లిప్ లాక్ కు అభ్యంతరం లేదు: లక్ష్మీ మీనన్
లిప్ లాక్ కు అభ్యంతరం లేదు: లక్ష్మీ మీనన్
Published Mon, Mar 17 2014 4:32 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
లిప్ లాక్ ఎలాంటి అభ్యంతరాలు లేవని దక్షిణాది తార లక్ష్మీ మీనన్ స్పష్టం చేశారు. త్వరలో విడుదల కానున్న నాన్ సిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్ కృష్ణతో లక్ష్మీ మీనన్ లిప్ లాకేసిన సంగతి తెలిసిందే. ఇటీవల మీడియాతో లక్ష్మీ మీనన్ మాట్లాడుతూ.. స్కిప్ల్ లో భాగమై.. ప్రాధాన్యత కలిగి ఉంటే లిప్ లాక్ వెనుకాడను అని లక్ష్మీ మీనన్ వెల్లడించింది.
కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ ఆలోచించనని.. దర్శకుడు తిరు లిప్ లాక్ సీన్ గురించి చెప్పినపుడు తాను ఓకే అన్నాను అని తెలిపారు. అంతేకాని ప్రేక్షకులను కేవలం సినిమా థియేటర్ కు రప్పించడానికి తాను లిప్ లాక్ సీన్లు చేయను అని అన్నారు.
నాన్ సిగప్పు మనిదన్ చిత్రం కోసం తొలిసారి విశాల్ తో కలిసి లిప్ లాక్ సీన్ లో పాల్గొన్నాను. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే. ప్రేక్షకులకు తప్పక నాన్ సిగప్పు మనిదన్ చిత్రం నచ్చుతుందని లక్ష్మీ మీనన్ వెల్లడించింది. నాన్ సిగప్పు మనిదన్ చిత్రం ఇంద్రుడు పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది.
Advertisement
Advertisement