విన్నారా! | ramya krishnan Powerful Role in NARASIMHA movie | Sakshi
Sakshi News home page

విన్నారా!

Published Mon, Aug 3 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

విన్నారా!

విన్నారా!

రమ్యకృష్ణ కెరీర్‌లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ విధంగా నిలిచిపోయిన పాత్రల్లో ‘నరసింహ’ చిత్రంలోని నీలాంబరి పాత్ర ఒకటి. ఈ పవర్‌ఫుల్ రోల్‌ను అద్భుతంగా చేశారామె. ఈ పాత్రను రమ్యకృష్ణ మినహా వేరే ఎవరూ ఇంత బాగా చేయలేరంటే అతిశయోక్తి కాదు. ఈ నీలాంబరి పాత్ర గురించి ఓ తమిళ పత్రిక రమ్యకృష్ణను ఓ ప్రశ్న అడిగింది. ఒకవేళ ‘నరసింహ’ చిత్రాన్ని రీమేక్ చేస్తే, అందులో నీలాంబరి పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందనుకుంటున్నారు? అని ఆ పత్రికా విలేకరి అడిగితే - ‘‘ఆ పాత్రలో వేరే ఎవర్నీ ఊహించుకోలేకపోతున్నాను. రీమేక్‌లో కూడా నేనే ఉండాలని  కోరుకుంటున్నాను. అవకాశం  ఇస్తే నేనే నటిస్తా’’  అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement