన్నా పాపులర్ కావొచ్చని నిరూపిస్తోంది శిర్లే సెటియా. ఇండియాలో పుట్టినప్పటికీ పెరిగింది, చదువుకుంది అంతా ఆక్లాండ్‌లోనే. అయినా భారత సినిమా పాటలను ఆలపిస్తూ లక్షలాది శ్రోతల్ని తన స్వరంతో అలరిస్తోంది. ఇండో–కివీస్ నటిగానేగాక, డ్యాన్సర్‌గా, రేడియో జాకీగా, గాయనిగా, యూ ట్యూబర్ గా రాణిస్తోంది. షోటైమ్ విత్ శిర్లే.. హరియాణాకు చెందిన రాజ్, ఫిరోజా సెటియా దంపతుల ముద్దుల కూతురు శిర్లే సెటియా. శిర్లే ఇండియాలోనే పుట్టినప్పటికీ.. రాజ్ సెటియా వ్యాపార రీత్యా ఆక్లాండ్‌లో స్థిరపడడంతో....శిర్లే ఆక్లాండ్‌లోనే అడుగు వేయడం నేర్చుకుంది. తనకి షానే సెటియా అనే తమ్ముడు ఉన్నాడు. స్కూలులో చురుకైన విద్యార్థిగా పేరున్న శిర్లే చిన్నప్పుడు వ్యోమగామి కావాలని కలలు కనేది. కానీ స్కూలు విద్య పూర్తయ్యాక మార్కెటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో బీకామ్ చేసింది. డిగ్రీ అయ్యాక ఆక్లాండ్‌లో హిందీ కంటెంట్‌ను ప్రసారం చేసే రేడియో టరానాలో పార్ట్‌టైమ్ ఉద్యోగం లో చేరి పాపులర్ షో ‘షోటైమ్ విత్ శిర్లే’కు ఆర్జేగా పనిచేసింది. ఆర్జే నుంచి సింగర్‌గా.. తన గాత్రం మెరుగుపడ్డాక..2012లో శిర్లే సెటియా పేరుతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. తను అప్లోడ్ చేసే పాటలకు మంచి స్పందన వచ్చేది. చిన్నప్పటి నుంచి న్యూజిలాండ్‌లో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఇద్దరూ హిందీలో మాట్లాడడం వల్ల భారతీయ సినిమా పాటలపై శిర్లేకు అవగాహన ఉంది. చిన్నప్పటి నుంచి బాలీవుడ్ పాటలు వింటూ పెరగడంతో.. భారతీయ సంగీతంపై పట్టు ఏర్పడింది. దాంతో బాలీవుడ్ సినిమా పాటలు పాడి వాటిని తన చానల్లో అప్లోడ్ చేసేది. ఏడాది తరువాత టీ సీరిస్ ఏర్పాటు చేసిన యూ ట్యూబ్ కాంపిటీషన్లో పాల్గొంది. ఆషికీ –2లో అర్జిత్ సింగ్ పాడిన ‘‘హమ్ తేరే బిన్ అబ్ రహనహి సక్తే’’ కవర్ సాంగ్ వీడియోను రికార్డు చేసి తన చానల్లో అప్లోడ్ చేసింది. ఈ పాట బాగా వైరల్ అవడంతో టీ సీరిస్ పోటీలో విజేతగా నిలిచి, అధిక సంఖ్యలో వ్యూస్‌ను సంపాదించుకుంది. పైజమా పాప్‌స్టార్.. పాపులారిటీ తెచ్చిన హమ్ తేరే పాట వీడియో రూపొందించేటప్పుడు శిర్లే.. పైజమా ఉన్న డ్రెస్ ధరించి పాడింది. ఆ పాటతో బాగా పాపులర్ అవడంతో.. న్యూజిలాండ్ హెరాల్డ్ ‘పైజమా పాప్‌స్టార్’గా శిర్లేను వర్ణించింది. అప్పటినుంచి శిర్లే పైజమా స్టార్‌గా పాపులర్ అయ్యింది. దాంతో సబ్‌స్కైబ్రర్స్ సంఖ్య కూడా బాగా పెరిగింది. కోయ్ వి నహీ... రవిసింఘాల్తో కలిసి 2016లో తన తొలి కొయ్ షోర్ పాటను విడుదల చేసింది. మరుసటి ఏడాది బాలీవుడ్ సినిమా ‘ఏ జెంటిల్మెన్’లో ‘‘డిస్కో డిస్కో’’ పాడింది. ఈ పాటకు 54 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇదే ఏడాది తన సొంత పాటలు పాడాలని నిర్ణయించుకుని టీమ్‌తో కలిసి పంజాబీ ట్రాక్ ‘కోయ్ వి నహీ’ సాంగ్‌ను విడుదల చేసింది. ఇది యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొట్టింది. అలా యూఎస్, యూకే, ఇండియా, కెనడాలలోని యూ ట్యూబ్ ఆరి్టస్టులతో కలిసి పాటలు పాడేది. పంజాబీ పాపులర్ సింగర్ గుర్నజర్తో కలిసి ఆమె విడుదల చేసిన ‘కోయ్ వీ నహీ’ పాటకు యూ ట్యూబ్‌లో180 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనితోపాటు జబ్ కోయి బాత్, తు జో మిలా, బోల్ డో నా జరా, కుచ్ నా కహో, బారీష్ కవర్ సాంగ్‌లకు గుర్తింపు వచ్చింది. ‘మస్కా’ ‘నిక్ నేమ్’ వంటి సినిమాల్లో శిర్లే నటించినప్పటికీ గాయనిగానే తనకి మంచి గుర్తింపు వచ్చింది. అంతేగాక బాలీవుడ్ నెక్ట్స్ బిగ్ సింగింగ్ సెన్సేషన్‌గా ఫోర్బ్స్ మ్యాగజీన్ గుర్తించడం, మ్యూజిక్ సెన్సేషన్ ఇన్ సోషల్ మీడియా, న్యూజిలాండ్ సోషల్ మీడియా అవార్డులలో ‘బెస్ట్ ఇన్ మ్యూజిక్ అవార్డు, లాయిడ్ అండ్ అవుట్‌లుక్ ఇండియా సోషల్ మీడియా అవార్డులను అందుకుంది. ప్రస్తుతం శిర్లే యూ ట్యూబ్ చానల్‌కు దాదాపు నలభైలక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండగా, ఇన్స్టాగామ్ ఫాలోవర్స్ డెబ్భై లక్షలకు పైగా ఉన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Vajrasana Benefits: మానసిక ఒత్తిడి, వెన్నునొప్పి, ఎసిడిటీ నివారణకు.. యోగా మంత్రమిదే! -
పాకిస్తాన్ వల్లే తాలిబన్లు ఇలా.. భారత్ మా ఫ్రెండ్: పాప్ స్టార్
న్యూఢిల్లీ: తమ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడం వెనుక పొరుగు దేశమైన పాకిస్తాన్ హస్తం ఉందని అఫ్గనిస్తాన్ పాప్‌స్టార్ అర్యానా సయీద్ ఆరోపించారు. అఫ్గన్ ప్రభుత్వం తాలిబన్లపై చర్యలకు ఉపక్రమించిన ప్రతిసారీ, పాక్ ఏదో ఒక విధంగా జోక్యం చేసుకునేదన్నారు. భారత్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమని, అఫ్గనీయులకు ఎంతో సహాయం చేసిందని ధన్యవాదాలు తెలిపారు. శరణార్థులను అక్కున చేర్చుకున్న భారత్.. తమ దేశానికి నిజమైన స్నేహితుడు అని కృతజ్ఞతాభావం చాటుకున్నారు. అఫ్గనిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన నేపథ్యంలో అర్యానా దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. శాంతి స్థాపనకై కృషి చేయండి ఈ క్రమంలో ఏఎన్ఐతో మాట్లాడిన ఆమె... తమ దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై తమ వంతు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ తాలిబన్లను ఎలా ప్రోత్సహిస్తుందో పలు వీడియోల ద్వారా మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. పాక్‌లోనే తాలిబన్లు శిక్షణ పొందుతున్నారు. అలాంటి ఎన్నో సాక్ష్యాలను చూసిన తర్వాతే నేను పాకిస్తాన్‌ను నిందిస్తున్నాను. ఇప్పటికైనా వారి తీరు మారాలి. అఫ్గనిస్తాన్ రాజకీయాల్లో, అంతర్గత విషయాల్లో పాక్ జోక్యం చేసుకోవడం మానేయాలి’’ అని అర్యానా చురకలు అంటించారు. ఇండియా మా ట్రూ ఫ్రెండ్ ఇక భారత్ గురించి చెబుతూ.. ‘‘ఇండియా మాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటుంది. మా దేశ ప్రజలు.. ముఖ్యంగా శరణార్థుల పట్ల దయా హృదయం కలిగి ఉండటం గొప్ప విషయం. ఇండియాలో ఉన్న అఫ్గనిస్తాన్ ప్రజలు ఆ దేశం, అక్కడి మనుషుల గురించి ఎంతో గొప్పగా మాట్లాడేవారు. ఇండియాకు మేం ఎప్పటికీ కృతజ్ఞులుగానే ఉంటాం. అఫ్గన్ ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు చెబుతున్నా. పొరుగుదేశాల్లో మాకున్న నిజమైన స్నేహితుడు ఇండియా మాత్రమే. ఇది