ఎప్పటికప్పుడు సమకూర్చుకోవాలి
ఔషధాల సప్లై మొత్తం ఆన్‌లైన్ చేయాలి
వారంలోగా 22 సెంట్రల్ మెడిసిన్ స్టోర్లు
ఫుడ్‌సేఫ్టీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సర్కారు ఆస్పత్రుల కోసం కొనుగోలు చేసే మెడిసిన్ ఇండెంట్ నుంచి అవి రోగి కి చేరేవరకు పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌ను మూడు దశలుగా విభజించి, ప్రతి దశకు ఒక అధికారిని బాధ్యులుగా నియమించాలని తెలిపారు. సెంట్రల్ మెడికల్ స్టోర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీల బలోపేతం, ఫుడ్ సేఫ్టీ అంశాలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో శుక్ర వారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేస్తు న్న 22 సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల పనులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘ఈ ఔషధి’పోర్టల్ వినియోగంపై ఫార్మసిస్టులకు వర్క్‌షాపు నిర్వహించాలని సూచించారు. అవసరమై న ఔషధాల కోసం టీజీఎంఎస్‌ఐడీసీకి సకాలంలో ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు. ఆస్పత్రు ల్లోని ఫార్మసీల్లో ఏయే ఔషధాలు అందుబాటు లో ఉన్నాయనేది ప్రజలు తెలుసుకొనేలా అక్కడ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా ల్లో మందుల సరఫరాకు డిప్యూటీ డీఎంహెచ్‌వోలను ఇన్‌చార్జీలుగా నియమించాలని ఆదేశించారు.
ఫుడ్ సేఫ్టీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
ఫుడ్‌సేఫ్టీలో హైదరాబాద్ నగరం దేశంలోనే చిట్టచి వరి స్థానంలో ఉందని జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 2022 నాటి డేటా తో కొందరు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నా రని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలపటంతో.. ఫుడ్ సేఫ్టీ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నెల రోజుల్లో 5 కొత్త మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
ఈ ఏడాది ఇప్పటివరకు 4,366 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్‌ఫుడ్ స్టాల్స్‌ను అధికారులు తనిఖీ చేశారని, నిబంధనలు పాటించని 566 సంస్థలపై కేసులు నమోదు చేయడంతో పాటు, రూ.66 లక్షల జరిమానా విధించామ ని తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్య దర్శి క్రిస్టినా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ విభాగం అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment