Lip Lock
-
తొందరపడి లిప్ లాక్ చేస్తున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసా?
ఇరువురు మనుషులు కలుసుకున్నపుడు చక్కని చిరునవ్వు, కరచాలనం, ఆత్మీయం ఆలింగనం ఇది సర్వ సాధారణం. మరికొన్ని చోట్ల ముద్దుగా బుగ్గలమీద చిన్న ముద్దుపెట్టుకోవడం ఒక అలవాటు. చిన్నారులను చూసినపుడు అందరమూ ముద్దు చేస్తాం. ఎదుటివారి పట్ల తమ ప్రేమను తెలియజెప్పేందుకు ఇలా చేస్తుంటాం. అదే ప్రేమికుల మధ్య ఈ ముద్దుల బంధం ఇంకొంచెం..మధురంగా ఉంటుంది. అయితే సినిమా కల్చర్ అనండీ..పాశ్చాత్య నాగరికత అనండీ.. ప్రేమికులతో పాటూ ఇతరులు కూడా లిప్ టూ లిప్ కిస్సులు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. లిప్ టూ లిప్ ముద్దుల వల్ల లాభాల మాటేమో గానీ.. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉన్నాయంటున్నారు నిపుణులు. చిన్నపిలల్ల్ని ఇలా ముద్దు పెట్టుకోవడం చాలా అనర్థం. తీవ్ర అనారోగ్యం, ఫ్లూ, వైరస్ల బారిన పడిన వారితో అయితే చాలా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ♦ ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటివి ఇతర అంటు వ్యాధులు త్వరగా వచ్చే అవకాశాలున్నాయి. ♦ ఈ రకం ముద్దుల వల్ల మోనోన్యూక్లియోసిస్, మెనింజైటిస్ వంటి వైరస్‌లను వ్యాపింపజేస్తుంది. మోనో వైరస్ కారణంగా కొందరిలో ఆరు నెలల పాటు విపరీతమైన అలసట వంటి లక్షణాలుంటాయి. ♦ మెనింజైటిస్, మెదడు వాపు వ్యాధిలు కూడా వ్యాప్తిస్తాయి. ♦ క్లామిడియా గనేరియా వంటి లైంగిక సమస్యలు కూడా రావచ్చు. లైంగిక వ్యాధులు కూడా చాలా తొందరగా వ్యాప్తిస్తాయి. ♦ స్వీడిష్ సర్వే ప్రకారం, అలెర్జీ ఉన్న వారిని ముద్దుపెట్టుకునే 12 శాతం మందికి అలెర్జీ త్వరగా సోకుతుంది. దురద, వాపు వంటి సమస్యలతో బాధ పడేవారు కూడా లిప్ టూ లిప్ కిస్సులకు దూరంగా ఉండాలి. ♦ పంటి, చిగుళ్ల సమస్యలు కూడా వచ్చే అవకాశాలన్నాయంటే నమ్ముతారా? తీవ్ర చిగుళ్ల సమస్యలు కూడా తలెత్తవచ్చు. ♦ న్యూమోనియా వంటి బ్యాక్టీరి కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చివరిగా మరోమాట ఇలాంటి వేవీ గమనించకుండా తొందరపడితే దద్దుర్లు, ముఖం వాపు, శ్వాస ఆడకపోవడం, ఒక్కోసారి వాంతులు కూడా సంభవించవచ్చు. -
నీటి అలల మధ్య భర్తకు అనసూయ లిప్‌లాక్.. వీడియో వైరల్
Anchor Anasuya Celebrating 12th Wedding Anniversary Video Viral: టాలీవుడ్ ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అక్కర్లేదు. అటు యాంకరింగ్.. ఇటు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోంది. యాంకరింగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం దర్జా, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలు, యాంకరింగ్‌తోపాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది అనసూయ. గ్లామరస్ ఫొటోలతోపాటు కుటుంబంతో ఆడిపాడే క్షణాలు పోస్ట్‌ల రూపంలో అభిమానులతో పంచుకుంటుంది రంగమ్మత్త. తాజాగా తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో బీచ్‌లో సందడి చేసిన వీడియోను షేర్ చేసింది. అనసూయ, సుశాంక్ ఒకరినొకరు ప్రేమగా హత్తుకుని, లిప్‌లాక్, రొమాంటిక్ ఫొజులతో ఈ వీడియో నిండిపోయింది. తమ 12వ వెడ్డింగ్ యాన్నివర్సరీ సందర్భంగా భర్తతో పకృతి ఒడిలో సముద్రం ఒడ్డున నీటి అలల మధ్య గడిపింది అనసూయ. ఈ వీడియో షేర్ చేస్తూ 'ప్రియమైన నిక్కూ.. మనిద్దరం కలిసి ఉండటమే నాకు ఓ అద్భుత ప్రదేశం. నువ్ నా పక్కనే ఉంటే చాలు ఒక్క చేత్తో ఈ ప్రపంచాన్ని జయించగలను. ఇన్నేళ్ల మన లవ్ జర్నీలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో మధుర క్షణాలు. అన్నింటిని మించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన 21 ఏళ్ల కలయికలో పెళ్లై 12 ఏళ్లు గడిచాయి. నా వృద్ధాప్యం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.' అని రాసుకొచ్చింది. చదవండి: మగజాతి పరువు తీస్తున్నారు: దిమ్మతిరిగేలా అనసూయ కౌంటర్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అనసూయ, సుశాంక్‌ల మధ్య పరిచయం ఏర్పడి 21 సంవత్సరాలు అయింది. 9 ఏళ్ల డేటింగ్ అనంతరం అనసూయ, సుశాంక్ వివాహం బంధంతో ఒక్కటయ్యారు. -
భర్తతో నిహారిక రొమాంటిక్ ఫోటో లీక్
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా రాణిస్తుంది. ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న నిహారిక పేరు మరోసారి హాట్‌టిపిక్‌గా మారింది. భర్తతో నిహారిక లిప్‌లాక్ ఫోటో ఒకటి బయటికొచ్చింది. విడిపోని బంధం అంటూ నిహారిక భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. గత కొంతకాలంగా నిహారిక పర్సనల్ లైఫ్‌కి సంబంధించి రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి చెక్ పెట్టేందుకే నిహారిక ఇలాంటి ఫోటోతో సమాధానమిచ్చిందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఇంత బోల్డ్ అవసరమా అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఈ ఫోటోను నిహారిక షేర్ చేయలేదు. అంతేకాకుండా ఇది లేటెస్ట్ పిక్ కూడా కాదు. నిహారిక కొణిదెల పేరుతో ఎవరో ఓ అకౌంట్‌ను క్రియేట్ చేసి ఈ బోల్డ్ పిక్‌ను షేర్ చేశారు. కాసేపట్లో ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. -
ప్రేయసి ముద్దే.. పోలీసులకు పట్టించింది
అతనొక భయంకరమైన నేరస్తుడు. సుమారు 200 దేశాల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. 196 దేశాల్లో ఇంటర్‌పోల్ అతని అరెస్ట్ కోసం రెడ్ వారెంట్ జారీ చేసింది. ఏళ్ల తరబడి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ప్రియురాలి అత్యుత్సాహంతో ఎట్టకేలకు బుక్కైపోయాడు. ఆమెకు ముద్దు పెట్టి పోలీసులకు దొరికిపోయాడు. అదెలాగంటే.. మెక్సికన్ డ్రగ్ లార్డ్, సినాలోవా కార్టెల్ మాఫియా ముఖ్యనేత జోవాక్విన్ గుజ్మన్ అలియాస్ ఎల్ చాపో గుర్తున్నాడా? ప్రస్తుతం అతను జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అతని ముఖ్య అనుచరుడు, ఎల్ పిట్ గా పేరొందిన ‘బ్రియాన్ డొనాసియానో ఒలుగ్విన్ వెర్డుగో’ మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు ఇప్పటికీ డ్రగ్స్లావాదేవీలు, అక్రమ రవాణా కొనసాగిస్తూ.. ఎల్ చాపోనే మించిపోయాడు. అలా 39 ఏళ్ల ఎల్ పిట్‌పై.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ పోల్ వారెంట్లు జారీ అయ్యాయి. చివరికి.. అతగాడి గాళ్ ఫ్రెండ్ అత్యుత్సాహమే అతన్ని పట్టించింది. కొన్నిరోజుల కిందట ఫేస్ బుక్ లో అమెరికా డ్రగ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ అధికారులకు ఓ ఫొటో కంటబడింది. ఓ పర్యాటక ప్రాంతంలో ఓ జంట ముద్దు పెట్టుకుంటున్న ఫొటో అది. ఆ ఫొటోలో ఉన్నది ఎల్ పిట్ అని గుర్తించిన అమెరికా డ్రగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అతడు కొలంబియాలో ఉన్నట్టు కనిపెట్టారు. పక్కా స్కెచ్‌తో.. వెంటనే కొలంబియా అధికారులకు సమాచారం అందించారు. దాంతో పక్కా ప్లాన్ వేసిన కొలంబియా పోలీసులు క్యాలీ నగరంలోని ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో ఎల్ పిట్ ను అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి అతడు కొలంబియాలోనే ఉంటున్నాడట. మెక్సికో, అమెరికా దేశాలకు వేల కోట్ల విలువైన కొకైన్ ను తరలించేందుకు కొలంబియాలోని (రివల్యూషనరీ ఆర్మ్ డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా) 'ఫార్క్' గెరిల్లా దళాల సాయం కోరేందుకు అతడు కొలంబియాలో మకాం వేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో.. మెక్సికోలో మోడల్ అయిన తన గర్ల్‌ఫ్రెండ్‌తో క్యాలీలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో దిగినట్లు తెలిసింది. ఆపై ఆమె ప్రఖ్యాత టూరిస్టు కేంద్రం లాస్ క్రిస్టాలెస్ కు తీసుకువచ్చింది. అక్కడ పర్వతంపై ముద్దు పెట్టుకుంటూ ఇద్దరూ సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. దొరికిపోయాడు. ఇదే మెక్సికోలో అయి ఉంటేనా? అయితే దాడుల సమయంలో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఎల్ పిట్ కొలంబియా పోలీసులకు 2,65,000 డాలర్ల లంచం ఇచ్చే ప్రయత్నం చేశాడట. అంతేకాదు, ఇదే ఘటన మెక్సికోలో జరిగుంటే తన సాయుధ దళాలు కొద్దిసేపట్లోనే తనను విడిపించి ఉండేవని పోలీసులతో చెప్పాడట. గట్టి భద్రత మధ్య అతడిని పలు కేసుల విచారణ నిమిత్తం అమెరికాలోని కాలిఫోర్నియాకు తరలించనున్నారు. -
నటితో బిగ్‌బాస్ విన్నర్ లిప్‌లాక్.. వీడియో వైరల్
సిద్ధార్థ్ శుక్లా..హిందీ బిగ్‌బాస్ సీజన్13తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బుల్లితెర నటుడు. షెహ్నాజ్‌తో లవ్ ట్రాక్ సిద్ధార్థ్‌కు మరింత కలిసొచ్చింది. ఫలితంగా గత సీజన్ విన్నర్‌గా నిలిచాడు. తాజాగా మరోసారి సిద్ధార్థ్ శుక్లా వార్తల్లోకి ఎక్కాడు. నటి సోనియా రథీతో సిద్ధార్థ్ లిప్‌లాక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రీట్వీట్లు చేస్తూ..ఈ వీడియోను షెహ్నాజ్కి సైతం ట్యాగ్ చేస్తున్నారు. అయితే ఈ లిప్‌లాక్ వీడియో రియల్ లైఫ్‌లో జరిగింది కాదు. 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' అనే ఓ వెబ్‌సిరీస్ కోసం చేసిన యాక్టింగ్ మాత్రమే. ఈ సిరీస్ గత రెండు సీజన్లు విజయవంతం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ మూడవ సీజన్‌ను ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ ప్రొడ్యూస్ చేశారు. ఓటీటీలో విడుదలైన ఈ వెబ్‌సిరీస్ ఈ మధ్యకాలంలో అత్యంత ప్రజాధణ పొందింది. సిద్ధార్థ్- సోనియాలు ఈ రొమాంటిక్ వెబ్‌సిరీస్‌లో జంటగా నటించారు. తాజాగా వీరిద్దరి లిప్‌లాక్ వీడియో బయటకు వచ్చింది. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ 'ఎన్నిసార్లు చూసినా.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అగస్త్యరావుగా నటించిన సిద్ధార్థ్ శుక్లాకు నా అభినందనలు' అంటూ కామెంట్ చేశారు. #AgastyaRao you set my heart on fire@sidharth_shukla you nailed it boss!#BrokenButBeautiful3 is a hit dude 🔥 pic.twitter.com/N6jQ1epnml — 𝒦𝒶𝓎🦋 (@kausar_nas) April 7, 2021 చదవండి: అవును.. నేను ఆ సర్జరీ చేయించుకున్నాను: అనుష్క శర్మ ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న సన్నీలియోన్.. ధర ఎంతంటే? -
అలా లిప్‌లాక్ నుంచి తప్పించుకున్నా : సాయిపల్లవి
కెరీర్ ఆరంభం నుంచే ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే ‘ఫిదా’ చేసి కోట్లాది మంది అభిమానులను సంపాధించుకుంది నానుచరల్ బ్యూటీ సాయిపల్లవి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. తన నటనకు ‘ఫిదా’ అయిన దర్శక, నిర్మాతలు.. ముద్దు సీన్లు వద్దు అంటున్నా ఆమెకు వరస ఆఫర్లు ఇస్తున్నారు. ఇలా వరుస సినిమాతో దూసుకెళ్తున్న ఈ నాచురల్ బ్యూటీ.. తాజాగా ఓ సీక్రెట్‌ను బయటపెట్టింది. ఓ దర్శకుడు తనతో ముద్దు సీన్ చేయించాలని ట్రై చేశాడని.. కానీ తనకు అటువంటి సీన్లో నటించడం కంఫర్ట్‌గా అనిపించదని దర్శకుడికి చెప్పేశానని తెలిపింది. ‘ఓ సినిమాలో రొమాంటిక్ సీన్లో నటించేటప్పుడు హీరో పెదవులపై ముద్దు పెట్టాలని దర్శకుడు సూచించాడు. అయితే లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడం నాకు కంఫర్ట్‌గా అనిపించదని దర్శకుడికి చెప్పేశాను. ఆ సమయంలో మీటూ ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆ సీన్ చేయమని సదరు దర్శకుడు బలవంత పెట్టలేదు. అలా 'మీటూ' కారణంగా లిప్‌లాక్ సీన్ నుండి తప్పించుకున్నాను’ అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా పేరును మాత్రం ఈ అమ్మడు బయటపెట్టలేదు. సాయిపల్లవి తెలుగులో 'విరాటపర్వం' మూవీలో నటిస్తోంది. దగ్గుబాటి రానా హీరోగా రూపొందుతున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగచైతన్య హీరోగా వస్తోన్న లవ్ స్టోరీలో హీరోయిన్గా చేస్తోంది. అలాగే నానినితో కలిసి ‘శ్యామ్ సింగరాయ్’లో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో 'పావకథైగల్' అనే వెబ్‌సిరీస్‌లో ఆమె నటించింది. నాలుగు కథలుగా రాబోతున్న ఈ వెబ్‌సిరీస్ ఒక కథలో సాయి పల్లవి కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 18న విడుదలకానుంది. -
లిప్‌లాక్ చేసి.. నాలుక కట్ చేశాడు
అహ్మదాబాద్ : గాఢంగా ముద్దుపెట్టుకుంటున్న సమయంలో భార్య నోట్లో నాలుక ఇరుక్కుపోయిందని, ఏకంగా ఆమె నాలుకను కత్తెరతో కట్ చేశాడో భర్త. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌కు చెందిన అయూబ్ మన్సూర్(46) ఒక రోజు తన భార్య నాలుకను కత్తెరతో కట్ చేశాడని, ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో అతను చెప్పిన సమాధానాలు విని ముక్కున వేలేసుకున్నారు. మన్సూర్ చెప్పిన కథనం ప్రకారం తాను ఎప్పటిలాగే తన భార్యతో శృంగారం చేస్తున్న సమయంలో లిప్‌లాక్ చేశానని, ఆ సమయంలో ఆమె నోట్లో నాలుక ఇరుక్కుపోయిందని, దీంతో ఊపిరిక ఆడలేదని, ఏంచేయాలో అర్థంకాక ఆమె నాలుకను కత్తెరతో కట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. కాగా బాధితురాలిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శస్త్ర చికిత్స ద్వారా నాలుకను అతికించామని, ప్రస్తుతం ఆమె ఎలాంటి ఆహారం తీసుకోవడంలేదని వైద్యులు పేర్కొన్నారు. అయూబ్ మన్సూర్ కాగా, బాధితురాలు మన్సూర్‌కి మూడో భార్య కావడం గమనార్హం. మొదటి బార్యను హత్య కేసులో మన్సూర్ పలు సార్లు జైలుకెళ్లి వచ్చాడు. అనంతరం ముంబైకి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. వేధింపులు తట్టుకోలేక ఆమె అతనికి దూరంగా ఉంటుంది. మన్సూర్‌పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. -
‘ముత్యం లాంటి ముద్దు’పై వివాదమా!
సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరం. అది ఢాకా యూనివర్శిటీ ప్రాంతం. అప్పుడే పెద్ద వర్షం కాస్త తుంపరగా మారింది. నేలంతా తడి తడిగా ఉంది. వెనకాల ఓ వినియోగదారుడు నెత్తున గొడుగు పట్టుకొని సెల్ఫోన్లో ఏదో వెతుక్కుంటున్నాడు. టీ కాసి పోసే వారిరువురు తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. రోడ్డు మీద బాటసారులు ఇవేమి పట్టకుండా తమ మానాన తాము పోతున్నారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడ కొంత ఎత్తైన అరుగులు మీద కూర్చున్న ఇద్దరు ప్రేమికులు తమకీ ప్రపంచం పట్టనట్టు ఒకరికొకరు అత్యంత సహజంగా ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ సన్నివేశంలో వారికి తెలియకుండా వారి ఫొటోను జిబాన్ అహ్మద్ తీశారు. ‘వర్షం దీవెనలతో విరిసిన కవిత, ప్రేమకు స్వేచ్ఛనివ్వండి’ అన్న నినాదంతో జిబాన్ అహ్మద్ ఆ ఫొటోను సోమవారం నాడు ఆన్లైన్లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. లౌకిక బెంగాలీ జాతీయ వాదం, ఇస్లాం ఛాందసవాదం మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగే బంగ్లాలో ఈ ఫొటోపై పెద్ద దుమారమే రేగుతోంది. ఫొటోలో కనిపిస్తున్న కళాత్మక దృశ్యాన్ని మెచ్చుకుంటున్న వాళ్లు, బరితెగించిన ప్రేమగా అభివర్ణిస్తున్న వాళ్లు ఎక్కువే ఉన్నారు. ‘ఇదే నిజమైన బంగ్లాదేశ్. ఇలాంటి ప్రేమను పాటించడం వల్ల దేశంలో ఇస్లాం ఛాందసవాదం నశించిపోతుంది. నా బంగ్లాదేశ్‌ను ప్రేమిస్తున్నాను’ అంటూ కొందరు ‘మనం అంతటా ముద్దు పెట్టుకోవాలి. తరచుగా ముద్దు పెట్టుకోవాలి. ముద్దులతోనే వ్యతిరేకులపై పోరాటం సాగిద్దాం’ అంటూ మరికొందరు ట్వీట్లు పేల్చారు. స్వచ్ఛమైన నీటి బిందువులాంటి ముద్దుపై అసలు వివాదం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. బరితెగించిన ప్రేమగా పరిగణించిన యువకులు మాత్రం జిబాన్ అహ్మద్‌ను వెతికి పట్టుకొని రోడ్డుపైనే కర్రలతో కొట్టారు. కాళ్లతో తన్నారు. వారిలో తోటి ఫొటోగ్రాఫర్లు కూడా ఉండడం మరీ విచారకరం. జిబాన్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం కూడా పోయింది. ఆయన పనిచేస్తున్న వెబ్సైట్ యాజమాన్యం ఆయన్ని తొలగించింది. ఇస్లాం ఛాందసవాదులతో పెట్టుకోవడం జిబాన్ అహ్మద్‌కు ఇది మొదటిసారి కాదు. 2015లో బంగ్లాదేశ్–అమెరికన్ హేతువాద బ్లాగర్ అవిజిత్ రాయ్, ఆయన భార్యపై ఇస్లాం ఛాందసవాదులు హత్యాప్రయత్నం చేశారు. రక్తం వోడుతూ ప్రాణాపాయా స్థితిలో కాపాడంటూ రాయ్ భార్య వేడుకుంటుంటే ఎవరు సాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో జిబాన్ అహ్మద్‌ను ఆస్పత్రికి చేర్చారు. అందుకు ఇస్లాం ఛాందసవాదుల చేతుల్లో తన్నులు తిన్నారు. -
డిమాండ్ చేస్తే లాక్ చేస్తా!
టాలీవుడ్ సెన్సేషన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పటికే చాలామంది కుర్రాళ్ల గుండెల్లో లాక్ అయిపోయారు. లాక్ చేయడానికి తనకూ అభ్యంతరం లేదంటున్నారామె. అయితే, ఇది వేరే లాక్. దాని పేరు ‘లిప్ లాక్’. హిందీ చిత్రం ‘యారియాన్’, తెలుగు ‘కిక్–2’తో కలిపి కొన్ని చిత్రాల్లో రకుల్ లిప్ లాక్ సీన్స్ చేశారు. ఈ సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని రకుల్ చెబుతూ – ‘‘కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ సీన్స్‌లో నటించేందుకు నాకు అబ్జెక్షన్ లేదు. అయితే ఆ సన్నివేశం సినిమాకు అతికించినట్టు ఉండకూడదు. ఆ సీన్ లేకపోతే అక్కడ పేలవంగా ఉంటుందనిపించాలి. ఆ రేంజ్ డిమాండ్ ఉంటేనే నేను లిప్ లాక్ సీన్ చేస్తా’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘సినిమాలో ఏ సీన్‌ని తీసుకున్నా ఏదో ఒకటి చేయాల్సిందే. ఏడ్చే సీన్లో ఏడవాలి. నవ్వే సీన్లో నవ్వాలి. రొమాంటిక్ సీన్లో రొమాన్స్ చేయాలి. అయితే మిగతా సీన్స్ గురించి మాట్లాడకుండా రొమాంటిక్ సీన్స్.. ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటారు. కథ డిమాండ్ మేరకు మిగతా సీన్స్ ఎలా చేస్తానో.. రొమాంటిక్ సీన్స్‌ని కూడా అలాగే చేస్తాను’’ అని రకుల్ అన్నారు. -
లిప్‌లాక్ వద్దన్న హీరో.. కారణం ఇదేనా!
చెన్నై: సాధారణంగా లిప్‌లాక్ సన్నివేశాలకు కథానాయికలు నో చెబుతుంటారు. అయితే తమిళ నటుడు సిబిరాజ్ హీరోయిన్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికి ససేమిరా అన్నారు. ఆ సంగతేమిటో చూద్దాం. సత్యరాజ్ సమర్పణలో ఆయన కొడుకు సిబిరాజ్ హీరోగా నటిస్తూ, నాదాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం సత్య. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నటి రామ్యానంబీశన్ హీరోయిన్ గానూ, నటి వరలక్ష్మీ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. 555 చిత్రం ఫేమ్ సైమన్ సంగీతాన్ని అందించారు. సత్య మూవీ జూన్ చివర్లో తెరపైకి రానుంది. ప్రదీప్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గతంలో నటుడు కమలహాసన్ నటించిన సత్య చిత్రం ఆయన కేరీర్‌ను ఎలా మలుపు తిప్పిందో, అదే విధంగా నటుడు సిబిరాజ్‌కు ఈ సత్య పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం. తెలుగులో విజయం సాధించిన ‘క్షణం’ చిత్రానికి ఇది రీమేక్. మూవీ స్టోరీ డిమాండ్ మేరకు హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సన్నివేశం ఉంటుంది. అయితే, ఆ సీన్లో నటించాలని ఎంతగా నచ్చజెప్పినా హీరో సిబిరాజ్ మాత్రం ఒప్పుకోలేదు. ఈ చిత్రాన్ని తన కూతురు కూడా చూస్తుందనే కారణాన్ని సిబిరాజ్ చెప్పారని' ఈ సందర్భంగా వివరించారు. -
లిప్‌లాక్‌లో కమల్‌నే మించిపోయారు
చిత్రాల్లో లిప్‌లాక్ చుంభనాలంటే మొదట గుర్తొచ్చేది విశ్వనటుడు కమలహాసనేననే పేరుంది. అలాంటిది ఆయన్నే మించారట యువ నటుడు లొల్లుసభ జీవా. ఈయన రజనీకాంత్ వీరాభిమాని. పలు చిత్రాల్లో ప్రధానపాత్రలు పోషించిన లొల్లుసభ జీవా తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆరంభమే అట్టహాసం. ఏమిటీ ఈ టైటిల్ వినగానే నటుడు అజిత్ గుర్తుకొస్తున్నారా? ఆయన వీరాభిమాని రంగా ఈ చిత్రానికి దర్శకుడు. ఆ అభిమానమే అజిత్ నటించిన ఆరంభం, అట్టహాసం చిత్రాల పేర్లను తన ఒక్క చిత్రానికి టైటిల్‌గా నిర్ణయించేలా చేసిందని భావించవచ్చు. రంగా ఇంతకుముందు నాయ్కుట్టి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఆయన రెండో చిత్రం ఆరంభమే అట్టహాసం. ఈ చిత్రం ద్వారా సంగీతాభట్ నాయకిగా పరిచయం అవుతున్నారు. కన్నడంకు చెందిన ఈ భామ అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారట. ఇతర ప్రధాన పాత్రల్లో పాండియరాజన్, శ్యామ్స్, వైయాపురి, శ్రీనాథ్, వాసు విక్రమ్, కే.జ్ఞానసుందర్, మనీష్,నెల్లైశివ, తెనడై మధుమిత, లొల్లుసభ మనోహర్, లొల్లుసభ శేషు, లొల్లుసభ ఉదయ్ నటిస్తున్నారు. జేకే.దాస్ సంగీతాన్ని, ఆనంద్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది వినోదం గుభాళించే విభిన్న ప్రేమ కథా చిత్రం అని చెప్పారు. సాధారణంగా లిప్‌లాక్ చుంభనాలకు పెట్టిందిపేరు విశ్వనాయకుడు కమలహాసన్ అంటారని, ఆయన పత్రి చిత్రంలోనూ ఒక్క చుంభనం సన్నివేశం చోటు చేసుకుంటుందని అన్నారు. అలాంటిది ఈ చిత్రంలో లొల్లుసభ జీవా కథానాయకితో పదిమార్లు లిప్‌లాక్ చుంభనాల సన్నివేశాల్లో నటించి కమల్‌నే అధిగమించారని అన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, కేరళ, హైదరాబాద్‌లలో చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని స్వాతీ ఫిలింస్ సర్య్కూట్ పతాకంపై మాలతీవేలు, ఎస్.సుక్కురుల్లా నిర్మిస్తున్నారని దర్శకుడు రంగా తెలిపారు. -
లిప్‌లాక్‌కు ఓకే!
అవసరం అయితే అందాలారబోతకే కాదు, చుంబన సన్నివేశాల్లోనూ నటించడానికి అభ్యంతరం లేదు అంటున్నారు వర్ధమాన నాయకి భారతనాయుడు. ఏమిటీ పేరు చూడగానే ఆంధ్రా అమ్మాయి అనిపించిందా?ఎస్ అక్షరాల ఆరణాల తెలుగమ్మాయి ఈ బ్యూటీ. పుట్టింది గుంటూరు. పెరిగింది హైదరాబాద్. ఇప్పడు తమిళ చిత్ర పరిశ్రమలో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు.కోలీవుడ్‌లో అంజలి, శ్రీదివ్య తమకే సొంతమైన స్టైల్లో రాణిస్తున్నారు. ఆ కోవలో ఈ నవ నాయకి చేరాలని ఆశ పడుతున్నారు. నాట్యంలో మంచి నైపుణ్యం కలిగిన భారతనాయుడికి తెలుగుతో పాటు తమిళం, కన్నడం,ఆంగ్లం భాషలు ధారాళంగా మాట్లాడగలనంటున్నారు.ఈ బ్యూటీ కోలీవుడ్, టాలీవుడ్‌లలో పలు చిత్రాలు చేస్తుండడం గమనార్హం. అవేమిటో భారతనాయుడి మాటల్లోనే చూద్దాం.ప్రస్తుతం తమిళంలో తేన్మిఠాయ్ చిత్రం ద్వారా పరిచయం అయ్యాను. దీనికి జే.భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మిర్చిశివకు జంటగా అడ్రా మచ్చాన్ విజిలు చిత్రం,రాఘవ లారెన్స్ వద్ద కాంచన,కాంచన-2 చిత్రాలకు పని చేసిన ముత్తుపాండియన్ దర్శకత్వం వహిస్తున్న నిరంజనా చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు రషీద్ దర్శకత్వంలో మంజల్ ఆరు, వరదన్ దర్శకత్వంలో రెండు కోడి మూను కోడి చిత్రాలను కొత్తగా అంగీకరించిన చిత్రాలు. తె లుగులోనూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, రిలేషన్షిప్ చిత్రాల్లో కథానాయికిగా నటిస్తున్నాను. దీపికాపదుకొనే, విద్యాబాలన్ పోషించిన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను. కథ,పాత్ర డిమాండ్ చేస్తే అందాలారబోతకు,లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి అభ్యంతరం లేదు.తమిళంలో బాలా,మిష్కిన్ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి ఉంది. -
విశాల్, క్యాథరిన్ లిప్‌లాక్‌కు కత్తెర
నటుడు విశాల్ నటి క్యాథరిన్ ట్రెసాల లిప్‌లాక్ కిస్‌లకు సెన్సార్ కత్తెర వేసింది. విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కథాకళి. మెడ్రాస్ చిత్రం ఫేమ్ క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. రెజీనా కస్సాంద్ర, నాజర్, కరుణాస్, సూరి, శ్రీజిత్ రవి, లక్ష్మి రామక్రిష్ణన్ పోషించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీత బాణీలు అందించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సంక్రాంతికి బరిలోకి దూకడానికి సిద్ధమవుతున్న కథాకళి చిత్రాన్ని సెన్సార్‌కు పంపనున్నారు. ఈచిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ దృశ్యాలు చోటు చేసుకున్నాయట. ఆ సన్నివేశాలను ముందుగానే ట్రైలర్లో జోడించి సెన్సార్‌కు పంపగా అక్కడ సెన్సార్ సభ్యులు ఆ సన్నివేశాలను నిర్దాక్షణ్యంగా కట్ చేసి విశాల్ క్యాథరిన్ ట్రెసాల చుంబనాలకు దగ్గరయ్యే వరకూ సన్నివేశాలు ఉంచి మిగతావి కట్ చేసి ట్రైలర్‌ను చేతిలో పెట్టారట. దాన్నే ప్రచారం చేస్తున్న చిత్ర యూనిట్ ఇప్పుడు మెయిన్ చిత్రంలో అలాంటి సన్నివేశాలు లేకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారని సమాచారం. లవ్,కామెడీ, యాక్షన్, అంటూ పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన చిత్రం కథాకళి అంటున్నారు చిత్రవర్గాలు. -
లిప్ లాక్కు సై
చెన్నై: లిప్ టూ లిప్ కిస్‌లకు ఛీఛీ, ఛాఛా అనే హీరోయిన్లు ఒకప్పుడు ఉండేవారేమో కాదనలేమ్. ఇప్పుడు అలాంటి హీరోయిను జల్లెడేసినా కనిపించరేమో. లిప్ లాక్కు నేను దూరం అనే మాటలు ఇంతకుముందు అక్కడక్కడా వినిపించేవి. ఇప్పుడు మాత్రం నేను సైతం అనే వారే కనిపిస్తున్నారు. పైగా అందులో తప్పేముంది అని ప్రశ్నించడానికి వెనుకాడటం లేదు. ఒకప్పటి పాశ్చాత్య సంప్రదాయం అయిన చుంభనాల చర్య ఇప్పుడు స్వదేశీ ఆనవాయితీగా మారిపోయింది. ఈ దృశ్యాలు సినిమాల్లోనే కాదు నిజజీవితంలో పెరిగిపోతున్నాయి. ఇక ఆ మధ్య గ్లామర్‌కు నేను దూరం అంటూ మడి గట్టుకున్నట్లు నటించిన నటి రెజీనా అందాల ఆరబోతలో హద్దులు మీరడానికి వెనుకాడనంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది. ఆ ఏముందిలే గ్లామర్ గురించేగా ఈ గడుగ్గాయి అంది అని సరిపెట్టేసుకుంటే ఇప్పుడు లిప్ టూ లిప్ కిస్‌లకు నేను సైతం అనేసింది. అంతేకాదు నేను నటించే లిప్ లాక్ సన్నివేశం ఎలా ఉండాలంటే అదో కొత్త ట్రెండ్‌కు దారితీయాలి. రికార్డు సృష్టించాలి అంటోంది. కొసమెరుపుగా ఇందుకు కథ డిమాండ్ చేయాలి సుమా అని దీర్గాలు తీస్తోంది. ఇంతకీ ఈ రెజీనా గుర్తుందా? ఆ మధ్య కేడీ బిల్లా కిలాడీ రంగా తదితర రెండు మూడు చిత్రాలు చేసింది. ఆ తరువాత ఇక్కడ అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్‌కు గెంతింది. అక్కడ అవకాశాలు, అందస్తు బాగానే పెంచుకుంది. క్రేజీ హీరోయిన్గా ఎదగడానికే ఇప్పుడీ లిప్ టూ లిప్ ఎత్తుగడ అని అర్థం కావడంలేదూ. ఏమిటీ రెజీనా పెద్ద నెరజాణే అనిపిస్తుందా? ఎంతైనా నటి కదా’ -
కంగనా కిస్సా?
కంగనా లిప్ ‘లాక్’ సీన్లు సినిమా సక్సెస్‘కి’ వర్కవుట్ అవుతాయా.... కంగనా కిస్సా ఏమిటి? ‘‘ముద్దు సీన్స్‌లో నటించడానికి నాకేం మొహమాటం’’ అన్నట్లుగా ఉంటుంది కంగనా రనౌత్ వ్యవహారం. ఎందుకంటే, ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో దాదాపు అరడజను సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చేశారు కంగన. తాజాగా, ‘కట్టీ బట్టీ’ చిత్రం కోసం హీరో ఇమ్రాన్ ఖాన్‌తో కూడా అదే కిస్సా..! ఇక, కంగన ముద్దు, ముచ్చట్లు తెలుసుకుందాం. తొలి చిత్రంలోనే లిప్ లాక్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నో కలలతో ముంబయ్‌లో అడుగుపెట్టారు కంగనా రనౌత్. మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నేపథ్యంలో ‘గ్యాంగ్‌స్టర్’లో నటించే అవకాశం వచ్చిందామెకు. ఇందులో ఆమె ఓ డాన్ లవర్. నిత్యం మద్యం మత్తులో ఉంటుంది. తొలి చిత్రంలో ఇలాంటి పాత్ర అంటే సాహసమే. పైగా లిప్ లాక్ సీన్ కూడా ఉంది. కంగన ఏమీ ఆలోచించలేదు.. ఆ సీన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా మొదటి సినిమాలోనే పెదవి ముద్దు సన్నివేశంలో నటించి, నలుగురూ తన గురించి మాట్లాడుకునేలా చేశారామె. అది కంగనాకు మంచి పబ్లిసిటీగా ఉపయోగపడింది. నటనపరంగా కూడా ‘వంక పెట్టలేని ఆర్టిస్ట్’ అనిపించుకున్నారామె. మనూతో ముద్దుకి సై! కంగన కెరీర్ ఓ మెట్టు ఎదగడానికి కారణంగా నిలిచిన చిత్రం ‘తను వెడ్స్ మను’. అప్పటివరకూ నటించిన చిత్రాల ద్వారా కంగన మంచి పెర్ఫార్మర్ అనిపించుకున్నప్పటికీ ఈ చిత్రం నటిగా ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. హోమ్లీ క్యారెక్టర్స్‌కి కూడా కంగన బ్రహ్మాండంగా పనికొస్తుందని ప్రూవ్ చేసిన చిత్రం ఇది. ఇందులో చిత్రకథానాయకుడు మాధవన్‌తో కలిసి లిప్ లాక్ సీన్లో నటించారామె. ఫ్యామిలీ మూవీలో లిప్ లాకేంటి? అనే విమర్శలు రాలేదు. ఎందుకంటే చిత్రదర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ఈ సన్నివేశాన్ని ఈస్థటిక్‌గా చిత్రీకరించారు. ఆ కిస్ సూపర్! బాలీవుడ్లో ఇప్పటివరకూ చిత్రీకరించిన పెదవి ముద్దు సన్నివేశాల్లో టాప్ టెన్ అనదగ్గ వాటిలో జాన్ అబ్రహాం, కంగనా రనౌత్‌ల కిస్ సీన్ ఉంది. ‘షూట్ అవుట్ ఎట్ వదాలా’ చిత్రం కోసం తీసిన పడక గది సన్నివేశంలో ఈ ఇద్దరి మధ్య పెదవి ముద్దు సీన్ ఉంటుంది. మోస్ట్ హాటెస్ట్ కిస్ సీన్ ఇదని బాలీవుడ్ వర్గాలు కితాబులిచ్చాయి. 2013లో ఈ కిస్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. అంతగా ఘాటైన ముద్దు సన్నివేశంలో నటించిన జాన్ అబ్రహాం ఇకనుంచి అలాంటి సీన్స్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రియా రుంచల్‌ని పెళ్లి చేసుకున్నాక జాన్ తీసుకున్న నిర్ణయం ఇది. రాణి ముద్దు బాగుందన్నారు ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్‌కి కంగన పనికొస్తుందని ప్రూవ్ చేసిన చిత్రం ‘క్వీన్’. ఆత్మస్థైర్యం ఉన్న పంజాబీ అమ్మాయి రాణీ మెహ్రాగా ఇందులో కంగన కనబర్చిన అభినయం సూపర్. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా దక్కిందామెకు. ఈ చిత్రంలో ఓ ఇటాలియన్ చెఫ్‌తో కంగన లిప్ లాక్ చేశారు. అక్కడ ఆ ముద్దు ఉంటేనే బాగుంటుందని స్వయంగా కంగనాయే సజెస్ట్ చేసిందని చిత్రదర్శకుడు వికాస్ బహల్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. సినిమా చూసినవాళ్లకి కూడా అది ‘పెట్టుడు ముద్దు సీన్’ అనిపించలేదని, బాగుందని అన్నారు. హీరో పెదవి కొరికేసిన కంగనా ఓ పొలిటికల్ పార్టీకి లీడర్‌గా కంగనా రనౌత్ పవర్ఫుల్ రోల్లో కనిపించిన చిత్రం ‘రివాల్వర్ రాణి’. ఈ చిత్రంలో ఓ హాట్ లిప్ లాక్ సీన్ ఉంది. సినిమాలో వీర్ దాస్‌ని మీదకు లాక్కుని అతని అధరాలను కంగన క్యారెక్టర్ చుంబిస్తుంది. వీర్ దాస్, కంగన పాల్గొనగా ఈ సీన్ తీసినప్పుడు ఓ తమాషా జరిగింది. పొరపాటున వీర్ దాస్ పెదాలను కంగనా కొరికేశారు. ఆ బైట్ కారణంగా వీర్ పెదాల నుంచి రక్తం కారిందంటే ఏ రేంజ్లో కంగన కొరికేసి ఉంటారో ఊహించుకోవచ్చు. ఈ ముద్దు చాలా హాట్ గురూ అని బాలీవుడ్‌వారు సర్టిఫికెట్ ఇచ్చేశారు. ముద్దు సీన్‌కి 24 గంటలు ఇప్పటివరకూ కంగనా చేసిన కిస్ సీన్స్ అన్నీ ఒక ఎత్తయితే ‘కట్టీ బట్టీ’లో చేసిన సీన్ మరో ఎత్తు అనే చెప్పాలి. ‘లిప్ టు లిప్ కిస్సియాన్..’ అనే పాట కోసం చిత్రకథానాయకుడు ఇమ్రాన్ ఖాన్, కథానాయిక కంగన పాల్గొనగా ఈ సీన్ తీశారు. రోజుకి ఎనిమిది గంటలు చొప్పున మూడు రోజులు ఇమ్రాన్, కంగన మధ్య ఈ సీన్ తీశారు. మోషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ లిప్ లాక్ సీన్‌ని చిత్రీకరించారు. ఇప్పటివరకూ అంతర్జాతీయ చిత్రాల్లోనే ఈ టెక్నాలజీని వాడారు. సో.. మోషన్ టెక్నాలజీ వాడిన తొలి భారతీయ చిత్రంగా ‘కట్టీ బట్టీ’ రికార్డ్ సొంతం చేసుకుంది. మరి.. ఈ లిప్ లాక్కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాల్సిందే. -
ఆ ముద్దుగుమ్మ మధుశాలినే!
చాలా కాలం తరువాత కమలహాసన్ నేరుగా తెలుగులో నటిస్తున్న కొత్త సినిమా ‘చీకటి రాజ్యం’. తెలుగు, తమిళాల్లో (తమిళ టైటిల్ ‘తూంగావనమ్’) ఏకకాలంలో నిర్మాణమవుతున్న ఈ సినిమాలో కమలహాసన్ సరసన త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమవడాని కన్నా ముందే ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను మీడియా మీట్లో కమలహాసన్ స్వయంగా విడుదల చేశారు. తుపాకీ పట్టుకొని, ముఖం కనిపించని ఒకమ్మాయిని గాఢంగా ముద్దాడుతున్న కమల్ లాంటి ఫోటోలన్నీ ఈ ‘థ్రిల్లర్’ పట్ల ఆసక్తి పెంచాయి. ఇంతకీ ఆ బొమ్మలో ముద్దిస్తున్న అమ్మాయి ఎవరని చర్చ జరిగింది. ఆ నటి ఎవరన్నది చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు కానీ, త్రిష కావచ్చేమో అని ఊహాగానాలు రేగాయి. అయితే, ఆ నటి మరెవరో కాదు... మన తెలుగమ్మాయి మధుశాలిని అని తేలింది. కూచిపూడి నర్తకి, ఇ.వి.వి. ‘కితకితలు’ దగ్గర నుంచి ఇటీవలి ‘గోపాల... గోపాల’ దాకా పలు చిత్రాల్లో నటించిన వర్ధమాన కథానాయిక మధుశాలిని ఈ సినిమాతో బంపర్ ఛాన్స్ కొట్టేశారు. తమిళంలో విశాల్, ఆర్యల ‘అవన్ - ఇవన్’లోనూ నటించిన మధుశాలినికి ఇది పెద్ద ఆఫరనే చెప్పాలి. ఈ ముద్దు సీన్ ఫస్ట్‌లుక్‌లో ముఖంగా కనిపించకుండా ఆసక్తి రేపిన ఆమెది ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర. ఇప్పటికే కొన్ని రోజుల షూటింగ్‌లోనూ ఆమె పాల్గొన్నారు. థ్రిల్లర్ సినిమా కావడంతో అంతకు మించి వివరాలు ఎవరూ వెల్లడించడం లేదు. కమలహాసన్, త్రిష, ప్రకాశ్‌రాజ్, మధుశాలిని తదితర ముఖ్య తారాగణమంతా పాల్గొనగా, ఇప్పటికి దాదాపు పది రోజులుగా హైదరాబాద్ పరిసరాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ‘‘మరో రెండు, మూడు రోజులు ఇక్కడే షూటింగ్ సాగుతుంది. తరువాయి షెడ్యూల్ చెన్నైలో ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే షార్ట్‌ఫిల్మ్ ‘సీతావలోకనం’లో సీతగా అందంగా కనిపించిన మధుశాలినికి ఇటు తెలుగు, అటు తమిళాల్లో వచ్చే ఈ పెద్ద సినిమాతో బ్రేక్ వస్తుందేమో! -
చీకటిరాజ్యంలో లిప్‌లాక్‌లు
'చీకటి రాజ్యం' చుంభనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కమల్ తాజా చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు హాట్ టాఫిక్ అయ్యింది. లిప్‌లాక్ దృశ్యాలు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. అలాంటి సన్నివేశాలను తప్పుపట్టే స్థాయి దాటిపోయింది. హీరోయిన్లు కూడా లిప్‌లాక్ దృశ్యాల్లో నటిస్తే తప్పేమిటి? అని ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. ఇంతకు ముందు చుంభనాల దృశ్యాలకు తాను దూరం అన్న హీరోయిన్లు ఇప్పుడు కథ డిమాండ్ చేయడంతో కాదనలేకపోయానని అయినా ఆ సన్నివేశంలో అసభ్యం లేకుండా దర్శకుడు కళాత్మకంగా చిత్రీకరించారని చెబుతున్న కాలం ఇది. కోలీవుడ్‌లో ఇలాంటి లిప్‌లాక్ దృశ్యాలకు అగ్మార్క్ హీరో కమలహాసన్ అంటారు. ఆయన ప్రతి చిత్రంలోను ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. ఈ విశ్వనాయకుడి చుంభనాల దృశ్యాలు చాలా ఘాటుగా ఉంటాయని అంటారు. తన తాజా ద్విభాషా చిత్రం తెలుగులో 'చీకటి రాజ్యం' తమిళంలో 'తూంగావనం' సినిమాలో ఇలాంటి చుంభన దృశ్యాల మోతాదు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమాన్ని ఇటీవల హైదరాబాదులో నిర్వహించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో కమలహాసన్ నటి త్రిషను ఘాటుగా ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం ఉంది. సాధారణంగా కమల్ చిత్రాలు వివాదాలకు నిలయం అనే పేరుంది. ఇటీవల ఆయన నటించిన ప్రతి చిత్రం తీవ్ర వ్యతిరేకతల మధ్య విడుదలైంది. ఈ తాజా చిత్రంలో చుంభనాల దృశ్యం ఎలాంటి వివాదాలకు తావు తీయనున్నాయో నంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
లిప్ లాక్!
నాలుగేళ్లు కలిసుండి... ఆ తరువాత ఒకరినొకిరు తిట్టుకుని... విడిపోయిన సూపర్ సింగర్ జెనిఫర్ లోపెజ్, నటుడు కాస్పర్ స్మార్ట్ మళ్లీ ఒక్కటయ్యారా! వీళ్ల వాలకం చూస్తుంటే కాదనలేకపోతున్నారు హాలీవుడ్ జనం. రీసెంట్గా ‘అమెరికన్ ఐడల్’ పధ్నాలుగో సీజన్ షూటింగ్ గ్యాప్‌లో ఈ ఇద్దరూ లిప్ లాక్ వేసుకుని మైమరిచిపోయారట! రోజంతా ఒకరినొదిలి ఒకరు ఉండలేనంతగా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారట. ఎంతో కాలం రొమాన్స్ చేసిన ఈ తారలు గత ఏడాది జులైలో విడిపోయారు. భర్త మార్క్ ఆంథోనీతో ఏడేళ్ల కాపురం చేసి విడిపోయిన జెనిఫర్‌కు కాస్పర్ మరింత దగ్గరయ్యాడు. ఎంతో అన్యోన్యంగా తిరిగారు. అయితే కాస్పర్ ఇద్దరు మోడల్స్‌తో క్లోజ్‌గా ఉన్న పిక్చర్స్ ఓ వెబ్సైట్ రిలీజ్ చేసింది. దీంతో వీరు విడిపోయారు. -
ముద్దులతో రికార్డు సాధిస్తా
పెదవి ముద్దులతో రికార్డ్ సాధిస్తానంటోంది నటి రెజీనా. కోలీవుడ్ హీరోయిన్లకు అచ్చొచ్చిన సినిమారంగం అనవచ్చు. మలయాళ భామలు, ముంబయి బ్యూటీస్ దృష్టి ముందుగా దక్షిణాదిలో తమిళ చిత్ర పరిశ్రమ పైనే పడుతుంది. ఇక్కడ హీరోయిన్గా కాలుపెట్టి కాస్త పేరు తెచ్చుకుంటే చాలు ఇతర భాషల్లో బ్రహ్మరథం పట్టేస్తారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నా తాజాగా రెజీనా సినీ కెరీర్‌నే ఉదహరించవచ్చు. ఈ బ్యూటీ తమిళంలో కేడీ బిల్లా కిలాడీ రంగ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించింది. అయినా రెజీనాకు ఇక్కడ మరిన్ని అవకాశాలు రాలేదు. అయితేనేం ఈ అమ్మడిపై టాలీవుడ్ దృష్టి పడింది. అక్కడ కొత్త జంట చిత్రంలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత రారా కృష్ణయ్య, పవర్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పవర్ చిత్రంలో ఆ చిత్ర హీరో రవితేజతో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి బోలెడు ప్రచారం పొందింది. తాజాగా నవ నటుడు, ప్రఖ్యాత నటుడు చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ సరసన పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంలో ఆయన్ని లిప్‌లాక్‌లతో ముంచెత్తిందనే ప్రచారం హోరెత్తుతోంది. నటి రెజీనా ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ ఏదో ఒక విషయంలో ప్రశ్నలు గుప్పిస్తూ తనను నోరుజారే పరిస్థితికి తీసుకొస్తారని నిష్టూరం ఆడింది. మళ్లీ తనే మాట్లాడుతూ ఇంతకీ మీరడిగిన ప్రశ్న ఏమిటి లిప్‌లాక్‌ల విషయం గురించేనా? అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి చుంభనాల సన్నివేశాలలో నటించి రికార్డ్ కెక్కుతానని రెజీనా పేర్కొంది. -
ఏ హీరోతో అయినా లిప్‌లాక్‌కు ఓకే
ఈతరం హీరోయిన్లో హీరోలతో యమ క్లోజ్‌గా ఉండే భామల్లో నటి లక్ష్మీ మీనన్ ఒకరనే ప్రచారం జరుగుతోంది. కుంకి, సుందర పాండియన్, వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో హీరోయిన్గా మంచి పేరుతోపాటు హోమ్లీ ఇమేజ్ను సంపాదించుకున్న లక్ష్మీ మీనన్ ఆ తరువాత తన శైలిని మార్చుకుంటూ వచ్చారు. నాన్ శిగప్పు మనిధన్ చిత్రంలో విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి తన పక్కింటి అమ్మాయి ఇమేజ్ను బద్దలుకొట్టారు. అంతేకాదు హీరోలతో సన్నిహితంగా ఉంటేనే సన్నివేశాలు సహజంగా ఉంటాయని, లేకుంటే అసౌకర్యంగా ఉంటుందన్నారు. విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాలలో నటించడానికి మీ స్నేహమే కారణమా? అన్న ప్రశ్నకు, కథ డిమాండ్ చేస్తే ఏ ఇతర హీరోతో అయినా పెదవి ముద్దు సన్నివేశాల్లో నటిస్తానని నిస్సంకోశంగా అంటున్నారీ భామ. ఈమె సిద్దార్ధ్‌తో రొమాన్స్ చేసిన జిగరదండా చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. -
అధరములను మధుర ఫలములవలె...
సందర్భం నేడు పపంచ ముద్దుల దినోత్సవం నవ్వులు నానా రకములు! ప్రేమలు పలు విధములు!! అదే రీతిన ముద్దులు కూడా సకల రూపములు!!! పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనే రీతిలో ముద్దులందు మోహ ముద్దులు వేరు. ముద్దంటే? పెదవులతో రాసే పొయిట్రీ. ముద్దంటే? శృంగార సౌధానికి చేసే శంకుస్థాపన. ముద్దంటే? గుండెల్లో ఘనీభవించిన ప్రేమను ద్ర(ధృ)వీకరించుకునే ప్రయత్నం. ఇదంతా చూస్తుంటే... అధరాలక్కూడా అయస్కాంత శక్తి ఉందేమో అనిపిస్తుంది. ముద్దుతో కవిత్వం తన్మయత్వం పొందినట్టుగానే, ముద్దుతో వెండితెర పరవళ్లు తొక్కే పరిమళ సంద్రమయ్యింది. ఒకప్పుడు వెండితెరపై ముద్దు అనేది పరమ నిషిద్దం. ఇప్పుడది బాక్సాఫీస్‌కి బంగారు బాతు. ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’లో శ్రీదేవి అన్నట్టుగా - నాయకా నాయికలు తమ అధరములను మధుర ఫలముల వలె కొరుక్కుతినడం ఇప్పుడు ‘కామ’న్. బాలీవుడ్లో ఈ లిప్లాక్లనేవి ఆటోమేటిక్ లాక్ వేసినంత సులభము, సునాయాసము. టాలీవుడ్‌లోనూ అదే పరిస్థితి. ఎన్ని ఉదాహరణలని చెప్పాలి? ఎంత చరిత్ర అని తవ్వి తీయాలి. ఫైనల్‌గా ఈ ‘కిస్’కిందకాండ ప్రేక్షకులకు నయనానందకాండ! తొలి తెలుగు సినిమా ముద్దు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. మనకు స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే విడుదలైన ‘గొల్లభామ’ సినిమాలో లిప్‌లాక్ సీన్ ఉంది. ప్రముఖ నటి అంజలీదేవి తొలి సినిమా అది. అంజలీదేవి, ‘ఈలపాట’ రఘురామయ్యపై ఈ ముద్దు సన్నివేశం చిత్రీకరించారు. సెన్సార్‌వారు అభ్యంతరం వ్యక్తం చేస్తే, అది నిజమైన ముద్దు దృశ్యం కాదని, ఎడిటింగ్‌లో చేసిన మేజిక్ అని చెప్పి తప్పించుకున్నారట ఆ చిత్ర దర్శక, నిర్మా తలు. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఇలాంటి బ్లాస్ట్‌లు చాలా జరిగాయి మరి! తొలి భారతీయసినీ చుంబనం 1933లో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కర్మ’ అనే సినిమా వచ్చింది. అందులో హీరో హీరోయిన్లు హేమాంశురాయ్, దేవికారాణి. వీరిద్దరిపై ఓ సుదీర్ఘ చుంబన దృశ్యం చిత్రీకరించారు. అప్పట్లో అది సూపర్ సెన్సేషన్. భారతీయ వెండితెరపై ఈ రీతిన ముద్దు దృశ్యాన్ని చిత్రీకరించడం ఇదే ప్రథమం. -
కోటిస్తే.. ఆరబోస్తా
సినిమా అనేది గ్లామర్ ప్రపంచం అయితే అందులో గ్లామర్‌ను హీరోయిన్లు సాదకంగా వాడుకుంటూ పారితోషికాన్ని పెంచుకుపోతున్నారు. ప్రస్తుతం కొన్ని మంచి కథా చిత్రాలు వస్తున్న గ్లామర్ డిమాండ్ గ్లామర్దే. కాకపోతే నిన్నగాక మొన్న వచ్చిన నటి లక్ష్మీమీనన్ కోటి రూపాయల పారితోషికం తీసుకునే హీరోయిన్ల క్లబ్లో చేరడానికి తహతహలాడుతుండటమేమిటి! కుంకి చిత్రంలో కొండవాసి పడతిగా మంచి అభినయాన్నే ప్రదర్శించిన ఈ మళయాళ భామ అలా మరో రెండు చిత్రాల్లో నటించిందో లేదో అప్పుడే గ్లామర్ ప్రదర్శనకు రెడీ అయిపోయింది. అదృష్టం తరుముకొస్తున్నట్లు ఈ అమ్మడికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మొదట్లో మోడ్రన్ దుస్తులు తన శరీరాకృతికి సరిపడవని, పక్కింటి అమ్మాయి ఇమేజ్ చాలని దీర్ఘాలు తీసిన లక్ష్మీమీనన్ నాన్ శిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో ఏకంగా లిప్‌లాక్ సన్నివేశాల్లో లీనమై నటించేసింది. అదేమంటే కథ డిమాండ్ మేరకే నటించాల్సి వచ్చిందని స్టేట్మెంట్స్ ఇచ్చేసింది. ఆ తరువాత ఎలాంటి చుంబనాలకైనా రెడీ అంటూ గేట్లు తెరిచేసింది. దీంతో దర్శక నిర్మాతలు ఆమె కాల్షీట్స్ కోసం క్యూ కడుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న లక్ష్మీమీనన్ తన పారితోషికాన్ని ఐదు లక్షలు, పది లక్షలు, అంటూ పెంచుకుంటూపోతోంది. ప్రస్తుతం అరకోటికి చేరిన లక్ష్మీమీనన్ ఇక తన పారితోషికం కోటి అంటోందట. కోటంటే మరి ఎక్కువ అంటున్న దర్శక నిర్మాతలతో కావాలంటే మరిన్ని ముద్దు సన్నివేశాల్లో, మరింత అందాలు ఆరబోయడానికి తాను రెడీ అని నిర్మాతల్ని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చేస్తుందట మాలీవుడ్ ముద్దుగుమ్మ లక్ష్మీమీనన్! -
లిప్‌లాక్ ఓకే కానీ
లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికి రెడీ అంటున్నారు నటి పూనంకౌర్. బహు భాషల్లో నటించినా రావలసిన పేరు మాత్రం ఈ బ్యూటీకి రాలేదు. అయితే ఖచ్చితంగా తనకంటూ ఒక స్థానాన్ని కోలీవుడ్‌లో ఏర్పరచుకుంటానంటున్నారు. ముంబయికి చెందిన ఈ భామ తొలిసారిగా బాలీవుడ్ ప్రవేశానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటూ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ మొదలగు భాషల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మతో చిన్న ఇంటర్వ్యూ. సరైన గుర్తింపు పొందలేకపోయారే? ఆబాధ నాకూ ఉంది. నేనింత కు ముందు నటించిన చిత్రాల గురించి అందరికీ తెలుసు. ఆ చిత్రాలు రీచ్ అయినంతగా నేను ప్రేక్షకులకు రీచ్ అవలేకపోయాను. అయితే ఆ లోటు ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో చేరుతుందనే నమ్మకంతో ఉన్నాను. ఆ చిత్రాలు ఏవి? ఎన్ వళి తనీ వళీ, గెస్ట్, అచ్చారం, రణం చిత్రాలతో పాటు ఇంద్రకుమార్ దర్శకత్వంలో రూ పొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంతో నాకంటూ ఒక స్థానం లభిస్తుందని భావిస్తున్నాను. షూటింగ్లో మిలటరీ అధికారులు భయపెట్టారట? అవును. ఎన్ వళి తనీ వళీ చిత్రంలో ఆర్కె కి జంటగా నటిస్తున్నాను. పాటల చిత్రీకరణ కోసం జార్దాన్ వెళ్లాం. జార్దాన్ ప్రాంత సరిహద్దులో షూటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ మమ్మల్ని షూటింగ్ చేయకుండా ఆ దేశ మిలటరి బెదిరించి తరిమేశారు. అనుమతి పత్రాలు చూపడంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ పాటలో భలే డాన్స్ చేశాను. వదం చిత్రంలో ఫైట్స్ చేశారటగా? ఈ చిత్రం షూటింగ్ కొడెకైనాల్లో నిర్వహించారు. ఇందులో పగ, ప్రతీకారాల పాత్ర కావడంతో యాక్షన్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. దర్శక, నిర్మాతలు డూప్‌తో చేయిద్దామన్నా వద్దని రిస్కీ ఫైట్స్ సన్నివేశాల్లో నటించాను. అనూహ్యంగా కొన్నిసార్లు గాయాలకు గురయ్యాను కూడా. చిత్రం విడుదలానంతరం ప్రేక్షకుల చప్పట్లతో నేను పడిన శ్రమను మరచిపోతాను. ఎలాంటి షరతులు విధిస్తారు? నిజం చెప్పాలంటే నేనెలాంటి షరతులు విధించను. పాత్రకు న్యాయం చేయడానికి కఠినంగా శ్రమించడానికి ఎప్పుడూ సిద్ధమే. చిత్రం ఒప్పుకున్న తరువాత ఎలాంటి సమస్యలు సృష్టించను. ఎలాంటి పాత్రలు ఆశిస్తున్నారు? అతి అనుకోకుంటే నటి శ్రీదేవి, జ్యోతికల మాదిరి నటనకు అవకాశం వున్న పాత్రలు లభిస్తే ఆ పాత్రకు ప్రాణం పోయడానికి ఎంత కష్టపడి అయినా నటించడానికి రెడీ. ఈ మధ్య 6 చిత్రంలో నా నటనకు ప్రశంసలందారుు. హీరోయిన్ ప్రాముఖ్యత వున్న పాత్రలను కోరుకుంటున్నారా? అలాంటి మంచి పాత్రల్లో నటించే అవకాశం వస్తే వెంటనే ఒప్పుకుంటాను. ప్రస్తుతం నటిస్తున్న వదం చిత్రకథ నా పా త్ర చుట్టూనే తిరుగుతుంది. ఇది పూర్తిగా నా కోసమే తయారు చేసిన ట్లు ఉంటుంది. ఈత దుస్తులు ధరిస్తారా? కథకు అవసరం అయితే లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి సిద్ధమే గానీ ఈత దుస్తుల్లో మాత్రం నటించను. మోడ్రన్ దుస్తుల్లో గ్లామరస్‌గా నటించడానికి అభ్యంతరం లేదు. అయితే అందులోను వల్గారిటీ ఉండేలా నటించను. -
సుదీర్ఘ అధర చుంబనం!
ప్రస్తుతం లిప్ లాక్‌ల సీజన్ నడుస్తోంది. యువతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం చాలామంది లిప్ లాక్‌ల సన్నివేశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. సొంతవూరు, గంగపుత్రులు తదితర చిత్రాలతో ఎన్నో పురస్కారాలు గెలుచుకున్న సునీల్‌కుమార్ రెడ్డి తాజాగా తను తీసిన ‘ఒక క్రిమినల్ ప్రేమకథ’లో కథానుసారం ఓ లిప్ లాక్ సీన్ పొందుపరిచారు. ఓ బలమైన కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో సన్నివేశాలన్నీ దాదాపు బలంగానే ఉన్నాయట. వాటిలో ఈ పెదవి ముద్దు సన్నివేశం ఒకటి. హీరోహీరోయిన్లు మనోజ్, ప్రియాంకా పల్లవి పాల్గొనగా ఇటీవల ఈ సన్నివేశం తీశారు. ఇలాంటి సీన్స్‌లో నటించడం అంత సులువైన విషయం కాదు. నటీనటులు మానసికంగా సమాయత్తం కావాలి. మనోజ్, ప్రియాంక అలానే అయ్యారు. కానీ, సునీల్‌కుమార్ రెడ్డి ‘స్టార్ట్ కెమెరా..’ అనగానే అదరాలు వణకడం మొదలుపెట్టాయి. ఇక, చుంబనం సంగతి దేవుడెరుగు. మొత్తానికి టేక్స్ మీద టేక్స్ తీసుకున్నారట. ఫలితంగా ఈ ఒక్క సన్నివేశం చిత్రీకరణకు పట్టిన సమయం ఎనిమిది గంటలు. అది ఓకే.. కానీ, చిత్రీకరణకు అయిన నిడివి ఆ సినిమా మొత్తం నిడివి అంత అట. పెదవి ముద్దు సన్నివేశం నిడివి 90 సెకన్లకు పైగా ఉంటుందట. ఇప్పటివరకు తెలుగు తెరపై ఇంత నిడివి గల చుంబనం రాలేదని నిర్మాత రవీంద్రబాబు పేర్కొన్నారు. ఈ చిత్రం త్వరలోనే రానుంది. -
ఎవరేమన్నా అనుకోనీ..
సక్సెస్ మనిషిలో చాలా మార్పు తీసుకొస్తుంది. అది నమ్మకాన్నేకాదు కించిత్ గర్వాన్ని పెంచుతుంది. విజయాన్ని తలకెక్కించుకోరాదంటారు. అయితే దాన్ని అమలుపరచడం అంత సాధ్యం కాదు. నిన్నగాక మొన్న వచ్చిన నటి లక్ష్మీమీనన్‌ను గమనిస్తే సక్సెస్ ఆమెలో ఎంత మార్పును, తెగింపును తీసుకొచ్చిందో అర్థం అవుతుంది. తొలి చిత్రం కుంకీ, సుందరపాండియన్, కుట్టిపులి, పాండియనాడు, నాన్ శిగప్పుమనిధన్, అంటూ వరుస విజయాలు ఆమె సొంతం చేసుకుంది. ఇటీవల ఇన్ని హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న నటి ఈమేనని చెప్పవచ్చు. అంతేకాదు మరో నాలుగైదు చిత్రాలతో ఈ అమ్మడి డైరీ ఫుల్‌గా ఉంది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి లక్ష్మీమీనన్ తెలుపుతూ జిగర్తండా, మంజాపై చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని ఈ నెలలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయన్నారు. తాను అంచనాలు పెంచుకున్న మరో చిత్రం సిపాయి అని తెలిపారు. గౌతమ్ కార్తిక్‌తో రొమాన్స్ థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నారు. తమది ముచ్చటైన జోడి అని పేర్కొన్నారు. ఇటీవలే ప్లస్ పాసయిన ఈ ముద్దుగుమ్మ చదువైనా నటనైనా ప్రణాళిక అంటూ ఏమీ ఉండదంటున్నారు. లిటరేచర్ ఆఫ్ కామర్స్‌లో ఉత్తీర్ణత పొంది డిగ్రీ పట్టా అందుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. సినిమాలో మంచి పాత్ర అనిపిస్తేనే అంగీకరించాలని నిర్ణయించుకున్నానన్నారు. ఇటీవల నాన్‌శిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్‌తో నటించిన లిప్‌లాక్ సన్నివేశాలు పెద్ద కలకలాన్నే పుట్టించాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ, ఆ చిత్రంలో తమ మధ్య రొమాన్స్ సన్నివేశాలతోపాటు, కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యిందన్నారు. ఈ సన్నివేశాల్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారని కాబట్టి ఈ విషయంలో ఎవరేమనుకున్నా పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు. అసలు అలాంటి ప్రచారం గురించి వినే టైమ్ కూడా తనకు లేదని తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఈ భామ మలయాళ చిత్రంలో నటిస్తున్నారు.