
విశాల్ చిత్రంలో రమ్యకృష్ణ
చెన్నై: తన దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ ముఖ్య భూమిక పోషించనున్నారని ఆ చిత్ర దర్శకుడు సుందర్. సి బుధవారం చెన్నైలో వెల్లడించారు. ఆ చిత్రం త్వరలో హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు. ఆ షూటింగ్లో రమ్య పాల్గొంటారని తెలిపారు. తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా రమ్యకృష్ణ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.
1990లో తమిళంలో తెరకెక్కిన కుట్టి పిశాసు చిత్రం ఆమె నటించిన అఖరి చిత్రమని సుందర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బహుబలిలో నటిస్తు రమ్యకృష్ణ మహా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.