లిప్ లాక్! | Lip Lock | Sakshi
Sakshi News home page

లిప్ లాక్!

Published Sat, Mar 28 2015 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

లిప్ లాక్!

లిప్ లాక్!

నాలుగేళ్లు కలిసుండి... ఆ తరువాత ఒకరినొకిరు తిట్టుకుని... విడిపోయిన సూపర్ సింగర్ జెనిఫర్ లోపెజ్, నటుడు కాస్పర్ స్మార్ట్ మళ్లీ ఒక్కటయ్యారా! వీళ్ల వాలకం చూస్తుంటే కాదనలేకపోతున్నారు హాలీవుడ్ జనం. రీసెంట్‌గా ‘అమెరికన్ ఐడల్’ పధ్నాలుగో సీజన్ షూటింగ్ గ్యాప్‌లో ఈ ఇద్దరూ  లిప్ లాక్ వేసుకుని మైమరిచిపోయారట! రోజంతా ఒకరినొదిలి ఒకరు ఉండలేనంతగా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారట. ఎంతో కాలం రొమాన్స్ చేసిన ఈ తారలు గత ఏడాది జులైలో విడిపోయారు.

భర్త మార్క్ ఆంథోనీతో ఏడేళ్ల కాపురం చేసి విడిపోయిన జెనిఫర్‌కు కాస్పర్ మరింత దగ్గరయ్యాడు. ఎంతో అన్యోన్యంగా తిరిగారు. అయితే కాస్పర్ ఇద్దరు మోడల్స్‌తో క్లోజ్‌గా ఉన్న పిక్చర్స్ ఓ వెబ్‌సైట్ రిలీజ్ చేసింది. దీంతో వీరు విడిపోయారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement