లాస్ ఏంజిల్స్: పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ రెండున్నరేళ్లుగా డేటింగ్ చేస్తున్న తన బాయ్ఫ్రెండ్ కాస్పెర్ స్మార్ట్కు గుడ్ బై చెప్పారట!. రెండు నెలల క్రితం వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
లింగమార్పిడి చేయించుకున్న ఓ మోడల్కు స్మార్ట్ బూతు ఫొటోలు పంపడంతో జెన్నీఫర్తో విబేధాలు వచ్చాయని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ జంటకు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఇవన్నీ అవాస్తవమని చెప్పారు. ఎవరి కెరీర్లో తీరికలేకుండా ఉన్నారని, అలాగే ముందుకుసాగాలని నిర్ణయించుకున్నారని సమాచారం. 44 ఏళ్ల జెన్నీఫర్ తన పదో ఆల్బమ్ పనిలో తీరికలేకుండా ఉండగా, 27 ఏళ్ల స్మార్ట్ నటన, దర్శకత్వం, కొరియో గ్రఫీపై దృష్టిసారిస్తున్నాడని తెలిపారు.
బాయ్ఫ్రెండ్తో జెన్నీఫర్ కటీఫ్?
Published Fri, Jun 6 2014 7:11 PM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM
Advertisement
Advertisement