Casper Smart
-
లిప్ లాక్!
నాలుగేళ్లు కలిసుండి... ఆ తరువాత ఒకరినొకిరు తిట్టుకుని... విడిపోయిన సూపర్ సింగర్ జెనిఫర్ లోపెజ్, నటుడు కాస్పర్ స్మార్ట్ మళ్లీ ఒక్కటయ్యారా! వీళ్ల వాలకం చూస్తుంటే కాదనలేకపోతున్నారు హాలీవుడ్ జనం. రీసెంట్గా ‘అమెరికన్ ఐడల్’ పధ్నాలుగో సీజన్ షూటింగ్ గ్యాప్‌లో ఈ ఇద్దరూ లిప్ లాక్ వేసుకుని మైమరిచిపోయారట! రోజంతా ఒకరినొదిలి ఒకరు ఉండలేనంతగా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారట. ఎంతో కాలం రొమాన్స్ చేసిన ఈ తారలు గత ఏడాది జులైలో విడిపోయారు. భర్త మార్క్ ఆంథోనీతో ఏడేళ్ల కాపురం చేసి విడిపోయిన జెనిఫర్‌కు కాస్పర్ మరింత దగ్గరయ్యాడు. ఎంతో అన్యోన్యంగా తిరిగారు. అయితే కాస్పర్ ఇద్దరు మోడల్స్‌తో క్లోజ్‌గా ఉన్న పిక్చర్స్ ఓ వెబ్సైట్ రిలీజ్ చేసింది. దీంతో వీరు విడిపోయారు. -
జెన్నిఫర్ ఇంట్లో మాజీ బాయ్ ఫ్రెండ్ మకాం
లాస్ ఏంజిల్స్: రెండున్నరేళ్ల పాటు డేటింగ్ చేసిన పాప్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్, డాన్సర్ కాస్మర్ స్మార్ట్ తమ బంధానికి ఇటీవల కటీఫ్ చెప్పేశారు. కాగా లాస్ ఏంజెల్స్‌లోని లోపెజ్ వీధిలోని జెన్నిఫర్ మూడు బెడ్రూమ్ల ఇంట్లోనే కాస్మర్ ఇప్పటికీ మకాం వేశాడు. జెన్నిఫర్ ప్రస్తుతం ఆ ఇంట్లో ఉండటం లేదు. కొత్త ఆల్బమ్ ప్రమోషనల్ టూర్‌కు వెళ్లింది. ఆమె లాస్ ఏంజిల్స్‌కు తిరిగొచ్చిన వెంటనే కాస్మర్ ఇంటిని ఖాలీ చేస్తాడని భావిస్తున్నారు. జెన్నిఫర్ నివాసానికి సమీపంలోనే అద్దె ఇంటి కోసం కాస్మర్ అన్వేషిస్తున్నట్టు ఓ వెబ్సైట్ పేర్కొంది. 44 ఏళ్ల జెన్నిఫర్, 27 ఏళ్ల కాస్మర్ల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. -
బాయ్‌ఫ్రెండ్‌తో జెన్నీఫర్ కటీఫ్?
లాస్ ఏంజిల్స్: పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ రెండున్నరేళ్లుగా డేటింగ్ చేస్తున్న తన బాయ్‌ఫ్రెండ్ కాస్పెర్ స్మార్ట్‌కు గుడ్ బై చెప్పారట!. రెండు నెలల క్రితం వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. లింగమార్పిడి చేయించుకున్న ఓ మోడల్‌కు స్మార్ట్ బూతు ఫొటోలు పంపడంతో జెన్నీఫర్‌తో విబేధాలు వచ్చాయని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ జంటకు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఇవన్నీ అవాస్తవమని చెప్పారు. ఎవరి కెరీర్లో తీరికలేకుండా ఉన్నారని, అలాగే ముందుకుసాగాలని నిర్ణయించుకున్నారని సమాచారం. 44 ఏళ్ల జెన్నీఫర్ తన పదో ఆల్బమ్ పనిలో తీరికలేకుండా ఉండగా, 27 ఏళ్ల స్మార్ట్ నటన, దర్శకత్వం, కొరియో గ్రఫీపై దృష్టిసారిస్తున్నాడని తెలిపారు. -
ప్రేమ ఓకే.. పెళ్లే కష్టం!
ప్రేమ ఎంత మధురం అంటున్నారు జెన్నిఫర్ లోపెజ్. అందుకే, ఎప్పుడూ ప్రేమలో పడుతూ ఉంటారామె. ఇప్పటికి మూడు సార్లు ప్రేమలో పడ్డారు జెన్నిఫర్. ఆ ముగ్గురు ప్రేమికులను పెళ్లి కూడా చేసుకున్నారు. మూడో భర్త మార్క్ ఆంటోనీకి విడాకులిచ్చి మూడేళ్లయ్యింది. మరి.. ప్రేమను ప్రేమించే వ్యక్తి కాబట్టి, జెన్నిఫర్ ఖాళీగా ఉంటారా? మూడో భర్తకు విడాకులిచ్చిన కొన్నాళ్లకు కాస్పర్ స్మార్ట్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమికుణ్ణి ఎప్పుడు భర్తని చేసుకుంటారనే ప్రశ్న జెన్నిఫర్ ముందుంచితే -‘‘ఏమో.. నాకే తెలియదు. పెళ్లి అనే సంప్రదాయం మీద నాకు సదభిప్రాయమే ఉంది. కానీ, వివాహ బంధం మాత్రం చాలా కష్టం. ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించడం పెద్ద సవాల్లాంటిది. కానీ, ప్రేమ అనేది సవాల్ కాదు. అందులో ఎలాంటి కష్టం ఉండదు’’ అన్నారు. ఈవిడగారి వైఖరి చూస్తుంటే.. కాస్పర్తో ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లరని అర్థమవుతోంది. ప్రస్తుతం జెన్నిఫర్ వయసు 44. పెళ్లి జోలికి వెళ్లకుండా మిగతా జీవితాన్ని మొత్తం ఆమె నిత్య ప్రేమికురాలిలా గడిపేసే ఆలోచనలో ఉన్నారేమో!