Vishal Krishna
-
ఘనంగా హీరో విశాల్ సోదరి వివాహం
-
మాలో విభేదాలా.. లేనే లేవు
నడిగర సంఘంలో విభేదాలు తలెత్తాయంటూ వచ్చిన వదంతులను సంఘం సెక్రటరీ జనరల్, హీరో విశాల్ ఖండించాడు. ఈ మేరకు శుక్రవారం ఉదయం విశాల్ ఓ ట్వీట్ చేశాడు. ''నడిగర సంఘంలో విభేదాలా? దమ్ముంటే తీసుకురండి. ఈ టీమ్ మొత్తం ఒకే కుటుంబంలా కలిసి ఉంటుంది, సంఘ సభ్యుల సంక్షేమం కోసమే పనిచేస్తుంది. సంఘానికి కొత్త భవనం కావాలన్న కోరిక తీరేవరకు మేమంతా ఇలాగే కలిసుంటాం'' అని తన ట్వీట్లో చెప్పాడు. అయితే, ఈ వదంతులు ఎందుకు, ఎప్పుడు వచ్చాయన్నది మాత్రం తెలియడం లేదు. ఇంతకుముందున్న శరత్‌కుమార్ టీమ్‌ను ఓడించి విశాల్ టీమ్ గెలిచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా నడిగర సంఘానికి కొత్త భవనం కట్టించాలన్న నినాదంతోనే విశాల్ టీమ్ తన ప్రచారాన్ని సాగించింది. తెలుగు - తమిళ అన్న విభేదాలు తెచ్చే ప్రయత్నాలు జరిగినా, చివరకు విశాల్ టీమ్ విజయం సాధించింది. Split n our #nadigar sangam team? -
టెంపర్ తమిళ రీమేక్ హీరో ఇతడే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించి, మంచి వసూళ్లు రాబట్టిన సినిమా టెంపర్. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమైంది. స్వతహాగా తెలుగువాడైనా కోలీవుడ్‌లోనే స్థిరపడిన విశాల్ కృష్ణ ఈ రీమేక్‌లో పోలీసు పాత్రను పోషిస్తున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్టులో శింబు నటిస్తాడని తొలుత కథనాలు వచ్చాయి. కానీ, చివరకు అధికారికంగా వచ్చిన ప్రకటన ప్రకారం విశాల్ హీరో అని తేలింది. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న తుప్పరివాలన్ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. అది పూర్తికాగానే టెంపర్ మొదలుపెడతాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విశాల్‌కు టెంపర్ సినిమా తెగ నచ్చేసిందని, అందులో ఎన్టీఆర్ చేసిన పాత్రకు న్యాయం చేయాలని భావిస్తున్నాడని అంటున్నారు. తెలుగులో జూనియర్ సరసన నటించిన కాజల్ అగర్వాలే తమిళంలోనూ హీరోయిన్గా చేస్తుందట. ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన అనల్ అరసు మెగాఫోన్ పట్టుకుంటారు. -
విశాల్ చిత్రంలో రమ్యకృష్ణ
చెన్నై: తన దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ ముఖ్య భూమిక పోషించనున్నారని ఆ చిత్ర దర్శకుడు సుందర్. సి బుధవారం చెన్నైలో వెల్లడించారు. ఆ చిత్రం త్వరలో హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు. ఆ షూటింగ్లో రమ్య పాల్గొంటారని తెలిపారు. తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా రమ్యకృష్ణ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. 1990లో తమిళంలో తెరకెక్కిన కుట్టి పిశాసు చిత్రం ఆమె నటించిన అఖరి చిత్రమని సుందర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బహుబలిలో నటిస్తు రమ్యకృష్ణ మహా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
దెబ్బ తగిలిందో.. బొమ్మ బంపర్ హిట్టే
షూటింగ్ సమయంలో ఏదైనా దెబ్బ తగిలిందంటే, ఆ సినిమా బంపర్ హిట్ అవుతుందంటున్నాడు తమిళ సినిమాల్లో క్లిక్కయిన తెలుగబ్బాయి విశాల్ కృష్ణ. ప్రస్తుతం శృతి హాసన్‌తో కలిసి 'పూజై' అనే సినిమాలో విశాల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ఫైటింగ్ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు అతడి చెయ్యి విరిగింది. అయినా కూడా షూటింగ్ ఏమాత్రం ఆపకుండా అలాగే కొనసాగిస్తున్నాడు. ఈ సినిమా సెట్ల మీద షూటింగులో ఉండగా విశాల్ గాయపడటం ఇది రెండోసారి. కరైకుడిలో ఓ యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తున్నామని, డైవింగ్ చేస్తుండగా తాను జారిపడుతూ.. ముఖం కిందపడకుండా చెయ్యి అడ్డుపెట్టుకున్నానని, దాంతో చెయ్యి కాస్తా విరిగిందని విశాల్ తెలిపాడు. సెట్లోనే తనతో పాటు ఓ డాక్టర్, ఓ ఫిజియోథెరపిస్టు కూడా ఉండటంతో షూటింగ్ ఆపలేదని అన్నాడు. తాను షూటింగ్ సమయంలో గాయపడిన సినిమాలన్నీ బ్రహ్మాండంగా హిట్టయ్యాయని, దాంతో తాను గాయపడితే సినిమా హిట్టవుతుందన్న సెంటిమెంటు తనకుందని, అందుకే షూటింగ్ ఆపలేదని కూడా వివరించాడు. ఈ సినిమాలోనే ఒకసారి విశాల్ గాయపడి ఎక్కువ రోజులు కూడా కాలేదు. హరిగోపాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విశాల్ సరసన టాప్ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తోంది. -
ఇంద్రుడు మూవీ ఆడియో లాంచ్
-
లిప్ లాక్ కు అభ్యంతరం లేదు: లక్ష్మీ మీనన్
లిప్ లాక్ ఎలాంటి అభ్యంతరాలు లేవని దక్షిణాది తార లక్ష్మీ మీనన్ స్పష్టం చేశారు. త్వరలో విడుదల కానున్న నాన్ సిగప్పు మనిదన్ చిత్రంలో విశాల్ కృష్ణతో లక్ష్మీ మీనన్ లిప్ లాకేసిన సంగతి తెలిసిందే. ఇటీవల మీడియాతో లక్ష్మీ మీనన్ మాట్లాడుతూ.. స్కిప్ల్ లో భాగమై.. ప్రాధాన్యత కలిగి ఉంటే లిప్ లాక్ వెనుకాడను అని లక్ష్మీ మీనన్ వెల్లడించింది. కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ ఆలోచించనని.. దర్శకుడు తిరు లిప్ లాక్ సీన్ గురించి చెప్పినపుడు తాను ఓకే అన్నాను అని తెలిపారు. అంతేకాని ప్రేక్షకులను కేవలం సినిమా థియేటర్ కు రప్పించడానికి తాను లిప్ లాక్ సీన్లు చేయను అని అన్నారు. నాన్ సిగప్పు మనిదన్ చిత్రం కోసం తొలిసారి విశాల్ తో కలిసి లిప్ లాక్ సీన్ లో పాల్గొన్నాను. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే. ప్రేక్షకులకు తప్పక నాన్ సిగప్పు మనిదన్ చిత్రం నచ్చుతుందని లక్ష్మీ మీనన్ వెల్లడించింది. నాన్ సిగప్పు మనిదన్ చిత్రం ఇంద్రుడు పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది.