Ramya Krishnan
-
దళపతి కొత్త మూవీలో శివగామి.. ఏకంగా అలాంటి పాత్రలో!
దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. వెంకట్ ప్రభు దర్శకుడు. విజయ్.. తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ క్రేజీ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రంలో భారీ తారాగణమే నటిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, యోగిబాబు, కిచ్చా సుదీప్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఇప్పుడు మరో ప్రముఖ నటి కూడా జాయిన్ అయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ.. 'బాహుబలి'లో శివగామిగా చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పుడు విజయ్ కొత్త మూవీలో నటిస్తున్న స్వయంగా ఆమెనే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చైన్నెలో ప్రారంభమై థాయిలాండ్, టర్కీ, హైదరాబాద్‌లో జరిగింది. తదుపరి షెడ్యూల్ క్రిస్మస్ తర్వాత అంటే జనవరి తొలివారంలో ప్రారంభం కానుందని సమాచారం. (ఇదీ చదవండి: మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఒక్కటిగా కనిపించిన ఆ ఇద్దరు!) -
Jailer Movie Release Fans Celebration: రజనీకాంత్ ‘జైలర్’మూవీ విడుదల.. అభిమానుల సందడి (ఫోటోలు)
-
రజినీకాంత్ 'జైలర్' మూవీ స్టిల్స్
-
స్టార్ స్టార్ స్పూర్ స్టార్ - రమ్యకృష్ణ
-
Rangamarthanda Review: ‘రంగమార్తాండ’ రివ్యూ
టైటిల్: రంగమార్తాండ నటీనటులు: ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నిర్మాతలు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి దర్శకత్వం : కృష్ణవంశీ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: రాజ్ కె.నల్లి విడుదల తేది: మార్చి 22, 2023 క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘నక్షత్రం’(2017) బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ..ఇప్పుడు ‘రంగమార్తాండ’తో వచ్చాడు. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్‌లో భాగంగా సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలతో పాటు మీడియాకు కూడా పలుమార్లు ప్రిమియర్స్ వేడయంతో ‘రంగమార్తాండ’కు బజ్ ఏర్పడింది. భారీ అంచనాల ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ‘రంగమార్తాండ’ కృష్ణవంశీకి కమ్‌బ్యాక్ చిత్రమైయిందా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రాఘవరావు(ప్రకాశ్ రాజ్) ఓ రంగస్థల కళాకారుడు. తన నటనతో ప్రేక్షకుల అభిమానంతో పాటు ఎన్నో కీర్తిప్రతిష్టతలను సాధిస్తాడు. ఆయన ప్రతిభకు మెచ్చి ‘రంగమార్తాండ’బిరుదుని ప్రదానం చేస్తారు అభిమానులు. అయితే ఆ సత్కార సభలోనే తన రిటైర్మెంట్ని ప్రకటించి అందరికి షాకిస్తాడు. అంతేకాదు తన ఆస్తులను పిల్లలకు పంచిస్తాడు. కొడుకు రంగారావు(ఆదర్శ్), కోడలు గీత(అనసూయ)లకు ఇష్టపడి కట్టుకున్న ఇంటిని, అమ్మాయి శ్రీ(శివాత్మిక రాజశేఖర్)కి తాను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న సొమ్ముని అప్పగిస్తాడు. ప్రేమించిన వ్యక్తి(రాహుల్ సిప్లిగంజ్)తో కూతురు పెళ్లి కూడా చేస్తాడు. ఇలా బాధ్యతలన్ని తీర్చుకున్న రాఘవరావు శేష జీవితాన్ని భార్య(రమ్యకృష్ణ)తో ఆనందంగా గడపాలనుకుంటాడు. మరి రాఘవరావు అనుకున్నట్లుగా శేష జీవితం ఆనందంగా సాగిందా? తను ఇష్టపడి కట్టుకున్న ఇంటి నుంచే ఆయన ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది? పిల్లలే తన సర్వస్వం అనుకున్న రాఘవరావు దంపతులకు జీవితం ఎలాంటి పాఠం నేర్పించింది? భర్తే సర్వస్వం అనుకొని నమ్ముకున్న భార్యకు, చిన్నప్పటిని నుంచి కష్టసుఖాల్లో తోడుగా ఉన్న ప్రాణ స్నేహితుడు చక్రి(బ్రహ్మానందం)కు ఎలాంటి న్యాయం చేశాడు? రంగస్థలంపై గొప్ప నటుడిగా పేరొందిన వ్యక్తి.. జీవితమనే నాటకంలో ఎలా తేలిపోయాడు ? చివరికి అతని నిజజీవితం ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మారాఠీ లో క్లాసిక్ అనిపించుకున్న ‘నటసామ్రాట్’కి తెలుగు రీమేకే రంగమార్తాండ. ఇలాంటి కథను ముట్టుకోవడమే పెద్ద సాహసం. ఆ చిత్రంలో కథ, కథనం కంటే నటన చాలా బలంగా ఉంటుంది. నానా పటేకర్‌తో సహా ఆ సినిమాలో పనిచేసిన వాళ్లంతా కెరీర్ బెస్ట్ యాక్టింగ్‌లు ఇచ్చేశారు. అలాంటి కథను రీమేక్ చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. కానీ ఈ విషయంలో కృష్ణవంశీ వందశాతం విజయం సాధించాడు. ‘నటసామ్రాట్’ సోల్ మిస్ అవ్వకుండా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేసి మెప్పించాడు. తెలుగు నాటకాలు..పద్యాలతో ప్రతి సన్నివేశాన్ని చాలా భావోద్వేకంగా రాసుకున్నాడు. కథ ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపించినా.. రాఘవరావు రంగస్థలం నాటకాలకు రిటైర్మెంట్ ప్రకటించి జీవితం అనే నాటకంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రతి సీన్ చాలా ఎమోషనల్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం అయితే కంటతడి పెట్టిస్తుంది. భార్యను ముద్దగా ‘రాజుగారు’అని పిలుస్తూ సేవలు చేసే దృశ్యాలు హృదయాలను ఆకట్టుకుంటాయి. ’ఆనందం.. రెండు విషాదాల మధ్య విరామం’ అంటూ ఇంటర్వెల్ బోర్డు పడడంతో ప్రేక్షకులు బరువెక్కిన హృదయాలతో సీట్ల నుంచి లేస్తారు. ఇక సెకండాఫ్‌లో వచ్చే ప్రతి సన్నివేశం హృదయాలను హత్తుకుంటాయి. కూతురు దగ్గరకు వెళ్లిన రాఘవరావు దంపతులకు ఎదురైన అవమానాలు.. స్నేహితుడు చక్రి జీవితంలో చోటు చేసుకున్న విషాదాలతో సెకండాఫ్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. ఆస్పత్రిలో ఉన్న చక్రి ‘ముక్తిని ఇవ్వరా’ అంటూ స్నేహితుడిని వేడుకోవడం... ‘మన ఇంటికి మనం వెళ్లిపోదామయ్యా..’ అంటూ రాఘవరావు భార్య అడగడం.. ఇవన్ని గుండెని బరువెక్కిస్తాయి. క్లైమాక్స్ సీన్ చూసి భారమైన మనసుతో, బరువెక్కిన గుండెతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. భార్యభర్తల అనుబంధం, స్నేహబంధాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. ఎవరెలా చేశారంటే.. ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించగల గొప్ప నటుడు ఆయన. రంగమార్తండ రాఘవరావు పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇక ఈ సినిమాకు బ్రహ్మానందం ఒక సర్ప్రైజింగ్ ప్యాకెజ్. చక్రి పాత్రలో ఆయన తన కెరీర్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తర్వాత దర్శకనిర్మాతలు బ్రహ్మానందంను చూసే కోణం మారుతుంది. ఆ స్థాయిలో బ్రహ్మానందం నటన ఉంటుంది. ముఖ్యంగా ఆస్పత్రి సీన్లో ప్రకాశ్‌రాజ్‌ని బ్రహ్మానందం పూర్తిగా డామినేట్ చేశాడు. తెరపై ఓ కొత్త బ్రహ్మానందాన్ని చూస్తారు. ఇక రాఘవరావు భార్యగా రమ్యకృష్ణ నటన అద్భుతమని చెప్పాలి. శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్ తదితరులు పాత్రల పరిధి మేర నటించారు. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన బలం ఇళయరాజా సంగీతం. ఎలాంటి రణగొణ ధ్వనుల లేకుండా.. చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలకు కూడా సినిమాలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్రతి వారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో ‘రంగమార్తాండ’ కచ్చితంగా ఉంటుంది. ఈ కథ కొత్తదేం కాదు. అందరికి తెలిసిన కథే.. మనం నిత్యం చూస్తున్న అమ్మ నాన్నల జీవిత కథే. ఇంత గొప్పకథను అంతేగొప్పగా తెరకెక్కించాడు కృష్ణవంశీ. ఈ తరం, రేపటి తరం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. -అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
ఎందుకు ఈ సినిమా.. ఎవరు చూస్తారని అడిగా : రమ్యకృష్ణ
టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఉగాది సందర్భంగా మార్చి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘సినిమా ప్రారంభానికి ముందు ‘అసలు ఇలాంటి చిత్రాలను ఇప్పుడు ఎవరు చూస్తారు?’ అని కృష్ణవంశీని అడిగాను. కానీ ఆయన మొండి కదా.. వినిపించుకోకుండా షూటింగ్‌ని ప్రారంభించారు. ఇందులో నేను పోషించిన పాత్ర కోసం మొదటగా చాలా మంది హీరోయిన్లను సంప్రదించారు. ఎవరూ ఎంపికకాకపోవడంతో..చివరకు నేను ఆ పాత్ర చేస్తానని ముందుకొచ్చా. కళ్లతోనే నటించాలని చెప్పారు. అలానే నటించాను. నా పాత్ర నిడివి అంత ఉంటుందని ఊహించలేదు. ఎమోషనల్ సినిమాలు నాకు అంతగా నచ్చవు. కానీ ఈ సినిమా షూటింగ్ చేస్తుండగానే.. భావోద్వేగానికి లోనయ్యాం. ప్రతి సీన్ హృదయాలను హత్తుకునేలా తిశాడు. వంశీ కెరీర్లో ఇదొక బెస్ట్ మూవీగా నిలుస్తుంది’ అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. -
‘రంగమార్తాండ’ చిత్రం ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
Fashion: రమ్యకృష్ణ ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఫలానా పాత్ర కోసం ఆమె’ అనే అవకాశాన్ని అందుకునే స్థాయి దాటిపోయి.. ‘ఆమె కోసం ఈ పాత్ర’ అని రచయితలు రాసే.. దర్శకులు ఆలోచించే హోదాకు చేరుకున్న నటి రమ్యకృష్ణ! ఆమెకు సంబంధించిన ఈ ప్రత్యేకత ష్యాషన్ రంగంలోనూ అమలవుతోంది. ఇక్కడ చెబుతున్నది చిన్న ఉదాహరణ మాత్రమే! మనీష్ మల్హోత్రా డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకూ దుస్తులు డిజైన్ చేస్తుంటాడాయన. బాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే. ఫ్యాషన్ వరల్డ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ డిజైనర్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ప్రూవ్ చేసుకున్నాడు. ఫిల్మ్‌ఫేర్‌తో పాటు మరెన్నో అవార్డులనూ అందుకున్నాడు. అయితే అతని డిజైన్స్‌ను సామాన్యుడు అందుకోవాలంటే కాస్త కష్టమే. ఏది కొనాలన్నా ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్లైన్లో లభ్యం. జైపూర్ జెమ్స్.. 1974, ముంబైలో శ్రీపాదం సచేతి ప్రారంభించిన బంగారు ఆభరణాల వ్యాపారమే ఈ ‘జైపూర్ జెమ్స్’. అప్పట్లోనే కస్టమర్ కోరుకున్న డిజైన్స్‌లో ఆభరణాలను తయారుచేసి ఇచ్చేవారు. ఇలా వారికంటూ ఒక ప్రత్యేకత ఉండటంతో నలభై ఎనిమిదేళ్లుగా వారి వ్యాపారం జోరుగానే సాగుతోంది. ప్రస్తుతం చెన్నై, కోయంబత్తూర్లలోనూ జైపూర్ జెమ్స్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: మనీష్ మల్హోత్రా ధర: రూ. 2,75,000 జ్యూయెలరీ బ్రాండ్: జైపూర్ జెమ్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. నాకు డ్రీమ్‌రోల్స్ అంటూ ఏవీ లేవు. నాకొచ్చిన, వస్తున్నవన్నీ నేను కోరుకున్న పాత్రలే. కాబట్టి వాటినే నా డ్రీమ్‌రోల్స్ అనుకోవచ్చు! – రమ్యకృష్ణ ∙దీపిక కొండి View this post on Instagram A post shared by Ramya Krishnan (@meramyakrishnan) -
ఒకే ఒక్క సినిమా.. విలనిజంతో భయపెట్టిన హీరోయిన్లు
హీరోయిన్గా కెరీర్‌ని ప్లాన్ చేసుకోవడం ఎంత కష్టమో… కంటిన్యూ చేయడం కూడా అంతే కష్టం. అందులోనూ అసలు హీరోయిన్ లైఫ్ స్పాన్ ఐదారేళ్లు. అంతకు మించి కష్టం. ఇలా అన్ని వైపుల నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన కెరీర్ అది. అలాంటిది…ఇంకా హీరో యిన్‌గా కంటిన్యూ అవుతూనే విలనిజం వైపు ఒక లుక్ వేయడం అంటే చిన్న విషయం కాదు. సాహసమనే చెప్పాలి. ఇలాంటి సాహసాలు చేసి శభాష్ అనిపించుకునే తారమణులూ ఉన్నారు. అటు గ్లామర్ పాత్రల్లోనూ, ఇటు ఫెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లోనూ సత్తా చాటిన నటి రమ్య కృష్ణ. చంద్రలేఖలో కోమాలో ఉన్నపేషెంట్ పాత్ర నుంచి, బాహుబలిలో శివగామి దాకా అద్భుతంగా చేసిన క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. కానీ… నరసింహాలో నీలాంబరి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. ఫుల్ నెగిటివ్ రోల్ క్యారెక్టర్ అది. పైగా రజినీకాంత్‌తో ఢీ అంటే ఢీ అనే పాత్ర. ఆ క్యారెక్టర్లో రమ్యకృష్ణ జీవించింది. నరసింహ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. ఆ సక్సెస్‌లో రజినీకాంత్‌తో సమాన వాటా రమ్యకృష్ణది కూడా. నీలాంబరి అన్న పేరుకే ఒక సీరియస్ అటెన్షన్ ఇచ్చేసింది తన నటనతో. చాలా కాలం పాటు ఆ పేరు బ్రాండ్‌గా నిలిచింది. టాలీవుడ్లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని ఎంజాయ్ చేసిన అతి తక్కువ హీరోయిన్స్‌లో సౌందర్య ఒకరు. తెలుగులో టాప్ హీరోలందరితోనూ సౌందర్య నటించింది. అటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది సౌందర్య. హీరోయిన్గా కెరీర్ కొనసాగు తున్న సమయంలోనే… నెగిటివ్ రోల్ ప్లే చేసింది సౌందర్య. నా మనసిస్తా రా చిత్రంలో శ్రీకాంత్ , రిచా హీరో, హీరోయిన్లుగా నటిస్తే…విలన్‌గా సౌందర్య యాక్ట్ చేసింది. నెగిటివ్ రోల్ లోనూ మంచి మార్కులను కొట్టేసింది. మహేశ్ బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో విలన్‌గా గోపిచంద్ నటించారు. దేవుడు పాత్రలో గోపిచంద్ ప్రదర్శించిన విలనీజం అప్పట్లో పెద్ద సంచలనమైంది. గోపిచంద్‌తో పాటుగా ఉంటూ అతను చేసే ప్రతి పనికి సహకరిస్తూ ఉంటుంది రాశి. హీరోయిన్ పాత్రల నుంచి లేడీ విలన్ క్యారెక్టర్లోకి రాశి జంప్ చేయడంపై కాస్త డిస్కషన్ కూడా సాగింది. మల్లి పాత్రలో గ్లామర్‌కు క్రూరత్వం మిక్స్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది రాశి. -
Tollywood Actresses: వెండితెరపై నారీమణుల విశ్వరూపం
సినిమాని తీసే తీరులో మార్పొచ్చింది. చూసే విధానంలోనూ ఛేంజ్ కనిపిస్తోంది. బడ్జెట్ పెరిగింది. క్రియేటివిటీ పెరిగింది. టెక్నాలజీ పెరిగింది. కానీ హీరోయిన్ని గ్లామర్ డాల్‌గా చూసే పద్ధతిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఎప్పుడో ఒకసారి నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ దొరుకుతుంది. అప్పుడు వాళ్లు తమ విశ్వరూపం చూపిస్తే దశాబ్దాల పాటు ఆ నటనని ప్రేక్షకులు గుర్తు చేసుకుని మరీ ఆనందిస్తారు. అభినందిస్తారు. ఫెర్ఫా మెన్స్ స్కో ప్ ఉన్న క్యారెక్టర్ దొరికితే అదరహో అనేలా ఆ పాత్రకి జీవం పోసిన హీరోయిన్స్‌ని ఒకసారి చూసేద్దామా? అందం అభినయం. ఇవి రెండు కలిస్తే శ్రీదేవే. గ్లామర్ యాంగిల్లో శ్రీదేవికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో యాక్టింగ్ పరంగా అంతకు మించిన పేరుంది. అయినానిజానికి నటనపరంగా తన సామర్థ్యాన్ని చూపించే అవకాశం చాలా సినిమాల్లో శ్రీదేవికి లభించింది. అయితే... వసంత కోకిల చిత్రంలో పోషించిన విజయ పాత్ర శ్రీదేవి నటజీవితంలోనే మైలు రాయి. ఆరు ఏళ్ల వయ స్సు పిల్ల మైండ్‌లో ఉన్న ఇరవై ఏళ్ల యువతిగా అద్భుతంగా నటించింది శ్రీదేవి. హోమ్లీ క్యారెక్టర్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే నటి సౌందర్య. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉంటూ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అతి తక్కువ కథానాయికల్లో సౌందర్య ఒకరు. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న చాలా పాత్రల్లో సౌందర్య నటించారు. కానీ అంతఃపురంలో భానుమతి క్యారెక్టర్ మాత్రం నిజంగానే ఛాలెంజింగ్ క్యారెక్టర్. కానీ అక్కడ ఉన్నది సౌందర్య. ఇక చెప్పేదేముంది వెండితెర మీద విశ్వరూపమే చూపించింది. అటు గ్లామర్ పాత్రల్లోనూ, ఇటు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లోనూ సత్తా చాటిన నటి రమ్య కృష్ణ. చంద్రలేఖలో కోమాలో ఉన్న పేషెంట్ పాత్ర నుంచి, బాహుబలిలో శివగామి దాకా అద్భు తంగా చేసిన క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. కానీనరసింహాలో నీలాంబరి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. గర్వం, పొగరు ఉన్న జమీందారు కూతురు పాత్రలో జీవించేసింది రమ్యకృష్ణ. తనదైన నటనతో నీలాంబరి అన్న పేరుకే ఒక సీరియస్ అటెన్షన్ ఇచ్చేసింది. ఛాలెంజింగ్ పాత్రల గురించి చెప్పుకునేటప్పుడు మంచు లక్ష్మీ పేరుని మిస్ అవడానికి వీల్లేదు కదా. గుండెల్లో గోదారి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాల్లో మంచు లక్ష్మీ పెర్ఫామెన్స్ అందరి ప్రశంసలు అందుకుంది. గుండెల్లో గోదారి చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. గోదావరి యాసలో డైలాగ్‌ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రంలో ముసలమ్మగా డీగ్లామరైజ్ రోల్ బాగా యాక్ట్ చేసింది. చదవండి: నవరాత్రులు - సినిమాల్లో నారీమణులు: హీరోయినే.. హీరో -
ఓటీటీలోకి రమ్యకృష్ణ అరంగేట్రం, ఆ డాన్స్ షోలో ‘శివగామి’ సందడే సందడి..
ప్రేక్షకులకు వందశాతం వినోదం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా. ప్రేక్షకులు వందశాతం వినోదం అందించేందుకు ఆహా సరికొత్త కథలు, షోలతో ముందుకు వస్తోంది. అన్‌స్టాపబుల్ టాక్ షో విత్ ఎన్బీకే, తెలుగు ఇండియన్ ఐడల్ వంటి రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరించిన ఆహా తాజాగా డాన్స్ ఐకాన్ షోతో సిద్ధమైంది. ఆహా ప్లాట్‌ఫాంపై తాజాగా గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ షోతో లేడీ సూపర్ స్టార్, ‘శివగామి’ రమ్యకృష్ణ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? ప్రముఖ యాంకర్ ఓంకార్ హొస్ట్‌గా చేయనున్న ఈ షోకి ఆమె జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు కింగ్ ఆఫ్ హుక్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ కూడా న్యాయనిర్ణేతగా ఉండబోతున్నాడు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రం చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ఫార్మాట్ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చేయనిది. ఈ షో ద్వారా ఎవరూ చూడని ఒక కొత్త రమ్యని చూడబోతున్నారు. అందరూ ఈ షో ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే.. అదే విధంగా ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్‌తో ఆహా ఫ్యామిలీకి రమ్యకృష్ణని మేము స్వాగతిస్తున్నాము. రమ్య ఎంతో మందికి ఒక రోల్ మోడల్. డ్యాన్స్‌పై ఆమెకున్న అవగాహన అసమానమైనది. డాన్స్ ఐకాన్‌కు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. అనంతరం యాంకర్, ఈ షో ప్రొడ్యూసర్ ఓంకార్ “రమ్యకృష్ణ గారు ఈ షో కి జడ్జి గా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రమ్య గారితో పనిచేయాలి అనే నా కల, ఆహ టీం ద్వారా సాకరమైంది. డాన్స్ ఐకాన్ షో ద్వారా అందరికీ నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది’ అని తెలిపారు. ఈ షో సెప్టెంబర్ 17 నుండి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ఆహాలో అందుబాటులో ఉండనుంది. -
రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుంది, నేనేమో హైదరాబాద్‌లో..: కృష్ణవంశీ
టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్‌గా కృష్ణవంశీకి పేరుంది. గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం వంటి సినిమాలతో ఇండస్ట్రీకి హిట్స్ ఇచ్చిన కృష్ణవంశీ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా 'రంగమర్తాండ'. నక్షత్రం సినమా తర్వాత దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబంధించిన విశేషాలతో పర్సనల్ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రమ్యకృష్ణ రేంజ్‌ని మ్యాచ్ చేయాలనే టెన్షన్ నాకు ఉంటుంది. నాకు ఆమెతో కాంపిటిషన్ ఉంటుంది. కొడుకుతో కలిసి రమ్యకృష్ణ చెన్నైలో ఉంటోంది. నేనేమో హైదరాబాద్‌లో ఉంటున్నా. ఎప్పుడూ ఖాళీ దొరికినా నేను అక్కడికి వెళ్తుంటా. లేదా వాళ్లే నా దగ్గరికి వస్తుంటారు. ఇక మా అబ్బాయి రిత్విక్ చాలా యాక్టివ్. ఎంతైనా క్రాస్‌బ్రీడ్ కదా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రమ్యకృష్ణ, మీరు వేరేవేరుగా ఉంటే పుకార్లు వస్తుంటాయి కదా అని అడగ్గా.. అలాంటివి తాము పట్టించుకోమని, ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్ కామన్' అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అందరికీ గాసిప్స్ అంటేనే ఇంట్రెస్ట్ కదా అంటూ సమాధానమిచ్చారు. -
చీరకట్టులో రమ్యకృష్ణ ఇబ్బందులు.. అయినా ఫొటోలకు పోజులు
Ramya Krishnan Gets Irritated With Saree Video Goes Viral: ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ అందం, నటన, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీలాంబరిగా.. శివగామిగా.. ఇలా ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్‌కే కొత్త అర్థం తీసుకొస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం ప్రాధాన్యత గల పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. బాహుబలిలో శివగామిగా అలరించిన రమ్య కృష్ణ 'బంగార్రాజు', 'రొమాంటిక్' సినిమాల్లో కీలక పాత్రల్లో సందడి చేసింది. తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగ్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' మూవీలో మరో పవర్ఫుల్ పాత్రతో ముందుకు రానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడీగా నటించిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగానే ముంబైలో పలు ఇంటర్వ్యూలూ నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ ప్రమోషన్స్‌లో రమ్యకృష్ణ పాల్గొంది. ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ కనువిందు చేసింది. స్టూడియో బయట ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తూ సందడి చేసింది. సన్నని గాలి తాకుతుంటే పలుచని చీరలో రమ్యకృష్ణ అందం మతిపోగెట్టాల ఉంది. గాలికి చీర సర్దుకుంటూ, జుట్టు సవరించికుంటూ కొంచెం ఘాటుగానే దర్శనమిచ్చింది శివగామి. అయితే అలా గాలికి చీర జరగడంతో రమ్యకృష్ణ కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. చదవండి: నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరని గూగుల్ చేసేవాడిని: నితిన్ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నీలాంబరికి ఇంకా వయసు అవ్వలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 'లైగర్'లో విజయ్ దేవరకొండకు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. మరీ ఈ పాత్రతో రమ్యకృష్ణ ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అట్లుంటది లైగర్తోని.. వాళ్లిద్దరిదే డామినేషన్!
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్. ఈ సినిమా ఎలా ఉండబోతుందో సాంపుల్‌గా ట్రైలర్ వదిలారు మేకర్స్. డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ దద్దరిల్లిపోయింది. ఇంతటి పవర్ఫుల్ వీడియో చూశాక ఫ్యాన్స్ ఊరుకుంటారా? సంతోషంతో లైగర్ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. 'విజయ్, రమ్యకృష్ణలతో పాటు మైక్ టైసన్లు అదరగొట్టేశారు', 'ఈ వీడియో మొత్తంలో విజయ్, రమ్యకృష్ణలు మిగతావారిని డామినేట్ చేశారు', 'థియేట్రికల్ రిలీజ్ కోసం అందరు హీరోలు కష్టపడుతున్నారు.. కానీ విజయ్ మాత్రం తన సినిమా రిలీజ్ అవడానికి నెల రోజులు ముందే 75 అడుగుల కటౌట్‌తో థియేటర్ ముందు ప్రత్యక్షమయ్యాడు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రైలర్లో బాక్సర్‌గా అదరగొట్టేసిన విజయ్‌కు నత్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రమ్యకృష్ణ ఊరమాస్ తల్లిగా నటించినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయిక. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 25న రిలీజ్ కాబోతోంది. #LigerTrailer is wild! Fabulous! Vijay Deverakonda and Ramya Krishna dominated the show! Looking forward to it 🔥#Liger @TheDeverakonda @Charmmeofficial pic.twitter.com/aILnsoYf6M — idlebrain jeevi (@idlebrainjeevi) July 21, 2022 India, We give you Mass. Action. Entertainment. The LIGER Trailer!https://t.co/u7529aF8NS#LIGER#LigerTrailer Aug 25th Worldwide release! pic.twitter.com/J9MrpTDvCV — Vijay Deverakonda (@TheDeverakonda) July 21, 2022 These were the day where actors are struggling for theatre release .. The there is VIJAY DEVERAKONDA.. who got 75feet cutout infront of theatre before 1 month release... Craze matters 💥💥@TheDeverakonda #LigerOnAug25th #LigerTrailer pic.twitter.com/kIWEnCS45I — GSK Media (@GskMedia_PR) July 20, 2022 Stunning snaps from Liger Trailer@TheDeverakonda Rage 🔥🔥🔥@ananyapandayy ❤️🔥#VijayDeverakonda #AnanyaPanday #LigerTrailer #Liger #LigerOnAug25th #LigerHuntsFromAug25th #AnanyaPandayhot #AnanyaPandayy @TheDevarkonda @VdoeOfficial @kondafans pic.twitter.com/GYXMPk7klr — Star Frames (@starframesoffl) July 21, 2022 కటౌట్ చూసీ కొన్ని కొన్ని సార్లూ నమ్మెయ్యాలి .......#Liger #లైగర్ #LigerTrailer #लाइगर #லிகர் #VijayDeverakonda #ApoorvaMehta #విజయ్_దేవరకొండ #AnanyaPanday #LigerRoar #ಲಿಗರ್ #PuriJagannadh #karanjohar pic.twitter.com/57J7UFBXfP — UPSTOX (@MMelasangam) July 21, 2022 చదవండి: క్రాస్ బ్రీడ్ సార్ వాడు... ‘లైగర్’ ట్రైలర్ అదిరింది! ‘మీ టూ’.. తప్పు లేకపోతే ఇప్పటికి నన్నెందుకు వేధిస్తున్నారు? -
రమ్యకృష్ణతో విడాకులు? స్పందించిన కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రంగమర్తాండ'. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబందించిన విశేషాలతో పాటు మ్యారేజ్ లైఫ్‌పై వస్తోన్న రూమర్స్‌పైనా స్పందించారు. గత కొన్నాళ్లుగా కృష్ణవంశీ- నటి రమ్యకృష్ణ విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ ఈ వార్తలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'బాధ్యతలంటే భయంతో అసలు పెళ్లే వద్దునుకున్నా. కానీ చివరకు రమ్యకృష్ణతో వివాహం జరిగింది. ఇదంతా లైఫ్ డిజైన్ అని భావిస్తాను. పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. రమ్యకృష్ణ నన్ను నన్నులా ఉండనిచ్చింది. ఇక ఆమెతో విడాకులు అంటారా? ఇందులో నిజం లేదు. పబ్లిక్ ఫిగర్స్‌గా ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు వస్తుంటాయి. కానీ మేం పెద్దగా పట్టించుకోం. అందుకే ఖండించాలని కూడా అనుకోము. జస్ట్ నవ్వి ఊరుకుంటాం' అంతే అంటూ చెప్పుకొచ్చారు. -
రజనీకాంత్‌కి మరోసారి విలన్‌గా రమ్యకృష్ణ..?
రజనీకాంత్‌కి మరోసారి విలన్‌గా మారుతున్నారు రమ్యకృష్ణ. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌కు ఫైనల్ టచ్ ఇవ్వడంతో పాటు, ఈ మూవీలో నటించనున్న ఇతర నటీనటుల ఎంపిక పనిలో ఉన్నారట నెల్సన్. కాగా ఈ చిత్రంలో రజనీ సరసన ఐశ్వర్యారాయ్ నటిస్తారని, కీలక పాత్రలో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ యాక్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ విలన్ రోల్‌కు రమ్యకృష్ణను సంప్రదించారట నెల్సన్. కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. 1999లో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘పడయప్ప’ (తెలుగులో ‘నరసింహ’) చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో రమ్యకృష్ణ నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోసారి ఆమె అలాంటి పాత్రలోనే నటించనుండటంపై ఇండస్ట్రీలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. -
Bangarraju Movie Images : ‘బంగార్రాజు’ మూవీ స్టిల్స్
-
బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. వీకెండ్ ఎపిసోడ్స్‌కి భారీ ప్లాన్!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్.. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విజయవంతంగా కొనసాగుతుంది. తెలుగు, తమిళంలో ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తోంది. తెలుగు షోకి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా, తమిళంలో లోకనాయకుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా ఉన్నారు. అయితే ఇటీవల కరోనా బారిన ఆయన.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో బిగ్‌బాస్ సీజన్ 5కి కొత్త హోస్ట్‌ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కమల్ ప్లేస్‌లో తాత్కాలికంగా శ్రుతి హాసన్‌ని హోస్ట్‌గా తీసుకొస్తారనే వార్తలు వినిపించాయి. కానీ కోలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తమిళ బిగ్‌బాస్‌ను శ్రుతిహాసన్ హోస్ట్ చేయడం లేదట. కమల్ ప్లేస్‌లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తమిళంలో హోస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగులో రమ్యకృష్ణకు బిగ్ బాస్ కార్యక్రమం హోస్ట్ చేసిన అనుభవం ఉంది. నాగార్జున తన 60వ బర్త్ డే సందర్భంగా విహార యాత్ర కోసం ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిన క్రమంలో బిగ్‌బాస్ నాల్గో సీజన్లో హోస్ట్‌గా రమ్యకృష్ణ రంగ ప్రవేశం చేశారు. రెండు రోజులపాటు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అందుకే తమిళ బిగ్‌బాస్‌కి కూడా రమృకృష్ణనే తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ విషయంపై రమ్యకృష్ణను సంప్రదించగా, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ వీకెండ్లో ఆమెనే షోకు హోస్ట్‌గా వస్తుందని తమిళ జనాలు చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో మరికొన్ని గంటల్లో తేలుతుంది. -
Romantic Review: రొమాంటిక్ మూవీ రివ్యూ
టైటిల్ : రొమాంటిక్ నటీనటులు : ఆకాశ్ పూరీ, కేతికా శర్మ, రమ్య కృష్ణ, మకరంద్ దేష్ పాండే, సునైన బాదం, రమాప్రభ, ఉత్తేజ్ తదితరులు నిర్మాణ సంస్థలు : పూరీ కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మీ దర్శకత్వం : అనిల్ పాదూరి సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ : నరేష్ రానా విడుదల తేది : అక్టోబర్ 29,2021 పూరీ జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆకాశ్ పూరి. ఆయన హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఎలాగైనా తనయుడిని హిట్ ట్రాక్ ఎక్కించాలని ప్రమోషన్స్ గ్రాండ్‌గా నిర్వహించాడు పూరి. ప్రభాస్, విజయ్‌దేవరకొండ లాంటి బిగ్‌స్టార్స్‌తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ‘రొమాంటిక్’పై హైప్ క్రియేట్ అయిది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ నేడు(అక్టోబర్ 29)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? ఈ సినిమాతో పూరీ తనయుడు ఆకాశ్ హిట్ కొట్టాడా లేదా రివ్యూలో చూద్దాం. కథేంటంటే... గోవాకి చెందిన వాస్కోడి గామా(ఆకాశ్ పూరీ) పక్కా ఆవారా. ఆయన తండ్రి ఓ సిన్సియర్ పోలీసు అధికారి. ఆయన నిజాయతీ వల్ల ఓ గ్యాంగ్‌స్టర్ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. దీంతో వాస్కోడిగామా నానమ్మ మేరీ (రమా ప్రభ) దగ్గర బస్తీలో పెరుగుతాడు. డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కడం మొదలెడతాడు. వచ్చిన డబ్బుతో తన నానమ్మ పేరుతో మేరీ ట్రస్ట్‌ని నెలకొల్పి తన బస్తీ వాసులకు ఇళ్లు నిర్మించి వసతులు కల్పిస్తుంటాడు. పెద్ద పెద్ద నేరాలు చేసైనా సరే.. తన బస్తీవాసులకు ఇల్లు కట్టించాలనుకుంటాడు. దీనికోసం గోవాలో పేరుమోసిన ఓ డ్రగ్స్ ముఠాలో చేరుతాడు. అనూహ్య పరిణామాల వల్ల ఆ గ్యాంగ్‌కే లీడర్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి మోనిక (కేతిక శర్మ) పరిచయం అవుతంది. ఆమెను చూసి మోహంలో పడతాడు. చివరకు అది ప్రేమగా మారుతుంది. మరోవైపు వాస్కోడిగామా గ్యాంగ్ ఆగడాలకు కళ్లెం వేయడానికి గోవాలో కొత్తగా అడుగుపెడుతుంది ఏసీపీ రమ్య గోవార్కర్ (రమ్యకృష్ణ). వాస్కోడిగామాను పట్టుకొని, ఆ గ్యాంగ్‌ని అంతమొందించడమే ఆమె లక్ష్యం. మరి ఏసీపీ రమ్య వలలో వాస్కోడిగామా చిక్కాడా లేదా? మోనికతో మోహం ఏమైంది? నిజానికి అది మోహమా, ప్రేమా? అనేదే ‘రొమాంటిక్’కథ. ఎవరెలా చేశారంటే... గ్యాంగ్ స్టర్ వాస్కోడి గామాగా ఆకాశ్ పూరీ అదరగొట్టేశాడు. కెమెరా ముందు ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే.. తన నటనలో మెచ్యూరిటీ ఎంతో కనిపించింది. ఓ పెద్ద హీరో చేయాల్సిన సినిమా ఇది. అయినప్పటికీ.. అకాశ్ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ఫైట్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్‌లో కూడా అద్భుత నటనను కనబరిచాడు. చంటిగాడు, పండుగాడిలా వాస్కోడిగామా పాత్ర కూడా జనాలకు గుర్తిండిపోతుంది. ఇక మోనిక పాత్రకి పూర్తి న్యాయం చేసింది కేతికాశర్మ. రొమాంటిక్ సీన్స్‌లో అద్భుత నటనను కనబరిచి కుర్రకారుకు చెమటలు పట్టేలా చేసింది. క్లైమాక్స్‌లో ఆమె ఫెర్పామెన్స్ అద్భుతమనే చెప్పాలి. ఇక ఆకాశ్ పూరీ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర రమ్యకృష్ణది. ఏసీపీ రమ్య గోవార్కర్ పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టేసింది. ఆకాశ్, రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్ నువ్వా నేనా? అన్నట్టుగా ఉంటాయి. హీరో బెస్ట్‌ఫ్రెండ్‌గా దేవియాని శర్మ, గ్యాంగ్ శాంసన్‌గా మకరంద్ దేశ్‌పాండే, పోలీసు అధికారిగా ఉత్తేజ్, అతని భార్యగా యాంకర్ సునైనా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే...? పూరీ సినిమాల్లో హీరోలే విలన్స్‌గా ఉంటారు. ఒక మంచి పని చేయడం కోసం చెడు మార్గాన్ని ఎంచుకుంటారు. ‘రొమాంటిక్’కథ కూడా అంతే. కానీ దీనికి కొంత ‘రొమాంటిక్’టచ్ ఇచ్చాడు దర్శకుడు, పూరీ శిష్యుడు అనిల్ పాదూరి. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ కథ, కథణం, స్క్రీన్ ప్లే అందించడంతో.. ఇది పూర్తిగా ఆయన సినిమాలాగే అనిపిస్తుంది. పూరి గత సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో, ఈసినిమాలోనూ అలానే ఉంటాడు. `కర్లో యా మర్లో` అనే తత్వం హీరోది. ఇంకా మీసాలు కూడా పూర్తిగా మొలవని ఓ కుర్రాడు.. సడన్‌గా డాన్ అయిపోవడం, ఓ గ్యాంగ్ ని మెయింటైన్ చేయడం.. అంతా సినిమాటిక్‌గా ఉంటుంది. అయితే లాజిక్లను పక్కనపెట్టి.. మ్యాజిక్‌ని నమ్ముకునే పూరీ.. ఇందులో కూడా తనకు తగినట్లుగా సీన్స్ రాసుకున్నాడు. ప్రతి సీన్లోనూ, డైలాగ్స్‌లో పూరీ మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సినిమాలో కొత్తదనం లేకున్నా.. తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా చూసుకున్నాడు పూరీ. ఫస్టాఫ్ కొంచెం స్లో అనిపించినప్పటికీ.. సెకండాఫ్ చాలా ఫాస్ట్‌గా ఆసక్తికరంగా సాగుతుంది. సాంకేతికపరంగా చూస్తే..సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది. పాటలు అంతంతమాత్రమే అయినప్పటికీ.. నేపథ్యం సంగీతం అదిరిపోయింది. ఈ సినిమాకి ప్రధానబలం.. పూరి మార్క్ డైలాగులు. ఒక్కో డైలాగ్ బుల్లెట్లలా దూసుకెళ్తాయి. నరేష్ రానా సినిమాటోగ్రఫీ బాగుంది. గోవా నేపథ్యంలో సన్నివేశాల్ని చాలా కలర్‌ఫుల్ గా, జాయ్ ఫుల్ గా తెరకెక్కించాడు.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. చివరగా చెప్పాలంటే.. లాజిక్కులు పక్కనపెట్టి సినిమా చూస్తే.. ఎంజాయ్ చెయ్యొచ్చు. కానీ కొత్తదనం ఆశించి వెళ్తే మాత్రం నిరాశే మిగులుతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - రమ్యకృష్ణ
-
ఎవర్ గ్రీన్ బ్యూటీ రమ్యకృష్ణ
-
Ramya krishna: రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్‌డే
సాక్షి, హైదరాబాద్: నీలాంబరి.. అలియాస్.. శివగామి.. అలియాస్ రమ్యకృష్ణ. సినీ అభిమానులకు పరిచయం అక్కరలేని అందాల నటి రమ్యకృష్ట. రమ్యకృష్ణ ఉంటే ఆ సినిమా ఫ్లాప్ ఖాయం అన్న స్థాయినుంచి ఆమె నటిస్తే చాలు విజయం అదే వస్తుందన్న భరోసా కల్పించిన లెవల్ ఆమెది. నీలాంబరిగా సవాల్ విసిరినా, రాజమాత శివగామిగా రాజ్యాన్ని పాలించినా ఆమెకే చెల్లు. టాలీవుడ్ అగ్ర కథానాయకులు అందరితోనూ సూపర్ డూపర్ మూవీల్లో నటించిన ఘనత రమ్యకృష్ణ సొంతం. పాత్ర ఏదైనా దాంట్లో ఇమిడిపోవడం ఆమె ప్రత్యేకత. కన్నులలో సరసపు వెన్నెల కురిపించే రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి.కామ్ -
నటి ఆరోపణలు.. డీసెంట్‌గా స్పందించిన రమ్యకృష్ణ
వనితా విజయ్‌కుమార్.. సీనియర్ యాక్టర్స్ విజయ్-మంజుల కూతురు. వ్యక్తిగత కారణాలతో నటనకు చాలాకాలం దూరంగా ఉన్న ఈమె.. బిగ్ బాస్ ద్వారా మళ్లీ తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా స్టార్ విజయ్ టీవీతో ఆమె ప్రయాణం కొనసాగుతూ వస్తోంది. తాజాగా ‘బిగ్‌బాస్ జోడిగల్’ రియాలిటీ షోలో పాల్గొంటున్న ఆమె.. ఆ షో నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో కాస్టింగ్ కౌచ్, వేధింపులు, అవమానాలు అంటూ ట్వీట్లు చేసిన వనితా.. ఓ సీనియర్ నటి వల్లే తాను షోను వీడాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ షోకి హోస్ట్ వ్యవహరిస్తోంది నటి రమ్యకృష్ణన్(రమ్యకృష్ణ). పైగా ఈ షో మొత్తంలో ఆమె సీనియర్ కూడా. దీంతో ఆమెను ఉద్దేశించే వనితా ఈ కామెంట్లు చేసిందని అంతా అనుకుంటున్నారు. Thank you @vijaytelevision for giving me the best opportunities of my life beginning from #biggbosstamil3 ..#cookuwithkomali season 1..and #kalakkapovadhuyaaru season 9.. and #bbjodigal. I want to make it clear I WALKED OUT OF THE SHOW @bbsureshthatha sorry I had to do this..❤️🙏 pic.twitter.com/E0c95POaoD — Vanitha Vijaykumar (@vanithavijayku1) July 2, 2021 అయితే ఈ వివాదాన్ని ఓ కోలీవుడ్ న్యూస్ ఛానెల్ రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించింది. దానికి రమ్యకృష్ణ బదులిస్తూ.. ‘‘షోలో ఏం జరిగిందో కూడా మీరు ఆమెను అడిగి ఉంటే బాగుండేది’’ అని బదులిచ్చింది. ‘నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద విషయం కాదు. నో కామెంట్స్ అని తేల్చేసింది ఆమె. కాగా, చివరి ఎపిసోడ్లో వనిత పర్ఫార్మెన్స్కు పదికి 1 మార్క్ ఇచ్చింది రమ్యకృష్ణ. చదవండి: ఆ కామెంట్ నచ్చకే విడిపోయా- హీరోయిన్ -
సీనియర్ నటి వీడియో చూసి శివగామి కంటతడి!
శివగామి రమ్యకృష్ణ ఎమోషనల్ అయింది. కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి కంటతడి పెట్టుకుంది. ఇంతకీ ఆమెను అంతలా ఏడిపించిన సంఘటన ఏంటో తెలియాలంటే ఇది చదివేయండి.. అలనాటి అందాల తార రేఖ 'ఇండియన్ ఐడల్ 12' అనే మ్యూజిక్ రియాలిటీ షోకు ముఖ్య అతిథిగా వెళ్లారు. అక్కడ ఆమె తన నాట్య ప్రతిభతో అందరినీ అవాక్కయ్యేలా చేశారు. వీకెండ్లో ప్రసారమైన ఈ ఎపిసోడ్‌ను టీవీలో వీక్షించిన రమ్యకృష్ణ భావోద్వేగానికి లోనైంది. సీనియర్ నటి రేఖ డ్యాన్స్ చూస్తూ టీవీకి అతుక్కుపోయిన శివగామి కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మై గాడ్ మై గాడ్.. నా దేవత రేఖ గారూ.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 'ఆమెను చూసి మీరు కన్నీరుపెట్టుకుంటే మిమ్మల్ని చూసి మేము ఉద్వేగానికి లోనవుతున్నాం' అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రిపబ్లిక్ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన క్వీన్ వెబ్ సిరీస్‌లో రమ్యకృష్ణ శక్తి శేషాద్రిలా కనిపించిన విషయం తెలిసిందే. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రను ప్రేరణగా తీసుకుని తెరకెక్కిందీ వెబ్ సిరీస్. సెకండ్ సీజన్‌కు స్క్రిప్ట్ రెడీ అయిందని, త్వరలోనే షూటింగ్ జరగనుందని ఇటీవల రమ్యకృష్ణ తెలిపింది. చదవండి: రిపబ్లిక్: స్పెషల్ లుక్‌లో రమ్యకృష్ణ, సాయి ధరమ్ తేజ్ రష్మిక ఫస్ట్ ఆడిషన్: వీడియో రిలీజ్ చేసిన మాజీ ప్రియుడు -
స్పెషల్ లుక్‌లో రమ్యకృష్ణ.. ఆసక్తి రేపుతున్న రిపబ్లిక్ టీజర్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రిప్లబిక్’. సుదీర్ఘకాలం తర్వాత డైరెక్టర్ దేవా కట్ట తీస్తున్న చిత్రం ఇది. ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ థ్రీల్లర్ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన దేవా ఆ తర్వాత ‘ఆటోనగర్ సూర్య’ తీశారు. ఈ మూవీ టేకింగ్ పరంగా ప్రశంసలు అందుకున్నప్పటికి కమర్షియల్‌గా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఇక కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ దేవా కట్ట పొలిటికల్ జానర్ ‘రిపబ్లిక్’తో తిరిగి వస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టిజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు, అరిచే హక్కు అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్వవస్థలే ఈ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండానే ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నామంటూ’ సమాధుల్లో కలిసిపోతున్న వ్యవస్థను ప్రశ్నిస్తూ దారిలో పెట్టాలనుకునే యువకుడి కథే రిపబ్లిక్ థీమ్. ఇందులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలితను తలపించేలా రమ్యకృష్ణ లుక్ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా చెప్పుకొవచ్చు. దీంతో ఈ మూవీలో రమ్యకృష్ణ సీఎం పాత్రలో కనిపించనున్నారని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే రమ్యకృష్ణ లుక్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ప్రభుత్వ అధికారులు నేతలకు బానిసలుగా మారితే సమాజంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేదే మెయిన్ పాయింట్‌గా చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ఇక ఇందులో తేజ్ కీలక పదవిలో ఉండే ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నట్లు క్లారిటి వచ్చేసింది. చదవండి: ‘వైల్డ్‌డాగ్ ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు’ రామ్‌చరణ్ బర్త్‌డే సీడీపీ: ఫ్యాన్స్ ట్రోలింగ్! -
వారే నిజమైన అందగత్తెలు: పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పోడ్ కాస్ట్ ఆడియోలతో ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ సంచలనం సృష్టిస్తున్నారు. సమాజంలోని ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ తనదైన స్టైల్లో వివరణ ఇస్తున్నారు. అందుకే ఆయన మాట్లాడుతుంటే ఆవేశంతో కూడిన వేదాంతం వినిపిస్తూ ఉంటుంది. టాపిక్ ఏదైనా క్లియర్ కట్‌గా లాగ్ చేయకుండా మాట్లాడతాడు. పూరి జగన్నాథ్ చెప్పిన ప్రతి విషయాన్ని గమనిస్తే.. సమాజం, అందులోని వ్యక్తులు, వారి స్వభావాలను చదివేశాడన్న ఫీలింగ్ కలుగుతోంది. ఆయన ఏం మాట్లాడుతున్నా అదేదో మన జీవితానికి ఉపయోగపడే అంశంలా కూర్చోని ఆసక్తిగా వినాలనిపిస్తుంది. ఈ కారణాల వల్లే పూరి ఆడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చదవండి: కళ్లు చెమ్మగిల్లాయి: పూరీ జగన్నాథ్ ఇప్పటి వరకు పోడ్ కాస్ట్ ఆడియోలతో చాలా విషయాలపై ప్రస్తావించిన పూరి తాజాగా టామ్బాయ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టామ్ బాయ్ అంటే.. అమ్మాయి అయినప్పటికీ అబ్బాయిలా బిహేవ్ చేయడం అని చెప్తూ ప్రారంభించాడు. అన్నింట్లో అబ్బాయిలతో పోటీపడుతూ, తనకు నచ్చినట్టుగా వ్యవహరించేవారని తెలిపారు. ‘ఎదీ ఉన్న మొహం మీద చెబుతూ, ప్రాక్టికల్‌గా ఉంటారు. ఐ లవ్ టామ్‌బాయ్స్. మగవాళ్లలాగా ఆలోచిస్తూ, వాళ్ల లాగే పనిచేస్తారు. ఎక్కడికైనా ధైర్యంగా వెళ్తారు. రెబల్స్లాగా ఆలోచిస్తారు. టామ్‌బాయ్స్ వల్లే ఈ ప్రపంచం మారుతుంది. హ్యట్సాఫ్ టు ద వుమెన్ ఇన్ మిలిటరీ. స్పోర్ట్స్, పోలీస్, డ్యాన్స్, వర్కింగ్ వుమెన్.. కూతురు మగ రాయుడిలా తిరుగుతుంటే మీకు భయం వేయొచ్చు. ఇది ఇలా ఉంటే దీన్ని ఎవరు చేసుకుంటారని కంగారు పడొచ్చు. అలాంటి కూతురు ఉన్నందుకు సంతోషించండి. కాలర్ పట్టుకొని మగాన్ని కొట్టే ఆడపిల్ల మనకు కావాలి. అమ్మోరు తల్లిలా తాటా తీయాలి. కాళికా దేవిలా కన్నెర్ర చేయాలి. నూర్ ఇనాయత్ ఖాన్, ఝాన్సీ లక్ష్మీ భాయ్, సరస్వతి రాజామణి, పులన్ దేవి, కిరణ్ బేడీ, కరణం మల్లేశ్వరి.. ఇలాంటి వాళ్లే మనకు కావాలి. కళ్లల్లో కసి, పట్టుదల ఉన్నవాళ్లే నిజమైన అందగత్తెలు. రియల్ వుమెన్ ఆల్వేస్ ఏ టామ్‌బాయ్’ అంటూ ముగించారు. Thank you @purijagan and @Charmmeofficial for nominating me....I hereby nominate @realradikaa @DrManjula_A and soul mate @madhoo69 powerful #tomboy https://t.co/zQmzAaOCdD — Ramya Krishnan (@meramyakrishnan) November 25, 2020 కాగా ఈ వీడియో అనేక మంది అమ్మాయిలు, మహిళలను హత్తుకుంటోంది. తమలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయని, ఎంతో మందికి ఈ వీడియో ఆదర్శంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అదే విధంగా ఈ టామ్‌బాయ్ వీడియో పవర్‌ఫుల్‌గా ఉందంటూ నటి ఛార్మి కౌర్ ప్రశంసలు కురిపించారు. అంతేగాక తను కూడా ఓ టామ్బాయ్నని చెబతూ తన జీవితంలో అలాంటి వ్యక్తులు మరో ముగ్గురు ఉన్నారని తెలిపారు. త్రిష, లక్ష్మీ మంచు, రమ్యకృష్ణలను ట్యాగ్ చేశారు. మరో ముగ్గురు స్వతంత్ర్య, ధైర్య మహిళలను నామినేట్ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన రమ్యకృష్ణ.. ఛార్మి, పూరి జగన్నాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే నటి రాధికా, డాక్టర్ మంజులా, నటి మధును రమ్య కృష్ణ నామినేట్ చేశారు. -
సమంత హోస్టింగ్‌పై నెటిజన్ల రియాక్షన్!
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన నటిస్తున్న వైల్డ్‌డాగ్ షెడ్యూల్లో బిజీగా ఉండటంతో 21 రోజుల తర్వాతే మళ్లీ బిగ్‌బాస్ షోలో కనిపించనున్నారు. అప్పటివరకు ఇతరులే హోస్ట్‌గా అలరించనున్నారు. ఈ క్రమంలో నాగ్ బాధ్యతను ఆయన కోడలు సమంత తన భుజాల మీద వేసుకుని దసరా స్పెషల్ బిగ్‌బాస్ మెగా ఎపిసోడ్‌ను మూడు గంటల పాటు నడిపించడం విశేషం. (చదవండి: ఎలిమినేషన్: మోనాల్‌పై తీవ్ర వ్యతిరేకత) సోషల్ మీడియాలో సమంత హోస్టింగ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె హోస్టింగ్ అద్భుతంగా ఉందంటున్నారు. కాగా గత సీజన్లోనూ నాగ్ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన స్థానంలో శివగామి రమ్యకృష్ణ హోస్ట్‌గా రఫ్ఫాడించారు. అయితే ఆమె కంటే కూడా తాజాగా బిగ్‌బాస్ మెగా ఎపిసోడ్‌ను ఒంటిచేత్తో నడిపించిన సమంత చాలా బాగా చేసిందని నెటిజన్లు చప్పట్లు చరుస్తున్నారు. ఇదే విషయంపై సోషల్ మీడియాలో పోల్ నిర్వహించగా 74 శాతం మంది సమంత హోస్టింగ్ బాగుందని అభిప్రాయపడ్డారు. (చదవండి: మనాలిలో నాగ్: బిగ్‌బాస్‌కు సమంత?) కాగా నిన్నటి స్పెషల్ ఎపిసోడ్లో నాగార్జున తన కోడలు సమంతను వీడియో సందేశం ద్వారా అటు కంటెస్టెంట్లకు, ఇటు ప్రేక్షకులకు పరిచయం చేశారు. తెలుగు అంత చక్కగా మాట్లాడలేనని, అందుకు క్షమించాలని సమంత కోరడం అందరి చేత ప్రశంసలు దక్కించుకుంటోంది. ఇక వచ్చీరాగానే కంటెస్టెంట్లపై ఫీడ్‌బ్యాక్ ఇస్తూనే కుదిరిన చోటల్లా కౌంటర్లు వేసింది. అలాగే తన నవ్వుతో అభిమానులకు రెట్టింపు సంతోషాన్ని అందించింది. ఎక్కడా తడబడకుండా షోను విజయవంతంగా నడిపించి మామకు తగ్గ కోడలు అనిపించుకుంది. మరి మిగతా మూడు వారాలు కూడా సమంతే వస్తుందా? లేదా మిగతా సెలబ్రిటీలను రంగంలోకి దింపుతారో చూడాలి. -
రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
ప్రముఖ నటి రమ్యకృష్ణ 'బాహుబలి' చిత్రంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అందులో శివగామి పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'క్వీన్' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు. తెలుగుతోపాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ నటిగా రాణిస్తున్నారు. ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు. గతేడాది తెలుగు బిగ్‌బాస్ షోలోనూ ఓసారి వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్నారు. తాజాగా రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ గురించి ఫిల్మీదునియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. (చదవండి: పెళ్లి సందడి మళ్లీ మొదలు) ఆమె ఒక్క రోజు షూటింగ్‌కు 10 లక్షల రూపాయలు తీసుకుంటుందట. ఈ లెక్కన ఆమె ఓ 10 రోజులు షూటింగ్లో పాల్గొంటే నిర్మాత మారు మాట్లాడకుండా కోటి రూపాయలు ఆమె ముందు పెట్టాల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే ఆమె ప్రస్తుతం విజయ్ దేవరకొండ "ఫైటర్" చిత్రంలో నటిస్తున్నారు. అలాగే "లూసిఫర్" తెలుగు రీమేక్‌లో చిరంజీవి సోదరిగా రమ్యకృష్ణ పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం. ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తారు. (చదవండి: కుటుంబ సభ్యులతో శివగామి బర్త్‌డే సెలబ్రేషన్స్) -
రమ్యకృష్ణ బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
రమ్యకృష్ణ కారు డ్రైవర్ అరెస్ట్
చెన్నై: సీనియర్ నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం తరలిస్తున్న రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారీగా మద్యాన్ని, కారును సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తున్న రమ్యకృష్ణకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా( టీఎన్07క్యూ 0099) కారును పోలీసులు తనిఖీ చేశారు. అయితే ఈ కారులో అక్రమంగా తరలిస్తున్న 96 బీర్ బాటిళ్లు, 8 మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. దీంతో కారును, మద్యం బాటిళ్లు సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే వ్యక్తిగత పూచీకత్తుపై డ్రైవర్ సెల్వకుమార్‌ను పోలీసులు విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై రమ్యకృష్ణ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక లాక్డౌన్ నిబంధనల్లో భాగంగా తమిళనాడులో మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సివుంది. -
క్వీన్ రివ్యూ: అందరి మనసులో ‘అమ్మ’
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తీయాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. ఫలితంగా ఆమె బయోపిక్‌పై మూడు సినిమాలు రానున్నాయి. కంగనా రనౌత్ ‘తలైవి’, నిత్యామీనన్ ‘ద ఐరన్ లేడీ’ సినిమాలతో పాటు డిజిటల్ మాధ్యమంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ‘క్వీన్’ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్, మురుగేశన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. అటు న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తకుండా చిత్రబృందం జయలలిత పాత్రకు శక్తి శేషాద్రి అని నామకరణం చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అందరి నుంచీ ప్రశంసలు అందుకుంటోంది. శక్తి.. ఏమీ తెలియని బాల్యం నుంచి అందర్నీ శాసించే రాజకీయ నాయకురాలిగా ఎదిగిన తీరు, ఆమె సంఘర్షణ, పోరాటతత్వం అన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. చిన్నప్పటి శక్తి పాత్రను అనిక పోషించగా యవ్వనంలో అంజనా జయప్రకాశ్ తెరమీద ప్రత్యక్షమవుతుంది. శక్తి రాజకీయ ప్రస్థానాన్ని టాలీవుడ్ నటి రమ్యకష్ణ మరింత రక్తి కట్టించిందనడంలో సందేహం లేదు. శక్తి బాల్యం నుంచే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ ముళ్లదారిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చివరాఖరకు విజయాన్ని ముద్దాడింది. ఒక్కసారి నటిగా గుర్తింపు వచ్చిన తర్వాత బాల్యంలో దక్కని ప్రేమ, అభిమానాలు ఆమెను చుట్టుముట్టడం విశేషం. శక్తి.. సమాజంలోని అసమానతలను, పితృస్వామ్య ధోరణిలను నిర్భయంగా, నిస్సందేహంగా నిలదీస్తుంది. అక్కడే ఆమెలోని నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తనకు ఎదురయ్యే ప్రతీ సమస్యను ఎదుర్కొంటూ మరింత రాటు దేలుతూ వచ్చిందే తప్ప కుంగిపోయి ఆమె ప్రయాణాన్ని ఆపలేదు. అదే ఆమెను గొప్ప స్త్రీగా నిలబెట్టింది. నటిగా, నాయకురాలిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇక రాజకీయ ఎంట్రీతో ఆమె జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. శక్తి(జయలలిత) ఎంతగానో గౌరవించే ఎమ్జీఆర్ పాత్రలో నటుడు ఇంద్రజిత్ సుకుమార్ దర్శనమిస్తాడు. వీరి కలయికలో వచ్చే సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే శక్తి జీవితంలో ఎత్తుపల్లాలను స్పృశిస్తూనే, ఓ గొప్ప నాయకురాలిగా అందరి మనసులో ఎలా స్థానం సంపాదించిందన్నదే కథ. సామాజిక వ్యత్యాసాలు, పురుషాధిక్యం వంటి సమస్యలను కూడా టచ్ చేస్తుందీ సినిమా. రాజకీయ నాయకురాలిగా రమ్యకృష్ణ ఠీవి, అధికారం, ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. మొత్తానికి తమిళ వెబ్‌సిరీస్‌లో క్వీన్ ప్రత్యేక స్థానం దక్కించుకోవడంతోపాటు అమ్మ(జయలలిత) అభిమానులు మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోతుందనటంలో అతిశయోక్తి లేదు. -
14 నుంచి క్వీన్ పయనం
చెన్నై : ఈనెల 14వ తేదీ నుంచి క్వీన్ పయనం ప్రారంభంకానుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్కు ఉన్న డిమాండ్ ఏమిటన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ టైటిల్ పాత్రలో తలైవి పేరుతో దర్శకుడు విజయ్ ఒక చిత్రాన్ని, నటి నిత్యామీనన్ టైటిల్ పాత్రలో ది ఐరన్ లేడీ పేరుతో నవ దర్శకురాలు ప్రియదర్శిని చిత్రాలను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో తలైవి చిత్రం ఇప్పటికే సెట్ పైకి వచ్చేసింది. కాగా వాటితో పాటు ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్, ప్రసాద్ మురుగేశన్‌లు కలిసి క్వీన్ పేరుతో వెబ్ సీరీస్‌ను రూపొందిస్తున్నారు. జయలలితగా రమ్యకృష్ణ నటించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. జయలలిత గెటప్‌లో రమ్యకృష్ణ బాగా నప్పిందనే ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఈ క్వీన్ సిరీస్ ప్రసారానికి టైమ్ ఫిక్స్ అయింది. ఈ నెల 14 నుంచి ప్రసారం కానున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా తెగింపు గల నటి, రాజకీయవాది, కాంప్రమైజ్ అనే పదానికి చోటు లేకుండా జీవించిన మనిషిగా రూపొందుతున్న వెబ్ సిరీస్ క్వీన్. బూడిద నుంచి ఉన్నత శిఖరాలకు చేరిన పీనిక్స్ పక్షిలా అతి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అన్న ఘనతకెక్కి తమిళనాడును ఏలిన వ్యక్తి జయలలిత. ఆమె యదార్థ సంఘటనలతో రూపొందుతున్న సిరీస్ క్వీన్. ఎంఎక్స్ ప్లేయర్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఎంఎక్స్ యాప్‌లో ప్రసారం చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ వెబ్ సిరీస్‌తో పాటు జయలలిత బయోపిక్‌తో తెరకెక్కనున్న చిత్రాలకు జయలలిత సోదరుడి కూతురు దీప అనుమతి ఇవ్వలేదు. అంతే కాదు ఈ వ్యవహారంపై ఆమె కోర్టుకెక్కారు. అయినా క్వీన్ వెబ్ సిరీస్‌ను ప్రసారానికి సిద్ధం అవుతున్నారు. దీంతో సమస్యలు తలెత్తకుండా ఈ సిరీస్‌లో ఎక్కడా జయలలిత పేరును ప్రస్థావం లేకుండా జాగ్రత్త పడ్డారు దర్శక నిర్మాతలు. ఇందులో జయలలిత పాత్ర పేరును శక్తి శేషాద్రి అనే పెట్టారు. అలా చట్ట పరమైన సమస్యలు నుంచి క్వీన్ వెబ్ సిరీస్ బయట పడుతుందా? లేదా?అన్నది చూడాలి. -
దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్
నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘క్వీన్’.గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇప్పటికే విడుదలైన క్వీన్ ఫస్ట్ లుక్, టీజర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయారని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ‘క్వీన్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు నిమిషాల 44 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్ అద్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ పేరు శక్తి శేషాద్రి. జయలలిత స్కూల్ డేస్ నుంచి మొదలు సినీ, రాజకీయ విషయాలను ఈ ట్రైలర్లో జోడించారు. ఇక జయలలిత చిన్న నాటి పాత్రలో ‘విశ్వాసం’ ఫేమ్ అనిఖ ఆకట్టుకుంది. డిసెంబర్ 14న విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. జయలలిత చిన్ననాటి సన్నివేశాలకు ప్రసాద్, రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి సాగిన పరిస్థితుల సన్నివేశాలను గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. ఇక ఈ వెబ్ సిరీసే కాకుండా జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’, ‘ఐరన్‌లేడీ’ అనే రెండు బయోపిక్స్ వెండితెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలైవి’ (హిందీలో ‘జయ’)లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుండగా.. దర్శకురాలు ప్రియదర్శిని ‘ఐరన్ లేడీ’లో జయలలిత పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా తలైవి ఫస్ట్ లుక్‌పై జయలలిత అభిమానులతో పాటు సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. (తలైవి ఫస్ట్ లుక్ రిలీజ్) -
‘రొమాంటిక్’లో రమ్యకృష్ణ
ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాపై అభిమానులు ముఖ్యంగా యువత ఎంతగానే ఆసక్తి కనబరుస్తుండటంతో ‘రొమాంటిక్’.పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బటయటకువచ్చింది. `బాహుబలి` చిత్రంలో రాజమాత శివగామి నటించి సినీ ప్రేక్షకులను మెప్పించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్లో కనపడనుందని తెలుస్తోంది. మంగళవారం నుంచి జరుగుతున్న షెడ్యూల్లో రమ్యకృష్ణ జాయిన్ అయ్యారని తెలిసింది. ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ పవర్ఫుల్ పాత్ర పోషిస్తుందని సమాచారం. ఇక ఇన్టెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. నరేశ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునైన తదితరులు ఈ చ్రితంలో నటిస్తున్నారు. -
బంగార్రాజు భలే నాయనా
సోగ్గాడే చిన్ని నాయనా.. బొమ్మ అదిరింది నాయనా అని సినిమా చూసినవాళ్లు అన్నారు. మూడేళ్ల క్రితం సంక్రాంతికి సోగ్గాడిగా సందడి చేసిన బంగార్రాజుని మళ్లీ చూపించనున్నారు చిత్రదర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఫస్ట్ పార్ట్‌లో నాగార్జున మాత్రమే సందడి చేశారు. రెండో భాగంలో కొడుకు నాగచైతన్య కూడా కలుస్తున్నారు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ తాతామనవళ్లలా కనిపించనున్నారు. తొలి భాగంలో నాగ్ సరసన నటించిన రమ్యకృష్ణ మలి భాగంలోనూ ఉంటారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట. కథ బాగా కుదిరిందని, ప్రతి పాత్ర ఆడి యన్స్‌కు కనెక్ట్ అయ్యేలా కల్యాణ్ కృష్ణ స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారని తెలిసింది. అంటే ఈసారి బంగర్రాజు భలే నాయనా అనిపిస్తాడన్నమాట. ప్రీ–ప్రొడక్షన్ పనులను త్వరలోనే కంప్లీట్ చేసి సినిమాను జూన్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మన్మథుడు’ సినిమా సీక్వెల్ చేయడానికి నాగార్జున గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా కాకుండా బాలీవుడ్లో ‘బ్రహ్మాస్త్ర’ అనే పీరియాడికల్ మూవీలో నాగార్జున ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఆయన నిజమైన లెజెండ్
సాక్షి, హైదరాబాద్: ద్రవిడ అభిమానంకోసం, ద్రవిడ జాతికోసం విప్లవాత్మక పోరాటం చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అస్తమయంతో దేశం దిగ్బ్రాంతికి లోనయ్యింది. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ,ఇ తర రంగాల ప్రముఖులు సంతాపం వెలుబిచ్చారు. నటుడు , కవి, రచయిత, హేతువాది అయిన కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా, గొప్ప రాజకీయవేత్తగా చేసిన ఎనలేని సేవలను గుర్తు చేసుకున్నారు. అటు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా కరుణానిధి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. నిజమైన లెజెండ్, మాస్ నాయకుడు, నిరంతరం స్పూర్తిగా నిలిచిన నాయుకుడు కరుణానిధి. ఆయనలేని లోటు పూడ్చలేనిదని టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు. సోదరుడు స్టాలిన్, అళగిరి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి. తన విధానాలతో లక్షలాదిమంది ప్రజలకు చేరువయ్యారు. తన రచనలతో లక్షలామంది ప్రజలకు కరుణానిధి ప్రేరణగా నిలిచారని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుఒక ఫోటోనుకూడా షేర్ చేశారు. ఈ భువిని వీడిన ఆయన నిజంగా ఎప్పటికీ మనల్ని వీడిపోని మనిషి కరుణాధి. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో జీవించే వుంటారు. మన ద్వారా ఆయన బతికే వుంటారంటూ కరుణానిధి మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని తెలిపారు మరో ప్రముఖ నటి రమ్యకృష్ణన్. అన్ని అసమానతలను ఎదుర్కొన్న ధీరుడు కరుణా నిధిగారు. ఈ అంతులేని విషాదంనుంచి కోలుకునే శక్తిని ఆయన కుటుంబం, తమిళ సోదర, సోదరీ మణులకు ఆ దేవుడు ప్రసాదించాలంటూ తెలుగు హీరో మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఇంకా హీరో విశాల్ కూడా కరుణానిధి మృతిపట్ల ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. కాగా తమిళ రాజకీయ యోధుడు, ద్రవిడ గడ్డ లెజెండరీ నేత, డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (94) కన్నుమూశారు. నెలరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో అభిమానులు, డీఎంకే శ్రేణులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న తమిళ సోదరులు, తీవ్ర శోకంలో మునిగిపోయారు. A true legend, a leader of masses and always lead by example, Sri. Karunanidhi leaves a huge void. My condolences to Brothers Stalin and Alagiri and their families. He touched millions of lives with his policies, gave hope to millions and inspired millions with his writing. — Mohan Babu M (@themohanbabu) August 7, 2018 One of my Cherished Photo with Sri. Karunanidhi pic.twitter.com/gcATjLpTVf — Mohan Babu M (@themohanbabu) August 7, 2018 A person that departs from this earth never truly leaves, for they are still alive in our hearts, through us, they live on. My condolences. #RIPKalaingr pic.twitter.com/qIfflYsgm1 — Ramya Krishnan (@meramyakrishnan) August 7, 2018 -
కోహ్లిని కలవడం చాలా సంతోషం- నటి
‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రను ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. శివగామి పాత్రలో అందరినీ మెప్పించారు నటి రమ్యకృష్ణ. ఇటీవల ఓ చానెల్ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి రమ్యకష్ణ, టిమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలు సందడి చేశారు. శివగామి పాత్రకు రమ్యకృష్ణ, ‘ ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ గా కోహ్లిలు అవార్డులు అందుకున్నారు. ఈ వేదికపై కోహ్లితో కలిసి దిగిన ఫోటోను రమ్యకృష్ణ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘విరాట్ చాలా మంచి వ్యక్తి, ఆయన్ను కలుసుకోవడం చాలా సంతోషంగా’ ఉందని ఆమె ట్విట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అయ్యింది. రమ్యకృష్ణ ‘హలో’ చిత్రంలో అఖిల్‌కు తల్లిగా నటిస్తున్నారు. -
అమ్మగా శివగామి.. పోస్టర్ హల్చల్!
తమిళనాడు ప్రజల గుండెల్లో అమ్మగా కోలువైన నేత జయలలిత. ఆమె జీవితచరిత్రను సినిమాగా తెరకెక్కిస్తే బాగుంటుందన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. ఆమె పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఓ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా అలరించిన రమ్యకృష్ణను అమ్మ మాదిరిగా ఫొటోషాప్ చేసి రూపొందించిన ఈ పోస్టర్ వైరల్‌గా మారిపోయింది. ఈ పోస్టర్‌ను మెచ్చుకుంటున్న నెటిజన్లు జయలలిత పాత్రకు రమ్యకృష్ణ నూరుశాతం న్యాయం చేస్తుందని కితాబిస్తున్నారు. నరసింహలో నీలాంబరిగా, బాహుబలిలో శివగామిగా శక్తిమంతమైన పాత్రలు పోషించిన రమ్యకృష్ణ అమ్మ పాత్రకు పూర్తిగా న్యాయం చేయగలరని అంటున్నారు. ఫుల్లీ ఫిల్మీ అనే ఫేస్బుక్ పేజీ ఈ పోస్టర్‌ను రూపొందించింది. ‘మదర్’ పేరిట కల్పితంగా రూపొందించిన ఈ పోస్టర్లో జయలలితపై సినిమాకు దర్శకుడిగా కార్తిక్ సుబ్బరాజు ఉంటే బాగుంటుందని పేర్కొంది. సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్న ఈ పోస్టర్‌పై తాజాగా రమ్యకృష్ణ స్పందించింది. ఎవరో కల్పితంగా సృష్టించిన ఈ పోస్టర్‌ను వాట్సాప్‌లో తనకు స్నేహితులు పంపించారని ఆమె తెలిపింది. ఇది కేవలం కల్పితమైన పోస్టర్ అయినప్పటికీ, నిజంగా జయలలిత జీవితకథలో నటించేందుకు తాను ఎంతో ఆసక్తితో ఉన్నానని పేర్కొంది. ‘గతంలో నాకు డ్రీమ్‌రోల్స్ అంటూ ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఎవరైనా మీ డ్రీమ్‌రోల్ ఏమిటని అడిగితే.. అది జయలలిత పాత్ర పోషించడమేనని కచ్చితంగా చెప్తాను’ అని అన్నారు. ‘జయలలిత గొప్ప ధైర్యశాలి, మేధావి.. ఆమె చాలామంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. మంచి స్క్రిప్టుతో ప్రముఖ దర్శకుడు ముందుకొస్తే జయ మేడం పాత్రను పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనిని గౌరవంగా భావిస్తాను’ అని ఆమె చెప్పారు. -
శివగామికి మరో పవర్ఫుల్ రోల్!
రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా మరోసారి సత్తా చాటిన రమ్యకృష్ణకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సూర్య హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘థానా సెరంధ కూటం’లో రమ్యకృష్ణకు మరో విశిష్టమైన కీలక పాత్ర దక్కింది. దేవుడు లేడనే నాస్తికత నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ కామెడీ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన పలు ఫొటోలు ఇటీవల మీడియాకు లీక్ అయ్యాయి. దీనిని బట్టి ఈ సినిమా షూటింగ్లో రమ్యకృష్ణ ఇప్పటికే చేరినట్టు తెలుస్తోంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన కీర్తిసురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ, సెంథిల్, నిరోషా లాంటి తారాగణంతో కూడిన ఈ సినిమాలో రమ్యకృష్ణది కీలక పాత్ర అని వినిపిస్తోంది. బాలీవుడ్ సినిమా స్పెషల్ 26కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్టు గతంలో కథనాలు రాగా, వాటిని చిత్రయూనిట్ కొట్టిపారేసింది. వేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, సూర్య ప్రతిష్టాత్మక సీక్వెల్ ‘సింగం-3’ రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది. -
మరో క్రేజీ ప్రాజెక్టులో 'శివగామి'
హైదరాబాద్: సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్న టాలీవుడ్ అందాలనటి రమ్యకృష్ణ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. అదీ భర్త కృష్ణవంశీ తదుపరి చిత్రం రుద్రాక్ష సినిమాలో. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తోందట. కృష్ణవంశీ తరహాలో తెరకెక్కుతున్న ఓ హీరోయన్ ఓరియంటెడ్ మూవీలో లేడీ సైకాలజిస్టుగా ప్రేక్షకులను అలరించనుందట. పవర్ ఫుల్ పాత్రల్లో తన విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న రమ్య.. బాహుబలి, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలతో తన టాలెంట్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకుంది. టాలీవుడ్లో తనవైన ప్రత్యేక కారెక్టర్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో మెయిన్ లీడ్‌లో నటించేందుకు అనుష్క మొదట ఓకే చెప్పినా, తరువాత తిరస్కరించింది. దీంతో ఆ కారెక్టర్‌ను సమంత దక్కించుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రమ్య-కృష్ణవంశీ దంపతులు విడివిడిగా ఉంటున్నారనే వదంతుల నేపథ్యంలో ఈవార్త ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా రుద్రాక్ష సినిమాలో కావాలనే రమ్యకృష్ణ కోసం ఓ పాత్రను సృష్టించి, కథను కూడా కాస్త మార్చినట్టు టాలీవుడ్ టాక్. కృష్ణవంశీ తీసిన చంద్రలేఖ సినిమాలో నటిస్తున్న సమయంలో రమ్యకష్ణ, కృష్టవంశీ ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. -
మావూళ్లమ్మ చరిత్ర
రమ్యకృష్ణ టైటిల్ రోల్లో నండూరి వీరేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జగన్మాత’. గజ్జవరపు మహిమా చౌదరి సమర్పణలో ఎన్.ఎస్. రాజు, జె. వెంకటేశ్వరావు నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పుష్పలీల పాటల సీడీని ఆవిష్కరించి నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌కు అందించారు. ‘‘ఈ చిత్రానికి థియేటర్స్ విషయంలో ఏదైనా సమస్య వస్తే, చాంబర్ తరఫున పర్సంటేజీ విధానం ద్వారా థియేటర్లు ఇప్పిస్తాం’’ అని రామకృష్ణ గౌడ్ అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాలంటే ఆసక్తి అనీ, త్వరలో ఓ చిత్రం నిర్మించాలనుకుంటున్నానని పుష్పలీల చెప్పారు. నండూరి వీరేష్‌తో ‘బుల్లెట్ బాయ్’ అనే సినిమా తీశాననీ, ఆయనలో మంచి దర్శకుడు ఉన్నాడని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. భీమవరం మావూళ్లమ్మ చరిత్ర ఆధారంగా ఈ సినిమా తీశారని మోహన్ గౌడ్ అన్నారు. -
జగన్మాత లీలలు
సీనియర్ నటి రమ్యకృష్ణ చాలా కాలం తర్వాత అమ్మోరు పాత్రలో నటి స్తున్న చిత్రం ‘జగన్మాత’. శ్రీ సాయి సీతారామ ప్రొడక్షన్స్ పతాకంపై జి.వెంకటేశ్వరరావు, ఎన్.ఎస్.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరేశ్ దర్శకుడు. రాజ్‌కిరణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘రమ్యకృష్ణ నటన ఈ చిత్రానికి హైలైట్. జగన్మాత లీలలు ఆసక్తి కరంగా ఉంటాయి. అన్ని వర్గాల వారికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: హరినాథ్‌రెడ్డి, నాగబాబు, సహనిర్మాత: చింతపల్లి నాగేశ్వరరావు. -
విన్నారా!
రమ్యకృష్ణ కెరీర్లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ విధంగా నిలిచిపోయిన పాత్రల్లో ‘నరసింహ’ చిత్రంలోని నీలాంబరి పాత్ర ఒకటి. ఈ పవర్ఫుల్ రోల్‌ను అద్భుతంగా చేశారామె. ఈ పాత్రను రమ్యకృష్ణ మినహా వేరే ఎవరూ ఇంత బాగా చేయలేరంటే అతిశయోక్తి కాదు. ఈ నీలాంబరి పాత్ర గురించి ఓ తమిళ పత్రిక రమ్యకృష్ణను ఓ ప్రశ్న అడిగింది. ఒకవేళ ‘నరసింహ’ చిత్రాన్ని రీమేక్ చేస్తే, అందులో నీలాంబరి పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందనుకుంటున్నారు? అని ఆ పత్రికా విలేకరి అడిగితే - ‘‘ఆ పాత్రలో వేరే ఎవర్నీ ఊహించుకోలేకపోతున్నాను. రీమేక్‌లో కూడా నేనే ఉండాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇస్తే నేనే నటిస్తా’’ అని చెప్పారు. -
క్రేజ్ తగ్గని ఓల్డ్ హీరోయిన్
-
నీలాంబరి రీఎంట్రీ
రజనీకాంత్ నటించిన పడయప్పా చిత్రంలో నీలాంబరి పాత్రను అంత సులభంగా ఎవరూ మరచిపోరు. ఆ పాత్రలో రమ్యకృష్ణ జీవించారంటే అతిశయోక్తి కాదు. నీలాంబరిలోని ద్వేషం, పగ, పశ్చాత్తాపానికి తావులేని ప్రతీకారేచ్ఛను తన ముఖ కవళికలో అద్భుతంగా పండించిన రమ్యకృష్ణ తమిళంలోనే కాదు తెలుగు చిత్ర పరిశ్రమలోను నీలాంబరిగా ముద్ర వేసుకున్నారు. అలాంటి నటి ఇటీవల తమిళ సినిమాకు దూరమయ్యారు. తాజాగా ఈ అభినయతార, కోలీవుడ్‌లో రీఎంట్రీకి రెడీ అవుతున్నారు. విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆంబళైలో రమ్యకృష్ణ ముఖ్య భూమికను పోషించనున్నారన్నది తాజా సమాచారం. విశాల్ హీరోగా నటిస్తున్న పూజై చిత్రం దీపావళికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్. విశాల్ తదుపరి చిత్రానికి తయారయ్యారు. సుందర్.సి దర్శకత్వంలో ఆంభళై చిత్రంలో నటిస్తూ సొంతంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అందాల భామ హన్సిక హీరోయిన్. షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ కోసం త్వరలో హైదరాబాద్‌కు చిత్ర యూనిట్ పయనం కానుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటించనున్నట్లు దర్శకుడు సుందర్.సి వెల్లడించారు. అయితే ఆమె పాత్ర గురించి ప్రస్తుతానికి ఏమీ మాట్లాడదలచుకోలేదని అన్నారాయన. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో మరో సీనియర్ నటి సిమ్రాన్ కూడా నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
విశాల్ చిత్రంలో రమ్యకృష్ణ
చెన్నై: తన దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ ముఖ్య భూమిక పోషించనున్నారని ఆ చిత్ర దర్శకుడు సుందర్. సి బుధవారం చెన్నైలో వెల్లడించారు. ఆ చిత్రం త్వరలో హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు. ఆ షూటింగ్లో రమ్య పాల్గొంటారని తెలిపారు. తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా రమ్యకృష్ణ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. 1990లో తమిళంలో తెరకెక్కిన కుట్టి పిశాసు చిత్రం ఆమె నటించిన అఖరి చిత్రమని సుందర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బహుబలిలో నటిస్తు రమ్యకృష్ణ మహా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
జనరంజకంగా వాసవీ చరిత్ర
కన్యకాపరమేశ్వరి అమ్మవారి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర’. కన్యకగా సందీప్తి నటించిన ఈ చిత్రంలో పార్వతీ పరమేశ్వరుల పాత్రలను రమ్యకృష్ణ, జె.టి.రమేష్ పోషించారు. శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో జె.ఆర్.పద్మిని, కొంపల్లి చంద్రశేఖర్, కాసనగొట్టు రాజశేఖర్‌గుప్త నిర్మించిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. ఒక మంచి సినిమా అందించాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశామని, 30 నిమిషాల గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, త్వరలోనే పాటల్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. అమ్మవారి మహిమలను జనరంజకంగా ఆవిష్కరించామని దర్శకుడు చెప్పారు. -
వెండితెరపై విరాజిల్లిన దుర్గమ్మలు
మనకు దేవుళ్లకు కొదవ లేదు. అందరి గుళ్లకీ వెళతాం.. మొక్కుతాం.. పూజిస్తాం. కానీ పరాశక్తి ఆలయంలో మాత్రం మన మైండ్‌సెట్ వేరేలా ఉంటుంది. ఏదో తెలీని బరువు, భయం గుండెల్లో దోబూచులాడుతూ ఉంటాయి. కొందరైతే... అమ్మవారి వంక ధైర్యంగా కూడా చూడలేరు. మనిషిలోని మానసిక దౌర్బల్యానికి ఇదొక నిదర్శనం. నిజానికి అమ్మ సంహరించేది మనలోని అరిషడ్వర్గాలను. అది తెలీకపోవడం వల్లే ఆ భయం. రక్తబీజుడనే రాక్షసుణ్ణి సంహరిస్తున్న సమయంలో.. శాంతింపజేయడానికి యత్నించిన సాక్షాత్ శివుణ్ణే కాలికింద పడేసి తొక్కేసిందట అమ్మ. అమ్మవారంటే భయపడటానికి ఈ కథలు కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. దేవీభాగవతంలోని అమ్మవారి కథల్ని ఒక్కసారి చదివితే... కావల్సినంత కమర్షియల్ వేల్యూస్ కనిపిస్తాయి. ఒకప్పుడు మన సినిమా వాళ్లు ఆ కథల్ని బాగానే ఉపయోగించుకున్నారు. అమ్మ మహిమల్ని ప్రస్తుతిస్తూ, నయనమనోహరంగా చూపించిన సినిమాలు మనకు కోకొల్లలు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సావిత్రి, ఎస్.వరలక్ష్మి, జయలలిత, కాంచన, గిరిజ, దేవిక, బి.సరోజాదేవి, వాణిశ్రీ... ఇత్యాది నటీమణులందరూ అమ్మవారి పాత్రలు పోషించినవారే. అయితే... కేఆర్ విజయ ఎప్పుడైతే... అమ్మవారి పాత్ర పోషించారో... అప్పట్నుంచి ‘అమ్మవారి సినిమా’ అనే ఓ బ్రాండ్ సినిమాల్లో మొదలైంది. దానికి నాంది పలికిన సినిమా ‘మా ఇలవేల్పు’. కేఆర్ విజయను అమ్మవారిగా తెలుగు ప్రేక్షకులు తొలిసారి చూసింది ‘మా ఇలవేల్పు’ ద్వారానే. బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆ రోజుల్లో పెను సంచలనం. ఈ సినిమా పుణ్యమా అని థియేటర్లన్నీ దుర్గాలయాలుగా మారాయి. కేఆర్ విజయ అయితే... తెరవేల్పుగా అవతరించారు. ఆ తర్వాత వినాయకవిజయం, జగన్మాత, శ్రీదత్త దర్శనం, అష్టలక్ష్మీ వైభవం... ఇలా.. ఎన్నో చిత్రాల్లో అమ్మవారిగా దర్శనమిచ్చి ప్రేక్షకులను భక్తిపారవశ్యంతో తేలియాడించారు కేఆర్ విజయ. ఇప్పటికీ ‘అమ్మవారు’ అంటే... దక్షిణాది ప్రేక్షకుల మనసుల్లో మెదిలే కమనీయరూపం కేఆర్ విజయదే. కేఆర్ విజయ తర్వాత నళిని, రాధ, అంబిక, విజయశాంతి లాంటి తారలు అమ్మవారిగా మెరిపించినా... రమ్యకృష్ణ మాత్రం ఆ పాత్రలో ప్రత్యేకమైన గుర్తింపునే తెచ్చుకున్నారు. రమ్యకృష్ణకు అమ్మవారిగా పేరు తెచ్చిన సినిమా ‘శ్రీజొన్నవాడ కామాక్షి కటాక్షం’. విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో వాణిజ్య పరంగా కూడా మంచి విజయం సాధించింది. యక్షిణిని అమ్మవారు సంహరించే సన్నివేశంలో ఆదిశక్తిగా రమ్యకృష్ణ అభినయాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదంటే అతిశయోక్తికాదు. ఆ తర్వాత ఇంకొన్ని సినిమాల్లో అమ్మవారిగా రమ్య కనిపించినా... ‘అమ్మోరు’ సినిమా మాత్రం ఆమె కెరీర్లో చిరస్థాయిగా గుర్తుంచుకోదగ్గది. ఆ సినిమా పతాక సన్నివేశంలో మహాకాళిగా మారే సందర్భంలో రమ్యకృష్ణ ఆహార్యం, అభినయం చూసి ప్రేక్షకులు రోమాంచితులయ్యారు. రమ్యకృష్ణ తర్వాత మీనా, రోజా లాంటి తారలు కూడా ఆదిపరాశక్తిగా దర్శనమిచ్చారు. కానీ నేటి తరం కథానాయికల్లో అమ్మవారి పాత్రలను రక్తికట్టించగలిగేదెవరు? అంటే మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఏదిఏమైనా... విజయదశమి అంటే... విజయానికి చిరునామా. ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా విజయం తథ్యం. అందుకే సినిమా వాళ్లు కూడా దసరా రోజున సినిమాలను విడుదల చేయడానికి కానీ, షూటింగ్‌లు ప్రారంభించడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. అమ్మలగన్న అమ్మ... ముగురమ్మల మూలపుటమ్మ అయిన ఆ దుర్గమ్మ కటాక్షం సినిమా పరిశ్రమపై ఉండాలని, మరిన్ని మంచి సినిమాలు తెలుగుతెరపైకి రావాలని కాంక్షిస్తూ... జై దుర్గ.