నిజంగా నిజం’’ అని అర్యానా ఉద్వేగంగా మాట్లాడారు. కాగా 2015లో తాలిబన్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో గల ఓ స్టేడియంలో పాట పాడటం ద్వారా అర్యానా కట్టుబాట్లను తెంచి ధైర్యసాహసాలు కలిగిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక అఫ్గన్ స్త్రీ, అందునా హిజాబ్ ధరించకుండా స్టేడియంలో ప్రవేశించడం అప్పట్లో సంచలనంగా సృష్టించింది. చదవండి: Afghanistan: నా సోదరిని దారుణంగా చంపేశారు: గోపాల్ బెనర్జీ #WATCH | "...I blame Pakistan. Over the yrs, we've seen videos & evidence that Pak is behind empowering Taliban. Every time our govt would catch a Talib, they'd see identification & it'd be a Pakistani, it's very obvious that it's them," says Afghan pop star Aryana Sayeed to ANI pic.twitter.com/eIBAGXvaCP — ANI (@ANI) August 24, 2021 -
డ్రగ్స్ ఇచ్చి నాపై అత్యాచారం చేశారు..
లండన్: పాప్ స్టార్ డఫ్ఫీ.. యునైటెడ్ కింగ్డమ్ సామ్రాజ్యానికి పరిచయం అక్కర్లేని పేరు. తన అద్భుత గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్రిటీష్ గాయని కొంతకాలంగా ఉనికిలో లేకుండా పోయింది. దీంతో ఆమె అభిమానులు డఫ్ఫీ ఎక్కడ? ఏమైంది? ఎందుకు కనిపించడం లేదు? అని గొంతెత్తి అరిచినా లాభం లేకపోయింది. కానీ ఓ జర్నలిస్టు ఆమె కోసం అన్వేషణ ప్రారంభించి, ఆచూకీ కనుగొన్నాడు. తీరా ఆమెను పలకరించగా గాయనికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని ద్రవించిపోయాడు. ఆమెకు ఎంతగానో ధైర్యం చెప్పడంతో తిరిగి పదేళ్ల తర్వాత డఫ్ఫీ అభిమానులతో మనసు విప్పి మాట్లాడింది. తన గతం గురించి చెప్తూనే వర్తమానం, భవిష్యత్తు గురించి కలలు కంటోంది. ‘ఇది మీకు చెప్పడానికి ఎన్నిసార్లు నాలో నేనే మథనపడ్డానో మీరు ఊహించలేరు. కానీ ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నాను. నేను కనిపించకపోయేసరికి నాకేం జరిగింది? ఎక్కడికి వెళ్లిపోయాను అని అభిమానులు కంగారుపడిపోయారు. నిజానికి నాకు మాదకద్రవ్యాలు ఇచ్చి అత్యాచారం చేశారు. అలా కొద్ది రోజులపాటు నన్ను నిర్భందించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాను. కానీ నాకు జరిగిన ఈ ఘోరం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇంతకు మించి నేను చెప్పలేను’ అంటూ డఫ్ఫీ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ‘నా మనసు ముక్కలైన తర్వాత గుండె లోతుల్లోంచి పాట ఎలా పాడగలను అని నన్ను నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నాను. అప్పుడు నా బాధ ప్రపంచానికి వినబడుతుందేమోనని ఆపివేశాను. కానీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. మళ్లీ నా మనసులోకి వెలుతురు వస్తోంది. దీనికోసం దశాబ్ధకాలంగా ఎదురు చూశాను. నేడు అది జరుగుతుందనిపిస్తుంది. నాపై చూపించిన మీ ప్రేమకు సర్వదా కృతజ్ఞురాలిని’ అని పేర్కొంది. దీనిపై ఆమె అభిమానులు స్పందిస్తూ డఫ్ఫీకి మద్దతుగా నిలబడుతున్నారు. కాగా ఆమె రూపొందించిన రాక్ఫెర్రీ ఆల్బమ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇది మూడుసార్లు బ్రిట్ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఒక గ్రామీ అవార్డును సైతం సొంతం చేసుకుంది. 2008లో విడుదలైన ఈ ఆల్బమ్ ఆ ఏడాది అత్యధికంగా అమ్ముడుపోయి రికార్డుకెక్కింది. -
జాక్సన్ జీవిత కథ
‘కింగ్ ఆఫ్ పాప్’ అంటారు పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌ను. పాప్ ప్రపంచంలో మైఖేల్ జాక్సన్ ఓ సంచలనం. డ్యాన్స్ చేయడంలో ఓ బెంచ్ మార్క్. జాక్సన్ జీవితంలో కేవలం సంగీతం, డ్యాన్స్ మాత్రమే కాదు ఎన్నో మిస్టరీలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ స్క్రీన్ మీదకు బయోపిక్‌గా తీసుకురావాలని చాలా మంది హాలీవుడ్ దర్శక–నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ మైఖేల్ జాక్సన్ ఫ్యామిలీకి చెందిన వాళ్లు లీగల్‌గా పెట్టే షరతులను దాటలేకపోయారు. తాజాగా హాలీవుడ్ నిర్మాత గ్రహమ్ కింగ్.. మైఖేల్ జాక్సన్‌పై సినిమా తీసే హక్కులను దక్కించుకున్నారు. గత ఏడాది ‘బొహేమియన్ రాప్సోడి’ చిత్రాన్ని నిర్మించారు గ్రహమ్ కింగ్. అది సంగీత కళాకారుడు ఫ్రెడ్డీ మెర్కూరీ బయోపిక్ కావడం విశేషం. నాలుగు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది ఈ సినిమా. జాక్సన్ సినిమా విషయానికి వస్తే.. ‘గ్లాడియేటర్, హ్యూగో, ద ఏవియేటర్’ వంటి సినిమాలకు కథను అందించిన జాన్ లోగాన్ ఈ చిత్రానికి కథను సమకూరుస్తారు. ప్రస్తుతం మైఖేల్ జాక్సన్ పాత్రను పోషించే నటుడి ఎంపిక జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. -
పాప్ స్టార్ రిహానాతో క్రిస్ గేల్!
-
అట్టహాసంగా ఫిఫా ప్రారంభ వేడుకలు
మాస్కో: సాకర్ సమరానికి తెర లేచింది. ఫుట్‌బాల్ ప్రేమికులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న 21వ ప్రపంచకప్ టోర్నమెంట్ గురువారం రాత్రి ఆరంభమైంది. దాదాపు 88 ఏళ్ల చరిత్ర కలిగిన పుట్‌బాల్ ప్రపంచ కప్ మహా సంగ్రామం అంగరంగ వైభవంగా రష్యాలో ప్రారంభమైంది. స్థానిక లుజ్నికి మైదానంలో నిర్వహించిన ఆరంభోత్సవం కనుల విందు చేసింది. రష్యా దేశ చరిత్ర, సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టి పడేలా ఏర్పాటు చేసిన సెట్టింగులు, కళాకారుల పాటలు, నృత్య ప్రదర్శనలు, బాణసంచా అదరహో అనిపించాయి. దేశవిదేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు, అతిరథ మహారథులు, అభిమానులతో స్టేడియం హోరెత్తిపోయింది. బ్రిటిష్ పాప్ స్టార్ రాబీ విలియమ్సన్, రష్యన్ గాయని ఐదా గార్ఫులినా బృందం మ్యూజికల్ షో అభిమానులను అలరించింది. దాదాపు 500 మంది నృత్యకారులు, జిమ్నాస్ట్‌లు, ట్రాంపోలినిస్ట్ల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనికి సమాంతరంగా మాస్కో నగరంలోని ప్రఖ్యాత రెడ్ స్క్వేర్‌లో నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రారంభోపన్యాసం చేశారు. ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ఫీఫా ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఆరంభ మ్యాచ్‌లో రష్యా, సౌదీ అరేబియా జట్లు తలపడుతున్నాయి. -
బీబర్‌తో ఉన్న ఆ కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఎవరో?
లాస్ ఎంజెల్స్: నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ హాలీవుడ్ యువ పాప్ కెరటం జస్టిన్ బీబర్ మరోసారి గాసిప్ వార్తల్లో దర్శనం ఇచ్చాడు. బ్రెజిల్లో ప్రదర్శన ఇచ్చిన అతగాడు అనంతరం కొత్తగా ఓ మిస్టరీ గర్ల్‌ఫ్రెండ్‌తో కనిపించాడు. వారితో ఆ గర్ల్‌ఫ్రెండ్ స్నేహితురాలు కూడా కనిపించింది. ఆమె ఫొటో తీసేందుకు విలేకరులు ఎంత ప్రయత్నించినప్పటికీ అవకాశం లేకుండా పోయింది. బ్రెజిల్ రాజధాని రియోడిజనిరోలో బీబర్ తన పాప్ గీతాలతో హోరెత్తించాడు. అనంతరం అతడితో గతంలో ఎప్పుడూ చూడని ఓ అమ్మాయి భుజాలపై చేయి వేసి ఏం చక్కా హోటల్ ఫోసానోలో పార్టీకి హాజరైనట్లు హాలీవుడ్ లైఫ్ అనే వెబ్ సంస్థ తెలిపింది. ఆ యువతి ల్యూసియానా చామోన్ అయ్యుంటుందని పేర్కొంది. ఆమెకు మారినా పుమార్ అనే స్నేహితురాలు ఉందని, ఆమెను కూడా పార్టీకి ఆహ్వానించారని, హోటల్లో ముగిసిన తర్వాత తిరిగి బీబర్ ప్రైవేట్ ఇంటికి వెళ్లి అక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్నారని కూడా ఆ సంస్థ వెల్లడించింది. -
మడోన్నా అరుదైన చిత్రం షేర్ చేసింది
లాస్ ఏంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ పాప్ స్టార్ మడోన్నా తాను దత్తత తీసుకున్న నలుగురు పిల్లల ఫొటోలను షేర్ చేసింది. వీరిలో ఇటీవలె దత్తత తీసుకున్న ఎనిమిదేళ్ల కవల బాలికలు కూడా ఉన్నారు. వీరిని మలావి నుంచి దత్తత తీసుకుంది. ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఇన్‌స్టాగ్రమ్‌లో ఈ ఫొటోను షేర్ చేసుకున్న 68 ఏళ్ల ఈ మ్యూజిక్ ఐకాన్ తామంతా పైజామా పార్టీలో చాలా హ్యాపీగా ఉన్నామంటూ ట్యాగ్‌లైన్ పెట్టింది. తమ ఇంట అసలైన సంతోషం నేడే వెల్లి విరుస్తోందంటూ రాసుకొచ్చింది. మడోన్నా మొత్తం నలుగురు పిల్లలను దత్తత తీసుకుంది. వీరిని ఇప్పటి వరకు సరిగా మీడియాకు చూపించని ఆమె తొలిసారి పంచుకున్నారు. వారి వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లుతుందనే ఆమె ఇన్ని రోజులపాటు వారి వివరాలను తెలియనివ్వడం లేదని చెబుతున్నారు. మడోన్నాకు ఇద్దరు కన్నబిడ్డలు ఉన్నారు. లార్డెస్(19) అనే కూతురుతోపాటు రాకో(15) అనే కుమారుడు ఉన్నాడు. వీరితోపాటు స్టెల్లా, వాలే, డేవిడ్ బాందా, మెర్సీ అనే నలుగురు దత్తత పిల్లలు అదనం. -
మాజీ ప్రియురాలి టాటూతో తంటాలు!
లండన్: ఆయన ఒంటిపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50కిపైగా పచ్చబోట్లు ఉన్నాయి. దేహం నిండా ఉన్న ఆ పచ్చబోట్లతో ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. ఓ టాటూను చూసి మాత్రం పాప్ స్టార్ జస్టిన్ బీబర్ తెగ ఇదయిపోతున్నాడు. ఆ టాటూ ఎవరికంట పడకుండా దాచాలనుకుంటున్నాడు. ఇంకుతో కవర్ చేసి.. ఆ పచ్చబొట్టు కనిపించకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకూ ఆ బొమ్మ ఎవరిదంటే సింగర్ సెలెనా గోమెజ్ది. ఈ ఇద్దరు ఒకప్పుడు గాఢమైన ప్రేమికులు. చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇప్పుడు బ్రేకప్ అయింది. అప్పట్లో ప్రేమగా తన చేతిపై పచ్చపొడుచుకున్న ఆ ముద్దుగుమ్మ బొమ్మను ఇప్పుడు చెరిపేయాలని బీబర్ భావిస్తున్నాడు. మాజీ ప్రియురాలి టాటూను కనిపించకుండా కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు 21 ఏళ్ల బీబర్ చెప్పాడు. ఈ బొమ్మను ఇంకుతో కప్పివేయడానికి ప్రయత్నించానని, అయినా ప్రజలు ఈ పచ్చబొట్టు ఎవరిదో గుర్తుపడుతున్నారని అతను చెప్పాడు. 'వాట్ డూ యూ మీన్' ఆల్బంతో తాజాగా హిట్ కొట్టిన ఈ యువ సంచలనం ఇప్పుడు హేలీ బల్ద్విన్తో డేటింగ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు ప్రణయ సల్లాపాల్లో మునిగి తేలుతున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. మరోవైపు సింగర్ సెలెనా గోమెజ్ మాత్రం ఒంటరిగా గడుపుతూ.. తన స్నేహితురాళ్లతో వాలెంటైన్స్ డే జరుపుకున్నదట. -
పాప్‌స్టార్ కన్నీరుమున్నీరైంది!
స్టాక్‌హోమ్: ప్రఖ్యాత పాప్ గాయని మడోన్నా పారిస్ దాడులపై స్పందిస్తూ కంటతడి పెట్టింది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో శనివారం ఓ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించిన మడోన్నా.. ఈ సందర్భంగా పారిస్ దాడుల మృతుల కోసం కొంతసేపు మౌనం పాటించింది. ఈ దాడుల్లో బాధితుల గురించి మాట్లాడుతూ ఆమె దుఃఖం ఆపుకోలేకపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించింది. 'ఇప్పుడు ఈ షో నిర్వహించడం నాకు చాలా కష్టమైన విషయం. గత రాత్రి ఏం జరిగిందన్నది మరిచిపోలేనిది. పారిస్‌లో జరిగిన విషాదకరమైన ఉదంతంలో ఎంతోమంది విలువైన ప్రాణాలు గాలిలో కలిశాయి' అని 51 ఏళ్ల మడోనా పేర్కొంది. 'ఒకవైపు తమవారిని కోల్పోయి బాధితులు దుఃఖిస్తుంటే.. ఇక్కడ నేను ఎందుకు డాన్స్ చేస్తున్నానంటే.. దాడులు చేసినవారి లక్ష్యం మన నోళ్లు మూయించడమే. మనల్ని మౌనంగా ఉంచడమే. అది ఎప్పటికీ జరుగదని నిరూపించడానికి నేనిప్పుడు షో కొనసాగిస్తున్నాను' అని మడోన్నా తెలిపింది. ఈ సందర్భంగా విషాదస్మృతి గీతమైన 'లైక్ ఏ ప్రేయర్' గీతాన్ని ఆలపించి.. మడోన్నా పారిస్ పేలుళ్ల మృతులకు నివాళులర్పించింది. -
స్టన్నింగ్ హాట్!
లేడీ గాగా ఎక్కడున్నా సెన్సేషనే. ఆమె డ్రెస్సింగ్ ఎప్పుడూ స్టన్నింగ్ హాటే. రీసెంట్గా ఏథెన్స్ ఎయిర్ పోర్టులో ఫ్యాన్స్‌కు ప్రత్యక్షంగా కిక్కెక్కించిందీ పాప్ స్టార్. ప్రైవేట్ ఫ్లయిట్ నుంచి బయటకు వచ్చిన గాగా... కేవలం షెల్ టాప్... ఓ చిన్న లోయర్‌తో కనిపించి అక్కడున్నవారందరిలో కరెంట్ పాస్ చేసేసింది. అంతటితో ఆగిందా..! తాను బస చేసిన స్టార్ హోటల్ రాయల్ సూట్ బాత్రూముల్లో దాదాపు నగ్నంగా ఫొటోలు దిగి వాటిని సామాజిక సైట్లో పెట్టి, బాడీలో ‘ఉష్ణోగ్రతలు’ పెంచేసింది. -
తల్లి కాబోతున్న షకీరా
'వాకా వాకా' అంటూ ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన కొలంబియన్ పాప్ స్టార్ షకీరా.. త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు నిర్ధరించారు. స్పానిష్ సాకర్ స్టార్ గెరార్డ్ పిక్‌తో కలిసి తాను రెండో బిడ్డను కనబోతున్నట్లు ఇటీవలే షకీరా కూడా చెప్పింది. ఇప్పుడు షకీరా తల్లి నిడియా, తండ్రి విలియం కూడా ఈ విషయం చెప్పారు. షకీరాకు ఇప్పటికే మిలన్ అనే 19 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతగాడికి ఇప్పుడో బుజ్జి తమ్ముడు రాబోతున్నాడు. ఈసారి కూడా షకీరాకు అబ్బాయే పుట్టబోతున్నాడని, దాంతో మిలన్కు ఆడుకోడానికి ఓ బుల్లి తమ్ముడు వస్తాడని అమెరికా పత్రికలు చెప్పాయి. పిల్లాడే పుడతాడన్న విషయం తెలిసినా, పేరు మాత్రం ఇప్పటివరకు ఏమీ అనుకోలేదట. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
'మైఖేల్ జాక్సన్ 100 సార్లు అత్యాచారం చేశాడు'
దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ సుమారు నాలుగేళ్ల కాలంలో కనీసం 100 సార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని సహనటుడు జేమ్స్ సేఫ్ చుక్ అనే నటుడు చేసిన ఆరోపణలు హాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. సెక్స్ కోసం మైఖేల్ జాక్సన్ సీక్రెట్ కోడ్స్ వాడేవాడని జేమ్స్ ఆరోపించాడు. 1980లో మైఖేల్ జాక్సన్ తో కలిసి పెప్పీ అడ్వర్టైజ్ మెంట్ లో నటించిన జేమ్స్ కోర్టుకు దాఖలు చేసిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు ఉన్నాయని అతని తరపు న్యాయవాది వెల్లడించారు. తన క్లైయింట్ జేమ్స్ ను జాక్సన్ పాలుమార్లు అనుభవించారని, సెక్స్ కోసం కోడ్ భాషను ఉపయోగించేవాడని అతని తరపు న్యాయవాదులు చెప్పినట్టు యూఎస్ లోని ఓ ప్రముఖ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించారు. అంతేకాకుండా జేమ్స్ ను రహస్యంగా వివాహం చేసుకునేందుకు ఉంగరాన్ని, మ్యారేజ్ సర్టిఫికెట్ ను కూడా సిద్ధం చేశారంటూ జేమ్స్ చేసిన ఆరోపణల్ని డాక్యుమెంట్ల రూపంలో కోర్టుకు అందించినట్టు సమాచారం. 20 ఏళ్ల తర్వాత జేమ్స్ చేస్తున్న ఆరోపణలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంకా.. మైఖేల్ జాక్సన్ మరణించిన ఐదేళ్ల తర్వాత ఈ ఆరోపణల్ని వెలుగులోకి తీసుకురావడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2009 జూన్ లో ఎక్కువ మోతాదులో డ్రగ్స్ వినియోగించడం కారణంగా మైఖేల్ జాక్సన్ మరణించిన సంగతి తెలిసిందే. తనపై పలుమార్లు జరిపిన అత్యాచారానికి జాక్సన్ ఎస్టేట్ నుంచి పరిహారం ఇప్పించాలని కోర్టుకు విజ్క్షప్తి చేశారు. జేమ్స్ చేస్తున్న ఆరోపణల్ని కోర్టు తిరస్కరిస్తుందని జాక్సన్ ఎస్టేట్ న్యాయవాది వీట్జ్ మెన్ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు సెప్టెంబర్ 4 తేదిన విచారణకు రానుంది. -
లో దుస్తుల డిజైనర్‌గా..!
ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్న ప్రసిద్ధ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఇప్పుడు డిజైనర్‌గా మారారు. కేవలం తన కోసం మాత్రమే కాదు.. అతివలందరి కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. లో దుస్తులు ఎలా ఉన్నా పైకి కనిపించే దుస్తులు బాగుంటే చాలని కొంతమంది అనుకుంటారనీ, అయితే లో దుస్తులు సౌకర్యవంతంగా ఉండకపోతే ధ్యాస అంతా వాటి మీదే ఉండి, మన పనులు మనం సరిగ్గా చేసుకోలేమనీ బ్రిట్నీ అంటున్నారు. అందుకే, శరీరానికి హాయినిచ్చే లో దుస్తులను డిజైన్ చేస్తున్నారామె. త్వరలోనే వీటి ఆవిష్కరణ జరగనుంది. స్వయంగా బ్రిట్నీ డిజైన్ చేస్తే ఇక, అమ్మకానికి కొదవ ఏముంటుంది? ఆడవాళ్లే కాదు.. బ్రిట్నీ అభిమానులు తమ గాళ్‌ఫ్రెండ్స్‌కి వీటిని బహుమతిగా ఇస్తారని ఊహించవచ్చు. ఆ విధంగా ఆడా, మగా తేడా లేకుండా బ్రిట్నీ డిజైన్ చేసిన లో దుస్తులు స్టాక్ దొరకని స్థాయిలో కొనేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మధ్య తాను కొంచెం బరువు పెరిగినట్లుగా బ్రిట్నీకి అనిపించిందట. ముఖ్యంగా తొడలు, నడుము భాగం కొలతలు పెరిగినట్లనిపించి, డాక్టర్ని సంప్రదించారట. లేజర్ ద్వారా అదనపు కొవ్వును కరిగించాలని నిర్ణయించుకున్నారట ఈ బ్యూటీ. -
బాయ్‌ఫ్రెండ్‌తో జెన్నీఫర్ కటీఫ్?
లాస్ ఏంజిల్స్: పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ రెండున్నరేళ్లుగా డేటింగ్ చేస్తున్న తన బాయ్‌ఫ్రెండ్ కాస్పెర్ స్మార్ట్‌కు గుడ్ బై చెప్పారట!. రెండు నెలల క్రితం వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. లింగమార్పిడి చేయించుకున్న ఓ మోడల్‌కు స్మార్ట్ బూతు ఫొటోలు పంపడంతో జెన్నీఫర్‌తో విబేధాలు వచ్చాయని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ జంటకు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఇవన్నీ అవాస్తవమని చెప్పారు. ఎవరి కెరీర్లో తీరికలేకుండా ఉన్నారని, అలాగే ముందుకుసాగాలని నిర్ణయించుకున్నారని సమాచారం. 44 ఏళ్ల జెన్నీఫర్ తన పదో ఆల్బమ్ పనిలో తీరికలేకుండా ఉండగా, 27 ఏళ్ల స్మార్ట్ నటన, దర్శకత్వం, కొరియో గ్రఫీపై దృష్టిసారిస్తున్నాడని తెలిపారు. -
షకీరాకు పాఠాలు నేర్పుతున్న పుత్రరత్నం
పాప్ స్టార్ షకీరా తన తళుకుబెళుకులతో ఊగిపోతూ కుర్రకారుల నుంచి వృద్ధుల వరకు తన పాటలతో ఊరుతలూగిస్తుంది. ఆ 37 ఏళ్ల అమ్మడు తన పుత్ర రత్నం నుంచి పాఠాలు నేర్చుకుంటున్నట్లు తెలిపింది. తన 15 నెలల కుమారుడు మిలన్ పిక్ మెబారక్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు వెల్లడించింది. మిలాన్‌ను చూసి తనతో పాటు తన భర్త గ్రిరార్డ్ పిక్ తమ పనులు తామే చేసుకుంటున్నట్లు చెప్పింది. ఖాళీ సమయంలో అధిక భాగం తన కుమారుడితో కలసి ఉండేందుకు తాము ఇష్టపడుతున్నట్లు షకీరా ఆమె భర్త ఈ మేరకు వెల్లడించారని గురువారం కాంటాక్ట్మ్యూజిక్ తెలిపింది. పాప్ స్టార్ షకీరా తన ప్రియుడు గెరార్డ్ పిక్‌తో జత కట్టి జనవరి 22, 2013న మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన ఈ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు కలిసి వచ్చేలా ‘మిలన్ పిక్ మెబారక్' అని నామకరణం చేసారు. షకీరాకు 60 మిలియన్ల మంది ఫేస్ బుక్ అభిమానులు ఉన్నారు. ఆ పాప్ స్టార్ స్పానిష్ దేశపు ఫుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.