సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన నరసింహ రీరిలీజ్ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 1999లో వచ్చిన ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో నీలాంబరిగా చాలా పవర్‌ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ (Ramya Krishnan) నటించారు. ఇందులో శివాజీ గణేశన్, సౌందర్య,నాజర్,అబ్బాస్ తదితరులు నటించారు. తమిళ్‌లో సంచలన విజయం అందుకున్న ఈ మూవీ తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం నుంచి రజనీకాంత్‌కు ఇక్కడ మార్కెట్ కూడా పెరిగింది.
(ఇదీ చదవండి: 'డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్)
దర్శకుడు కేఎస్ రవికుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ నరసింహ (Narasimha) సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాదితో రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి అవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తాను ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎప్పుడు థియటర్స్‌లోకి తీసుకొచ్చే విషయాన్ని ఆయన చెప్పలేదు. కానీ, ఈ చిత్రం 2025 ఆగష్టులో విడుదల కావచ్చని తెలుస్తోంది.
రజనీ నటించిన తొలి సినిమా అపూర్వ రాగంగళ్ 1975 ఆగస్టు 18న విడుదలైంది. దీంతో అప్పటికి ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అవుతాయి. ఆ సమయానికి నరసింహ సినిమాను రీరిలీజ్ చేయాలని ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెడుతున్నారు. ఈ మధ్య కాలంలో రజనీ నటించిన హిట్ చిత్రాలు మళ్లీ బిగ్ స్క్రీన్స్‌పై సందడి చేశాయి. అందులో భాషా, బాబా, దళపతి ఉన్నాయి. ఇప్పుడు నరసింహ మూవీ మళ్లీ విడుదల కానున్నడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.
నరసింహ సినిమా 1999లో 200 ప్రింట్స్‌తో విడుదలైంది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 86 థియేటర్ సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. చాలా ప్రాంతాలలో 200 రోజులకు పైగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 50 కోట్లు రాబట్టింది. ఆ సమయంలో అమెరికాలో రూ. 3 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత రజనీ లుక్‌ను బీడీలు, సిగరెట్లు పొగాకు వంటి వాటిపై ట్రేడ్‌మార్క్‌గా రైట్స్ కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment